
సీఎం సీమాంధ్రులను ఇంకా భ్రమపెడుతున్నారు: హరీష్ రావు
ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి సమైక్యాంధ్ర పేరు జపిస్తూ సీమాంధ్ర ప్రజల్ని భ్రమ పెడుతున్నారని విమర్శించారు. ఆయన తీవ్ర నిరాశ, నిస్పృహలతో మాట్లాడుతున్నారని హరీష్ రావు అన్నారు.
తెలంగాణ ఉద్యమం స్వయం పాలన కోసమే తప్ప పదవుల కోసం కాదని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన కిరణ్కుమార్ రెడ్డికి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలియకపోవడం విచారకరమని హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీలో ఓటింగ్ ఉండదని సీఎంకు తెలియదా అని ప్రశ్నించారు.