జనగామ, న్యూస్‌లైన్ : సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కేవలం ఆ ప్రాంత ప్రజలకు మేలు కలిగే విధంగా వ్యహరిస్తూ తెలంగాణ ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎల్‌పీ ఉప నేత తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. జనగామ వ్యవసాయ మార్కెట్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆయనకు విన్నవించారు. రైతుల బాధలు విన్న హరీష్‌రావు మాట్లాడుతూ మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు * 1,310 ఉండగా... మార్కెట్‌లో * 1,000 మాత్రమే కొనుగోలు చేస్తుండడం శోచనీయమన్నారు.
తెలంగాణ మంత్రులు ఇక్కడి రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. మార్కెట్‌కు సరుకులు తీసుకొచ్చిన ప్రతి రైతుకూ గిట్టుబాట ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతుల పక్షాన నిలబడి పోరాడతామన్నారు. జనగామ మార్కెట్‌కు వచ్చిన ధాన్యం వర్షంలో తడవకుండా టార్పాలిన్ కవర్లు అందజేయాలన్నారు.
కిరణ్ సీమాంధ్రకే మేలు చేస్తున్నడు : హరీష్‌రావు
Published Wed, Oct 2 2013 3:00 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement