సీఎం బెదిరింపులకు లొంగను: హరీష్ రావు
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బెదిరింపులకు భయపడను అని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్యెల్యే హరీష్ రావు స్సష్టం చేశారు. సీఎం కిరణ్ బ్లాక్ మెయిల్ కు లొంగను అని ఆయన అన్నారు. అసెంబ్లీలో అంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013 పై జరుగుతున్న చర్చలో అసత్యాలు చెబుతున్న సీఎంని ప్రశ్నిస్తూనే ఉంటా అని హరీష్‌రావు తెలిపారు.
సీఎం ఏప్రాంతంవారికీ న్యాయం చేయడం లేదు అని హరీష్‌రావు విమర్శించారు. ఇకనైనా అసెంబ్లీలో బిల్లులో పూర్తి స్థాయిలో చర్చ జరిగేలా చూడాలి అని హరీష్‌రావు అన్నారు.
అసెంబ్లీలో బిల్లుపై చర్చలో భాగంగా సీఎం కిరణ్ ప్రసంగానికి పదే పదే హరీష్ రావు అడ్డుపడటంతో సీఎం అనేక మార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే.