సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖకు కొత్త బాస్ ఎవరు? ప్రస్తుతం డీజీపీ దినేష్‌రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయనను కొనసాగించే అవకాశం లేదని ప్రభుత్వం కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్)కు స్పష్టంచేసిన నేపథ్యంలో కొత్త డీజీపీ ఎవరు కాబోతున్నారనే అంశం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈనెల 30వ తేదీన కొత్త డీజీపీ నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డీజీపీ నియామకానికి సంబంధించి ఐదుగురు డీజీపీ స్థాయి అధికారుల జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి పంపితే వారిలో ముగ్గురి పేర్లను ఎంపికచేసి ప్రభుత్వానికి పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకర్ని ప్రభుత్వం ఎంపిక చేయవచ్చు.
ప్రసాదరావుకే అవకాశాలు!: ఏసీబీ డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ప్రసాదరావును కొత్త డీజీపీగా ప్రభుత్వం నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం కిరణ్‌ని సచివాలయంలో బుధవారం ఆయన కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని కీలకమైన పోస్టులతోపాటు ఆర్టీసీ ఎండీ, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేసి ఉండటం ప్రసాదరావుకు అదనపు అర్హత. రాష్ట్రంలో వీఆర్‌ఎస్ తీసుకున్న ఐఏఎస్ అధికారి ద్వారా ఢిల్లీ రాహుల్‌గాంధీ కోటరీలో కూడా ప్రసాదరావు ఎంపిక అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇంకా డీజీపీ పదవి రేసులో సీఆర్పీఎఫ్ ప్రత్యేక డెరైక్టర్‌గా కేంద్ర సర్వీసులో ఉన్న అరుణాబహుగుణ కూడా ఢిల్లీనుంచే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. అదే బ్యాచ్‌కి చెందిన హోం శాఖ ముఖ్య కార్యదర్శి టీపీ దాస్‌కు రాజ్‌భవన్ వర్గాల నుంచి మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొత్త పోలీస్ బాస్ ఎవరు ?
Published Sat, Sep 28 2013 1:46 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement
Advertisement