సాక్షి, మంచిర్యాల : తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు శతవిధాలా ప్రయత్నించిన రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దినేష్‌రెడ్డిపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అమితప్రేమ చూపుతున్నారని పెద్దపల్లి ఎంపీ వివేకానంద విమర్శించారు. శనివారం మంచిర్యాలలో తన నివాస గృహంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. డీజీపీగా దినేష్‌రెడ్డి పదవి కాలం ము గిసినా ఆయన స్థానంలో కొత్త డీజీపీ నియామకం విషయంలో నోరు మెదపడం లేదన్నారు. 30 జూలై 2011లో దినేష్‌రెడ్డిని డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. సాధారణం గా డీజీపీకి రెండేళ్ల పదవి కాలం ఉంటుందని.. ఇ ప్పటికే ఆ పదవి కాలం ముగిసిందని చెప్పారు.
మ రొకరిని డీజీపీగా నియమించాల్సి ఉండగా.. సీ మాంధ్రలో కొనసాగుతున్న సమైక్య ఉద్యమం పే రుతో దినేష్‌రెడ్డిని కొనసాగించాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దినేష్‌రెడ్డి తెలంగాణవాదులపై తప్పుడు కేసులు బనాయించి.. బైండోవర్లు చేసి తీవ్ర ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సభలు.. సమావేశాల కోసం అనుమతి కోరి తే ఆఖరి దశలో అనుమతి ఇచ్చిన డీజీపీ సమైక్యవాదంతో సీమాంధ్రులు చే పడుతున్న కార్యక్రమాలకు కోరిన వెంటనే అనుమతి ఇస్తున్నారని అన్నా రు. దినేష్‌రెడ్డి స్థానంలో కొత్త డీజీపీని నియమిం చాలని డిమాండ్ చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కృష్ణారావు, టీఆర్‌ఎస్ నాయకులు సుదమల్ల హరి కృష్ణ, పానుగంటి శ్రీనివాస్, తేజ పాల్గొన్నారు.