హైదరాబాద్: రాష్ట్ర డీజీపీగా దినేష్ రెడ్డి కొనసాగే అర్హత లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ఉన్నత న్యాయ స్థానానికి వెళ్లైనా సరే దినేష్ రెడ్డిని అడ్డుకుంటామన్నారు. దినేష్ రెడ్డిని డీజీపీ ఇక కొనసాగించలేమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ కు ఒక నివేదిక ఇవ్వడంతో అతను పెట్టుకున్న ఆశలకు గండిపడింది. చట్ట ప్రకారం అతనికి పదవిలో కొనసాగే అర్హత లేదని ఆయన తెలిపారు. ఈనెల 29వ తేదీన తాము చేపట్టే సకలజనుల భేరీని విజయవంతం చేయాలని ఆయన విజ్క్షప్తి చేశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు దసరా బోనస్ ఇవ్వాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుపుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీకే మహంతి తరఫున స్పెషల్ జీపీ శ్రీధర్‌రెడ్డి క్యాట్‌కు గురువారం మెమో సమర్పించారు. దినేశ్‌రెడ్డి ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ప్రాథమిక విచారణ చేస్తోందని మెమోలో పేర్కొన్నారు. దర్యాప్తు పురోగతిపై నాలుగు నెలల్లో నివేదికను సమర్పించాల్సి ఉందని, ఈ నేపథ్యంలో డీజీపీగా దినేశ్‌రెడ్డిని కొనసాగించబోమని తెలిపారు. పదవీ కాలం పొడిగింపునకు దినేశ్‌రెడ్డి చేసుకున్న విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించినట్టు వివరించారు. ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు అమలుపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని వివరించారు.
పదవీ విరమణ వయస్సుతో నిమిత్తంలేకుండా రెండేళ్ల పదవీకాలాన్ని కొనసాగించే విషయంలోనూ స్పష్టత అవసరవుని, ప్రకాశ్‌సింగ్ కేసులో తీర్పు ఆధారంగా డీజీపీ పదవీ కాలాన్ని తమిళనాడు ప్రభుత్వం పొడిగించినంత మాత్రాన, దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వివరించింది. దీంతో, ఈ పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లు క్యాట్ ధర్మాసనం ప్రకటించింది.