దినేష్ రెడ్డి కొనసాగింపుపై క్యాట్లో వాదనలు | DGP Dinesh reddy's appointment: CAT hearing Begin | Sakshi
Sakshi News home page

దినేష్ రెడ్డి కొనసాగింపుపై క్యాట్లో వాదనలు

Published Thu, Sep 26 2013 11:15 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM

DGP Dinesh reddy's appointment: CAT hearing Begin

హైదరాబాద్ : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా దినేష్ రెడ్డి పదవీ కాలంపు పొడిగింపుపై గురువారం క్యాట్లో విచారణ కొనసాగుతోంది. డిజిపిగా తన పదవీ కాలాన్ని సెప్టెంబర్ 30, 2014 వరకూ పొడిగించాలని కోరుతూ డిజిపి దినేష్ రెడ్డి  క్యాట్ హైదరాబాద్ బెంచిని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై దినేష్ రెడ్డిని కొనసాగించాలా.... వద్దా అనే దానికి రాష్ట్ర ప్రభుత్వం క్యాట్కు నివేదిక ఇవ్వనుంది.

 'ప్రకాష్ సింగ్ తదితరులు - భారత ప్రభుత్వం తదితరుల' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పదవీ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా డిజిపిగా తన నియామకం జరిగిన తేదీ నుంచి రెండేళ్ళపాటు పదవిలో కొనసాగేలా అవకాశమివ్వాలని దినేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  సుప్రీం తీర్పు ఆధారంగానే తన నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.  కాగా దినేష్ రెడ్డి పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement