వీడ్కోలు వందనం స్వీకరించిన దినేష్ రెడ్డి | Police farewell parade to DGP Dinesh reddy | Sakshi
Sakshi News home page

వీడ్కోలు వందనం స్వీకరించిన దినేష్ రెడ్డి

Published Mon, Sep 30 2013 9:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM

Police farewell parade to DGP Dinesh reddy

హైదరాబాద్ : డీజీపీ దినేష్ రెడ్డి పదవీ కాలం నేటితో ముగియనున్న సందర్భంగా ఆయన సోమవారం వీడ్కోలు వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌గ్రౌండ్స్‌లో పోలీస్‌ విభాగం కవాతు నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ కార్యక్రమానికి  అందరూ ఐపీఎస్‌లు, అడిషనల్‌ డీజీలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ డీజీపీగా రెండేళ్ల మూడు నెలలు పని చేశానన్నారు. తాను బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రం అల్లకల్లోలంగా ఉందని.... అయితే అందరి సహకారంతో శాంతిభద్రతలు అదుపులోకి తీసుకు వచ్చినట్లు దినేష్ రెడ్డి తెలిపారు.  దేశంలో  ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ విభాగం గొప్పగా పని చేస్తోందని చెప్పారు. తన పదవీ కాలంలో శాంతి భద్రతలు కాపాడటానికి సహకరించిన పోలీసులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement