Director General of Police
-
Neena Singh: చారిత్రక అడుగు అంకితభావమే ఆభరణమై...
అల్లరికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆ ఇల్లు నీనా రాకతో నిశ్శబ్దంలోకి వెళ్లిపోయేది. ఆ ఇంట్లోని పిల్లలు ఎక్కడి వాళ్లు అక్కడ కూర్చుని పాఠ్యపుస్తకాలు చదువుతూ కనిపించేవారు. పెద్ద అక్క అంటే మాటలా మరి! అక్కయ్య అంటే ఆప్యాయత, అనురాగం మాత్రమే కాదు క్రమశిక్షణ కూడా. ఆ క్రమశిక్షణే ఆమెను పోలీస్‌శాఖలోకి అడుగు పెట్టేలా చేసింది. వివిధ హోదాల్లో మంచి పేరు తెచ్చుకునేలా చేసింది. తాజాగా... సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా చరిత్ర సృష్టించింది నీనా సింగ్... నీనా సింగ్‌ది బిహార్ రాష్ట్రం. కుటుంబ సభ్యుల్లో తనే పెద్ద. తమ్ముళ్లు, చెల్లెళ్లకు అమ్మ తరువాత అమ్మ. నీనా తండ్రి బిహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో ఉండేవారు. తల్లి గృహిణి. పట్నా ఉమెన్స్ కాలేజీ, దిల్లీలోని జేఎన్‌యూలో చదివిన నీనా సింగ్ ‘దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్. కోసం చేరింది. హార్వర్డ్ యూనివర్శిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. రాజస్థాన్ క్యాడర్, 1989 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన నీనా సింగ్ పోలీస్‌శాఖలో అడుగు పెట్టిన తొలిరోజు నుంచి పాదరసంలా చురుగ్గా ఉండేది. సివిల్ రైట్స్ అండ్ యాంటి–హ్యూమన్ ట్రాఫికింగ్ ఏడీజీ(ట్రైనింగ్), డీజీగా పని చేసింది. రాజస్థాన్‌లోని డీజీ ర్యాంక్ పొందిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు పొందింది. రాజస్థాన్ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్‌లో పనిచేసింది. కమీషన్ సభ్యులు వివిధ ప్రాంతాలకు వెళ్లి మహిళల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కార్యాచరణను రూపొందించింది. పాండమిక్ కాలంలో రాజస్థాన్‌లో ప్రిన్సిపల్ సెక్రెటరీ(హెల్త్)గా బాధ్యతలు నిర్వహించింది. జాయింట్–డైరెక్టర్ ఆఫ్ సీబీఐగా పీఎన్బీ స్కామ్, నీరవ్ మోదీ కేసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లలో కీలకపాత్ర పోషించింది. ‘సివిల్ సర్వీస్‌లో ఉన్న మా నాన్నను చూస్తూ పెరిగాను. నేను ఐపీఎస్ చేయాలనుకోవడానికి నాన్న స్ఫూర్తిగా నిలిచారు. చదువుకు సంబంధించిన విషయాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టేవారు. మమ్మల్ని దగ్గర ఉండి చదివించేవారు. ఇంట్లో ఇతరత్రా విషయాల కంటే చదువుకు సంబంధించిన విషయాలే ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం’ అంటుంది నీనా సింగ్. తన ఉద్యోగప్రస్థానంలో మహిళా సాధికారత భావన కలిగించే ఏ అవకాశాన్నీ, సందర్భాన్నీ వదులుకోలేదు నీనా సింగ్. ఆమె మాటలతో స్ఫూర్తి పొందిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. నీనా సింగ్‌ను భారతప్రభుత్వం 2015లో ‘ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్’ 2020లో ‘విశిష్ఠసేవా పురస్కారం’తో సత్కరిం చింది. నాన్న స్ఫూర్తితో... ఇంటి వాతావరణం మన కలలకు ఊపిరిపోస్తుంది. నాన్న సివిల్ సర్వీస్‌లో ఉండడం వలన ఎన్నో విషయాలు చెప్పేవారు. ఆయన ద్వారా ఎంతోమంది ఐకానిక్ ఆఫీసర్ల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే సివిల్ సర్వీస్‌లో చేరాలనే లక్ష్యం ఏర్పడింది. కెరీర్‌కు సంబంధించి వేరే ఆలోచనలు ఏవీ ఉండేవి కాదు. నా ఏకైక లక్ష్యం సివిల్ సర్వీస్ అని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సివిల్ సర్వీస్‌లో విస్తృతంగా పనిచేసే అవకాశం దొరుకుతుంది. ఖాకీ యూనిఫాం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఖాకీ యూనిఫాంలోఉన్న వారిని చూస్తే అపురూపంగా అనిపించేది. యూనిఫాం ఎప్పుడూ ఇతరులను ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ...నేను సిరోహి ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి నాకు మీలాగే పోలీస్ ఆఫీసర్ కావాలని ఉంది అన్నప్పుడు సంతోషంగా అనిపించింది. పోలీస్ ఉద్యోగం అంటే శాంతిభద్రతలను కాపాడడం మాత్రమే కాదు రకరకాల సమస్యలు ఎదుర్కొనే ప్రజలకు ధైర్యాన్నీ, భరోసానూ ఇవ్వడం కూడా. – నీనా సింగ్ నోబెల్ విజేతలతో కలిసి పరిశోధన పోలీసుల పనితీరులో రావాల్సిన మార్పులు, ప్రజలకు మరింత చేరువయ్యే మార్గాల గురించి ‘మసాచుసెట్సు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’కి సంబంధించిన ప్రాజెక్ట్‌లో నీనా సింగ్ భాగం అయింది. తన పరిశోధన తాలూకు అంశాల ఆధారంగా ఎన్నో పోలీస్స్టేషన్లలో మార్పు తీసుకువచ్చింది. నోటెల్ బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డప్లోతో కలిసి ‘ది ఎఫీసియెంట్ డిప్లాయ్‌మెంట్ ఆఫ్ పోలీస్ రిసోర్సెస్’ అంశంపై పరిశోధన పత్రాలు రాసింది. హార్వర్డ్‌లో చదివే రోజుల నుంచి వారితో నీనా సింగ్‌కు పరిచయం ఉంది. -
‘3 నెలల్లో ఫిట్‌గా మారండి.. లేదా ఇంటికి వెళ్లిపోండి’
పోలీసులకు ఎత్తు, సరైన బరువు, శారీరక ధృడత్వం ఎంతో ముఖ్యం. అందుకే పోలీస్‌కు ఎంపికయ్యే సమయంలో రాత పరీక్షలతోపాటు ఈవెంట్స్‌లో కూడా తప్పక క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అయితే పోలీస్ విధుల్లో చేరాక చాలా మందికి ఫిట్నెస్ కోల్పోవడం చూస్తుంటాం.. ఇక వయసు మీదపడుతున్న వారికైతే పొట్ట అమాంతం ముందుకు వచ్చేస్తుంటుంది. కొందరిని అయితే యూనిఫాంలో చూస్తే తప్ప వారిని పోలీసులని గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలోని పోలీసులును ఫిట్ మార్చేందుకు అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్‌లతో సహా అన్ని విభాగాల్లోని పోలీసులందరూ ఫిట్‌గా ఉండాలని సూచించింది. పోలీసులు ఫిట్ మారడానికి మూడు నెలల సమయం ఇచ్చింది. ఈ తర్వాత వారి బాడీ మాస్ ఇండెక్స్(బీఎమ్ఐ)నమోదు చేయనున్నట్లు తెలిపింది. ఏపీఎస్, ఏపీఎస్ అధికారులతో సహా అస్సాం పోలీసు సిబ్బంది అందరికి ఆగస్టు 15 వరకు మూడు నెలల సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర డీజీపీ జీపీ సింగ్ తెలిపారు. ఆ తరువాత 15 రోజులకు వారి బీఎమ్ఐ లెక్కగట్టనున్నట్లు పేర్కొన్నారు. ఊబకాయం కేటగిరిలో(BMI 30+) ఉన్నవారికి బరువు తగ్గించుకోవడానికి మరో మూడు నెలల సమయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అప్పటికీ ఫలితం కనిపించకపోతే తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకునే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే హైపోథైరాయిడిజం వంటి వైద్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న వారికి దీని నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. బీఎంఐ లెక్కించుకునే వారిలో మొదటి వ్యక్తి తానేనని డీఐజీ తెలిపారు. ఇక అస్సాంలో 7,000 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు.. -
Telangana: డీజీపీ కుర్చీ ఎవరికి?.. రేసులో ఆ ముగ్గురు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ బాస్ పోస్టు ఎవరికి దక్కుతుందన్న దానిపై పోలీసు శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ ఏడాది డిసెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త డీజీపీ రేసులో ఎవరెవరు ఉన్నారన్న దానిపై పోలీసు వర్గాలు అంచనాలు వేసుకుంటున్నాయి. ప్రస్తుతం సీనియారిటీ ప్రకారం.. రాష్ట్ర పోలీసుశాఖలో ఐపీఎస్ 1989 బ్యాచ్‌కు చెందిన ఉమేష్ షరాఫ్, 1990 బ్యాచ్‌కు చెందిన గోవింద్ సింగ్, అంజనీకుమార్, రవిగుప్తా డీజీ (డైరెక్టర్ జనరల్) ర్యాంకులో.. 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్, హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ ఇద్దరూ అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు. రేసులో ఎవరెవరు? అందరిలోకి సీనియర్ అయిన ఉమేష్ షరాఫ్ 2023 జూన్‌లో రిటైర్ కానున్నారు. దీనితో ఆయనకు డీజీపీగా అవకాశాలు తక్కువనే అభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత 1990 బ్యాచ్‌కు చెందిన గోవింద్ సింగ్ (ప్రస్తుత సీఐడీ చీఫ్) ఈ ఏడాది నవంబర్లోనే పదవీ విరమణ చేయనున్నారు. ఇదే బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్ (ఏసీబీ డీజీ), రవి గుప్తా (హోంశాఖ ముఖ్య కార్యదర్శి) ప్రస్తుతం డీజీ హోదాలో ఉన్నారు. వీరు డీజీపీ పోస్టు రేసులో ఉంటారు. ఇక గోవింద్ సింగ్ పదవీ విరమణతో ఖాళీ అయ్యే డీజీ ర్యాంకు పోస్టులోకి రాజీవ్ రతన్ పదోన్నతి పొందుతారు. ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులకు ఒకే హోదా ఉండేందుకు వీలుగా.. ప్రభుత్వం ఎక్స్ కేడర్ కోటా కింద మరో డీజీ పోస్టు సృష్టించి పదోన్నతి కల్పించేందుకు అవకాశం ఉంది. అంటే సీవీ ఆనంద్‌కు కూడా డీజీ ర్యాంకు పదోన్నతి రావొచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన అంజనీకుమార్, రవిగుప్తాలతోపాటు రాజీవ్ రతన్, సీవీ ఆనంద్ కూడా డీజీపీ రేసులో ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక 30 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసుకుని అదనపు డీజీపీ హోదాలో ఉన్న వారి పేరునూ డీజీపీ పోస్టు కోసం పరిశీలించే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం 1992 బ్యాచ్‌కు చెందిన అదనపు డీజీపీ జితేందర్ పేరూ నియామక ప్యానల్ జాబితాలోకి వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. చదవండి: (Telangana: ఆర్టీసీ కీలక నిర్ణయం.. వారికి ఉద్యోగాలకు ఓకే!) డిసెంబర్ రెండో వారంలో.. రాష్ట్ర జీఏడీ విభాగం డీజీపీ నియామకానికి సంబంధించి ప్యానల్ లిస్ట్‌ను డిసెంబర్ రెండో వారంలో యూపీఎస్సీకి పంపనుంది. ఈ జాబితాలో ఉమేష్ షరాఫ్, రవిగుప్తా, అంజనీకుమార్, రాజీవ్ రతన్, సీవీ ఆనంద్, జితేందర్ పేర్లను పంపే అవకాశం ఉంది. 2023 జూన్‌లో రిటైర్ కానున్న ఉమేష్ షరాఫ్ పేరును పరిగణనలోకి తీసుకోకున్నా డీజీ హోదా అధికారి కాబట్టి పంపడం తప్పనిసరని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపే జాబితా నుంచి ముగ్గురి పేర్లను యూపీఎస్సీ సెలెక్షన్ కమిటీ తిరిగి సూచిస్తుంది. అందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించుకునే అవకాశం ఉంటుంది. నియామకాల్లో కీలకం రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి డీజీపీగా అనురాగ్ శర్మ 2017 నవంబర్ వరకు సేవలు అందించారు. తర్వాత రెండో డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఆయన పదవిలో ఉంటారు. ఈ ఇద్దరూ కూడా హైదరాబాద్ కమిషనర్‌గా పనిచేసి డీజీపీగా నియమితులైనవారే కావడం గమనార్హం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ చాలా మంది డీజీపీలు హైదరాబాద్ కమిషనర్‌గా పనిచేసిన వారే. ప్రస్తుతం రేసులో ఉన్న అంజనీకుమార్ కూడా హైదరాబాద్ సీపీగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ కొనసాగుతున్నారు. -
పంజాబ్‌కు కొత్త డీజీపీ
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడానికి కొద్ది గంటల ముందు రాష్ట్రంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఎన్నికల వేళ శాంతిభద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)ని మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి వీరేశ్ కుమార్ భవ్రాను పంజాబ్ కొత్త డీజీపీగా నియమిస్తూ శనివారం ఉత్తర్వులొచ్చాయి. కొంతకాలంగా భవ్రా పంజాబ్ హోంగార్డ్స్ డీజీపీగా కొనసాగుతున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) షార్ట్‌లిస్ట్ చేసిన ముగ్గురు అధికారుల ప్యానెల్ నుంచి భవ్రాను చరణ్‌జీత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని పంజాబ్ సర్కార్ ఎంపికచేసింది. దీంతో భవ్రాను డీజీపీగా పంజాబ్ గవర్నర్ నియమించారు. బాధ్యతలు చేపట్టాక భవ్రా కనీసం రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. గత మూడు నెలలకాలంలో పంజాబ్‌కు కొత్త డీజీపీ రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం యూపీఎస్సీ పంపిన షార్ట్‌లిస్ట్‌లోని ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా ఎంచుకోవాలి. కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దిన్కర్ గుప్తా డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు. అమరీందర్ తప్పు కున్నాక చన్నీ సీఎం అయ్యారు. గత సెప్టెంబర్‌లో 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోతాను డీజీపీగా చన్నీ ఎంచుకున్నారు. అయితే సహోతా నియామకాన్ని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ తీవ్రంగా వ్యతిరేకించారు. సిద్ధూ ఒత్తిడికి తలొగ్గిన చన్నీ సర్కార్.. సహోతాను తప్పించింది. రెగ్యులర్ డీజీపీ నియామకం జరిగే లోపు బాధ్యతలు నిర్వహించేందుకు 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ ఛటోపాధ్యాయను చన్నీ ప్రభుత్వం డీజీపీ పీఠంపై కూర్చోబెట్టింది. -
ఏపీలో బాగా తగ్గిన నేరాల సంఖ్య
-
రియాకు అర్హత లేదు.. డీజీపీ రాజీనామా
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన డీజీపీ గుప్తేశ్వర్ పాండే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే రాజకీయాల్లో చేరడానికి పాండే రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే నెలలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాండే స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ఎన్నికల్లో పోటీ చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1987 బిహార్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గుప్తేశ్వర్ పాండే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక పాండే రాజీనామా అభ్యర్థనకు సంబంధించి నోటిఫికేషన్ హోంశాఖ జారీ చేసింది. ఇక నిన్నటితో ఆయన వర్కింగ్ డేస్ పూర్తయ్యాయి.(చదవండి: ‘రియాకు ఆ అర్హత లేదు.. అందుకే’) ఇక డీజీపీ రాజకీయాల్లో చేరతారంటూ వస్తోన్న వార్తలపై పాండే స్పందించారు. ‘నేను ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలేదు.. దీని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాకు సమాజ సేవ చేయాలని ఉంది. అందుకుగాను రాజకీయాల్లోనే చేరాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ఇక పాండే గతంలో కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రాజకీయాల్లో చేరి.. బీజేపీ టికెట్ పొందాలని ఆశించారు. కానీ అవకాశం లభించలేదు. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన 9 నెలల తర్వాత తిరగి తనను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా బిహార్ ప్రభుత్వాన్ని కోరారు. అతని అభ్యర్థన మేరకు నితీష్ కుమార్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు పాండేని విధుల్లోకి తీసుకున్నారు. -
హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ ఆదేశాలతో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన డీజీపీలు హైదరాబాద్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. దేశ అంతర్గత భద్రతకు సంబంధించి రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అందించుకోవడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. శాంతి భద్రతలు, సైబర్ నేరాలు, మావోయిస్టులు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా తదితర అంశాలపై ఆయా రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికారులు చర్చిస్తారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌తో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు అదనపు డీజీపీలు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అధికారులు సందర్శించే అవకాశమున్నట్టు సమాచారం. -
ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు
-
బాధ్యతలు స్వీకరించిన ఏపీ డీజీపీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన తొలుత గాడ్ ఆఫ్ ఆనర్ స్వీకరించారు. పోలీస్‌బాస్‌కు పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి పోలీస్ అధికారులు అభినందనలు తెలిపారు. సవాంగ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతారు. ఇప్పటిదాకా డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్, పర్ఛేజ్ కమిషనర్‌గా బదిలీ చేశారు. (డీజీపీగా గౌతమ్ సవాంగ్) ప్రజలకు మెరుగైన సేవలు.. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడారు. తనపై పూర్తి విశ్వాసం ఉంచి డీజీపీగా నియమించిన ఏపీ సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని అన్నారు. గత ఐదేళ్లుగా ఏపీ పోలీసులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రతి పోలీసు సేవను వినియోగించుకుంటామని చెప్పారు. పోలీసు వ్యవస్థలో పారదర్శకత, సంస్కరణలు, సంస్థాగత మార్పులు అవసరమని పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రికి పోలీసులపట్ల ఎంతో అభిమానం, గౌరవం ఉంది. సేవాభావంతో పనిచేయాలని ఆయన కోరారు. పోలీస్‌శాఖకు కావాల్సిన అన్నిరకాల సదుపాయాల్ని కల్పిస్తామని సీఎం హామీనిచ్చారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణకై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. క్రైమ్ ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతోంది. నేర రహిత ఏపీని తీర్చిదిద్దుతాం. సైబర్‌క్రైమ్ అరికట్టడంలో ఏపీ పోలీసులు మరింత కష్టపడాలి. రోడ్డు ప్రమాదాల్లో ఏపీ మూడో స్థానంలో ఉండటం విచారకరం. ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతాం’అన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
డీజీపీ వాహన తనిఖీ హైడ్రామా!
సాక్షి, అమరావతి : రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ వాహన తనిఖీ హైడ్రామా కొత్త చర్చకు దారితీసింది. విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన శృంగవరపుకోట మండలం బొడ్డవర జంక్షన్ వద్ద మంగళవారం పోలీసులు డీజీపీ వాహనాన్ని తనిఖీ చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన అరకుకు డీజీపీ ఠాకూర్ ప్రైవేట్ వాహనంలో వెళ్లారు. ఆయన వాహనంతోపాటు ఆయన్ను అనుసరించిన వాహనాలను కూడా పోలీసులు సోదాలు చేశారు. సోదాలు నిర్వహించిన పోలీసులను అభినందించిన ఆయన రివార్డు ఇవ్వాలని విజయనగరం జిల్లా ఎస్పీకి ఫోన్ చేసీ మరీ చెప్పారు. సీన్ కట్ చేస్తే డీజీపీ వాహన తనిఖీ వ్యవహారం అంతా హైడ్రామా అని పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది. అసలు డీజీపీ ఆ దారిలో వెళ్తున్నారంటే ట్రాఫిక్ క్లియర్ చేయడం దగ్గర్నుంచి ఆయన ఆ ప్రాంతం దాటే వరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుంది. డీజీపీ ఏ వాహనంలో వచ్చినా మొబైల్, వైర్లెస్, వాకీ టాకీలలో స్పష్టమైన ఆదేశాలు ఉంటాయని, అలాంటిది ఆయనెవరో తెలియకుండానే కారు ఆపి తనిఖీలు చేసే సాహసం చేస్తారా? అంటూ పోలీసు వర్గాలు సెటైర్లు పేలుస్తున్నాయి. ఎందుకీ డ్రామా? ఈ ఎన్నికల్లో అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారంటూ డీజీపీ ఠాకూర్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా ఆయన వాహనంలోనే ప్రకాశం జిల్లాకు రూ.35 కోట్లు తీసుకెళ్లి టీడీపీ అభ్యర్థులకు ఇచ్చారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఠాకూర్ పనిచేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుంచి తప్పించాలని సీఈసీ ఇచ్చిన ఆదేశాల అమలులోనూ ఠాకూర్ జోక్యంపై ఈసీ సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. విశాఖ జిల్లాలో డీజీపీ ఠాకూర్ పాడేరు: డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం విశాఖ ఏజెన్సీ అరకు, పాడేరు ప్రాంతాల్లో పర్యటించారు. మంగళవారం సాయంత్రం అనకాపల్లి పోలీస్ గెస్ట్‌హౌస్‌లో డీజీపీ ఠాకూర్, అడిషనల్ డీజీపీ గ్రేహౌండ్స్ నలినీ ప్రభాకర్ పోలీస్ అధికారులతో రహస్య మంతనాలు జరిపారు. -
పెద్ద సార్ల ఆటవిడుపు
-
పెద్ద సార్ల ఆటవిడుపు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులుగా తీరిక లేకుండా గడిపిన అఖిల భారత సర్వీసుల సీనియర్ అధికారులు ఈ ఆదివారం తమ కుటుంబాలతో కండ్లకోయలో హాయిగా సేద తీరారు. గడిచిన శుక్రవారం పోలింగ్ ముగిసేదాకా సెలవులు లేకుండా విధులు నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు ఈ ఆదివారం మాత్రం ఆటవిడుపుగా మారింది. అటవీ శాఖకు చెందిన కండ్లకోయ వనక్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడిపారు. నగర శివార్లలోని ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో వీరు ఆత్మీయంగా కలుసుకుని వన భోజనాలు చేశారు. ఆటపాటలతో సరదాగా గడుపుతున్న సీపీ అంజనీకుమార్ తదితరులు ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి అధర్ సిన్హా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, పీసీసీఎఫ్ పీకే ఝా, సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితర అధికారులు తమ కుటుంబ సభ్యులతో కలసి ఈ కార్యక్రమానికి హాజరై ఉల్లాసంగా గడిపారు. గత మూడు నెలలుగా ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా గడిపిన డీజీపీ, సీపీతో పాటు పలువురు ఇతర అధికారులు కొద్దిసేపు రాజకీయ చర్చలు, పాలనా వ్యవహారాల ముచ్చట్లను పక్కనబెట్టి గ్రామీణ క్రీడలు, ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపారు. -
అడిషనల్ డీజీగా సీవీ ఆనంద్
సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. దీంతో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొనసాగేలా బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో రెండో అతిపెద్ద విస్తీర్ణం గల సైబరాబాద్ కమిషనరేట్‌లో శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన కీలక పాత్రపోషిస్తున్నారు. తక్కువ సిబ్బందితో ఎఫెక్టివ్ పోలీసింగ్‌తో నేరాలు అదుపు చేయగలిగారు. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఆనంద్‌కు పదోన్నతి రావడంపై పోలీసు వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. -
సామాన్య కుటుంబం నుంచి డీజీపీగా ఎదిగా..
మాజీ డీజీపీ బి.ప్రసాదరావు విజయవాడ (లబ్బీపేట) : కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చునని, అందుకు తానే నిదర్శనమని మాజీ డీజీపీ, రిటైర్డ్ హోంశాఖ ముఖ్యకార్యదర్శి బి.ప్రసాదరావు అన్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రసాదరావును శుక్రవారం రాత్రి హోటల్ గేట్‌వేలో సువార్త చానల్ ఆధ్వర్యంలో సన్మానించారు. ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమకు మంచి చేసుకుని, మరో నలుగురికి మంచి చేయాలని సూచించారు. పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నారు. నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ ఎంతో మందికి ప్రసాదరావు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ కె.కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్టీసీ ఎండీగా చేసిన కాలంలో ఆయన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ కె.అజయ్‌కుమార్, గుంటూరు అడిషనల్ ఎస్పీ శోభామంజరి, ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ సింగంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ఆడిట్ డిప్యూటీ డెరైక్టర్ ఎంవీ ప్రసాద్, జిల్లా రిజిస్ట్రార్ ఎస్.బాలస్వామి, నిర్వాహకులు చాట్ల లూథర్ ప్రశాంత్‌కుమార్, పచ్చిగళ్ల దేవానందం తదితరులు పాల్గొన్నారు. -
సీతారాం.. c/o సెటిల్మెంట్
ఏసీపీపై సస్పెన్షన్ వేటు భూ వివాదాలలో భారీగా వసూళ్లు పదుల సంఖ్యలో బాధితులు సీఐగానూ ఇదే తీరుతో సస్పెండ్ డీజీపీ విచారణలో వెలుగు చూసిన నిజాలు సిటీబ్యూరో: చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలోని ఆర్కేపురం సర్వే నెంబర్ 9/1లో రెండెకరాల స్థలంపై ‘విమలానంద, వైశ్యా హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ’ సభ్యులకు... రౌడీషీటర్ ఘోరెమియాకు మధ్య భూ వివాదం నెలకొంది. ఘోరెమియాతో కుమ్మక్కైన ఏసీపీ సీతారాం సొసైటీ సభ్యుల ఖాళీ ప్లాట్లను తన బంధువు పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని... సభ్యులను బెదిరించారు. ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో హకోర్టు న్యాయవాది కనకయ్య కుమార్తెకు 2000 గజాల స్థలం ఉంది. ఇటీవలే జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకుని నిర్మాణం ప్రారంభించగా... ఘోరెమియా అడ్డం వచ్చాడు. బాధితురాలు ఏసీపీని ఆశ్రయించగా... రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోవడంతో ఆ స్థలంలోని ప్రహరీని కూలదోయించాడు. చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో శేఖర్‌కు 200 గజాల ఖాళీ స్థలం ఉంది. ఇటీవలే నిర్మాణం ప్రారంభించగా... లంచం ఇవ్వలేదనే కక్షతో పోలీసులను పంపించి పనులను ఆపించాడు. ఇలా ఒకటీ... రెండూ కాదు. పదుల సంఖ్యలో భూ వివాదాలలో తలదూర్చిన ఏసీపీ సీతారాంపై బాధితులు ఉన్నతాధికారులకు సుమారు 50కిపైగా ఫిర్యాదులు చేశారు. దీంతో డీజీపీ అనురాగ్ శర్మ స్పందిస్తూ మంగళవారం ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. బాధితుల్లో టెలికాం, వాటర్‌వర్క్స్, జీహెచ్ఎంసీ, హైకోర్టు ఉద్యోగులతో పాటు మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి కుమారుడు, టీఆర్ఎస్ నేత సాగర్‌రెడ్డి, శైలజలు ఉన్నారు. బాధితుల సంఖ్య సుమారు 173 వరకు ఉంటుందని అంచనా. పూర్తి వివరాల్లోకి వెళితే... 1991లో ఎస్ఐగా పొందిన పి.సీతారాం మెదక్ జిల్లాలో మొదట్లో విధులు నిర్వహించారు. ఇన్స్పెక్టర్గా పదోన్నతి వచ్చిన తరువాత సైబరాబాద్‌లో కుషాయిగూడ, ఇబ్రహీంపట్నంలలో ఎస్హెచ్ఓగా విధులు నిర్వహించారు. గత ఏడాది ఫిబ్రవరిలో డీఎస్పీగా పదోన్నతి పొంది... ఎల్బీనగర్ ఏసీపీగా విధుల్లో చేరారు. గతంలో ఈ ప్రాంతంలో ఉన్న భూ వివాదాలపై అతని కన్ను పడింది. ఇరువర్గాల వారిని పిలిపించుకుని బలవంతపు సెటిల్మెంట్లు చేసేవారు. కొన్ని కేసులలో తన బంధువు పేరుపై కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారు. ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే అటు వైపు మొగ్గు చూసి సహకరించేవారు. పదుల సంఖ్యలో బలవంతపు సెటిల్మెంట్లకు పాల్పడి రూ.కోట్లు సంపాదించాడని బాధితుల ఆరోపణ. అతని వేధింపులు భరించలేని బాధితులు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, డీ జీపీ అనురాగ్‌శర్మకు దఫదఫాలుగా ఫిర్యాదులు చేశారు. దీంతో అతనిపై విచారణకు ఆదేశించారు. ఎల్బీ నగర్ డీసీపీ తస్వీర్ ఎక్బాల్ ఇటీవల విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. ఈ విచారణలో సీతారాం అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమైనట్టు తేల్చారు. దీంతో ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.ప్రస్తుతం వివాదాస్పద 9/1 సర్వే నెంబర్ భూమిలో ఘోరెమియా, అతని 50 మంది అనుచరులు తిష్ట వేశారు. ఎస్ఓపీని తుంగలో తొక్కి... సైబరాబాద్‌లో పెరిగిపోతున్న భూ వివాదాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ఏడాది క్రితం పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ కాపీలను అన్ని స్టేషన్లకు పంపించారు. ఎస్ఓపీ నిబంధనలు, విధానాన్ని పక్కన పెట్టిన ఏసీపీ సీతారాం తనదైన స్టైల్లో సెటిల్మెంట్లకు తెరలేపారు. గతంలోనూ... ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే సీతారాం అక్రమాలకు తెరలేపారు. భూ వివాదాలలో జోక్యం చేసుకుని బలవంతపు సెటిల్మెంట్లకు పాల్పడ్డారు. అప్పటి పోలీసు కమిషనర్ ప్రభాకరరెడ్డికి బాధితులు ఫిర్యాదు చేయడంతో విచారణలో సీతారాం అక్రమాలు వెలుగు చూశాయి. దీంతో అత ణ్ణి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ల డివిజన్ ... ఎల్బీనగర్ ఏసీపీలుగా బాధ్యతలు నిర్వహించిన అధికారుల్లో వరుసగా నలుగురు వివిధ ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురికావడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితుల నుంచి లంచం తీసుకుంటూ హర్షవ ర్ధన్‌రెడ్డి అనే ఏసీపీ గతంలో సస్పెండయ్యారు. ఆ తరువాత వచ్చిన లక్ష్మీకాంత్ షిండేపై ఇదే రీతిలో సస్పెన్షన్ వేటు పడింది. రెండేళ్ల క్రితం ఇక్కడ ఏసీపీగా పని చేసిన వెంకట్‌రెడ్డి కేవలం ఐదు నెలలు మాత్రమే విధులు నిర్వహించారు. ఈము కోళ్ల మాంసాన్ని సీజ్ చేసిన ఘటనలో సస్పెండయ్యారు. తాజాగా సీతారాం సస్పెండ్ కావడంతో దీనిపై సస్పెన్షన్ల డివిజన్‌గా ముద్ర పడింది. అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడంతో ఇలాంటి ఉదంతాలుపునరావృతమవుతున్నాయి. ఏ నేరమూ చేయలేదు నేను ఎవరి భూమినీ కబ్జా చేయలేదు. ప్లాట్ యజమానులను బెదిరించలేదు. 9/1 సర్వే నెంబర్ భూమి సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. చట్ట ప్రకారమే నడుచుకున్నా. కొంతమంది నాపై కక్ష కట్టి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారు. తప్పుడు ఫిర్యాదులు చేశారు. ఎవరి వద్దనూ ఒక్క పైసా లంచం తీసుకోలేదు. మా బంధువు పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాననే ఆరోపణలు అవాస్తవం. - ఏసీపీ సీతారాం -
నవసేన
సాక్షి, సిటీబ్యూరో: జంట కమిషనరేట్ల పరిధిలో ఆదివారం భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. తొమ్మిది మంది కొత్తవారికి పోస్టింగ్ ఇచ్చారు. ఇందులో ఇద్దరిని సైబరాబాద్‌కు, ఏడుగురిని హైదరాబాద్‌కు కేటాయించారు. ఇక్కడ విధులు నిర్వహించిన 13 మంది ఇతర జిల్లాలకు, డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. జంట కమిషనరేట్లు ఏర్పాటయ్యాక ఇంత పెద్ద సంఖ్యలో ఐపీఎస్‌లు బదిలీ కావడం ఇదే తొలిసారి. రాష్ట్ర విభజన నేపథ్యంలోనే ఈ బదిలీలు జరిగినట్టు తెలుస్తోంది. నగర పోలీసు కమిషనరేట్‌లో శాంతి భద్రతల విభాగానికి చెందిన ఐదుగురు, ట్రాఫిక్ విభాగానికి చెందిన ఇద్దరు ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పించారు. సైబరాబాద్‌లో జాయింట్ పోలీసు కమిషనర్ వై.గంగాధర్‌తోపాటు ఐదు జోన్లలో కేవలం మాదాపూర్ మినహా మిగిలిన నాలుగు జోన్ల డీసీపీలు విశ్వప్రసాద్, రమేష్‌నాయుడు, ఏఆర్ శ్రీనివాస్, కోటేశ్వరరావులను కదిలించారు. వీరి స్థానంలో కేవలం మల్కాజిగిరి జోన్‌కు మాత్రమే కొత్తగా అధికారిని నియమించారు. బాలానగర్, ఎల్బీనగర్ జోన్లకు అధికారులను నియమించాల్సి ఉంది. జాయింట్ పోలీసు కమిషనర్‌గా వచ్చిన కొత్త అధికారికి శంషాబాద్ జోన్ డీసీపీ బాధ్యతలను అదనంగా అప్పగించారు. త్వరలో సైబరాబాద్‌కు మరో ముగ్గురు ఐపీఎస్‌లు రావాల్సి ఉంది. ఇంటెలిజెన్స్‌లో ఎస్పీగా పనిచేసిన డాక్టర్ వి.రవీందర్ తూర్పు మండలం డీసీపీగా బదిలీ అయ్యారు. సమర్ధవంతంగా.. వరంగల్ డీఐజీగా బదిలీ అయిన 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఎం.మల్లారెడ్డి సిటీ కమిషనరేట్‌లో సుదీర్ఘకాలం పని చేశారు. నాలుగేళ్ల మూడు నెలల పాటు సేవలందించారు. కడప జిల్లా ఎస్పీగా పని చేస్తూ మల్లారెడ్డి 2010 ఆగస్టులో హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. ట్రాఫిక్ డీసీపీ-2గా ఏడాదికి పైగా విధులు నిర్వర్తించారు. అక్కడ నుంచి నగర భద్రతా విభాగం (సీఎస్‌డబ్ల్యూ) డీసీపీగా బదిలీ అయ్యారు. ఇక్కడ పని చేస్తుండగానే 2012 జూన్‌లో డీఐజీగా పదోన్నతి పొంది సిటీ ఆర్డ్మ్ రిజర్వ్ హెడ్-క్వార్టర్స్ సంయుక్త పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఏడాదిన్నర క్రితం స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. అనేక ఉద్యమాలు, ఉద్రిక్తతలతో పాటు కీలక ఘట్టాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలను సమర్ధవంతంగా పర్యవేక్షించారు. -
ఇక డీజీపీ పదవీకాలం రెండేళ్లు..
తప్పనిసరి చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్: ఇకపై డీజీపీ పదవీ కాలాన్ని రెండేళ్లు తప్పనిసరి చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించిన చట్టపరమైన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. పోలీసుశాఖలో తీసుకు రావలసిన సంస్కరణలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకాశ్‌సింగ్ వేసిన పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు 2006లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది. ఇందులో ప్రధానంగా రాష్ట్ర డీజీపీని ఎంపిక చేయడానికి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడిన స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర డీజీపీగా నియమించిన అధికారి పదవీ కాలపరిమితి రెండేళ్లు తప్పని సరి చేయాలని, ఎస్ఐ నుంచి అదనపు డీజీస్థాయి అధికారులను రెండేళ్లపాటు వారి పోస్టు నుంచి తప్పించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ప్రజలు పోలీసులపై ఫిర్యాదులు చేయడానికి ప్రతీ జిల్లాలో పోలీసు కంప్లైంట్ బాక్సులను ఏర్పాటుచేసి, వాటిని ఉన్నతాధికారులు విచారించి, తగిన చర్యలు తీసుకోవాలని, పోలీసుశాఖలో సైతం తమపై అధికారిపై క్రిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఫిర్యాదులు చేయడానికి కంప్లైంట్ బాక్సును ఏర్పాటు చేయాలని సూచించింది. వీటిని మూడునెలల్లోగా అమలు చేస్తూ తమకు నివేదిక ఇవ్వాలని కోరింది. ఇందులో కొన్నింటిని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. కానీ డీజీపీ పోస్టు పదవీకాలం మార్పు, స్టేట్ సెక్యూరిటీ కమిటీ ఏర్పాటు విషయాల్ని అమలు చేయలేదు. రాష్ట్ర విభజన జరిగే చివరిదశలో.. రెండేళ్లు కాకముందే తనను బదిలీ చేయడం అన్యాయమని రైల్వే ఎస్పీ ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీం ఇచ్చిన నోటీసుమేరకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే.మహంతి కోర్టుకు హాజరై ఈ అంశంతోపాటు డీజీపీ పోస్టు టెన్యూర్‌ను రెండేళ్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మధ్యలోనే రాష్ట్ర విభజన జరగడంతో సుప్రీం సూచనలు అమలు కాలేదు. తాను చేసిన సిఫార్సులను పాటించలేదని మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ కాకమునుపే తామూ పాటించాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. -
డీజీపీ రాముడు మనోడే
ఎస్కేయూ/బత్తలపల్లి/పుట్టపర్తి అర్బన్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ తొలి డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన జేవీ రాముడు మన జిల్లా వాసి కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తాడిమర్రి మండలం నార్శింపల్లిలో 1954 ఆగస్టు 1న జన్మించారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ (1971-74 బ్యాచ్) పూర్తి చేశారు. ఎస్కేయూలో ఎంఏ (ఎకనామిక్స్) మొదటి సంవత్సరం (1974-75), ఎస్వీ యూనివర్సిటీలో ద్వితీయ సంవత్సరం(1975-76) పూర్తి చేశారు. 1978లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇది వరకు ఉమ్మడి రాష్ట్రానికి డీజీపీ (ఆపరేషన్స్)గా బాధ్యతలు నిర్వర్తించారు. జేవీ రాముడు డీజీపీగా నియమితులు కావడంతో మండల కేంద్రమైన బత్తలపల్లిలో నార్శింపల్లి గ్రామస్తులు, ఆర్డీఎఫ్ పాఠశాల సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. గ్రామానికి చెందిన రామకృష్ణ ఆధ్వర్యంలో బాణాసంచ కాల్చారు. కేక్ కట్ చేశారు. జేవీ రాముడు గ్రామాభివృద్ధిని, ప్రజల క్షేమాన్ని కోరుకునే వ్యక్తి అని, ఆయన పెద్ద పదవి చేపట్టడం ఆనందంగా ఉందని వారు అన్నారు. ఆయన వల్ల తమ గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్ డీజీపీగా జేవీ రాముడు ఎంపిక కావడం తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని ఆయన సోదరి వెంకటలక్ష్మమ్మ, బావ రామయ్య అన్నారు. వీరు పుట్టపర్తి మండలం వీరాంజనేయపల్లిలో నివసిస్తున్నారు. డీజీపీగా జేవీ రాముడు బాధ్యతలు స్వీకరించడంతో సోమవారం గ్రామస్తులతో కలసి బాణాసంచ కాల్చారు. మిఠాయిలు పంచి పెట్టారు. -
వీడ్కోలు వందనం స్వీకరించిన దినేష్ రెడ్డి
హైదరాబాద్ : డీజీపీ దినేష్ రెడ్డి పదవీ కాలం నేటితో ముగియనున్న సందర్భంగా ఆయన సోమవారం వీడ్కోలు వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌గ్రౌండ్స్‌లో పోలీస్ విభాగం కవాతు నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ కార్యక్రమానికి అందరూ ఐపీఎస్‌లు, అడిషనల్ డీజీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ డీజీపీగా రెండేళ్ల మూడు నెలలు పని చేశానన్నారు. తాను బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రం అల్లకల్లోలంగా ఉందని.... అయితే అందరి సహకారంతో శాంతిభద్రతలు అదుపులోకి తీసుకు వచ్చినట్లు దినేష్ రెడ్డి తెలిపారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం గొప్పగా పని చేస్తోందని చెప్పారు. తన పదవీ కాలంలో శాంతి భద్రతలు కాపాడటానికి సహకరించిన పోలీసులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
గ్రామ స్థాయిలో అమలుకు నోచని ‘విలేజ్ పోలీస్’
గ్రామ స్థాయిలో శాంతిభద్రతల పర్యవేక్షణ, పరిరక్షణ తప్పనిసరనే మేధావుల సూచనలు జిల్లాస్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు. స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే గ్రామాల్లోకి వెళుతున్నారు. అంగ, అర్థబలం ఉన్న వారు చెప్పిందే శాసనంగా నడిచే గ్రామాలు జిల్లాలో వందకు పైగా ఉన్నాయని స్వయంగా పోలీసువర్గాలే చెబుతుండటం గమనార్హం. పెదకూరపాడు, తాడికొండ, తెనాలి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఇప్పటికీ కొందరు మోతుబరి ఆసాములు జమీందారీ తరహా వ్యవస్థను నడిపిస్తున్నారు. ఇక పల్నాడులో ఫ్యాక్షన్‌గ్రామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో గ్రామానికో పోలీసు విధులు నిర్వహించగలిగితే బాధితులకు రక్షణగా నిలవచ్చు. కానీ జిల్లాలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుంటూరు, న్యూస్‌లైన్ : గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సేవలు క్షేత్రస్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘విలేజ్ పోలీసు’ విధానం రికార్డులకే పరిమితమైంది. గ్రామ రాజకీయాలు పోలీసు వ్యవస్థను సైతం శాసిస్తాయని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనమే అవసరం లేదు. క్షేత్రస్థాయిలో పోలీసు సేవలు ప్రజలకు అందుబాటులోకి రావాలంటే ప్రతి గ్రామానికి స్థాయిని బట్టి ఒకరు లేక ఇద్దరు చొప్పున కానిస్టేబుళ్లను కేటాయిస్తారు. ఆ గ్రామాలను కానిస్టేబుళ్లు దత్తత తీసుకుని అక్కడ జరుగుతున్న వ్యవహారాలను పై అధికారులకు తెలియజేస్తుండాలి. వీరి నేతృత్వంలో ఆ గ్రామాల్లో పరిస్థితిని పూర్తిస్థాయిలో చక్కబెట్టేందుకు అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఆ కానిస్టేబుల్‌కు పూర్తి అవగాహన కలిగి వుండడం వల్ల సమస్య తక్షణం పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. జరుగుతుందిలా.. గ్రామస్థాయిలో కీలకమైన ఈ ‘విలేజ్ పోలీసు’ విధానంతో రాజకీయపెత్తనం తగ్గే ప్రమాదం ఉండటంతో ఆయా సామాజిక వర్గాలకు చెందిన కానిస్టేబుళ్లనే కేటాయించాలనే ఒత్తిళ్ళు రావడం, కొన్ని స్టేషన్లలో సిబ్బంది కొరత ఉండటంతో విలేజ్ పోలీసు వ్యవస్థకు తూట్లుపడ్డాయి. స్టేషన్ల పరిధిలోని ఐడీ పార్టీ, కోర్టు విధులు, నాయకులు వద్ద ప్రొటోకాల్ కోసం, కొన్ని కేసుల్లో రికవరీలకు వెళ్లేందుకు అలవాటుపడిన కొంతమంది కానిస్టేబుళ్లు కూడా విలేజ్ పోలీసుగా బాధ్యతలు తీసుకుంటే ఆ గ్రామాలకు పరిమితం కావాల్సి వస్తుందని వెనుకాడుతున్నారు. రికార్డుల్లో మాత్రం ఆయా గ్రామాలకు పూర్తి బాధ్యత మీదేనంటూ కానిస్టేబుళ్ల పేర్లు నమోదు చేశారు. గ్రామాల్లో పట్టు కోల్పోతున్న పోలీస్.. సిబ్బంది కొరత... పనిభారంతో గ్రామాల్లో పోలీసు పట్టు సడలుతున్నట్టు కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. పిడుగురాళ్ల పరిధిలో కొందరు ఆగంతకులు వృద్ధులు, మహిళలను దోచుకుంటున్నా మూడు నెలల తరువాత పోలీసులకు తెలిసింది. స్టూవర్టుపురం గ్రామంలో ఇటీవల తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని రెండు చోట్ల ర్యాపులు కొనసాగించినప్పటికీ పోలీసులకు 15రోజుల తరువాత తెలియడంతో బాధితులు నష్టపోయారు. అర్బన్ పరిధిలో ట్రావెల్స్ నిర్వహకుడుని కిడ్నాప్ చేసి రెండు రోజులు పాటు శ్రీశైలం, మాచర్లలో తిప్పుకుంటూ తీవ్రంగా కొట్టారు. అతనిని హత్య చేయకుండా ఉండేందుకు నగదు ఇవ్వాలని డిమాండ్ చేసి, నగదు ఇచ్చిన తరువాత బాధితుడిని వదిలిపెట్టారు. బాధితుడు చికిత్సకు వెళ్లిన తరువాతే ఈ సంఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది. ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్టవేయాలంటే విలేజ్ పోలీస్ తప్పని సరనే వాదన ఆ వర్గాల నుంచే వినిపిస్తోంది.