
అడిషనల్ డీజీగా సీవీ ఆనంద్
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. దీంతో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొనసాగేలా బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో రెండో అతిపెద్ద విస్తీర్ణం గల సైబరాబాద్ కమిషనరేట్‌లో శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన కీలక పాత్రపోషిస్తున్నారు.
తక్కువ సిబ్బందితో ఎఫెక్టివ్ పోలీసింగ్‌తో నేరాలు అదుపు చేయగలిగారు. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఆనంద్‌కు పదోన్నతి రావడంపై పోలీసు వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి.