పోలీసులకు ఎత్తు, సరైన బరువు, శారీరక ధృడత్వం ఎంతో ముఖ్యం. అందుకే పోలీస్‌కు ఎంపికయ్యే సమయంలో రాత పరీక్షలతోపాటు ఈవెంట్స్‌లో కూడా తప్పక క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అయితే పోలీస్ విధుల్లో చేరాక చాలా మందికి ఫిట్‌నెస్ కోల్పోవడం చూస్తుంటాం.. ఇక వయసు మీదపడుతున్న వారికైతే పొట్ట అమాంతం ముందుకు వచ్చేస్తుంటుంది. కొందరిని అయితే యూనిఫాంలో చూస్తే తప్ప వారిని పోలీసులని గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు.
ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలోని పోలీసులును ఫిట్ మార్చేందుకు అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్‌లతో సహా అన్ని విభాగాల్లోని పోలీసులందరూ ఫిట్‌గా ఉండాలని సూచించింది. పోలీసులు ఫిట్ మారడానికి మూడు నెలల సమయం ఇచ్చింది. ఈ తర్వాత వారి బాడీ మాస్ ఇండెక్స్(బీఎమ్‌ఐ)నమోదు చేయనున్నట్లు తెలిపింది. ఏపీఎస్, ఏపీఎస్ అధికారులతో సహా అస్సాం పోలీసు సిబ్బంది అందరికి ఆగస్టు 15 వరకు మూడు నెలల సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర డీజీపీ జీపీ సింగ్ తెలిపారు.
ఆ తరువాత 15 రోజులకు వారి బీఎమ్‌ఐ లెక్కగట్టనున్నట్లు పేర్కొన్నారు. ఊబకాయం కేటగిరిలో(BMI 30+) ఉన్నవారికి బరువు తగ్గించుకోవడానికి మరో మూడు నెలల సమయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అప్పటికీ ఫలితం కనిపించకపోతే తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకునే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే హైపోథైరాయిడిజం వంటి వైద్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న వారికి దీని నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. బీఎంఐ లెక్కించుకునే వారిలో మొదటి వ్యక్తి తానేనని డీఐజీ తెలిపారు. ఇక అస్సాంలో 7,000 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు.
చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..
Comments
Please login to add a commentAdd a comment