Voluntary retirement scheme
-
AP: ఐఏఎస్ ఇంతియాజ్ స్వచ్చంద పదవీ విరమణ
సాక్షి, విజయవాడ: ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. సెర్ప్ సీఈవోగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ రాజకీయ ప్రవేశం చేసేందుకు పదవీ విరమణ చేసినట్లు సమాచారం. ఇంతియాజ్ అహ్మద్ వీఆర్ఎస్ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
దిశా కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: దిశా కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ అధికారిగా పనిచేసిన పోలీసు అధికారి సురేంద్ర స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వీఆర్ఎస్ కోసం డీజీపీ అంజనీ కుమార్ యాదవ్‌కు దరఖాస్తు సమర్పించారు. ఇటీవల తరుచూ బదిలీలపై అసంతృప్తితో ఉన్నాయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కాగా దిశా నిందితుల ఎన్కౌంటర్ సమయంలో సురేంద్ర షాద్ నగర్ ఏసీపీగా ఉన్నారు. దిశ కేసు విచారణ అధికారిగా పనిచేశారు. తరువాత ట్రాన్స్‌కో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా పనిచేశారు. సురేంద్రను ఇటీవలె సైబరాబాద్ కమాండర్ కంట్రోల్ విభాగానికి ఏసీపీగా బదిలీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన స్వచ్చంద పదవీ విమరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించారు. అయితే వీఆర్ఎస్కు వ్యక్తిగత కారణాలను చూపుతున్నప్పటికీ.. తరచుగా బదిలీలు, లూప్ లైన్ పోస్టింగ్‌లు పొందడం పట్ల సురేందర్ కలత చెందినట్టుగా తెలుస్తోంది. ఇక సురేందర్‌కు మరో మూడేళ్ల సర్వీసు ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. చదవండి: మంచిర్యాల: పీఎస్‌లో కుప్పకూలిన నిందితుడు -
‘3 నెలల్లో ఫిట్‌గా మారండి.. లేదా ఇంటికి వెళ్లిపోండి’
పోలీసులకు ఎత్తు, సరైన బరువు, శారీరక ధృడత్వం ఎంతో ముఖ్యం. అందుకే పోలీస్‌కు ఎంపికయ్యే సమయంలో రాత పరీక్షలతోపాటు ఈవెంట్స్‌లో కూడా తప్పక క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అయితే పోలీస్ విధుల్లో చేరాక చాలా మందికి ఫిట్నెస్ కోల్పోవడం చూస్తుంటాం.. ఇక వయసు మీదపడుతున్న వారికైతే పొట్ట అమాంతం ముందుకు వచ్చేస్తుంటుంది. కొందరిని అయితే యూనిఫాంలో చూస్తే తప్ప వారిని పోలీసులని గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలోని పోలీసులును ఫిట్ మార్చేందుకు అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్‌లతో సహా అన్ని విభాగాల్లోని పోలీసులందరూ ఫిట్‌గా ఉండాలని సూచించింది. పోలీసులు ఫిట్ మారడానికి మూడు నెలల సమయం ఇచ్చింది. ఈ తర్వాత వారి బాడీ మాస్ ఇండెక్స్(బీఎమ్ఐ)నమోదు చేయనున్నట్లు తెలిపింది. ఏపీఎస్, ఏపీఎస్ అధికారులతో సహా అస్సాం పోలీసు సిబ్బంది అందరికి ఆగస్టు 15 వరకు మూడు నెలల సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర డీజీపీ జీపీ సింగ్ తెలిపారు. ఆ తరువాత 15 రోజులకు వారి బీఎమ్ఐ లెక్కగట్టనున్నట్లు పేర్కొన్నారు. ఊబకాయం కేటగిరిలో(BMI 30+) ఉన్నవారికి బరువు తగ్గించుకోవడానికి మరో మూడు నెలల సమయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అప్పటికీ ఫలితం కనిపించకపోతే తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకునే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే హైపోథైరాయిడిజం వంటి వైద్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న వారికి దీని నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. బీఎంఐ లెక్కించుకునే వారిలో మొదటి వ్యక్తి తానేనని డీఐజీ తెలిపారు. ఇక అస్సాంలో 7,000 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు.. -
Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్!
న్యూఢిల్లీ: టెక్, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 10వేల ఉద్యోగాల కోత ప్రకటన తరువాత వచ్చే పరిణామాలను ఎదుర్కొ నేందుకు మల్లగుల్లాలు పడుతోంది. ఈ మేరకు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఇండియన్ టెకీలను వేడు కుంటోంది. అంతేకాదు అలా చేసిన వారికి భారీ ప్రయోజనాలు అందిస్తామని కూడా ప్రకటించింది. దీంతో ఈ అంశం హాట్‌టాపిక్‌గా నిలిచింది. (మరో టెక్ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?) అమెజాన్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ టీమ్‌లో L1 నుండి L7 బ్యాండ్‌లో పని చేస్తున్న భారతీయ ఉద్యోగులు కంపెనీ వాలంటరీ సెపరేషన్ ప్రోగ్రామ్‌కు అర్హులని పేర్కొంది. ఈ పథకం కింద ఈ సంవత్సరం నవంబర్ 30 లోపు రాజీనామా చేస్తే వారికి కొన్ని ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇస్తోంది. దీంతో పలువరు ఇండియన్ ఉద్యోగులు స్వచ్ఛంద రాజీనామాలను ప్రారంభించినట్టు తెలుస్తోంది. (దోమలను తోలేసినంత తేలిగ్గా ఉద్యోగ కోతలు, ఎన్నాళ్లీ వేట?) కార్మిక మంత్రిత్వ శాఖ సమన్లు భారతీయఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విమరణకు అమెజాన్ ప్రయత్నాలపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అమెజాన్‌కు కార్మిక మంత్రిత్వ శాఖ నోటీసు లిచ్చింది. దీనిపై విచారణకు హాజరు కావాలని మంగళవారం డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఏ అంజనప్ప కంపెనీకి నోటీసులు పంపారు. భారతదేశంలో అమెజాన్ చేసిన తొలగింపులపై ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఫిర్యాదు మేరకు, బెంగళూరులోని ఈకామర్స్ దిగ్గజం సీనియర్ పబ్లిక్ పాలసీ మేనేజర్ స్మితా శర్మను (బుధవారం నవంబర్ 23న జరిగే) విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఐటి/ఐటిఇఎస్ ఉద్యోగుల యూనియన్ గత వారం కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్‌కు రాసిన లేఖలో, దేశంలోని అమెజాన్ ఉద్యోగులను స్వచ్ఛందంగా కంపెనీ నుండి వైదొలగాల్సి వస్తోందన్న ఫిర్యాదులు అందాయని పేర్కొంది. దేశంలోని కార్మిక చట్టాలను అమెజాన్ ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించిన ఉద్యోగులకు భారీ పరిహారం అందించాల్సి ఉంటుంది. అందుకే నవంబర్ 30, 2022న భారత ప్రామాణిక కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలలోపు స్మార్ట్ ఫారమ్‌ల ద్వారా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలంటూ ఉద్యోగులకు ఒక నోట్ పంపింది. అయితే ఉద్యోగులు రాజీనామా చేసిన తర్వాత ఎంత సమయంలోపు ఈ పరిహారం అందిస్తుంది అనేది అమెజాన్ స్పష్టం చేయలేదు. ఈ స్కీం కింద 22 వారాల బేస్ పే; అలాగే ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు ఒక వారం మూల వేతనం (సమీప 6 నెలల వరకు ఉంటుంది) గరిష్ట ప్రయోజనం ఇరవై వారాల వరకు చెల్లింపు, బీమా బెనిఫిట్ పాలసీ ప్రకారం 6 నెలల పాటు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదా దానికి బదులుగా సమానమైన బీమా ప్రీమియం మొత్తం తదితర ప్రయోజనాలను ఆఫర్ చేసింది.ఒక ఉద్యోగిని కంపెనీ తొలగించినట్లయితే, తొలగింపును చట్టపరంగా సవాలు చేయవచ్చు. కానీ ఒక ఉద్యోగి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు, న్యాయస్థానంలో ఉద్యోగం కోల్పోవడంపై సవాలు చేసే హక్కును కోల్పోతారు. ఇదే కంపెనీ ఎత్తుగడ అని లానోజిఎమ్బిహెచ్ ఎంప్లాయిమెంట్ లా ప్రాక్టీషనర్, జనరల్ కౌన్సెల్ భాగ్యశ్రీ పాంచోలో వ్యాఖ్యానించారు. కాగా ఆర్థికమందగమనం, ఆదాయాలు క్షీణత నేపథ్యంలో తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను విభాగాల్లో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు వచ్చే ఏడాది కూడా ఈ తొలగింపుల ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు: అమెజాన్ కీలక నిర్ణయం) -
గ్రేటర్ ఆర్టీసీలో వీఆర్‘ఎస్’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు ఉద్యోగులు బారులు తీరుతున్నారు. వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెలాఖరు వరకు గడువు విధించడంతో నగరంలోని వివిధ డిపోలకు చెందిన సీనియర్ కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణకు ఆర్టీసీ యాజమాన్యం గతంలోనే ఒకసారి అవకాశం కల్పించింది. దాంతో అప్పట్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. పదవీ విరమణకు చేరువలో ఉన్న సుమారు 1500 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ పథకంపై అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచారు. అప్పటి నుంచి వీఆర్ఎస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లతో పాటు కొత్తగా మరికొందరికి అవకాశం కలి్పంచేందుకు తాజాగా మరోసారి దరఖాస్తులు ఆహా్వనించారు. ఈ నెలాఖరు వరకు గడువు విధించడంతో వివిధ డిపోలకు చెందిన సీనియర్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వయోభారమే కారణం.. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం 2019లో రెండేళ్లకు పెంచింది. దీంతో ఆ సంవత్సరం ఉద్యోగ విరమణ చేయాల్సిన వాళ్లు 2021 వరకు విధులు నిర్వహించారు. కానీ.. చాలా మంది రెండేళ్ల పెంపును భారంగానే భావిస్తున్నారు. ముఖ్యంగా విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే డ్రైవర్లు, ఆ తర్వాత కండక్టర్లు స్వచ్ఛంద పదవీ విరమణ వైపే మొగ్గు చూపుతున్నారు. వయోభారం కారణంగా అధిక రక్తపో టు, మధుమేహం, గుండెజబ్బులతో బాధపడేవా ళ్లు విశ్రాంతిని కోరుకుంటున్నారు. అప్పట్లోనే సు మారు 1500 మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా తాజా ప్రకటనతో మరికొంత మంది అదనంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. తగ్గనున్న ఆర్థిక భారం.. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో వివిధ విభాగాల్లో సుమారు 18 వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పీకల్లోతు నష్టాల్లో నడుస్తున్న సంస్థలో ఇంధనం, విడిభాగాల కొనుగోళ్లు, బస్సుల నిర్వహణతో పాటు ఉద్యోగుల జీతభత్యాలు కూడా భారంగానే మారాయి. ఈ క్రమంలో అదనపు భారాన్ని తగ్గించుకొనేందుకే మరోసారి ఈ పథకాన్ని ముందుకు తెచ్చినట్లు సమాచారం. 2019లోనే వీఆర్ఎస్ ప్రస్తావన వచి్చనప్పటికీ అప్పట్లో ఉద్యోగ సంఘాలు గట్టిగా వ్యతిరేకించడంతో విరమించుకున్నారు. ఆ తర్వాత వీఆర్ఎస్ ప్రతిపాదన ముందుకు వచ్చింది. అప్పటికి విధానపరమైన అంశాల్లో కారి్మక సంఘాల జోక్యం లేకపోవడంతో వీఆర్ఎస్ను ప్రతిపాదించారు. దీంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు ఒక అవకాశంగా భావిస్తున్న అధికారులు తాజాగా వీఆర్ఎస్ను ప్రకటించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను డిపోల నుంచి సేకరించడం గమనార్హం. (చదవండి: నవీకరణ.. నవ్విపోదురు గాక!) -
TSRTC: ఆర్టీసీలో వీఆర్ఎస్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ అంశంపై అధికారులు కసరత్తు ప్రారభించారు. ప్రస్తుతం సంస్థ తీవ్ర నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఖర్చును తగ్గించాలంటే ఉద్యోగుల సంఖ్యను కుదించటమొక్కటే మార్గమని భావిస్తున్నారు. ఇందుకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకాన్ని ప్రవేశపెట్టడం మినహా గత్యంతరం లేదనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపు భేటీ అయ్యారు. ఆర్టీసీ ఆర్థిక స్థితిపై వాకబు చేసిన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లెవెలుగు, సిటీ సర్వీసులతో ఆర్టీసీ స్థితిగతులు ఎప్పటికి మారతాయని, ఆదాయాన్ని అందించే దూరప్రాంత సర్వీసులను ఎందుకు మెరుగుపరచటం లేదని నిలదీశారు. 4 వేల మంది మిగులు ఉద్యోగులు సర్వీసుల సంఖ్య కుదింపు, దాదాపు నాలుగు వేల మంది ఉద్యోగులు ‘మిగులు’గా మారిన విషయం అధికారులు ప్రస్తావించారు. ఆర్టీసీలో కూడా పదవీ విరమణ వయసును రెండేళ్లకు (60 ఏళ్లు) పెంచటం, మిగులు ఉద్యోగులు ఉండటం, రిటైర్మెంట్లు లేకపోవటంతో ప్రొడక్టివిటీ తగ్గి జీతాల భారం పెద్ద సమస్యగా మారిందన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలోనే దీనికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకం పరిష్కారమనే తమ అభిప్రాయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చినట్టు సమాచారం. అయితే దీనిపై ముఖ్యమంత్రి ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదని తెలిసింది. 55 ఏళ్లు మొదలు 60 ఏళ్ల వయసు వరకు ఉన్న ఉద్యోగుల సంఖ్యను మాత్రం ఆయన ప్రశ్నించారు. దానికి అధికారుల వద్ద కచ్చితమైన లెక్కలు లేకపోవటంతో ఉజ్జాయింపు లెక్కలు వెల్లడించారు. తాజాగా ఆయా వివరాలను సీఎంకు సమర్పించేందుకు అధికారులు పక్కాగా లెక్కలు వేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం తెస్తే భారీగా ప్రయోజనాలు అందించాల్సి ఉంటుంది. అందుకు పెద్ద మొత్తంగా నిధులు కావాలి. దీంతో ఇప్పటికే ఆర్టీసీకి ఉన్న భూములు, వాటిల్లో ఉపయోగంలో ఉన్నవి, ఖాళీగా ఉన్నవి.. తదితర వివరాలను కూడా అధికారులు సిద్ధం చేసి పెట్టారు. ఒకేరోజు రూ.13 కోట్ల ఆదాయం గత ఏడాదిన్నరలో ఎన్నడూ లేనట్టుగా ఆర్టీసీ సోమవారం రోజున రూ.13.04 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. కోవిడ్‌కు ముందు రోజుల్లో ఉన్నట్టుగా ఆదాయం రావటంతో ఆర్టీసీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 78 శాతం ఆక్యుపెన్సీతో ఈ మొత్తం నమోదైంది. -
కష్టమైనా.. ఇన్వెస్ట్ చేయాల్సిందే..!
రిటైర్మెంట్.. ఏదో ఒకరోజు ఆహ్వానించాల్సిందే. ఉద్యోగాల్లో ఉన్న వారికి కాస్త ముందు, స్వయం ఉపాధుల్లోని వారికి కొంత ఆలస్యంగా అయినా.. వృద్ధాప్యంలో పని జీవితం నుంచి విశ్రాంతి అవసరమే. అప్పటి వరకు సంపాదనతో నడిచిన జీవితం.. ఆ తర్వాత కూర్చుని కొనసాగించాలంటే అందుకు ముందు నుంచే ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాల్సిందే. రిటైర్మెంట్ కోసం పొదుపును పెద్దగా పట్టించుకోని ధోరణి యుక్త వయసులోని వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. రిటైర్మెంట్ కోసం చాలా సమయం ఉందన్నది వారి ఆలోచనా తీరు. ఈ ధోరణితో రిటైర్మెంట్ ప్రణాళికను వాయిదా వేస్తే.. వివాహంతో గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత పిల్లలు, వారి ఉన్నత విద్య, వారి వివాహాలు, సొంతిల్లు, కారు తదితర లక్ష్యాలు ముఖ్యమైనవిగా మారతాయి. దీంతో తమ విశ్రాంత (వృద్ధాప్య) జీవనానికి సంబంధించిన ప్రణాళిక పక్కకు వెళ్లిపోతుంది. కారణం ఏదైనా కానీయండి.. వయసుతో సంబంధం లేకుండా సంపాదించే గ్రూపులో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ పదవీ విరమణ జీవితానికి పొదుపును తక్షణం ప్రారంభించడమే మంచి పరిష్కారం. ఇది ఎంత ముందుగా ప్రారంభిస్తే అంత సులభంగా కావాల్సినంత సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. ఇందుకు ఏం చేయాలో చూద్దాం.. ఉద్యోగులు అయితే ‘ఉద్యోగుల భవిష్య నిధి’ (ఈపీఎఫ్) సదుపాయం ఉంటుంది. వేతనంలో ప్రతీ నెలా నిర్ణీత శాతం మేర ఈపీఎఫ్ ఖాతాకు వెళుతుంటుంది. ఉద్యోగి వాటాకు సమానంగా పనిచేయించుకునే సంస్థ కూడా తన వంతు వాటాను సమకూర్చడం ఇందులోని విశేషం. ఉద్యోగి ప్రమేయం లేకుండా క్రమం తప్పకుండా ప్రతీ నెలా భవిష్యనిధి ఖాతాకు జమ కావడం వల్ల దీన్ని మంచి సాధనంగా నిపుణులు చెబుతారు. దీనికి విరుద్ధంగా చాలా మంది ఈపీఎఫ్ విషయంలో తప్పుగా వ్యవహరిస్తుండడాన్ని చూడొచ్చు. తమ అవసరాలకు ఈపీఎఫ్ నిధిపై ఆధారపడుతుంటారు. ఇల్లు కొనుగోలు, ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ నిధిని వెనక్కి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవడాన్ని చూడొచ్చు. ఇలా చేయడం అన్ని సందర్భాల్లోనూ సరైనది కాదు. ఈపీఎఫ్ నిధిని కదపకుండా.. రిటైర్మెంట్ తర్వాత ఉపసంహరించుకోవడం వల్ల మంచి నిధిని చేతికందుకోవచ్చు. ప్రతీ ఉద్యోగికీ సాధ్యమయ్యే రిటైర్మెంట్ పొదుపు సాధనంగా దీన్ని చూడాలి. మరి రిటైర్మెంట్ జీవితానికి ఈపీఎఫ్ ఒక్కటి సరిపోతుందా..? లేదు. మరింత అదనంగా పొదుపు, మదుపు చేసుకుంటూ వెళ్లాలి. ఎంత మొత్తం అన్నది మీరు తీసుకునే రిస్క్, ఇన్వెస్ట్ చేయగలిగే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. రిస్క్ తీసుకోని రక్షణాత్మక ధోరణి ఇన్వెస్టర్ అయితే డెట్ సాధనాలను పెట్టుబడులకు ఎంచుకోవాలి. ఓ మోస్తరు రిస్క్ అయినా ఫర్వాలేదనుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలం. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్.. ప్రయోజనాలు ఈపీఎఫ్ ఉద్యోగుల భవిష్యనిధిలో జమ అయ్యే మొత్తాలకు సెక్షన్ 80సీ కింద పన్ను పడదు. ఉద్యోగి వాటాతోపాటు, సంస్థ జమ చేసే వాటా కూడా పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తుంది. అంతే కాదు రిటైర్మెంట్ సమయంలో ఈపీఎఫ్ నుంచి తీసుకునే మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంటుంది. ఇందులో పెట్టుబడులు, రాబడులు, ఉపసంహరణల మొత్తం కూడా పన్ను లేనిదే. అందుకే ఉద్యోగాలలో ఉన్న వారు అనవసరాలకు ఈపీఎఫ్ నిధిని ఖాళీ చేయకుండా, రిటైర్మెంట్ కోసం కొనసాగించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఒక సంస్థ నుంచి వేరే సంస్థకు మారినా, ఈపీఎఫ్ నిధిని బదిలీ చేసుకుని, కొనసాగించుకోవాలి. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్‌కు అనుసంధానంగా పనిచేసే వీపీఎఫ్‌ను వినియోగించుకునే వారు చాలా తక్కు వ మందే. ఈపీఎఫ్ వాటా మూల వేతనంలో 12 శాతానికే పరి మితం. కానీ, వీపీఎఫ్ విషయానికొస్తే మూలవేతనం, డీఏ రెండింటికి సమాన స్థాయిలో ప్రతీ నెలా పొదుపు చేసుకునేందుకు అనుమతి ఉంది. ఈపీఎఫ్ వడ్డీ రేటే వీపీఎఫ్‌కూ అమలవుతుంది కనుక.. మెరుగైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇందు లో జమ చేసే మొత్తానికీ పన్ను మినహాయింపు పొందొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వేతన జీవులు కాని వారికి పీపీఎఫ్ ఒకానొక సాధనం అవుతుంది. రాబడులు ఈపీఎఫ్‌తో పోలిస్తే ప్రస్తుతానికి ఒక శాతానికి పైగా తక్కువగా ఉన్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఇందులో రాబడులు, ఉపసంహరణలకూ పన్ను మినహాయింపు ఉంది కనుక ఇది కూడా డెట్‌లో ఒక మెరుగైన ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్జన ఆరంభమైన నాటి నుంచి రిటైర్మెంట్కు చాలా సమయం ఉంటుంది. కనుక ముందే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఆరంభించినట్టయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఘనంగా సమకూర్చుకోవచ్చు. మధ్యస్థ రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకుంటే.. ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకుని ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి సంపదను సృష్టించుకునే మార్గం ఈక్విటీలు. కాకపోతే ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ పనితీరును ఏడాదికోసారి తప్పకుండా సమీక్షించుకోవాలి. ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీల్లోనే ఇవి ఒక విభాగం. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీ పొందొచ్చు. రాబడులను వెనక్కి తీసుకున్న సమయంలో మాత్రం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 10 శాతం (రూ.లక్ష మించిన మొత్తాలపై) చెల్లించాల్సి ఉంటుంది. అయినా, రిటైర్మెంట్ కోసం ఈ పథకాలను ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం మంచి మార్గమే అవుతుంది. అంతేకాదు, రిటైర్మెంట్ తర్వాత ఈక్విటీ పథకాల నుంచి ఏకమొత్తంలో ఉపసంహరించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతీ నెలా తమ అవసరాలకు కావల్సిన మొత్తాన్ని రిడెండప్షన్ చేసుకుంటూ వెళ్లొచ్చు. అప్పుడు మిగిలి ఉన్న పెట్టుబడులకు రాబడులు జమవుతూ ఉంటాయి. ఎన్పీఎస్ ఇది పూర్తిగా రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం ఉద్దేశించిన సాధనం. ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఇప్పుడు తప్పనిసరి అమల్లో ఉన్న పెన్షన్ సాధనం ఇదే. ప్రైవేటు రంగ సంస్థలు తమ అభీష్టం మేరకు ఈపీఎఫ్‌కు బదులు ఎన్పీఎస్ను కూడా ఎంచుకోవచ్చు. స్వచ్ఛందంగా ఎవరైనా ఎన్‌పీఎస్‌లో భాగం కావచ్చు. ఇందులో డెట్, ఈక్విటీల కలయికగా పెట్టుబడుల ఆప్షన్ ఎంచుకునేందుకు వీలుంది. ఎంత మేర ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయించుకోలేకపోతే.. వయసు ఆధారంగా ఈక్విటీ, డెట్ శాతాలను నిర్ణయించే ఆటో చాయిస్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ఈపీఎఫ్, పీపీఎఫ్ సాధనాల్లో మెచ్యూరిటీ తర్వాత మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది. కానీ, ఎన్‌పీఎస్‌లో అలా కాదు.. 60 ఏళ్లనాటికి సమకూర్చుకున్న నిధిలో 60 శాతాన్నే వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది. ఈ మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. మిగిలిన 40 శాతంతో పెన్షన్ ఇచ్చే యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా యాన్యుటీ ప్లాన్ నుంచి ప్రతీ నెలా అందుకునే మొత్తం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. ఇలా మెచ్యూరిటీ తర్వాత కచ్చితంగా యాన్యుటీలో 40 శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన కొందరికి నచ్చకపోవచ్చు. అటువంటి వారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. రక్షణాత్మక ధోరణి కలిగిన విభాగంలోకి మీరు వస్తే.. ఈపీఎఫ్ ఖాతాకు ప్రతీ నెలా మీ వంతు అదనంగా జమ చేయడం ఒక మంచి మార్గం. దీన్నే వాలంటరీ ప్రావిడెంట్ ఫంఢ్ (వీపీఎఫ్) అంటారు. ఈపీఎఫ్ నిల్వలపై అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్‌కూ వర్తిస్తుంది. డెట్ సాధనాల్లో ఈపీఎఫ్ అత్యధిక రిటర్నులు అందిస్తున్న ఒక సాధనమని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేయని వారు ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)ని ఎంచుకోవచ్చు. కాకపోతే ఇందులో రాబడులు కాస్త తక్కువగా ఉంటాయి. ఈపీఎఫ్‌తోపాటు వీపీఎఫ్ లేదా పీపీఎఫ్ రూపంలో రిటైర్మెంట్కు కావాల్సిన మేర నిధికి ప్రణాళిక వేసుకోవడం మంచి ఆలోచనే అవుతుంది. అయితే, డెట్ సాధనాల్లో వచ్చే రాబడిలో అధిక శాతం ద్రవ్యోల్బణ ప్రభావానికే కరిగిపోతుంది. కనుక అధిక రాబడుల కోసం కొంత మొత్తాన్ని అయినా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మోస్తరు నుంచి అధిక రిస్క్ తీసుకునే వారికి ఈక్విటీలు అనుకూలమైన పొదుపు సాధనమని చెప్పుకోవాలి. ఈపీఎఫ్, వీపీఎఫ్, పీపీఎఫ్, ఈక్విటీ ఫండ్స్ కలయికతో పెట్టుబడుల ప్రణాళిక రూపొందించుకున్నామెరుగ్గానే ఉంటుంది. 20–30ల్లోనే ఉండి ఆదాయం మొదలు పెట్టిన వారు ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకోవడం ద్వారా భారీ నిధిని సమకూర్చుకునే అవకాశం సొంతం చేసుకోవచ్చు. రిటైర్మెంట్కు కనీసం 20–30 ఏళ్లు అయినా ఉంటే, ఈక్విటీల కలయికగా పెట్టుబడులను ప్లాన్ చేసుకోవాలి. పెంచుతూ పోవడం పరిష్కారం ఆదాయం పెరుగుతూ వెళుతున్నట్టే.. రిటైర్మెంట్ కోసం చేసే పొదుపు మొత్తాన్ని కూడా అంతే మేర పెంచుకుంటూ వెళ్లాలి. వీలైనంత ముందుగా పెట్టుబడులను ప్రారంభించాలి. చెప్పడం సులభం.. ఆచరణే కష్టం. కానీ, ఆరంభించేంత వరకే కష్టం. ఒక్కసారి మొదలు పెడితే, దానికి తగినట్టు ఖర్చులను సర్దుబాటు చేసుకోవచ్చు. రిటైర్మెంట్ కోసం కొంత మొత్తం కావాలన్న అవసరాన్ని ఒక్కొక్కరు ఒక్కో సమయంలో గుర్తిస్తుంటారు. కొందరు అయితే అప్పటి సంగతి అప్పుడే చూసుకోవచ్చనుకుంటారు. కానీ, ముందుగా ప్రారంభించినట్టయితే.. దానికి కాంపౌండింగ్ (వృద్ధి) శక్తి తోడవుతుంది. దాంతో దీర్ఘకాలానికి గణనీయమైన మొత్తాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు మధ్య వయసు కూడా దాటి, రిటైర్మెంట్ పొదుపును ఇంకా ప్రారంభించలేదని ఆలోచిస్తున్నారా..? ఆందోళన చెందకుండా వెంటనే ఆచరణలో పెట్టడం ఉత్తమం. ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే 45–50లకు చేరిన తర్వాత రిటైర్మెంట్ కోసం పొదుపు మొదలు పెట్టడం వల్ల అవసరమైనంత నిధి సమకూరదు. చిన్న వయసులో అయితే సంపాదనలో కొంత భాగాన్ని పక్కన పెట్టినా సరిపోతుంది. కానీ, ఆలస్యం చేసిన కొద్దీ సంపాదనలో భారీ మొత్తాన్ని రిటైర్మెంట్కు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రిటైర్మెంట్ అవసరాలకు ఎంత మేర కావాలి, అందుకు ఏం చేయాలన్న విషయమై సందేహాలు ఉంటే ఆర్థిక సలహాదారులను సంప్రదించి వారిచ్చే సూచనలను అనుసరించాలి. -
రియాకు అర్హత లేదు.. డీజీపీ రాజీనామా
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన డీజీపీ గుప్తేశ్వర్ పాండే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే రాజకీయాల్లో చేరడానికి పాండే రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే నెలలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాండే స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ఎన్నికల్లో పోటీ చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1987 బిహార్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గుప్తేశ్వర్ పాండే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక పాండే రాజీనామా అభ్యర్థనకు సంబంధించి నోటిఫికేషన్ హోంశాఖ జారీ చేసింది. ఇక నిన్నటితో ఆయన వర్కింగ్ డేస్ పూర్తయ్యాయి.(చదవండి: ‘రియాకు ఆ అర్హత లేదు.. అందుకే’) ఇక డీజీపీ రాజకీయాల్లో చేరతారంటూ వస్తోన్న వార్తలపై పాండే స్పందించారు. ‘నేను ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలేదు.. దీని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాకు సమాజ సేవ చేయాలని ఉంది. అందుకుగాను రాజకీయాల్లోనే చేరాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ఇక పాండే గతంలో కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రాజకీయాల్లో చేరి.. బీజేపీ టికెట్ పొందాలని ఆశించారు. కానీ అవకాశం లభించలేదు. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన 9 నెలల తర్వాత తిరగి తనను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా బిహార్ ప్రభుత్వాన్ని కోరారు. అతని అభ్యర్థన మేరకు నితీష్ కుమార్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు పాండేని విధుల్లోకి తీసుకున్నారు. -
14 వేల మందిని నియమించుకుంటాం..
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వీఆర్ఎస్ పథకంపై వివరణ ఇచ్చింది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో ఉద్యోగులను తీసివేస్తోందన్న మీడియా కథనాలను తిరస్కరించింది. ప్రతిపాదిత వీఆర్ఎస్ పథకం 30వేల మంది ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా 'అనుకూలమైన పరిష్కారం' అని తెలిపింది. పైగా తమ సేవల విస్తరణలో భాగంగా ఈ ఏడాది కొత్తగా14వేల నియామకాలను చేపట్టనున్నామని ప్రకటించింది. (ఎస్బీఐ ఉద్యోగులకు మరో 'స్వచ్ఛంద షాక్') వృత్తిపరమైన వృద్ధి పరిమితులు, శారీరక ఆరోగ్య పరిస్థితులు లేదా కుటుంబ పరిస్థితుల కారణంగా వృత్తిలో వ్యూహాత్మక మార్పు చేయాలనే కోరికను వ్యక్తం చేసిన ఉద్యోగులకు అనుకూలమైన పరిష్కారాన్ని అందించాలని మాత్రమే భావించామని బ్యాంక్ తెలిపింది. తమ విలువైన ఉద్యోగుల పట్ల నిబద్ధతతో ఉన్నామని స్పష్టం చేసింది. దేశంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యం ఇవ్వడం, భారత ప్రభుత్వ జాతీయ అప్రెంటిస్‌షిప్ పథకం కింద అప్రెంటిస్‌లను ఉద్యోగులుగా ఎంపిక చేసుకున్న ఏకైక బ్యాంకు తామే అని ఎస్బీఐ వెల్లడించింది. 2020 సంవత్సరంలో 14 వేల మందికి పైగా నియామకాలను చేపట్టే యోచనలో ఉన్నట్టు వివరించింది. ప్రజల అవసరార్థం కార్యకలాపాలను విస్తరిస్తున్న క్రమంలో ఉన్నామనీ, ఇందుకు నిదర్శనమే ఈ నియామకాలని చెప్పింది. కాగా రెండవ విడత విఆర్ఎస్ పథంలో భాగంగా దాదాపు 30వేలమందికి ఉద్యోగులను ఇంటికి పంపిచేందుకు బ్యాంకు ప్రతిపాదనలను సిద్దం చేసిందనీ, బోర్డు ఆమోదం కోసం ఎదురు చూస్తోందంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వీఆర్ఎస్ స్కీంను వ్యతిరేకించనప్పటికీ, కాస్ట్ కటింగ్ లో భాగంగా ఈ చర్య చేపట్టడం లేదని, స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ ఉంటుందని బ్యాంకు తాజాగా వివరణ ఇచ్చింది. మరోవైపు వీఆర్ఎస్ పథకంపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో బ్యాంకు చర్య కార్మిక వ్యతిరేక వైఖరిని ప్రతిబింబిస్తుందని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వైస్ ప్రెసిడెంట్ అశ్వని రానా విమర్శించారు. -
ఎస్బీఐలో వీఆర్ఎస్ ప్రతిపాదన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) అమలు చేయాలని భావిస్తోంది. దీన్ని వినియోగించుకునేందుకు సుమారు 30,190 మంది ఉద్యోగులకు అర్హత ఉంటుందని తెలుస్తోంది. వీఆర్ఎస్ ముసాయిదా ఇప్పటికే సిద్ధమయినట్లు, బోర్డు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ’సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్ వీఆర్ఎస్ – 2020’ పేరిట ప్రతిపాదించే స్కీమును ప్రధానంగా మానవ వనరుల వినియోగాన్ని, ఖర్చులను మెరుగుపర్చుకోవడానికి ఉద్దేశించినట్లు వివరించాయి. తమ కెరియర్లో ఆఖరు స్థాయికి చేరినవారు, అత్యుత్తమ పనితీరు కనపర్చలేని పరిస్థితుల్లో ఉన్న వారు, వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు, ఇతరత్రా వ్యాపకాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నవారు గౌరవప్రదంగా నిష్క్రమించేందుకు కూడా ఇది తోడ్పడగలదని పేర్కొన్నాయి. అయితే, ప్రతిపాదిత వీఆర్ఎస్ స్కీముపై బ్యాంకు యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దేశమంతా కరోనా వైరస్ మహమ్మారితో కుదేలవుతున్న తరుణంలో ఇలాంటి ప్రతిపాదనలు చేయడం ఉద్యోగులపై యాజమాన్యానికి ఉన్న వ్యతిరేక ధోరణులను సూచిస్తోందని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వైస్ ప్రెసిడెంట్ అశ్వని రాణా వ్యాఖ్యానించారు. పాతికేళ్ల సర్వీసు.. కటాఫ్ తేదీ నాటికి 25 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయస్సు నిండిన పర్మినెంట్ ఆఫీసర్లు, సిబ్బందికి ఈ స్కీము అందుబాటులో ఉంటుంది. ముసాయిదా ప్రకారం వీఆర్ఎస్ పథకం డిసెంబర్ 1న ప్రారంభమై, ఫిబ్రవరి ఆఖరు దాకా అమల్లో ఉంటుంది. వీఆర్ఎస్ దరఖాస్తులను ఈ వ్యవధిలో మాత్రమే స్వీకరిస్తారు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం 11,565 మంది అధికారులు, 18,625 ఇతర సిబ్బందికి వీఆర్ఎస్ ఎంచుకునేందుకు అర్హత ఉంటుంది. 2020 జూలై వేతనాలు బట్టి అర్హత కలిగిన ఉద్యోగుల్లో కనీసం 30 శాతం మంది దీన్ని ఎంచుకున్నా బ్యాంకుకు నికరంగా సుమారు రూ. 1,663 కోట్ల దాకా మిగులుతుందని అంచనా. వీఆర్ఎస్ ఎంచుకున్న వారికి గ్రాట్యుటీ, పెన్షన్, ప్రావిడెంట్, వైద్యం తదితర ప్రయోజనాలన్నీ కూడా లభిస్తాయి. అలాగే దీని కింద రిటైరైన వారు పదవీ విరమణ తేది నుంచి రెండేళ్ల తర్వాత తిరిగి బ్యాంకులో చేరేందుకు లేదా సర్వీసులు అందించేందుకు వెసులుబాటు ఉంటుంది. గతేడాది 2.57 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 2020 మార్చి ఆఖరు నాటికి 2.49 లక్షలకు తగ్గింది. -
రిటైర్మెంట్కు వీపీఎఫ్ ఆయుధం!
రిటైర్మెంట్ తర్వాత జీవితానికి సంబంధించి చాలా మందిలో ప్రణాళిక కనిపించదు. ఎన్నో ఏళ్ల తర్వాత అవసరాల కంటే ప్రస్తుత జీవన అవసరాలే వారికి ప్రాధాన్యంగా ఉంటుంటాయి. ఎక్కువగా మధ్యతరగతి, దిగువ ఆదాయ వర్గాల్లో ఇది చూడొచ్చు. కానీ, 60 ఏళ్ల తర్వాత ఆర్జనా శక్తి తగ్గిపోయిన పరిస్థితుల్లో తమ జీవన అవసరాలు, ఆరోగ్య సంరక్షణ, వైద్య ఖర్చులు భరించాలంటే.. కచ్చితంగా అందుకు చిన్న నాటి నుంచే తగిన ప్రణాళిక కావాలి. అన్ని అవసరాలను తీర్చేంత నిధి సమకూర్చుకోవాలి. దీన్ని విస్మరిస్తే విశ్రాంత జీవనంలో ఇబ్బందులు (స్థిర, చరాస్తులు కలిగిన వారు మినహా) ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఎన్పీఎస్ నిధి ఎలానూ ఉంటుంది. ప్రైవేటు రంగంలోని వారికి ఈపీఎఫ్ సదుపాయం ఉంది. కానీ, దీని వాటా స్వల్ప మొత్తమే. ఇంకాస్త అదనంగా ఈపీఎఫ్‌కు జమ చేసుకుంటానంటే అందుకు వీలు పడదు. కానీ, ఇటువంటి వారు ఈపీఎఫ్‌కు అదనంగా మరికొంత మొత్తాన్ని ప్రతి నెలా స్వచ్ఛ్చంద భవిష్యనిధి (వీపీఎఫ్) రూపంలో సమకూర్చుకోవచ్చు. సులభ ప్రక్రియ ఈపీఎఫ్‌కు కొనసాగింపు వీపీఎఫ్. వేతన జీవులకే ఈ అవకాశం. వీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది సులభమే. తాము పనిచేస్తున్న సంస్థకు ఆ విషయాన్ని తెలియజేసి రిజి స్ట్రేషన్ ఫామ్‌ను పూర్తి చేసి ఇస్తే సరిపోతుంది. ప్రతి నెలా ఎంత మొత్తాన్ని వీపీఎఫ్‌కు జమ చేయాలన్నది కూడా తెలియజేయాలి. అప్పటి వరకు కొనసాగుతున్న ఈపీఎఫ్ ఖాతాయే వీపీఎఫ్‌కూ వర్తిస్తుంది. వీపీఎఫ్ రూపంలో అదనంగా జమ చేసే మొత్తం కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌కే కలుస్తుంది. వీపీఎఫ్‌లో పెట్టుబడుల పరంగా సౌలభ్యం కూడా ఉంది. వీలున్నంత కాలం ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత కొంత కాలం పాటు నిలిపివేయవచ్చు. అయితే, కొన్ని సంస్థలు ఏడాదికి ఒక్కసారే మార్పులకు అనుమతిస్తున్నాయి. రిస్క్‌లేని అధిక రాబడులు రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం స్థిరాదాయ సాధనాల్లో పొదుపు చేసుకోవాలనుకునే వారికి వీపీఎఫ్ ఒక మంచి సాధనమన్నది నిపుణుల అభిప్రాయం. ఈపీఎఫ్ చందాకు అదనంగా స్వచ్ఛందంగా ఉద్యోగులు ఇందులో జమ చేసుకోవచ్చు. ప్రైవేటు రంగ ఉద్యోగులకు వారి మూల వేతనం, డీఏలో 12 శాతాన్ని ప్రతి నెలా వేతనం నుంచి మినహాయించి వారి ఈపీఎఫ్ ఖాతాకు సంస్థలు జమ చేస్తుంటాయి. ఇంతే మొత్తాన్ని ఉద్యోగి తరఫున సంస్థ కూడా తన వాటాగా అందజేస్తుంది. కానీ, ఈ పరిమితికి మించి ఈపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం లేదు. దీనికి అదనంగా రిటైర్మెంట్ ఫండ్ కోసం మరికొంత పొదుపు చేసుకోవాలని భావించే వారికి వీపీఎఫ్ అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగి తన మూలవేతనం, డీఏకు నూరు శాతం సమాన మొత్తాన్ని ప్రతి నెలా వీపీఎఫ్‌లో జమ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం 12,000, డీఏ రూ.3,000 అనుకుంటే అప్పుడు ప్రతి నెలా గరిష్టంగా రూ.15,000ను వీపీఎఫ్‌లో జమ చేసుకోవచ్చు. వీపీఎఫ్ ఎందుకు ఆకర్షణీయం అంటే.. ఈపీఎఫ్ చందాలపై లభించే వడ్డీ రేటే వీపీఎఫ్ నిధికి కూడా వర్తిస్తుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రతీ ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడులపై వచ్చిన ఆదాయం, నిధుల లభ్యతకు అనుగుణంగా వడ్డీ రేటును నిర్ణయిస్తుంటుంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ రేటు 8.65 శాతం కాగా, 2019–20 సంవత్సరానికి 8.5 శాతంగా నిర్ణయించింది. స్థిరాదాయ పథకాల్లో ఇది అత్యధిక రేటు. కొంత మంది విడిగా పీపీఎఫ్ ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ పీపీఎఫ్తో పోలిస్తే కనీసం అర శాతానికి పైనే వీపీఎఫ్‌లో వడ్డీ రేటు ఉంటుందని ఆశించొచ్చు. ఈపీఎఫ్, వీపీఎఫ్ రెండూ కూడా క్యుములేటివ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాలే. అంటే ఇందులో చేసే పెట్టుబడులపై వడ్డీ ఆదాయం ఏటా అసలుకు కలుస్తుంటుంది. దీంతో దీర్ఘకాలంలో మంచి కాంపౌండింగ్ వృద్ధి ఉంటుంది. అయితే, ఈపీఎఫ్ జమలకు వర్తించే లాకిన్, పాక్షిక ఉపసంహరణల నిబంధనలే వీపీఎఫ్‌కూ వర్తిస్తాయి. రాబడుల వ్యత్యాసం బ్యాంకు డిపాజిట్లపై ఇప్పుడు వడ్డీ రేటు 6.5% స్థాయిలకు పడిపోయింది. దీంతో వడ్డీ రేటు పరంగా వీపీఎఫ్ ఎంతో ఆకర్షణీయమనే చెప్పొచ్చు. పెద్దల కోసం ఉద్దేశించిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (8.6%)ను మినహాయిస్తే చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లతో పోల్చి చూసినా వీపీఎఫ్ రేటే అధికం. ఈక్విటీల్లో ఈపీఎఫ్ పెట్టుబడులు పెరుగుతూ ఉండడం, కార్మిక సంఘాల డిమాండ్ల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్, వీపీఎఫ్‌పై అధిక వడ్డీ రేటును నిర్ణయించక తప్పడం లేదు. రిటైర్మెంట్ పథకం ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు గరిష్టంగా 75% కేటాయింపులకు అవకాశం ఉండడంతో దీర్ఘకాలంలో వీపీఎఫ్‌తో పోలిస్తే కొంత అదనపు రాబడులకు వీలుంది. కానీ, గడువు ముగిసిన తర్వాత ఉపసంహరించుకునే విషయంలో పరిమితులు న్నాయి. ఆ విధంగా చూసుకుంటే వీపీఎఫ్ ఎం తో సౌలభ్యం. ఈపీఎఫ్/వీపీఎఫ్‌కు చేసే జమ లకు కేంద్రం హామీ ఉండడం అదనపు ఆకర్షణ. పన్ను వర్తించని సాధనం వీపీఎఫ్‌కు చేసే జమలు, రాబడులు, ఉపసంహరణలు అన్నీ కూడా పన్ను ఆదా ప్రయోజనం కలిగినవి. ఎన్‌పీఎస్‌లో గడువు తీరే నాటికి సమకూరిన నిధిలో 40 శాతంపై పన్ను చెల్లించి ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే, వీపీఎఫ్‌లో జమ అయిన మొత్తాన్ని ఎటువంటి పన్ను లేకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. ఇందులో చేసే జమలకు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఏ దశలోనూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు కనుక.. వాస్తవికంగా పొందే రాబడి రేటు మెరుగైనదిగా భావించాలి. అయితే, వడ్డీ రేటు 9.5 శాతం మించితే అప్పుడు ఆ మొత్తంపై పన్ను చెల్లించాలి. కానీ, ఇటీవలి సంవత్సరాల్లో ఈపీఎఫ్, వీపీఎఫ్‌పై వడ్డీ రేటు 8.5–9 శాతం మధ్యే స్థిరపడడాన్ని చూస్తూనే ఉన్నాం. రిటైర్మెంట్ అనంతరం ఈపీఎఫ్, వీపీఎఫ్ నిధిని పన్ను లేకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. ఒకవేళ రిటైర్మెంట్కు ముందుగా ప్రత్యేక అవసరాల్లో కొంత వెనక్కి తీసుకున్నా కానీ పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. అయితే, కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత తీసుకుంటేనే పన్ను మినహాయింపు ప్రయోజనం వర్తిస్తుంది. ఐదేళ్ల సర్వీసు పూర్తి కాకముందే ఉపసంహరించుకునే మొత్తం రూ.50,000 మించితే 10 శాతాన్ని టీడీఎస్ కింద మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తారు. అలాగే, అప్పటి వరకు ఆర్జించిన వడ్డీ రాబడిపైనా పన్ను పడుతుంది. అవసరాల్లో అక్కరకు.. ఆర్థిక అత్యవసరాల్లో ఈపీఎఫ్‌లో మాదిరే వీపీఎఫ్ బ్యాలెన్స్‌ను కూడా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పిల్లల వివాహాలు, వారి ఉన్నత విద్య, వైద్య అవసరాల కోసం, గృహ కొనుగోలుకు ఇందులోని బ్యాలెన్స్‌ను వెనక్కి తీసుకునేందుకు ఈపీఎఫ్‌వో అనుమతిస్తుంది. నిర్ణీత కాలం పాటు ఉద్యోగం లేకుండా ఉన్నా బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఒక నెలకు మించి ఉద్యోగం లేకుండా కొనసాగితే, వీపీఎఫ్/ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. వరుసగా రెండు నెలల పాటు ఉద్యోగం లేని యెడల మిగతా మొత్తాన్ని కూడా వెనక్కి తీసేసుకోవచ్చు. పీపీఎఫ్తో పోలిస్తే ఎన్నో విధాలుగా ఈపీఎఫ్, వీపీఎఫ్‌లు ప్రయోజనకరం. పీపీఎఫ్‌లో పాక్షిక ఉపసంహరణలు, అది కూడా ఏడో ఏట నుంచే అవకాశం కల్పిస్తారు. 15 ఏళ్లు పూర్తయిన తర్వాతే పూర్తిగా వెనక్కి తీసుకోగలరు. కానీ, ఈపీఎఫ్/వీపీఎఫ్‌లో ఉపసంహరణల పరంగా సౌలభ్యత ఎక్కువ. పైగా రాబడి రేటు కూడా పీపీఎఫ్‌లో ప్రస్తుతమున్న 7.9 శాతంతో పోలిస్తే ఎక్కువే. -
బై బై బీఎస్ఎన్ఎల్.. భావోద్వేగానికి లోనైన ఉద్యోగి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు చెందిన రాష్ట్ర కార్యాలయాల్లో నిన్న (శుక్రవారం) ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల కోసం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, ఇందుకు భారీ ఎత్తున ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడం తెలిసిందే. ఇలా వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారి విధుల నిర్వహణకు జనవరి 31 చివరి రోజు. దీంతో బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో శుక్రవారం ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. బాధ్యతల నుంచి రిలీవ్ అవుతున్నవారంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ భావాలను పరస్పరం పంచుకుంటూ గడిపారు. సంస్థ పరిస్థితి దయనీయంగా మారడం...కోలుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో చాలామంది ఉద్యోగులు వీఆర్ఎస్కు ముందుకొచ్చి అప్లయ్ చేసుకున్నారు. ఏపీలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సంఖ్య 8,878మంది ఉండగా, వీరిలో 5,031మంది వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారు. దీంతో సంస్థలో 3,847మంది ఉద్యోగులు మాత్రమే మిగిలినట్లు అయింది. అర్హత ఉన్నా 1,361మంది వీఆర్ఎస్కు దూరంగా ఉన్నారు. ఉద్యోగం...ఉద్వేగభరితం.. ఎన్నో ఏళ్లుగా తమ మధ్య విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగిని స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తుండటం.. తోటి ఉద్యోగులను భావోద్వేగానికి గురి చేసింది. ఆమెకు వీడ్కోలు పలకడం వారికి భారంగా మారింది. ఎస్డీఈ (పీఆర్)గా పని చేసిన పద్మా శర్మ స్వచ్ఛంద పదవీ విరమణ సందర్భంగా సహోద్యోగి డీఎస్ నరేంద్ర..ఆమెతో చివరిసారి కరచాలనం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యం శుక్రవారం హైదరాబాద్‌లోని బీఎస్ఎన్ఎల్ భవన్లో చోటుచేసుకుంది. బీఎస్ఎన్ఎల్ భవన్ మూడొంతులు ఖాళీ సాక్షి, హైదరాబాద్ : ఇక నగరంలోని టెలికం ఉద్యోగుల్లో సుమారు 77% మంది వీఆర్ఎస్ తీసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సంస్థలో కొత్తగా చేరిన ఉద్యోగులు మినహా మిగిలిన వారంతా వీఆర్ఎస్ తీసుకున్నారు. హైదరాబాద్ టెలికం జిల్లా పరిధిలో మొత్తం 3,500 మంది ఉద్యోగులకు గాను అందులో 2,613 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఎగ్జిక్యూటివ్ కేడర్‌కు చెందిన వారిలో 17 మంది డీజీఎంలు, 80 ఎజీఎంలు, 100 మంది ఎస్‌డీవోలు, 80 మంది జేటీవోలు ఉన్నారు. మిగతా వారిలో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌కు చెందిన వారున్నారు.హైదరాబాద్ సర్కిల్ సీజీఎం పరిధిలోకి వచ్చే మరో 284 మంది ఉద్యోగులు సైతం వీఆర్ఎస్ తీసుకున్నారు. దీంతో ఆదర్శనగర్‌లో గల టెలికం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ (పీజీఎం) కార్యాలయమైన బీఎస్ఎన్ఎల్ భవన్ మూడొంతులు ఖాళీ అయింది. ఉన్నతాధికారుల నుంచి నాల్గోవ తరగతి సిబ్బంది వరకు పదవీ విరమణ చేయడంతో పలు సెక్షన్లు బోసిపోయాయి. -
అసెంబ్లీలో కేసీఆర్ హామీ ఇచ్చినా ఫలితం శూన్యం
సాక్షి, కొత్తగూడెం: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన 3 వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు సింగరేణి యాజమాన్యం నిర్వాకంతో దయనీయ స్థితిలో బతుకులీడ్చాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆయా కుటుంబాల కన్నీటి గోసను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 21 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నా.. ‘ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం’ అనే స్ఫూర్తిని యాజమాన్యం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తే.. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మరింత దౌర్భాగ్య స్థితిలోకి నెట్టిందని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. 1997లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పథకాన్ని ఎత్తేసింది. అయితే అప్పటికే వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) పెట్టుకున్న సుమారు 3 వేల మంది కార్మికులు తమ పరిస్థితి ఏంటని సింగరేణి యాజమాన్యాన్ని ఆశ్రయించారు. తమ వారసులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో సదరు కార్మికులు 15 ఏళ్ల సర్వీసు, వేతనం వదులుకుని న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇస్తామని యాజమాన్యం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినా.. ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం తీరును డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇన్నేళ్లుగా వీరిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించగా సింగరేణి యాజమాన్యం వద్ద సమాధానం లేదు. 1997లో ఈ పథకాన్ని రద్దు చేసినప్పుడు.. కొత్త గనులు ఏర్పాటు చేసినా, సంస్థలో ఉద్యోగాలు ఖాళీ అయినా అప్పటికే వీఆర్ఎస్ పెట్టుకున్న కార్మికుల వారసులను నియమిస్తామని యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో కొందరికి మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ కూడా ఇచ్చింది. వారికీ ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కాగా, మూడు నెలల్లో ఉద్యోగాలు ఇప్పించి కార్మికుల భవిష్యత్తును మారుస్తామని 2016లో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సీఎం కేసీఆర్ సైతం శాసనసభలో హామీ ఇచ్చారు. అయితే నేటికీ వారికి న్యాయం జరుగలేదు. దీంతో కార్మికులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం హామీలను నెరవేర్చాలి సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి. టీబీజీకెఎస్ నాయకులు సైతం గుర్తింపు సంఘం ఎన్నికల ముందు వీఆర్ఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. ఎన్నికలు జరిగి రెండేళ్లయినా అతీగతీ లేదు. నేడు ఆయా కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగావÔకాశాలు కల్పించాలి. – చింతల సూర్యనారాయణ, బీఎంఎస్ అధ్యక్షుడు ప్రభుత్వానివి మోసపూరిత వాగ్దానాలే వీఆర్ఎస్ ఉద్యోగులు సుమారు 21 సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై అనేక హామీలు గుప్పించి ఎన్నికల్లో లబ్ధి పొంది ఇప్పుడు వారిని రోడ్డున పడేయడం సరైంది కాదు. సింగరేణి యాజమాన్యం ఆర్ఎస్సీ వద్ద వీఆర్ఎస్ విషయంలో నోరుమెదపకపోవడం దారుణం. ప్రభుత్వ వైఖరితో 3000 మంది కార్మికులు అర్ధాకలితో అలమటిçస్తున్నారు. – పి.మాధవనాయక్, బీఎంఎస్ కార్యదర్శి 48 రోజులు ఎంవీటీసీ చేయించుకున్నారు 1997లో మా నాన్న అన్‌ఫిట్ అయి నాకు 48 రోజులు మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ ఇచ్చారు. మా బ్యాచ్‌లో 16 మందిలో 8 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా వారికి నేటికీ ఇవ్వలేదు. సింగరేణి అధికారులు 2002లో పిలిచి రూ. రెండు లక్షలు ఇస్తాం.. ఉద్యోగం లేదన్నారు. అయితే నాకు ఉద్యోగమే కావాలన్నాను. సింగరేణి భవన్, హెడాఫీస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల నాయకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. – మబ్బు శంకర్, వీఆర్ఎస్ కార్మికుడి కుమారుడు -
రైల్వే ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ
న్యూఢిల్లీ: రైల్వేల పనితీరు మెరుగుపరిచే దిశగా ఆ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సరైన ప్రతిభ కనబరచని ఉద్యోగులను ముందస్తు పదవీ విరమణ ద్వారా తొలగించాలని నిర్ణయించింది. ఇందుకు 55 ఏళ్లు పైబడిన లేదా 2020 మొదటి త్రైమాసికాని కల్లా 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకునే ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని అన్ని జోనల్ కార్యాలయాలకు సూచించినట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ‘ఈనెల 27న రైల్వే శాఖ అన్ని జోనల్ కార్యాలయాలకు లేఖ పంపింది. ఉద్యోగుల వివరాలను సమర్పించడానికి ఆఖరు తేదీ ఆగస్టు 9 అని పేర్కొంది’ అని జోనల్ కార్యాలయాలు తెలిపాయి. సరైన పనితీరు కనబరచని లేదా క్రమశిక్షణ పాటించని ఉద్యోగులను ముందస్తు పదవీ విరమణ ద్వారా తొలగించాలని రైల్వే శాఖ నిర్ణయించిందని, ఈ విషయంలో ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరిస్తోందని వర్గాలు పేర్కొన్నాయి. ముందస్తు పదవీ విరమణ నిబంధనకు సంబంధించి ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 1.19 లక్షల మందికి పైగా గ్రూప్–ఏ, గ్రూప్–బీ ఉద్యోగుల పనితీరును 2014–19 మధ్య కాలంలో సమీక్షించినట్లు ఇటీవల లోక్‌సభకు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రైల్వేలో 13 లక్షల మంది ఉద్యోగులున్నారని, వారిని 2020 కల్లా 10 లక్షల మందికి తగ్గించడమే మంత్రిత్వ శాఖ ఉద్దేశమని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. -
ప్రైవేటీకరణ దిశగా ఆర్టీసీ మరో అడుగు!
సాక్షి, అమరావతి: ప్రజా రవాణాలో మేటిగా పేరుపొందిన ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది. చంద్రబాబు సర్కార్ త్వరలోనే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. సంస్థలో గడిచిన నాలుగున్నరేళ్లుగా ఉద్యోగ ఖాళీల భర్తీ ఊసేఎత్తని సర్కార్.. తాజాగా ఉన్న ఉద్యోగులకు ఎసరు పెట్టే నిర్ణయాన్ని తీసుకుంది. సంస్థలోని ఉద్యోగులకు 52 ఏళ్లు దాటి, కనీసం 20 ఏళ్లు రెగ్యులర్ సర్వీసు పూర్తి చేసుకున్న వారికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వాలంటరీ రిటైర్మెంట్ స్కీం–వీఆర్ఎస్) అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు సంస్థ యాజమాన్యం ముసాయిదా రూపొందించింది. వీఆర్ఎస్ అడుగు ముందుకుపడితే ఆర్టీసీలో సుమారు 30 వేల మందిపై ప్రభావం ఉంటుందని అంచనావేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది డ్రైవర్లు, కండక్టర్లే ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ వీఆర్ఎస్ ఆఫర్ ఇవ్వడంతో యాజమాన్యానికి కొత్త ఉద్యోగాలిచ్చే ఆలోచన లేదని, ఇది ప్రైవేటీకరణ కుట్రలో భాగమేనని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ స్థలాల్ని ప్రైవేటు పరం చేయడం, అద్దె బస్సులను తిప్పడం, కీలక విభాగాలన్నీ ప్రైవేటు సంస్థలకు అప్పగింత వంటివి చేస్తున్నారు. ఇప్పుడు వీఆర్ఎస్ తీసుకొచ్చి నిర్భందంగా అమలు చేసే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సంస్థ ప్రస్తుతం రూ.4 వేల కోట్ల నష్టాల్లో ఉందని, ప్రభుత్వం ఆదుకోకపోవడం వల్లే వీఆర్ఎస్ అమలు ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆందోళనలో 30 వేల కుటుంబాలు ఏపీఎస్ ఆర్టీసీలో 55 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 40 వేల మంది వరకు డ్రైవర్లు, కండక్టర్లే. టీడీపీ అధికారంలోకి వచ్చాక కండక్టర్ల పోస్టుల్ని కుదించడం ప్రారంభించింది. టిమ్ యంత్రాల ద్వారా డ్రైవర్ల చేతికే కండక్టర్ల బాధ్యతలు అప్పగిస్తూ నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చాక దానికి కార్మికులు ఎవ్వరూ ముందుకు రాకపోతే సర్కారు ఆదేశాలకు అనుగుణంగా నిర్బంధంగా వీఆర్ఎస్ అమలు చేస్తారని సమాచారం. వీఆర్ఎస్ నిర్ణయంతో సంస్థలో పనిచేసే 30 వేల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో మాదిరిగా ఆర్టీసీలో 60 ఏళ్ల వయో పరిమితి అమలు చేయలేదు. 58 ఏళ్లకే పదవీ విరమణ అమలు చేస్తారు. 52 ఏళ్లకే వీఆర్ఎస్ వర్తింపజేస్తే ఉద్యోగి వేతన సవరణ, ఇంక్రిమెంట్లు వంటి ప్రయోజనాలన్నీ కోల్పోతారు. ‘కారుణ్యం’లేని సర్కార్ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే ఆ ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీసీలో 1978 నుంచి కారుణ్య నియామకాలు ప్రవేశపెట్టారు. గతంలో చంద్రబాబు హయాంలోనూ, ప్రస్తుత పాలనలోనూ కారుణ్య నియామకాలను నిలిపేశారు. రాష్ట్రంలో మొత్తం 1,200 మంది కుటుంబాలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాయి. నిబంధనల పేరుతో మహిళా అభ్యర్థులకు కారుణ్య నియామకాల్లోనూ ఇబ్బందులు పెడుతున్నారని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్, సెక్యూరిటీ గార్డుల పోస్టులను ఇవ్వాలని నిబంధన ఉంది. క్లరికల్ పోస్టులకు అనుమతి లేదు. తెలంగాణ ఆర్టీసీలో కారుణ్య నియామకాల్లో మహిళలకు ఉద్యోగాలు ఇస్తున్నారని, ఏపీఎస్ఆర్టీసీ మాత్రం కారుణ్యం చూపడంలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగి కుటుంబంలో కూడా ఒకరికి ఉద్యోగం ఇస్తామని 2015లో యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. మొత్తం 200 మంది మెడికల్ అన్‌ఫిట్ ఉద్యోగుల కుటుంబాల వారసులు దరఖాస్తు చేసుకున్నా.. వారిని తిప్పుకుంటున్నారే తప్ప ఉద్యోగాల ఊసెత్తడం లేదు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం వద్దనుకునే వారికి ఆర్టీసీ రూ.5 లక్షలు అందిస్తామని ఇటీవలే ప్రకటించింది. ఆర్టీసీలో 2014కు ముందు అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 140 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులున్నాయి. వీటి నాన్చివేత వైఖరి అవలంబిస్తున్నారు. ఖాళీలులేవని యాజమాన్యం చెబుతుంటే.. ట్రాఫిక్, నిర్వహణ విభాగంలో పలు ఖాళీలున్నాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. అధికారికంగా ప్రతిపాదనలిస్తే స్పందిస్తాం వీఆర్ఎస్పై యాజమాన్యం కేవలం డ్రాఫ్ట్ మాత్రమే రూపొందించింది. యూనియన్లకు మెసేజ్‌లు పంపించారు. రెండ్రోజుల్లో అభిప్రాయాలు చెప్పాలని యాజమాన్యం కోరింది. అయితే అధికారికంగా ప్రతిపాదనలు అందితే స్పందిస్తాం. –దామోదరరావు, ఈయూ, ఆర్టీసీ గుర్తింపు సంఘం ఉన్న ఉద్యోగాల్ని దూరం చేస్తారా? ఆర్టీసీలో సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు. పైగా ఉన్న ఉద్యోగాల్ని పీకేస్తారా? ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తే తీవ్ర పరిణామాలుంటాయి. –చల్లా చంద్రయ్య, ఎన్ఎంయూ అధ్యక్షుడు ప్రైవేటీకరణ చేపట్టేందుకే ఈ దురాలోచన చంద్రబాబు సర్కారు ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ఎప్పట్నుంచో ఆలోచన చేస్తోంది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతో బెంబేలెత్తిన చంద్రబాబు సర్కారు ఉన్నఫళంగా ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు యత్నించడం దారుణం. మొదట్నుంచీ చంద్రబాబుకు ఆర్టీసీ అంటే చులకన భావనే. –రాజారెడ్డి, వైఎస్సార్ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షుడు -
ఎస్బీఐలో 6000 మందికి పైగా ఉద్యోగులు ఔట్
ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీగా తన ఉద్యోగులను తగ్గించుకుంది. స్వచ్చంద పదవీ విరమణ పథకం, పదవీ విరమణలతో ఆరు వేలకు మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఈ క్వార్టర్ ప్రారంభంలో 2.80 లక్షలుగా ఉన్న ఎస్బీఐ ఉద్యోగులు, క్వార్టర్ ముగిసే నాటికి 2.73 లక్షలకు చేరుకున్నారు. ఈ తగ్గింపు మరింత ఉండనుందని తెలుస్తోంది. పదవీ విరమణలతో 2017-18 ఆర్థిక సంవత్సరంలో సుమారు 15,460 మంది ఉద్యోగులు తగ్గిపోనున్నారని అంచనాలు వెలువడుతున్నాయి. అంతేకాక డిజిటలైజేషన్‌తో పాటు తన అసోసియేట్ బ్యాంకులు తనలో విలీనమైన నేపథ్యంలో 10వేలకు మందికి పైగా ఉద్యోగులను కొత్త ప్రాంతానికి లేదా కొత్త పనివిభాగాలకు కేటాయించేందుకు ఎస్బీఐ ప్రణాళికలు రచిస్తోంది. అసోసియేట్ బ్యాంకుల కన్సాలిటేషన్, డిజిటల్ చానళ్లలోకి మారే క్రమంలో దేశంలోనే ఎక్కువమంది ఉద్యోగులను కలిగి ఉన్న ఈ బ్యాంకింగ్ దిగ్గజం ఉద్యోగ పునర్నిర్మాణ ప్రక్రియను చేపట్టింది. ఎక్కువమొత్తంలో పునర్నిర్మాణం విలీనంతోనే చోటుచేసుకుంటున్నట్టు తెలిసింది. ఒకే స్ట్రీట్‌లో ఎక్కువమొత్తంలో అవుట్లెట్లను నిర్మూలించేందుకు బ్యాంకు చూస్తోంది. ఆగస్టు 6 నాటికి 594 బ్రాంచులు ఎస్బీఐలో విలీనమయ్యాయి. 122 అధికారిక కార్యాలయాలను హేతుబద్ధం చేసింది. దీంతో వార్షికంగా 1,160 కోట్ల రూపాయలను ఎస్బీఐకి ఆదా చేసుకోనుంది. ఎస్బీఐతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. డిజిటల్ లావాదేవీలను పెంచుతూ తమ ఉద్యోగులకు కోత పెడుతున్నాయి. 2016 డిసెంబర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో 90,421 మంది ఉద్యోగులుంటే, 2017 మార్చి నాటికి 84,325 మంది ఉద్యోగులున్నారు. -
ఆ జవాన్ అభ్యర్థన తిరస్కరణ
న్యూఢిల్లీ: జవాన్లకు నాసిరకమైన భోజనం పెడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసి ఆవేదన వ్యక్తం చేసిన బీఎస్ఎఫ్ జవాన్ బహదూర్ యాదవ్‌కు చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనను బీఎస్ఎఫ్ తిరస్కరించింది. యాదవ్ చేసిన ఆరోపణలపై ప్రస్తుతం సాగుతున్న విచారణ, అతడిపై క్రమశిక్షణ చర్యల అంశం పెండింగ్‌లో ఉన్నందున వీఆర్ఎస్ అభ్యర్థనను తిరస్కరించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ విషయాన్ని బహదూర్ యాదవ్‌కు జనవరి 30వ తేదీనే తెలియజేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయన కుటుంబం ఆరోపిస్తున్నట్లుగా యాదవ్‌ను అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. అయితే, గురువారం ఉదయం యాదవ్ తనకు ఫోన్ చేశారని, తనను అరెస్టు చేసి వేధిస్తున్నారని చెప్పాడని ఆయన భార్య ఆరోపించారు. సంబంధిత వార్తలు.. కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో నా భర్తను నిర్బంధించారు: జవాన్ భార్య జవాన్ల ఆహారానికి కొత్త మార్గదర్శకాలు