ఆ జవాన్ అభ్యర్థన తిరస్కరణ
న్యూఢిల్లీ:
జవాన్లకు నాసిరకమైన భోజనం పెడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసి ఆవేదన వ్యక్తం చేసిన బీఎస్‌ఎఫ్ జవాన్ బహదూర్ యాదవ్‌కు చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనను బీఎస్‌ఎఫ్ తిరస్కరించింది. యాదవ్ చేసిన ఆరోపణలపై ప్రస్తుతం సాగుతున్న విచారణ, అతడిపై క్రమశిక్షణ చర్యల అంశం పెండింగ్‌లో ఉన్నందున వీఆర్‌ఎస్ అభ్యర్థనను తిరస్కరించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ విషయాన్ని బహదూర్ యాదవ్‌కు జనవరి 30వ తేదీనే తెలియజేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయన కుటుంబం ఆరోపిస్తున్నట్లుగా యాదవ్‌ను అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. అయితే, గురువారం ఉదయం యాదవ్ తనకు ఫోన్ చేశారని, తనను అరెస్టు చేసి వేధిస్తున్నారని చెప్పాడని ఆయన భార్య ఆరోపించారు.
సంబంధిత వార్తలు..
కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో
నా భర్తను నిర్బంధించారు: జవాన్ భార్య
జవాన్ల ఆహారానికి కొత్త మార్గదర్శకాలు