( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: దిశా కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ అధికారిగా పనిచేసిన పోలీసు అధికారి సురేంద్ర స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వీఆర్‌ఎస్ కోసం డీజీపీ అంజనీ కుమార్ యాదవ్‌కు దరఖాస్తు సమర్పించారు.
ఇటీవల తరుచూ బదిలీలపై అసంతృప్తితో ఉన్నాయన వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కాగా దిశా నిందితుల ఎన్‌కౌంటర్ సమయంలో సురేంద్ర షాద్ నగర్ ఏసీపీగా ఉన్నారు. దిశ కేసు విచారణ అధికారిగా పనిచేశారు. తరువాత ట్రాన్స్‌కో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీగా పనిచేశారు. సురేంద్రను ఇటీవలె సైబరాబాద్ కమాండర్ కంట్రోల్ విభాగానికి ఏసీపీగా బదిలీ అయ్యారు.
ఈ క్రమంలోనే ఆయన స్వచ్చంద పదవీ విమరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించారు. అయితే వీఆర్ఎస్‌కు వ్యక్తిగత కారణాలను చూపుతున్నప్పటికీ.. తరచుగా బదిలీలు, లూప్ లైన్ పోస్టింగ్‌లు పొందడం పట్ల సురేందర్ కలత చెందినట్టుగా తెలుస్తోంది. ఇక సురేందర్‌కు మరో మూడేళ్ల సర్వీసు ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
చదవండి: మంచిర్యాల: పీఎస్‌లో కుప్పకూలిన నిందితుడు
Comments
Please login to add a commentAdd a comment