Disha Encounter: ముగిసిన సజ్జనార్ విచారణ.. అడిగిన ప్రశ్నలివే.. | Sajjanar Appears Before Three Member Committee | Sakshi
Sakshi News home page

Disha Encounter: సజ్జనార్‌పై కమిషన్‌ ప్రశ్నల వర్షం

Published Tue, Oct 12 2021 12:31 PM | Last Updated on Tue, Oct 12 2021 9:15 PM

Sajjanar Appears Before Three Member Committee - Sakshi

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ అంశానికి సంబంధించి వరుసగా రెండో రోజు విచారణకు వీసీ సజ్జనార్‌ హాజరయ్యారు. అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగినప్పుడు సజ్జనార్‌ సీపీగా పని చేసి చేశారు. దాంతో సజ్జనార్‌ విచారణకు హాజరుకావడం అనివార్యమైంది. సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారిస్తోంది.

సజ్జనార్‌పై కమిషన్‌ ప్రశ్నల వర్షం కురిపిస్తుస్తోంది. సీన్ రీకన్స్ట్రక్షన్‌ సమాచారం మీకు ముందే ఉందా అని కమిషన్‌ ప్రశ్నించింది. డీసీపీ శంషాబాద్‌ చెబితే తనకు తెలిసిందని సజ్జనార్‌ సమాధాన ఇచ్చారు.సంఘటన జరిగిన తర్వాత నిందితులను పట్టుకున్న అంశాలను కమిషన్‌ లేవనెత్తింది. కమిషన్‌ అడిగిన ప్రశ్నకు సజ్జనార్‌ సమాధానాలు చెబుతున్నారు. దిశ కమిషన్‌ ముందు వీసీ సజ్జనార్‌ విచారణ ముగిసింది.
చదవండి: సీజ్‌ చేసిన..  తుపాకులెలా వాడారు?

కమిషన్: ఎన్కౌంటర్ జరిగిన విషయం మీకు ఏ సమయానికి తెలిసింది?

సజ్జనార్‌: డిసెంబర్ 6 ఉదయం ఆరు గంటల 20 నిమిషాలకు తెలిసింది.

కమిషన్‌: ఎన్ కౌంటర్‌పై ఎఫ్ఐర్ నమోదు ఎంక్వైరీ చేశారా ?

సజ్జనార్‌: శంషాబాద్ డీసిపి కి ఎఫ్ ఐ ఆర్ చేయమని చెప్పాను.

కమిషన్: ఎన్‌కౌంటర్‌ స్పాట్ కి ఏ టైం లో చేరుకున్నారు?

సజ్జనార్‌: ఉదయం 8:30 గంటలకు స్పాట్ కు చేరుకున్నాను.

కమిషన్:  ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇంచార్జ్ ఆఫీసర్ ఎవరు?

సజ్జనార్‌: షాద్‌నగర్ సీఐ శ్రీధర్ ఇంచార్జీ.

కమిషన్: ఎన్‌కౌంటర్ స్పాట్‌కు రీచ్ అయ్యాక ఎవరెవరిని కలిశారు?

సజ్జనార్‌:ఏసిపి సురేందర్‌ను కలిశాను.

సజ్జనార్‌:పోస్టుమార్టం గురించి డీఎంఈకి సమాచారం అందించాను.

కమిషన్: ఇంక్వెస్ట్‌ను ఎవరి సమక్షంలో చేశారు.

సజ్జనార్‌:తెలంగాణలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు ఇంక్వెస్ట్ చేస్తారు.

సజ్జనార్‌: పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ వర్సెస్ మహారాష్ట్ర కేస్ తీర్పు ప్రకారం ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందే జరగాలి.

కమిషన్: ఇంక్వెస్ట్  ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు చేయమని ఎవరు చెప్పారు?

కమిషన్: ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో మీతో పాటు ఎంత మంది సీనియర్ అధికారులు ఉన్నారు?

కమిషన్: సీన రీ కన్స్ట్రక్షన్ కి వెళ్లేటప్పుడు పోలీసులతో ఆయుధాలు ఉన్నాయా?

కమిషన్: ఎంత మంది పోలీసులు వెపన్స్ క్యారీ  చేశారు?

ఎన్‌కౌంటర్ జరిగిన రోజు సజ్జనార్‌ మాట్లాడిన క్లిప్లింగ్‌ను రెండు భాషల్లో ప్లే చేశారు.

సజ్జనార్‌: పోలీసుల నుండి నిందితులు వెపన్స్ లాక్కున్నారు.

కమిషన్: వెపన్స్ ఎందుకు అన్లాక్ చేశారు?

సజ్జనార్‌:  వెపన్స్ అన్లాక్ చేయలేదు.

కమిషన్: మీడియా సమావేశంలో వెపన్స్  అన్ లాక్ చేసినట్టు ఉంది?

కమిషన్:ప్రెస్ మీట్ సమయానికి బాధితురాలి వస్తువులు రికవరీ కాకపోయినా ఎందుకు రికవరీ చేశామని చెప్పారు?

కమిషన్:వెపన్స్ రికవరీ కాకుండా, పోస్ట్ మార్టం పూర్తి కాకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు?

సజ్జనార్‌: డిసిపి శంషాబాద్ పెట్టమంటే ప్రెస్ మీట్ పెట్టాను.

కమిషన్: ఘటన జరిగిన సమయంలో ఎన్ని గంటలు స్పాట్‌లో ఉన్నారు?

సజ్జనార్‌: గంటన్నర గంటలపాటు ఉన్నాను.

కమిషన్: 2008 వరంగల్ ఎన్‌కౌంటర్, 2016 నక్సలైట్ల ఎన్‌కౌంటర్,  2019 దిశ కేస్ కౌంటర్ లలో ఒకటే రకమైన విధానం కనిపిస్తుంది. మీ హయంలోనే ఇలా జరిగింది.

సజ్జనార్‌: వరంగల్ ఎన్‌కౌంటర్ సమయంలో నేను ఎస్పీ గా ఉన్నాను, 2016 లో నేను లా అండ్ ఆర్డర్ లో లేను అని సమాధాన ఇచ్చారు. 

కమిషన్‌: మిమ్మల్ని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా మీడియా అభివర్ణించింది. మీరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఒప్పుకుంటారా? 

సజ్జనార్‌: నేను అంగీకరించను.

కమిషన్‌: ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఏమిటి? 

సజ్జనార్‌: నాకు తెలియదు.

కమిషన్‌: మీరు ప్రతీది డీసీపీ చెప్తేనే తెలిసింది అంటున్నారు. డీసీపీపై నే ఆధార పడతారా?

సజ్జనార్‌: గ్రౌండ్ లెవెల్ లో ఆఫీసర్ లకు. పూర్తి సమాచారం ఉంటుంది. వారికి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తాను.

కమిషన్‌: దిశ అత్యాచారం జరిగిన రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు?

సజ్జనార్‌: మిస్సింగ్ కంప్లైంట్ రాగానే బాధితురాలి కోసం వెతకడం లో కొంత సమయం డిలే అయ్యింది.

కమిషన్‌: ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

సజ్జనార్‌: ఎఐఆర్‌ నమోదు చేయడంలో అలసత్వం వహించిన నలుగురు పోలీస్ సిబ్బంది పైన సస్పెన్షన్ విధించాం.

కమిషన్‌: ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో విచారణ ముగియకముందే మీడియా సమావేశం ఎలా పెట్టారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వల్లే విచారణ సరిగా చేయలేకపోయాము అని సాక్షులు చెప్పారు.

సజ్జనార్‌: ఎన్ కౌంటర్ స్పాట్కి 300 మీటర్ల దూరంలో విచారణకు ఆటంకం కలగకుండా వీడియో సమావేశం ఏర్పాటు చేశాం.

కమిషన్‌: సమావేశం కోసం కుర్చీలు, టేబుల్లు తదితర సామగ్రిని అంత తక్కువ సమయం లో  ఎక్కడి నుండి తెచ్చారు?

సజ్జనార్‌: షాద్ నగర్ పోలీసులు సమగ్రి నీ తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి సామాగ్రిని  తీసుకొచ్చారో నాకు తెలియదు. ఆ ఘటన జరిగి రెండు సంవత్సరాలు అయ్యింది నాకు గుర్తు లేదు అని సజ్జనార్‌ సమాధానమిచ్చారు. దీంతో సజ్జనార్‌ విచారణ పూర్తయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement