హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం | South Indian Director General Of Police Officers Meeting In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం

Published Fri, Sep 20 2019 3:46 PM | Last Updated on Fri, Sep 20 2019 3:56 PM

South Indian Director General Of Police Officers Meeting In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర హోంశాఖ ఆదేశాలతో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన డీజీపీలు హైదరాబాద్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. దేశ అంతర్గత భద్రతకు సంబంధించి రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అందించుకోవడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. శాంతి భద్రతలు, సైబర్ నేరాలు, మావోయిస్టులు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా తదితర అంశాలపై ఆయా రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికారులు చర్చిస్తారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌తో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు అదనపు డీజీపీలు ఇతర ఉన్నతాధికారులు  ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అధికారులు సందర్శించే అవకాశమున్నట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement