మాజీ డీజీపీ బి.ప్రసాదరావు
విజయవాడ (లబ్బీపేట) : కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చునని, అందుకు తానే నిదర్శనమని మాజీ డీజీపీ, రిటైర్డ్ హోంశాఖ ముఖ్యకార్యదర్శి బి.ప్రసాదరావు అన్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రసాదరావును శుక్రవారం రాత్రి హోటల్ గేట్‌వేలో సువార్త చానల్ ఆధ్వర్యంలో సన్మానించారు. ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమకు మంచి చేసుకుని, మరో నలుగురికి మంచి చేయాలని సూచించారు. పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నారు. నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ ఎంతో మందికి ప్రసాదరావు స్ఫూర్తిగా నిలిచారన్నారు.
ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ కె.కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్టీసీ ఎండీగా చేసిన కాలంలో ఆయన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ కె.అజయ్‌కుమార్, గుంటూరు అడిషనల్ ఎస్పీ శోభామంజరి, ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ సింగంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ఆడిట్ డిప్యూటీ డెరైక్టర్ ఎంవీ ప్రసాద్, జిల్లా రిజిస్ట్రార్ ఎస్.బాలస్వామి, నిర్వాహకులు చాట్ల లూథర్ ప్రశాంత్‌కుమార్, పచ్చిగళ్ల దేవానందం తదితరులు పాల్గొన్నారు.
సామాన్య కుటుంబం నుంచి డీజీపీగా ఎదిగా..
Published Sat, Nov 28 2015 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM
Advertisement
Advertisement