ఉమేష్ కుమార్ పిటిషన్పై ముగిసిన వాదనలు | End of the arguments on Umesh Kumar petition | Sakshi
Sakshi News home page

ఉమేష్ కుమార్ పిటిషన్పై ముగిసిన వాదనలు

Published Tue, Aug 27 2013 5:48 PM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM

End of the arguments on Umesh Kumar petition

ఢిల్లీ:  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి) దినేష్‌రెడ్డిపై ఉమేష్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం  కోర్టులో వాదనలు ముగిశాయి.  తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌ చేసింది.

 ఫోర్జరీ కేసులో గతంలో ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్పై సుప్రీంకోర్టులో పిటీష్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ కేసులో డీజీపీ దినేష్ రెడ్డిని ప్రతివాదిగా చేర్చాలంటూ ఉమేష్ మధ్యంతర పిటిషన్ వేశారు. దీంతో గతంలో దినేష్ రెడ్డికి సుప్రీం కోర్టుకు నోటీసులు జారీ చేసింది.

 రాష్ట్రంలో ఈ ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల మధ్య తలెత్తిన వివాదంపై గతంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  ఒకరిపై ఒకరు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించారు.  నిజాయితీ గల ఐఎఎస్‌ అధికారితో కానీ ఐపీఎస్‌ అధికారితో కానీ విచారణ జరిపించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.  డీజీపీగా పని చేస్తున్న వ్యక్తికి సంబంధించిన ఆస్తులపై విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. డీజీపీ దినేష్‌రెడ్డి తన భార్య పేరుతో అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఉమేష్‌కుమార్‌ ఆరోపించగా, షూ కోనుగోళ్లలో ఉమేష్‌కుమార్‌ అక్రమాలకు పాల్పడట్లుగా దినేష్‌రెడ్డి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement