Live : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ మంగళవారానికి వాయిదా | TDP Chandrababu Case Related Court Verdicts Live Updates | Sakshi
Sakshi News home page

Live : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ మంగళవారానికి వాయిదా

Published Wed, Sep 13 2023 7:29 AM | Last Updated on Thu, Sep 14 2023 7:06 AM

TDP Chandrababu Case Related Court Verdicts Live Updates - Sakshi

Updates..
 

07:00 PM

చంద్రబాబు అరెస్ట్‌ సందర్భంగా జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తోన్న లోకేష్‌.. సూటిగా అడిగిన ఎన్నో ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోతున్నారు. నిజంగా అవినీతి జరగలేదని కానీ, చంద్రబాబు తప్పు చేయలేకపోయారని గానీ సూటిగా చెప్పలేకపోతున్నారు. చాలా ప్రశ్నలకు నీళ్లు నమలడం, రొడ్డకొట్టుడు పాత ఆరోపణలు చేయడం తప్ప అసలు కేసు మూలాల్లోకి వెళ్లడం లేదు. మచ్చుకు ఒక ఉదాహరణ ఇది.

ఇండియాటుడే :  షెల్‌ కంపెనీలకు నిధులు తరలిపోయాయన్న అభియోగంపై ఏమంటారు?

లోకేష్‌ : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పథకం మాది కాదు, గుజరాత్‌  నుంచి మేం కాపీ కొట్టామంతే. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ అదే జరిగింది. మా పాత్ర ఏమీ లేదు.

ఇండియాటుడే :  ఇక్కడ పథకం కాదు, ఏపీలో మీ హాయంలో నిధులు షెల్‌ కంపెనీలకు తరలించారన్నారన్న ఆరోపణలకు ఏమంటారు?

లోకేష్‌ : 2021లో FIR నమోదయింది. చాలా మందిని విచారించారు. మనీ లాండరింగ్‌ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు IT, ED నోటీసులు వచ్చాయి

ఇండియాటుడే :  మనీ లాండరింగ్‌ జరగలేదని మీరంటున్నారు, మరి కేంద్ర సంస్థలు నోటీసులెందుకు ఇచ్చాయి? కేవలం రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారంటారా?

లోకేష్‌ : అవును, కేవలం రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారు. డబ్బులు తరలించారంటున్నారు కానీ ప్రూవ్‌ చేయలేదు. చంద్రబాబుకు చేరాయని కానీ, నాకు చేరాయని కానీ నిరూపించలేకపోయారు.

ఇండియాటుడే :  ఈడీ దర్యాప్తు చేస్తోంది కదా? అంతే కాదు.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని YSRCP చాలా కేసుల గురించి చెబుతోంది? ఆధారాలు చూపిస్తోంది కదా?

లోకేష్‌ : నాలుగున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం ఉంది. మాపై అమరావతి, ఫైబర్‌గ్రిడ్, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ ఆరోపణలు చేశారు. కానీ మాపై ఎలాంటి ఆరోపణలను నిరూపించలేకపోయింది.

ఇండియాటుడే :  ఎన్నికలు సమీపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ దీన్ని ఎలా చూస్తుంది ? రెండు పార్టీల మధ్య వైరంగానా?

లోకేష్‌ : చాలా చెప్పారు, చంద్రబాబుపై ఎన్నో ఆరోపణలు చేశారు కానీ, నిరూపించలేదు

ఇండియాటుడే :  చంద్రబాబు ఇంకొన్నాళ్లు జైల్లో ఉంటే మీ పార్టీ ఏం చేయబోతుంది? సానుభూతి కోసం మీరు ప్రయత్నిస్తారా?

లోకేష్‌ : తెలుగుదేశం ఎన్నో సవాళ్లను చూసింది. ఎన్టీఆర్‌ను అప్పుడు ఇందిరాగాంధీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఇప్పుడు కూడా చూస్తున్నాం.

నిజంగా లోకేష్‌ నిజాయతీగా మాట్లాడే వ్యక్తి అయితే,  చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌కు వచ్చిన ఇన్‌కమ్‌టాక్స్‌ నోటీసుల గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? రెండు వేల కోట్ల మొత్తం మనీ లాండరింగ్‌ అయిందన్న నోటీసుల మీద నోరెందుకు మెదపలేదు? తమపై రాజకీయ కక్ష అంటున్నారు కానీ.. మరి రాజధాని పేరిట జరిగిన భూకుంభకోణంలో కరకట్ట ఇంటి నుంచి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వరకు జరిగిన స్కాం గురించి ఎందుకు వివరించలేదు? అని వైఎస్సార్‌సిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. తాత ఎన్టీఆర్‌ను ఇందిరాగాంధీ పదవి నుంచి తప్పించారని చెప్పిన లోకేష్‌.. అదే నోటితో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి తన తండ్రి చంద్రబాబు పదవి లాక్కున్నారని చెప్పి ఉంటే మరింత నిజాయతీగా ఉండేదంటున్నారు.

05:54 PM
► రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్లాక్‌ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు

04:47 PM
మౌనంగా వెళ్లిపోయిన లూథ్రా 
► చంద్రబాబుతో ముగిసిన లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రా ములాఖత్‌
► దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ములాఖత్‌
► బయటకు వచ్చాక.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన లూథ్రా

03:46 PM
రాజమండ్రి జైలు వద్దకు చేరుకున్న లూథ్రా
► చంద్రబాబుతో మూలాఖత్‌ కోసం రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్దకు లాయర్‌ సిద్ధార్థ లూథ్రా చేరుకున్నారు.
► మరికాసేపట్లో చంద్రబాబుతో లూథ్రా భేటీ
► చంద్రబాబు భద్రత రిత్యా.. కారును బయటే నిలిపివేయాలని జైలు అధికారుల సూచన
► అధికారుల సూచన మేరకు కారు బయటే ఆపి లోపలికి నడుచుకుంటూ వెళ్లిన లూథ్రా
► ములాఖత్‌కు బయల్దేరే ముందు బాబు కుటుంబ సభ్యులతో లాయర్‌ లూథ్రా భేటీ

03:21 PM
జైలు వద్ద భారీ భద్రత
► రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు
► జైలు లోపలా.. బయటా సెక్యూరిటీ పెంపు
► ఉన్న సీసీ కెమెరాకు అదనంగా సీసీ కెమెరాల ఏర్పాటు
► చంద్రబాబు భద్రతను నిత్యం పర్యవేక్షిస్తున్న జైలు శాఖ ఉన్నతాధికారులు
 

03:09 PM
కాసేపట్లో చంద్రబాబుతో లాయర్‌ లూథ్రా భేటీ
► న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కాసేపట్లో చంద్రబాబుతో ములాఖత్‌ కానున్నారు.
► స్కిల్ స్కామ్ లో ముద్దాయి చంద్రబాబు తరపున లూథ్రా వాదనలు
► రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో బాబుతో భేటీ కానున్న లూథ్రా
►ములాఖత్‌కు ముందు.. కాసేపటి కిందట  గురుగోవింద్ సింగ్ వ్యాఖ్యలను ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్‌ చేసిన లూథ్రా 
► చంద్రబాబు హౌజ్‌ రిమాండ్‌ పిటిషన్‌ కొట్టివేత.. హైకోర్టు పిటిషన్‌ల విచారణ వాయిదా పడడంతో ఏం తోచని స్టేజ్‌లో బాబు లాయర్లు!

03:03 PM
చంద్రబాబుతో పవన్‌ ములాఖత్‌?

► నారా చంద్రబాబు నాయుడితో జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ ములాఖత్‌
► రేపు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పవన్‌ వెళ్లనున్నట్లు సమాచారం
► సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాబుతో ములాఖత్‌ అయ్యే ఛాన్స్‌! 
► బాబుతో పవన్‌ ములాఖత్‌పై జైలు అధికారుల నుంచి రావాల్సిన స్పష్టత

01:31 PM
టీడీపీ ముఖ్య నేతలతో భువనేశ్వరి భేటీ
► రాజమండ్రిలో తొలిసారి పార్టీ నాయకులతో సమావేశమైన భువనేశ్వరి
► చంద్రబాబు కేసు పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
► పార్టీ పరిస్థితితో పాటు లీగల్‌గా ఏర్పడిన ఇబ్బందులను భువనేశ్వరీకి వివరించిన లీడర్లు
► చట్టపరంగా అన్ని ఆధారాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని వివరణ

01:03 PM
► విజయవాడ: ఏసీబీ కోర్టుకు చేరుకున్న సిట్ అధికారులు
► కస్టడీ పిటిషన్ పై హైకోర్టు స్టే ఇచ్చిందన్న అధికారులు
► హైకోర్టు ఉత్తర్వులు అందాకే తదుపరి ఆదేశాలన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

12:33 PM
► అక్రమ నిర్బంధం, గృహ నిర్బంధాలంటూ హైకోర్టులో టిడిపి పిటిషన్
► పిటిషన్‌ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
► పిటిషనర్ తరఫున వాదించిన లాయర్ యలమంజుల బాలాజీ
► ప్రతివాదులకు ఏపీ హైకోర్టు నోటీసులు
► రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు

12:12 PM
► రాజమండ్రి : టిడిపి సీనియర్లతో లోకేష్‌ ఎడతెగని మంతనాలు
► సోమిరెడ్డి, అయ్యన్నపాత్రుడు, కనకమేడలతో లోకేష్‌ సుదీర్ఘ చర్చలు
► లీగల్ అంశాల పై లోకేశ్ తో మాట్లాడిన అడ్వొకేట్ లక్ష్మినారాయణ
► చంద్రబాబు చేసిన అవినీతికి పక్కాగా ఆధారాలున్నాయంటున్న బాబు లీగల్‌ టీం
► ఇప్పుడున్న పరిస్థితుల్లో కిం కర్తవ్యం అంటూ లోకేష్‌ చర్చలు
► చంద్రబాబు జైల్లోనే ఉండాల్సి వస్తే.. ఎవరు నాయకత్వమని పార్టీలో చర్చ

11:42 AM
► రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహ బ్లాక్‌లో సకల సౌకర్యాలు
► చంద్రబాబు గదిలో ఒక హాస్పిటల్ బెడ్, ఫ్యాన్, టీవీ, 
► చంద్రబాబు ఐదు ఛానల్స్‌ చూసే అవకాశం
► న్యూస్ పేపర్లు అందుబాటులో ఉంచిన అధికారులు
► స్నానానికి ప్రతిరోజు రెండు బకెట్ల వేడి నీళ్లు అందిస్తోన్న జైలు సిబ్బంది
► నిబంధనల మేరకు ఇంటి నుంచి భోజనం, అల్పాహారం
► భోజనాన్ని పరీక్షలు చేసిన అనంతరం చంద్రబాబుకు ఇస్తోన్న జైలు సిబ్బంది

11:42 AM
► అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కుంభకోణం కేసులో చంద్రబాబు కస్టడీ కోరిన ACB
► కస్టడీ కోసం అవినీతి నిరోధక శాఖ ACB ప్రయత్నాలు
► రాజమండ్రి జైలు నుంచి పిటి వారెంటు మీద బాబును కస్టడీ తీసుకునేందుకు ఏర్పాట్లు
► ఈ విషయంలో ఇప్పటికే ACB కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేసిన ఏసీబీ అధికారులు
► ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కేసులో A1గా చంద్రబాబు, A2గా నారాయణ, A6గా లోకేష్‌
► క్విడ్‌ ప్రో కో జరిగిందని ఇప్పటికే కావాల్సినన్ని ఆధారాలు సేకరించిన ACB

11:40 AM
► రాజమండ్రి జైలులో కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తనిఖీలు
► స్నేహ బ్లాక్‌ను పరిశీలించిన కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్
► చంద్రబాబుకు కోర్టు ఆదేశాల మేరకు అందుతున్న వసతులపై జైళ్ల శాఖ డీఐజీ ఆరా

11:35 AM
► రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి హైకోర్టులో బాబు లాయర్ల పిటిషన్‌
► CID నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ బాబు లాయర్ల పిటిషన్
► ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులోనూ కౌంటర్‌ దాఖలు చేయాలని CIDకి ఆదేశం
► చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 19కి వాయిదా వేసిన హైకోర్టు
► ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 19కి వాయిదా. 

 

11:30 AM
► హైకోర్టులో వాదనల సందర్భంగా ఆసక్తికర చర్చ
► అర్జంటుగా పిటిషన్‌పై వాదనలు వినాలన్న బాబు లాయర్‌ లుథ్రా
► గతంలో చంద్రబాబు CMగా ఉన్నప్పుడు  నేను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పని చేశానన్న హైకోర్టు జడ్జి
► మీకేమైనా అభ్యంతరాలుంటే కేసును వేరే బెంచ్‌కు మారుస్తామన్న న్యాయమూర్తి
► అలాంటిదేమి లేదు, ఎలాంటి అభ్యంతరాలు లేవన్న బాబు లాయర్‌ సిద్ధార్థ్‌ లుథ్రా
► ఒక కేసులో కౌంటర్‌ కూడా దాఖలు కాకుండా వాదనలు ఎలా వినాలన్న హైకోర్టు న్యాయమూర్తి
► కౌంటర్‌ దాఖలు అనంతరం పూర్తి వాదనలు వింటానని చెప్పిన జడ్జి
► మంగళవారం వరకు పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు

11:20 AM
► 17A సెక్షన్‌పై వాదనలు వినిపిస్తానంటూ పట్టుబట్టిన సిద్దార్థ్‌లుథ్రా
► బాబు అరెస్ట్‌పై గవర్నర్‌ అనుమతి కావాల్సిందేనంటూ జడ్జికి విజ్ఞప్తి
► ముందు CID నుంచి కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు కానివ్వాలని సూచించిన హైకోర్టు న్యాయమూర్తి
► CID తరపున హైకోర్టులో వాదనలు వినిపించిన AAG పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
► కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలన్న AAG
► కౌంటర్‌ దాఖలు తర్వాత పూర్తి వాదనలు వింటామన్న హైకోర్టు
► ఈ నెల 19వరకు పిటిషన్‌ను వాయిదా వేసిన హైకోర్టు
► అప్పటివరకు ACB కోర్టు కస్టడీ పిటిషన్‌పై నిర్ణయానికి రావొద్దన్న హైకోర్టు

11:15 AM
► క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేయడంతో నీరుగారిపోయిన బాబు లాయర్లు
► చంద్రబాబు కేసు కోసం హైకోర్టులో భారీగా మోహరించిన 20 మంది టాప్‌ లాయర్లు
► ఢిల్లీ నుంచి వచ్చిన సిద్దార్థ్‌ లుథ్రా & కో
► పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తోన్న చంద్రబాబు లాయర్ల బృందం
► ఏసీబీ కోర్టులో  పిటిషన్లు, హైకోర్టులో పిటిషన్లు
► ఢిల్లీలో మరింత మంది సీనియర్‌ లాయర్లతో  టిడిపి లీగల్‌ సెల్‌ మంతనాలు

11:15 AM
► క్వాష్‌ పిటిషన్‌ను ఈ నెల 19కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
► ఈనెల 18 వరకు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశం
► తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఇప్పటికే ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్
► సీఐడీ వేసిన పిటిషన్ పై విచారణను ఈనెల 18 వరకు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశం
► తాజాగా హైకోర్టు ఆదేశాలతో మంగళవారం వరకు కస్టడీ పిటిషన్‌ వాయిదా

11:10 AM

► ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు దక్కని అత్యవసర ఊరట
► క్వాష్ పిటిషన్‌పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా


10:50 AM
► చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ. 
► వాదనలు వినిపిస్తున్న ఇరు పక్షాల న్యాయవాదులు.

10: 35 AM
► రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న ముద్దాయి చంద్రబాబు. ఆయన భద్రత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. బాబు భద్రతకు సంబంధించిన వివరాలు హోం సెక్రటరీ వద్ద తీసుకున్నాం. బాబుకు పూర్తి భద్రత కల్పించామని ఏసీబీ కోర్టుకు తెలిపాం.
- ఏజీ శ్రీరామ్‌.  

10:15 AM
► చంద్రబాబు పోలీస్ కస్టడీ పిటిషన్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.
► పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి హైకోర్టుని ఆశ్రయించిన చంద్రబాబు న్యాయవాదులు. 
► క్వాష్ పిటిషన్ రూపంలో నిన్న హైకోర్టుని ఆశ్రయించిన చంద్రబాబు న్యాయవాదులు. 
► చంద్రబాబు రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని.. అత్యవసరంగా విచారించాలని కోరారు. 
► అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదన్న హైకోర్టు.. విచారణ నేటికి వాయిదా. 
► నేడు క్వాష్ పిటిషన్‌తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో ముందస్తు బెయిల్‌పై వాదనలు. 
► క్వాష్ పిటిషన్‌పై విచారణ సాకుతో ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయకుండా సాగదీయాలని చంద్రబాబు తరపు న్యాయవాదుల ఆలోచన?.
► మరోవైపు నందిగామలో ఓ న్యాయవాదిపై దాడి ఘటన నేపథ్యంలో నేడు న్యాయవాదుల విధుల బహిష్కరణకి పిలుపునిచ్చిన బెజవాడ బార్ అసోషియేషన్. 
► న్యాయవాదుల విధుల బహిష్కరణతో విజయవాడలోని జిల్లా కోర్టులు బంద్. 
► నేడు ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్‌పై విచారణ జరుగుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. 

9.00 am

నేడు విధుల బహిష్కరణకు బెజవాడ బార్ అసోసియేషన్ పిలుపు

► విధుల బహిష్కరణకు పిలుపు ఇచ్చిన నందిగామ బార్ అసోసియేషన్. సంఘీభావం తెలిపిన బెజవాడ బార్ అసోసియేషన్. 
► చంద్రబాబును కస్టడీకి కొరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ.
► బీబీఏ విధులు బహిష్కరణ పిలుపుతో విచారణ జరుగుతుందా.. వాయిదా పడుతుందా అని పిటిషనర్లలో సందిగ్ధం.

8.45 am
సానుభూతి కోసం నారా భువనేశ్వరి ఆరోపణలు..

► చంద్రబాబు కుటుంబసభ్యులు కోరిన అన్ని సదుపాయాలు జైలులో కల్పిస్తున్నారు. ఇంకా ఏవైనా సదుపాయాలు కావాలంటే జైలు అధికారులను కోరవచ్చు లేదా కోర్టులో పిటిషన్ వేయవచ్చు. న్యాయవ్యవస్థపై టీడీపీ, వాళ్ల మద్దతుదారులు ఆరోపణలు చేయడం దారుణం. న్యాయ వ్యవస్థను కించపరిచే వారిపై చర్యలు తీసుకుంటాం?
- వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి

8:10 AM
రాజమండ్రి జైలులో చంద్రబాబు దినచర్య..

► మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చంద్రబాబు నిద్రలోకి వెళ్లాడు. ఉదయం నిద్రలేచి వాకింగ్, మెడిటేషన్ చేసిన చంద్రబాబు. బ్లాక్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్స్ చదివిన బాబు.
► స్నేహ బ్లాక్ మొత్తం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ. నేడు చంద్రబాబును టీడీపీ సీనియర్ నేతలు కలిసే అవకాశం.
► స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో.. ప్రధాన నిందితుడు చంద్రబాబు నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ACB కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు నేటికి వాయిదా పడ్డాయి. చంద్రబాబు లాయర్లు ఈ పిటిషన్‌పై ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు.
► అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో బెయిల్‌ కోరుతూ చంద్రబాబు తరపున దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. లిస్టింగ్‌లో ఈ పిటిషన్‌ మెన్షన్‌ చేసి ఉంది. ఈ స్కాంలో ఏ1గా చంద్రబాబు పేరు ఉన్న సంగతి తెలిసిందే.

నేడు కోర్టులో వాదనలు..

► ACB కోర్టు - చంద్రబాబు కస్టడీ కోరుతూ CID పిటిషన్‌
► హైకోర్టు - స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో తనను తప్పించాలంటూ చంద్రబాబు స్క్వాష్‌ పిటిషన్‌

క్వాష్‌తో పాటు హైకోర్టులో మరో రెండు!
► స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టేయడం, ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ను సస్పెండ్ చేయడం, ఈ కేసులో స్టే ఇవ్వాలంటూ చంద్రబాబు తరుపున క్వాష్ పిటిషన్
► క్వాష్ పిటిషన్ తో పాటు హైకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలు
► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో A1 గా ఉన్న చంద్రబాబుకు బెయిల్ కోరుతూ మరో పిటిషన్
► అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోసం ఇంకొక పిటిషన్
► చంద్రబాబుకు సంబంధించిన మూడు పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశాలు
► స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా ఆధారాలతో దొరికిపోయిన విషయం తెలిసిందే.దీంతో, ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement