TDP Chandrababu Cases Petitions And Political Updates..
03:45 PM, Nov 19, 2023
క్వాష్ కొట్టేస్తే కిం కర్తవ్యం.?
►క్వాష్ కొట్టేస్తే ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే చంద్రబాబు మంత్రాంగం
►తమ వాదనల్లో అంత బలం లేదని తెలుగుదేశంలో అంతర్గతంగా చర్చ
►తప్పు చేయలేదని చెప్పుకోకుండా.. గవర్నర్ అనుమతి తీసుకోలేని చెబితే కోర్టు ఎలా నమ్ముతుంది?
►13 సంతకాలు పెట్టి అడ్డంగా దొరికిన తర్వాత 17a సెక్షన్ కలవరిస్తే.. ఎలా ఊరట కలుగుతుంది?
►బాబు క్వాష్ పిటిషన్ కొట్టేయడం ఖాయమన్న యోచనలో పార్టీ అధిష్టానం
►తాను మళ్లీ జైలుకు వెళ్తే ఎవరెవరు ఏం చేయాలన్న దానిపై చంద్రబాబు ప్లాన్ రెడీ
►జైలుకు వెళ్లగానే సానుభూతి మంత్రం అందుకోవాలని పార్టీ క్యాడర్‌కు సూచన
►భువనేశ్వరీ మళ్లీ పర్యటనలు ప్రారంభించాలని, దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు
►రాష్ట్రంలో ఒక వైపు లోకేష్, మరో వైపు పవన్ కళ్యాణ్ పర్యటనలు జరిగేలా చూడాలని క్యాడర్‌కు పిలుపు
►మరోవైపు జనసేనతో సమన్వయ సమావేశాల్లో తమ పార్టీకి అడ్వాంటేజ్ ఉండేలా చూసుకోవాలని సీనియర్లకు సూచనలు
►పేరుకే జనసేనతో పొత్తు, తెలంగాణ తరహాలో పదో, పదిహేనో సీట్లకు పరిమితం చేయాలన్న యోచనలో బాబు
►జైలుకు వెళ్లేకంటే ముందే మానిఫెస్టో విషయం తేల్చాలని నిర్ణయం
03:25 PM, Nov 19, 2023
బాబు క్వాష్ కొట్టేయడమే మిగిలిందా.?
►సుప్రీంకోర్టుకు రేపటితో ముగియనున్న సెలవులు
►గత వారమంతా దీపావళి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవులు
►17ఏ సెక్షన్‌ను తనకు అనుకూలంగా మార్చుకుని చంద్రబాబు క్వాష్ పిటిషన్
►చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు
►చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు
►CID తరపున ముకుల్ రోహత్గీ వాదనలు
►17ఏ సెక్షన్ ప్రకారం తనను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి అన్న బాబు లాయర్లు
►ఏ చట్టం అయినా, ఏ సెక్షన్ అయినా అవినీతిని అడ్డుకునేదే తప్ప.. సమర్థించేది కాదన్న CID లాయర్లు
►నేరం ముందే జరిగింది, దర్యాప్తు ముందే మొదలయింది, కాబట్టి చంద్రబాబుకు ఎలాంటి మినహాయింపు అవసరం లేదన్న CID లాయర్లు
►సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ లో పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం
►సుప్రీంకోర్టు తీర్పుపై చంద్రబాబు బృందం కోటి ఆశలు
►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తే.. మిగిలింది బెయిల్ పిటిషన్ మాత్రమే
03:03 PM, Nov 19, 2023
గబ్బర్ సింగ్‌కు వేళాయే.!
►తీవ్ర ఒత్తిడితో ఎట్టకేలకు షెడ్యూల్ ప్రకటించిన పవన్ కళ్యాణ్
►ఈ నెల 26న కూకట్‌పల్లిలో ప్రచారం చేస్తారని ప్రకటన
►తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి చంద్రబాబు ససేమిరా
►ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ఓట్లు చీల్చొద్దని ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌కు చంద్రబాబు సూచన
►చంద్రబాబు సూచనతో ఇప్పటివరకు తెలంగాణ వైపు కన్నెత్తి చూడని పవన్ కల్యాణ్
►కేవలం ప్రధాని సభకు నామమాత్రంగా వచ్చి వెళ్లిన పవన్ కళ్యాణ్
►బీజేపీ నుంచి, జనసేన 8 మంది అభ్యర్థుల నుంచి తీవ్రమైన ఒత్తిడి
►పార్ట్‌టైం పొలిటిషియన్‌గా ఉండాలనుకుంటే పోటీ ఎందుకు చేశారని ప్రశ్న
►చివరికి కూకట్‌పల్లిలో కనిపించి రావాలని డిసైడ్ అయిన పవన్ కళ్యాణ్
►మదిలో చంద్రబాబు, చుట్టున్న మనుష్యుల కోసం కమలం పార్టీ కోసం
►తమ అధ్యక్షుడికి ఎంతటి చిక్కొచ్చి పడిందని జనసేనలో ఆవేదన
02:30PM, Nov 19, 2023
టీడీపీ సీనియర్లలో అంతర్మథనం..!
►టీడీపీ యువనేతల్లో తమ భవిష్యత్తుపై చిగురించని ఆశలు..!
►టీడీపీ పని అయిపోయింది.. టీడీపీ సీనియర్లలో అంతర్గతంగా జరుగుతోన్న చర్చ ఇది.
►టీడీపీలో ఉంటే..లోకేష్‌ను నమ్ముకుంటే మనకు భవిష్యత్తు ఉండదు
►టీడీపీ యువ నేతల్లో అంతర్గత చర్చ
►ఈ రెండు చర్చల సబ్జక్ట్ వేరైనా లైన్ ఒక్కటే
►టీడీపీని చంద్రబాబు కాదు కదా..ఎవరూ బతికించలేరనేది
►టీడీపీ నేతల అంతర్గత చర్చల సారాంశం.
►చంద్రబాబుపై కేసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
►మరోవైపు.. బెయిల్ షరతులు బేఖాతరు చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది.
►చంద్రబాబు అరెస్ట్ సమయంలో హడావుడి చేసిన భువనేశ్వరి ఏమయ్యారు..?
►చంద్రబాబును అరెస్ట్ చేయగానే ఢిల్లీ పారిపోయి దాక్కున్న లోకేష్‌పై టీడీపీ క్యాడర్‌లో నమ్మకం ఏమాత్రం లేదు.
►చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలు..భువనేశ్వరి తీరు..లోకేష్ చేతులెత్తేసి ఢిల్లీ పారిపోవడం చూసిన..
►టీడీపీ నేతలు మింగలేక కక్కలేక టీడీపీలో ఉంటున్నారు.
►తెలంగాణ తరహాలోనే.. 2024 తరువాత ఏపీలో జెండా పీకేయాల్సి వస్తుందని..
►టీడీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
►నవంబర్ 28న చంద్రబాబు జైలుకు వెళ్తే... వాట్ నెక్ట్స్..?
►భువనేశ్వరికి మాట్లాడటమే తెలియడం లేదు
►లోకేష్‌కు రాజకీయాలు ఏమాత్రం తెలియదు
►మరీ ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వైపు వేళ్లు చూపెడుతున్నాయి..!!
►పురందేశ్వరి అధికారికంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అయినప్పటికీ ఆమె.. టీడీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నట్లు మాట్లాడుతున్నారు.
12:15 PM, Nov 19, 2023
పురంధేశ్వరికి విజయసాయి కౌంటర్
►పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్..
►బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి 2019లో విశాఖపట్నం లోక్‌సభ స్థానంలో సాధించిన ఓట్లు చూస్తే కళ్లు తిరిగి పడిపోవాల్సిందే
►మేడంకు NOTAకు పడిన ఓట్ల కంటే కొద్దిగా ఎక్కువ వచ్చాయి.
►33,892 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు
►అయినా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా నియమించి బీజేపీ పెద్ద సాహసమే చేసింది.
బిజెపి అభ్యర్థిగా పురంధేశ్వరి గారు 2019లో విశాఖపట్నం లోక్ సభ స్థానంలో సాధించిన ఓట్లు చూస్తే కళ్లు తిరిగి కింద పడిపోవాల్సిందే. మేడంకు NOTAకు పడిన ఓట్ల కంటే కొద్దిగా ఎక్కువ వచ్చాయి. 33,892 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. అయినా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా నియమించి…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2023
10:15 AM, Nov 19, 2023
టీడీపీ పనైపోయిందా!.. విజయసాయి కౌంటర్
►చంద్రబాబుకు అనారోగ్యం, బెయిల్ షరతులు సరే
►పార్టీలో నారా లోకేష్, భువనేశ్వరి అందరూ ఏమయ్యారు?
►ఇక టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా!
►తెలంగాణ తరహాలోనే టీడీపీ జెండా ఆంధ్రాలో కూడా పీకేశారా?
►లేక టీడీపీ భారమంతా పురంధేశ్వరిపైనే పెట్టారా?
►ఆమె సొంత పార్టీ బీజేపీని ముంచడంలో దిట్ట కావచ్చేమో కానీ..
►బావ గారి పార్టీ టీడీపీని బతికించడంలో కాదు సుమా!.
చంద్రబాబుకు అనారోగ్యం - బెయిల్ షరతులు సరే-- పార్టీలో లోకేష్ - భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు? ఇక టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా! తెలంగాణ తరహాలోనే టీడీపీ జెండా ఆంధ్రాలో కూడా పీకేశారా? లేక టీడీపీ భారమంతా పురంధేశ్వరిపైనే పెట్టారా? ఆమె సొంత పార్టీ బీజేపీని ముంచడంలో దిట్ట…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2023
9:45 AM, Nov 19, 2023
నాదెండ్లతో పవన్‌కు వెన్నుపోటు తప్పదా?
►నాదెండ్ల మనోహర్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు?
►నాదెండ్ల మనోహర్‌కు సామాన్యుడికి కౌంటర్
►జనసేన కోసమా.. టీడీపీ కోసమా?.
►నాదెండ్ల మాటలు, చేతలు టీడీపీకి అనుకూలమే..
►జనసేనకు లబ్ధి చేకూర్చేలా లేవు.
►రాబోయే రోజుల్లో పవన్‌కు వెన్నుపోటు తప్పదా?.
నాదెండ్ల మనోహర్ జనసేన కోసం పనిచేస్తున్నాడా..? లేదా టీడీపీ కోసమా..? అతని మాటలు, చేతలు అన్నీ టీడీపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి తప్ప జనసేనకి లబ్ధి చేకూర్చేలా మాత్రం లేవు. దాంతో పవన్ కళ్యాణ్‌కి రాబోయే రోజుల్లో వెన్నుపోటు తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.… pic.twitter.com/pKNg1BhI3g
— YSR Congress Party (@YSRCParty) November 19, 2023
8:00 AM, Nov 19, 2023
రేవంత్ ఆశల్లో వాస్తవాలెంత? లాజిక్ ఏముంది?
►చంద్రబాబు అరెస్ట్‌పై సానుభూతి వెల్లువెత్తుతుందన్న ఆశల్లో రేవంత్
►చంద్రబాబు అరెస్ట్ అంశం వల్ల తెలంగాణలో మాకు లాభం : రేవంత్
►చంద్రబాబు అరెస్ట్‌కు గల కారణాలపై మీడియాలో సంపూర్ణంగా చర్చ
►చంద్రబాబుపై ఏ ఏ కేసులున్నాయి? వాటి వెనక ఎన్ని రకాల సాక్షాలున్నాయి?
►చంద్రబాబు స్వయంగా ఎక్కడెక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టి నిధులు పక్కదారి పట్టేలా చేశాడు?
►చంద్రబాబు లాయర్ల వాదన ACB కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?
►చంద్రబాబు తప్పు చేయలేదు అని ఆయన తరపు లాయర్లు ఏ కోర్టు ముందుకూడా ఎందుకు చెప్పలేదు?
►మా బాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోలేదన్న ఓ పసలేని వాదననే చర్వితచర్వణంగా ఎందుకు వినిపించారు?
►కనీసం సాధారణ బెయిల్‌కు కూడా చంద్రబాబుకు అర్హత లేదని కోర్టులు ఎందుకు నమ్మాయి?
►కేవలం ఆపరేషన్ చేయించుకునేందుకు మాత్రమే అని చెప్పి మరీ బెయిల్ ఎందుకిచ్చాయి?
►తప్పు చేశాడు, సాక్షాలున్నాయి, చట్ట ప్రకారం అరెస్టయ్యాడని స్పష్టంగా తెలిసినప్పుడు సానుభూతి ఎందుకొస్తుంది?
►ఆంధ్రప్రదేశ్‌లోనే జనాలు చంద్రబాబును పట్టించుకోనప్పుడు తెలంగాణలో సానుభూతి ఎందుకొస్తుంది?
►నిజంగా సానుభూతే వచ్చే పరిస్థితే ఉంటే తెలుగుదేశమే స్వయంగా పోటీ చేసేది కదా..!
►అంటే తెలుగుదేశానికి రాని సానుభూతి కాంగ్రెస్ పార్టీకి వస్తుందని పచ్చమీడియా ఊదరగొట్టేది అసత్యాలే కదా.!
►చంద్రబాబుకు సానుభూతి వచ్చే అవకాశముంటే.. పవన్ కళ్యాణ్ పరిస్థితేంటీ?
►తెలంగాణలో తమ పరిస్థితి జీరో అని తెలిసే కదా.. టిడిపి పోటీ చేయలేదు? అలాగే జనసేన కేవలం 8 చోట్ల జనాన్ని నిలబెట్టింది.!
►జనసేన తరపున, మిత్రపక్షం బీజేపీ తరపున ప్రచారానికి రాకుండా పవన్ కళ్యాణ్ ముఖం చాటేశాడు కదా.!
7:10 AM, Nov 19, 2023
బలహీనులపై టీడీపీ నేతల దౌర్జన్యం..
►బలహీనులపై టీడీపీ నేతల దౌర్జన్యం రోజురోజుకు పెరుగుతోంది.
►అకారణంగా గొర్రెల కాపరిపై దాడి.
►రెచ్చిపోయిన చింతమనేని
►గతంలోనూ దళితులపై ఇలాగే నోరుజారి, మహిళా ఎమ్మార్వోపై దుసురు ప్రవర్తన
బలహీనులపై టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. అధికారం ఇవ్వలేదనే అక్కసుతో చింతమనేని ప్రభాకర్ రౌడీలా రెచ్చిపోతున్నాడు. అకారణంగా గొర్రెల కాపరిని అసభ్యపదజాలంతో దూషించి.. పిడిగుద్దులు కురిపించాడు. అనంతరం ఒక గొర్రెను తన కారులో తీసుకుపోయాడు. గతంలోనూ దళితులపై… pic.twitter.com/wvyTiOM6h0
— YSR Congress Party (@YSRCParty) November 18, 2023
7:00 AM, Nov 19, 2023
చంద్రబాబు జబ్బుల్లో నిజమెంత?
►నిజంగానే ఇంత సీరియస్ జబ్బులుంటే ఏ టెస్ట్‌లు చేయకుండానే కంటి ఆపరేషన్ చేయించుకున్నాడా? నమ్మబుద్ధి కావడం లేదన్నది నిపుణుల మాట
►నారా చంద్రబాబునాయుడు 73 సంవత్సరాల వయసులో AIG హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు
►చంద్రబాబుకున్న జబ్బులు ఏంటంటే.. ఫ్రీక్వెంట్ బౌల్స్ ఆఫ్ హెవీనెస్ ఇన్ ద చెస్ట్ విత్ పెయిన్, గిడ్డినెస్, నిద్రలేమి, లో బ్యాకెట్, డిస్కంఫర్టనెస్ మరియు చర్మవ్యాధులు
ఇక్కడ రెండు ప్రధానంగా డాక్టర్లు చెప్పిన విషయాలు
#ఒకటి : కరోనరీ ఆర్డినరీ డిసీజ్ ఉంది
#రెండు : హైపర్ ట్రాఫిక్ కార్డియోమియోపతి ఉంది
#హైపర్ ట్రాపిక్ కార్డియోమయోపతి ఉంది, ప్రీవియస్ రిపోర్ట్స్ లో LV క్లాట్ ఉంది, డయాబెటిస్ ఉంది, స్కిన్ డిసీస్ ఉంది.
►వీటన్నిటికీ సంబంధించి వచ్చే మూడు నెలలలో ఇవాక్యుయేషన్ కావాలి అంటూ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ యాక్టివిటీ అవాయిడ్ చేయాలీ.
►ఇంకా అడ్వాన్సుడ్ కార్డియాక్ లైఫ్ సపోర్టు ఉన్నటువంటి అంబులెన్స్ నిత్యం కూడా షెడ్యూల్లో ఉండాలి అని రిఫర్ చేశారు.
►వికిల్గోకి సంబంధించి ఇమ్యునో మార్జిలేటర్ డ్రగ్స్ వాడుతున్నారు
►ఎరిట్రియా ప్రోన్ ఉంది అంటే గుండె కొట్టుకోవడంలో సడన్‌గా వేరియేషన్స్ పరిస్థితులు ఉన్నప్పుడు ఇది చెబుతారు.
►ఇటువంటి ఆరోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు అనస్తీషియా ఇవ్వడం చాలా హై రిస్క్
►ఇన్ని సమస్యలున్నప్పుడు ఏ డాక్టర్ కూడా అనస్తీషియా ఇవ్వడానికి అంత ధైర్యం చేయడు.
►రెండో తారీఖున అడ్మిట్ కావటం, మూడో తారీఖున సర్జరీ చేసి డిశ్చార్జ్ చేయడం కూడా అయిపోయింది.
►ఈ రిపోర్ట్స్ తీసుకుని ఏ డాక్టర్ అయినా చూపిస్తే దీనిని ఆపరేట్ చేస్తారా?
►ఇదే విషయాన్ని ప్రశ్నించిన మంత్రి డాక్టర్ సీదీరి అప్పలరాజు
►కంటి చూపు తగ్గిపోయింది అనే విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు
►గౌరవ న్యాయస్థానం కూడా అనుమతించడం జరిగింది.
►CP కాల్షియం స్కోర్ 2019లో రిపోర్టు ప్రకారం 916 ఉంది
►ఇప్పుడు స్కోర్ అయితే 1611 ఉంది ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని వారు చెప్పడం జరిగింది.
►ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కనీసం కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయకుండా ఆపరేషన్ ఎలా చేశారు?
►క్యాల్షియం స్కోరు ఇంత తక్కువ సమయంలో పెరిగితే ఏ కార్డియాలజిస్ట్ అయిన ముందుగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ వెంటనే చేస్తారు
►కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయటం ద్వారా ఆయన కరోనరీ ఆర్తరీస్ ఎలాగ ఉన్నాయో తెలిసే అవకాశం ఉంది
►అలా తెలిసినప్పుడు ఆయనకి సరైన ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది.
►ఎందుకు చేయలేదు అంటే కేవలం బెయిల్ పొడిగించు కోవడానికి ఒక వండివార్చిన కథనమని మంత్రి సీదీరి అప్పలరాజు అనడాన్ని ఏ వైద్య నిపుణుడయినా ఖండించగలరా?
►పరిస్థితి సీరియస్‌గా ఉన్నప్పుడు.. గుండె ఎనలార్జ్ అయిన విషయాన్ని పరీక్షించి.. ఆ ఎక్సెస్ పోర్షన్‌ను ట్రీట్‌చేస్తారు
►ఆ కారణంగా గుండె కొట్టుకోవడంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూస్తారు.
►ఇంకా చంద్రబాబు తనకు కరోనార్ ఆర్డినరీ వ్యాధి ఉందని చెబుతున్నారు కాబట్టి దానికి సంబంధించి బైపాస్ సర్జరీ చేయాలి..
►అయోగ్టిక్ స్టినోసిస్ ఉంది అన్నారు, డైలేటెడ్ ఎస్ఎండింగ్ అయ్యోర్టా ఉందన్నారు
►నిజంగా ఇవి గానీ నిజమైతే అయోర్టిక్ వాల్ కూడా రీప్లేస్ చేయాలి.
►డెఫినిటివ్ ఇన్వెస్టిగేషన్ డెఫినేట్ ట్రీట్మెంట్ ఏమీ చేయకుండానే ఆపరేషన్ చేసేస్తారా?
►ఒక ప్రముఖ సంస్థకు సంబంధించినటువంటి రిపోర్టులను తన లాయర్ల ద్వారా తనకు నచ్చినట్లుగా రాయించుకుని కోర్టులను తప్పుదోవ పట్టించడం కాదా?
►హైపర్ ట్రాఫిక్ కార్డియామయోపతి ఉన్నప్పుడు కరోనరీ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మందులు ఎందుకు వాడడం లేదు?
►LV క్లాట్ ఉన్నప్పుడు జీవితాంతం దానికి తగ్గ మందులు వాడాలి కదా.?
►మందులు ఏవైనా కనీసం రాయాలి కదా? అవేవీ ప్రిస్క్రిప్షన్‌లో ఎందుకు లేవు?
►ఇవి సీదీరి అప్పలరాజు ప్రశ్నలే కాదు.. ఆరోగ్య శాస్త్రం తెలిసిన వారెవరయినా అడిగేవే.
►తనకు జబ్బులున్నాయని, వాటి కోసం బెయిల్ కావాలని అడిగినందుకే ఇంత లోతుగా విశ్లేషణ
►న్యాయస్థానానికి చెప్పిన విషయాలు నిజాలు కావా? అన్నది అత్యంత కీలకమైన అంశం
6:55 AM, Nov 19, 2023
బెయిల్‌పై బాబు వర్గంలో భిన్నాభిప్రాయాలు
►చంద్రబాబు బెయిల్‌పై తెలుగుదేశంలో భిన్నమైన అభిప్రాయాలు
►52 రోజులు చంద్రబాబు జైల్లో ఉండడం వల్ల తెలుగుదేశానికి మేలు జరిగింది.!
►ఇన్నాళ్లు మనకు అన్యాయం జరిగిందని కలరింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాం
►ఇప్పుడు చెప్పుకోడానికి ఏం లేదు.! చేయడానికి ఏమీ లేదు.!
►లోకేష్ కోసమైనా చంద్రబాబు త్యాగం చేయాలేమో..
►లోకేష్ నాయకుడిగా ఎదగాలంటే.. చంద్రబాబు రాజకీయాలకు దూరంగా ఉండడం బెటరేమో
►చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత జనం అరెస్ట్ గురించే మాట్లాడడం లేదు
►జైల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల అనవసరంగా జనసేనకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది
►ఇలాగే ఉంటే లోకేష్‌బాబును పట్టించుకునే వారెవరు?
►ఇప్పటికైనా పార్టీలో సమూలంగా మార్పులు జరగాలి
►పార్టీలేదు.. xxx లేదు అన్న అచ్చెన్నను ఇంకెన్నాళ్లు భరించాలి?
►యనమల, బుచ్చయ్యచౌదరీ, చినరాజప్ప, అయ్యన్నపాత్రుడిని నమ్ముకుని పార్టీ ఎన్నాళ్లు ప్రయాణం చేస్తుంది?
►కొత్త నీరు లేక, పక్క పార్టీ జనసేనను నమ్ముకుంటే తెలుగుదేశానికి సమాధి కాదా?
►పార్టీ తీరుపై తెలుగుదేశం కార్యకర్తల్లో ఆందోళన, అసహనం.
6:50 AM, Nov 19, 2023
జైలు ముహూర్తం దగ్గరపడుతుండడంతో చంద్రబాబు టీంలో ఆందోళన
►నవంబర్ 28న రాజమండ్రి జైల్లో లొంగిపోవాల్సి ఉన్న చంద్రబాబు
►ఇప్పటికే కంటి ఆపరేషన్ పేరిట మధ్యంతర బెయిల్ తీసుకున్న చంద్రబాబు
►తాజాగా గుండె జబ్బు గురించి హైకోర్టుకు నివేదించిన చంద్రబాబు లాయర్లు
►నవంబర్ 28న జైలులోనికి వెళ్లకుండా ఉండేందుకు సర్వ ప్రయత్నాలు
►ఆరోగ్య పరిస్థితిని కారణంగా చూపి కోర్టు నుంచి మినహాయింపు పొందే వ్యూహాలు
►ఎన్నో బహిరంగ సభల్లో తన ఆరోగ్యం గురించి మాట్లాడిన చంద్రబాబు
►వయస్సు అనేది తనకొక నెంబర్ మాత్రమేనని ప్రకటించిన చంద్రబాబు
►40 ఏళ్ల కుర్రాళ్ల కంటే వేగంగా పనులు చేస్తానని ఎన్నో సార్లు చెప్పుకున్న చంద్రబాబు
►జైలుకు వెళ్లగానే చంద్రబాబుకు హఠాత్తుగా గుర్తుకొచ్చిన జబ్బులు
6:45 AM, Nov 19, 2023
చంద్రబాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు?
►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు
►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే
►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే
►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే.
►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే.
►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే
►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే
►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే.
►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు
►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే
►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే
►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే
►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే.
6:40 AM, Nov 19, 2023
చంద్రబాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం
►స్కాంలో అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర
►టీడీపీ నేతల డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చారు.. వారి చర్యల వల్ల ఖజానాకు రూ. 1,500 కోట్ల నష్టం
►దీన్ని కాగ్ సైతం ధ్రువీకరించింది
►కొల్లుకు డబ్బు ముట్టడంపై దర్యాప్తు కొనసాగుతోంది
►ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు
►హైకోర్టుకు నివేదించిన ఏజీ శ్రీరామ్
►తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా
6:30 AM, Nov 19, 2023
స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది?
►టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం
►నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం
►జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం
►సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం
►ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు
►అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు
►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి
►విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్
►పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్)
►ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST
►విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు
►స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ
►నిధులన్నీ సూట్‌కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్ శాఖ
►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్‌మెంట్లను గుర్తించిన CID
►రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి
►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్
►చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు
►సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ
►1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
►సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
►ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
►రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు
►కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.
6:30 AM, Nov 19, 2023
చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ?
కేసు : స్కిల్ స్కాం
అంశం : మధ్యంతర బెయిల్
స్టేటస్ : అనారోగ్యం కారణంగా మంజూరు
వివరణ : నవంబర్ 28న జైలు ముందు లొంగిపోవాలి
కేసు : స్కిల్ స్కాం
అంశం : క్వాష్ పిటిషన్
స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్
వివరణ : ఈ నెలాఖరుకు తీర్పుకు ఛాన్స్
కేసు : స్కిల్ స్కాం
అంశం : రెగ్యులర్ బెయిల్ పిటిషన్
స్టేటస్ : హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్
కేసు : ఇసుక కుంభకోణం
అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్ 22కి తదుపరి విచారణ వాయిదా
కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి
అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్
వివరణ : నవంబర్ 30కి తదుపరి విచారణ వాయిదా
కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు
అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు
వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు
కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు
అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్ 22కి వాయిదా పడ్డ కేసు
కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు
అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్ 21కి వాయిదా పడ్డ కేసు.
6:30 AM, Nov 19, 2023
రెండు వర్గాలుగా మారిన తెలుగుదేశం అగ్ర నేతలు
ఒక వర్గం : ముందయితే ఎలాగైనా లోకేష్‌ను బుజ్జగించి పాదయాత్ర పునఃప్రారంభించాలి
రెండో వర్గం : ఇప్పుడు జనం ముందుకు లోకేష్ ను పంపితే పార్టీకి నష్టం. ఏదో ఒకటి మాట్లాడి అసలుకే మోసం
ఒక వర్గం : కనీసం భువనేశ్వరీ యాత్ర నిజం గెలవాలి అయినా ప్రారంభించాలి
రెండో వర్గం : అసలే వద్దు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలంటే బోలెడు ఖర్చు. ఎలాంటి సానుభూతి రావడం లేదు, డబ్బులెందుకు దండగ.?
ఒక వర్గం : ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి, ఇలాగే ఉంటే.. పార్టీలో నిరాశ, నిస్తేజం, నిస్పృహ. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే.. పార్టీ పరిస్థితి అంతే సంగతులు
రెండో వర్గం : పార్టీ అంటూ లోకేష్ ను ఫణంగా పెట్టుకుంటామా? చినబాబు ఢిల్లీ యాత్రలతో అలసిపోయారు, విశ్రాంతి తీసుకోనివ్వండి.
Comments
Please login to add a commentAdd a comment