స్కిల్‌ కేసు.. ఉండవల్లి పిటిషన్‌ విచారణ వాయిదా | AP High Court Adjourned Vundavalli Aruna Kumar Skill Case Petition | Sakshi
Sakshi News home page

స్కిల్‌ కేసు.. ఉండవల్లి పిటిషన్‌ విచారణ వాయిదా

Published Wed, Dec 27 2023 1:11 PM | Last Updated on Wed, Dec 27 2023 1:37 PM

AP High Court Adjourned Vundavalli Aruna Kumar Skill Case Petition - Sakshi

సాక్షి, గుంటూరు: చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసుపై దాఖలైన పిటిషన్‌ను ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారించింది. స్కిల్‌ స్కామ్‌ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 

అయితే.. 14 మంది ప్రతివాదులు పలు కారణాలతో నోటీసులు తీసుకోలేదని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం.. ఇతర కారణాలతో నోటీసులు వెనక్కి విషయాన్ని ప్రస్తావించారాయన. పైగా ఈ కేసులో కొందరు ప్రతివాదులు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీలోనూ ఉన్న విషయాన్ని తెలియజేస్తూ.. ఆయా ప్రతివాదులకు పేపర్‌ ప్రకటన ద్వారా నోటీసులు ఇస్తామన్నారు. ఈ విషయంపై మెమో ఫైల్ చేసినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో.. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది హైకోర్టు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement