Dec 14th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Chandrababu Case Petitions And Political Updates 14th December | Sakshi
Sakshi News home page

Dec 14th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Thu, Dec 14 2023 6:53 AM | Last Updated on Thu, Dec 14 2023 6:57 PM

Chandrababu Case Petitions And Political Updates 14th December - Sakshi

TDP Chandrababu Cases, Political Updates..

6:54 PM, డిసెంబర్‌ 14, 2023
ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసు @ హైకోర్టు

  • రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ
  • ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడీ తరపు వాదనలు పూర్తి
  • ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడి తరపు వాదనలు పూర్తి
  • సిఐడి తరపు వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్
  • చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు
  • వాదనల కొనసాగింపునకు విచారణ సోమవారానికి వాయిదా

6:24 PM, డిసెంబర్‌ 14, 2023
చంద్రబాబు భ్రమలు ఇంకా తొలగలేదు : మంత్రి కాకాని

  • చంద్రబాబుకీ పూర్తిగా పిచ్చి పట్టిందని ఆయన చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం..
  • పోలవరాన్ని తానే డిజైన్ చేసానని చెప్పుకోవడం సిగ్గుచేటు..
  • పోలవరం ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసింది వైస్సార్ ఐతే.. దాన్ని పూర్తి చేసేది సీఎం YS జగన్
  • మిగ్‌చామ్ తుఫాన్ లో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది..
  • చంద్రబాబు హయాంలోనే రైతులు నష్టపోయారనే విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలి..
  • వ్యవసాయమే దండగ అని మాట్లాడిన చంద్రబాబు.. రైతులు గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
  • టీడీపీ హయాంలో కరువు విలయతాండవం చేస్తే.. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు..
  • రుణమాఫీ చేస్తానని చెప్పి.. రైతులను బాబు మోసం చెయ్యలేదా..?
  • తుఫాన్ సమయంలో కష్టపడి పని చేసిన అధికారులను తక్కువ చేసి చంద్రబాబు మాట్లాడుతున్నారు..
  • ఆత్మ స్తుతి.. పర నిందతో చంద్రబాబు బతుకుతున్నారు.. 1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఐతే.. అప్పటి నుంచి ఒక్క సాగునిటీ ప్రాజెక్ట్ ను అయినా చేపట్టారా..??
  • చంద్రబాబు సిగ్గు లేకుండా.. తుఫాన్, వరదలు విషయంలో మాట్లాడుతున్నారు..
  • మోసాలు చెయ్యడంలో చంద్రబాబు దిట్ట.. అయన జైలుకు వెళ్తే జనాలు ఆత్మహత్య లు చేసుకున్నారని చెప్పడం సిగ్గుచేటు..
  •  అలిపిరిలో చంద్రబాబు మీద బాంబ్ దాడి జరిగితే రాష్టంలో ఒక్కరూ కూడా పట్టించుకోలేదు..
  • రైతులు నష్టపోతే ఇన్‌పుట్ సబ్సిడీని నీ హయాంలో ఎప్పుడైనా ఇచ్చావా..??
  • 2015 లో జాతీయ రహదారి తెగిపోతే ఐదేళ్లు పట్టించుకోలేదు.. వైసీపీ హయాంలో ఆ హైవే పనులు పూర్తి చేసాం..
  • NDA లో భాగస్వామిగా ఉన్నప్పుడు.. నిధులు తీసుకురాగలిగావా..?
  • రైతులను, ప్రజలను ఆదుకున్న చరిత్ర చంద్రబాబు కీ లేదు.. పని చేసే వ్యక్తి జగన్.. ఫోటోలకు పోజులు ఇచ్చేది చంద్రబాబు..
  • ఆస్తి, ప్రాణ నష్టాలు జరక్కుండా జిల్లా యంత్రాంగం తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది..
  • తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తే.. ఒక్క రైతు కూడా కనిపించలేదు..
  • వైసీపీలో వ్యవస్థీకృత మార్పులు జరుగుతుంటే చంద్రబాబుకు కడుపు మంటగా ఉన్నట్టుంది

5:42 PM, డిసెంబర్‌ 14, 2023
మా తలుపులు తెరిచే ఉన్నాయి.. రండి బాబు రండి

  • అభ్యర్థుల కోసం ఆశగా ఎదురుచూస్తోన్న చంద్రబాబు
    వైసీపీలో మంచివాళ్లు ఉంటే పార్టీలోకి తీసుకునే అంశంపై ఆలోచిస్తాం : చంద్రబాబు
    జనసేనతో పొత్తులో ఉన్నాం.. సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాం
    అయినా YSRCP నుంచి అసంతృప్తితో ఎవరైనా మంచి అభ్యర్థి వస్తే పార్టీలోకి తీసుకుంటాం
    ఈసారి త్వరగానే అభ్యర్ధులను ప్రకటిస్తాం : చంద్రబాబు
  • YSRCP నుంచి ఎవరైనా అసమ్మతిదారులు బయటకు వస్తారేమో..

5:12 PM, డిసెంబర్‌ 14, 2023
నీతులు భలే చెబుతావు బాబు..!

  • టికెట్ల కేటాయింపులో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు
  • ప్రజాభిప్రాయంతోనే అభ్యర్ధుల ఎంపిక
  • కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు విభిన్న కోణాల్లో ప్రజాభిప్రాయ సేకరణ
  • ఆ తర్వాతే అభ్యర్ధుల ఎంపిక : చంద్రబాబు

నిజంగా ప్రజాభిప్రాయం మీద నిలబడతావా చంద్రబాబు.?

  • ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినపుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు?
  • పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు?
  • మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో చేతులు కలిపినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు?
  • అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డంగా ప్రభుత్వ ఖజానాను దోచుకున్నప్పుడు ఎవరికి చెప్పావు?
  • ఓటుకు కోట్లు ఇవ్వడమే కాకుండా.. మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ అంటూ హామీలివ్వడానికి ఎవరి అభిప్రాయం సేకరించావు?
  • దళితుల్లో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నలు సంధించడానికి ఎవరి అభిప్రాయాలను సేకరించారు?
  • రాష్ట్రాన్ని విడగొడితే ఏపీకి పది లక్షల కోట్లిస్తే చాలని ప్రకటన చేయడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు?
  • ప్రత్యేక హోదా వద్దే వద్దు.. ప్యాకేజీ ముద్దు అని ఖరారు చేయడానికి ఎవరి అభిప్రాయం సేకరించారు?
  • లోకేష్‌ను దొడ్డిదారిలో మంత్రి పీఠంపైకి ఎక్కించినప్పుడు అభిప్రాయ సేకరణ చేయలేదేందుకు?
  • 23 మంది ఎమ్మెల్యేలను YSRCP నుంచి ఫిరాయింపజేయించి, వాళ్లలో ముగ్గురికి మంత్రి పదవులిచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారు?
  • అంతెందుకు.. జైల్లో కూర్చుని పొత్తు చర్చలు చేసినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారో.?
  • నిజంగా చంద్రబాబు వద్దని కుప్పం ప్రజలు చెబితే.. పోటీ నుంచి తప్పుకుంటారా?
  • అసలు మీ పార్టీలో ప్రజాస్వామ్యానికి విలువుందా? లేక కులస్వామ్యం మాత్రమే నడుస్తుందా?

4:10 PM, డిసెంబర్‌ 14, 2023
చంద్రబాబు+దత్తపుత్రుడు = డిపాజిట్లు గల్లంతు

  • ఉద్దానంలో మాట్లాడిన సీఎం జగన్
  • పేదల బతుకులు ఎలా మార్చాలి అనే తపన మీ బిడ్డ జగన్‌కు మాత్రమే ఉంది
  • పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదు
  • కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నీరు కూడా అందించలేదు
  • సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది?
  • ఎన్నికలు వచ్చే సరికి పొత్తులు, ఎత్తులు, చిత్తుల మీద బాబు ఆధారపడతారు
  • దత్తపుత్రుడి మీద చంద్రబాబు ఆధారపడతారు
  • తెలంగాణాలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు
  • ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణాలో డైలాగులు కొడతాడు....ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ దత్తపుత్రుడు
  • తెలంగాణాలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు
  • ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు
  • ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు
  • విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు
  • విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు
  • నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు
  • ఈ నాన్ లోకల్స్ అందరికీ ఆంధ్ర రాష్ట్రం పై ప్రేమ లేదు
  • అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాలను బాబు మోసం చేశారు
  • పార్టీలు సైతం చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం
  • వారు 5 ఏళ్లు అధికారంలో ఉండి పేదవారికి సెంటు స్థలం ఇవ్వలేదు
  • పేదలకు ఇంటి స్థలం ఇస్తామంటే వారికి ఏడుపు
  • 2014-19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు పది శాతం హామీలు కూడా అమలు చేయలేదు
  • YSRCP ప్రభుత్వంలో మేనిఫెస్టో హామీలు 99 శాతం అమలు చేస్తున్నాం
  • దోచుకోవడం, పంచుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు
  • మీ బిడ్డ జగన్‌ ప్రభుత్వంలో లంచాలు, వివక్ష, అవినీతి లేకుండా నేరుగా డబ్బులు జమ
  • ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబుకు ఏడుపే ఏడుపు
  • మరో 3 నెలలు ఆగి ఈ కేన్సర్ గడ్డలను తొలగిద్దాం
  • రాబోయే రోజుల్లో వారి అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి
  • మీ ఇంటికి, కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే అండ
  • ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంచ్ కారు కొనిస్తామని హామీ ఇస్తారు
  • మాటలు చెప్పి మోసం చేసే వారిని నమ్మకండి : సీఎం జగన్

4:05 PM, డిసెంబర్‌ 14, 2023
హైకోర్టులో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు

  • ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కాంకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ
  • బాబు ముందస్తు బెయిల్‌పై వాదనలు
  • సీఐడీ తరపున పూర్తయిన అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్ వాదనలు
  • చంద్రబాబు తరపున సిద్ధార్ధ లూథ్రా వాదనలు

4:02 PM, డిసెంబర్‌ 14, 2023
దొంగ ఓట్లు కేరాఫ్‌ తెలుగుదేశం

  • ఢిల్లీలో మీడియాతో ఎంపీ విజయసాయిరెడ్డి
  • దొంగ ఓట్లు చేర్పిస్తున్న టీడీపీ నేతలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం
  • ఒకే ఫొటోతో ఇంటి పేరు మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు
  • టీడీపీ నేతల నిర్వాకాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం
  • టీడీపీ నేతల దొంగ ఓట్ల వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని కోరాం
  • టీడీపీ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం
  • అమెరికా సర్వర్ లో ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారు
  • పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు
  • తండ్రి పేరు, ఇంటి పేరు మార్చి ఒకే ఓటర్ ను రెండు నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారు
  • పూర్తి ఆధారాలతో టీడీపీపై ఫిర్యాదు చేశాం
  • వీలైనంత త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరాం
  • మా విజ్ఞప్తులపై సీఈసీ సానుకూలంగా స్పందించింది : ఎంపీ విజయసాయిరెడ్డి

3:52 PM, డిసెంబర్‌ 14, 2023
ఇంతకీ ఈ ఏడాది చంద్రబాబు కుటుంబం ఆస్తుల లెక్కలు చెబుతారా? : YSRCP

  • ప్రతీ ఏటా కుటుంబం ఆస్తుల లెక్కలు అంటూ ఓ పక్కా పకడ్బందీ స్క్రిప్ట్‌ విడుదల చేసే లోకేష్‌
  • ఈ ఏడాది జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లిన చంద్రబాబు
  • చంద్రబాబు ఆస్తులపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ చర్చ
  • ఇన్నాళ్లు చంద్రబాబును అద్భుత స్థాయిలో కీర్తించిన ఎల్లో మీడియా
  • తాజా కేసులతో బయటపడుతున్న చంద్రబాబు, కుటుంబం అసలు రంగు
  • రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించానని తరచు చెప్పుకున్న చంద్రబాబు
  • ఇటీవల నోరు జారి నిజాలు కొన్ని చెప్పేసిన భువనేశ్వరీ
  • హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయి : భువనేశ్వరి
  • అంటే హెరిటేజ్ ఆస్తుల విలువ 20 వేల కోట్లు.!
  • హెరిటేజ్ లో రూ.20 వేల కోట్లు వైట్ మనీ ఐతే ... మార్కెట్లో దాని విలువ రూ.70 వేల కోట్లు .!
  • మరి కొండాపూర్ , మాదాపూర్ , అమరావతి , సింగపూర్ , దుబాయ్‌లో ఉన్న ఆస్తుల విలువెంత.?
  • మదీనాగూడలో 14 ఎకరాల ఫాంహౌజ్‌ విలువెంత?
  • జూబ్లీహిల్స్‌లో కట్టిన ఇంద్రభవనం విలువెంత?
  • లోకేష్‌.. ప్లీజ్‌ తొందరగా ప్రెస్‌ మీట్‌ పెట్టి కొన్నయినా నిజాలు చెప్పవా.?

2:52 PM, డిసెంబర్‌ 14, 2023
చంద్రబాబు అంటే నమ్మక ద్రోహం

  • చంద్రబాబుపై ఎమ్మెల్సీ పోతుల సునీత ఫైర్‌ 
  • కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు 
  • అధికారంలో ఉన్నప్పుడు ఏపీని నాశనం చేశాడు 
  • ఎస్సీ బీసీ ఎస్టీలను మోసం చేసి దగాచేశాడు
  • ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నాడు 
  • పోలవరంను నాశనం చేసింది చంద్రబాబే 
  • అధికారం కోసం జగనన్న సంక్షేమ పాలనపై యెల్లో మీడియాతో విషపు రాతలు
  • సీఎం జగన్‌ చేతల మనిషి.. ఆయనపై బాబు కుట్రలు పని చేయవు 
  • ఏపీ ప్రజలు చంద్రబాబును గమనిస్తున్నారు
  • చంద్రబాబు పాలనలో సామజిక న్యాయం అందని ద్రాక్ష
  • జగన్ పాలనలో సామాజిక న్యాయం విప్లవాత్మకంగా అమలైంది 
  • యువగళంకు ప్రజాబలం లేదు...లోకేష్ కి మెదడు లేదు
  • లోకేష్‌. మాతో చర్చలకు సిద్దామా? మీ ఆఫీస్కే వస్తాం


2:00 PM, డిసెంబర్‌ 14, 2023
బావను డీకోడ్‌ చేసే పనిలో బాలయ్య

  • బావ చంద్రబాబు ఎప్పటికి అర్థమవుతాడు?
  • మా నాన్నకెందుకు వెన్నుపోటు పొడిచాడు?
  • నాకు రావాల్సిన పదవిని, పార్టీని తానెందుకు లాగేసుకున్నాడు?
  • ఏపీలో నన్నెందుకు ఎమ్మెల్యే పదవికే పరిమితం చేశాడు?
  • కనీసం జైలుకెళ్లినప్పుడయినా.. నాకు అధ్యక్ష పదవి ఇవ్వలేదెందుకు?
  • నాకు పదవి ఏదంటే.. అల్లుడి సంగతి చూడమని ఎందుకంటాడు?
  • అసలు పోటీ చేయని తెలంగాణకు వెళ్లి ప్రెస్‌మీట్‌ ఎందుకు పెట్టించాడు?
  • తీరా తొడలు కొట్టి ప్రకటన చేశాక.. పోటీ లేదని ఎందుకు చెప్పాడు?
  • ఇంతకీ మా బావ మనసులో ఏముంది?
  • ఎప్పటికి నేను డీకోడ్‌ చేయగలను?
  • అదొక అన్‌-స్టాపబుల్‌ అసైన్‌మెంట్‌..!

1:30 PM, డిసెంబర్‌ 14, 2023
చంద్రబాబు పిటిషన్‌.. అత్యంత తొందరపాటు చర్య.. 17ఏ కాపాడలేదు : న్యాయనిపుణులు

  • రేపో, మాపో 17aపై తుది తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు
  • తప్పు చేయలేదని ఇప్పటివరకు ఏ కోర్టుముందు కూడా చెప్పని చంద్రబాబు
  • అరెస్ట్‌కు ముందస్తు అనుమతి లేదని మాత్రం సాంకేతికంగా డొంక తిరుగుడు వాదనలు వినిపిస్తోన్న చంద్రబాబు లాయర్లు
  • చంద్రబాబు పిటిషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో బలమైన వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌రోహత్గి(అక్టోబర్‌, నవంబర్‌లలో జరిగిన విచారణ సందర్భంగా)
  • స్కిల్‌ స్కామ్‌ కేసులో సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ వేయడం తొందరపాటు చర్యే
  • 17ఏ సెక్షన్‌ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది
  • 17ఏ సెక్షన్‌ చంద్రబాబుకి వర్తించదు
  • ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి
  • పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు
  • స్కిల్‌ స్కామ్‌ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్‌ లేదు
  • 17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది
  • అవినీతి పరులకు ఈ సెక్షన్‌ రక్షణ కవచం కాకూడదు
  • అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్‌ తెచ్చారు
  • నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు
  • ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం
  • అరెస్ట్‌ చేసిన ఐదు రోజులకే క్వాష్‌ పిటిషన్‌ వేయడం అత్యంత తొందరపాటు చర్య
  • విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు
  • సెక్షన్‌​ 482 ప్రకారం క్వాష్‌ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం
  • కేసు ట్రయల్‌ దశలో ఉన్నప్పుడు సెక్షన్‌ 482 ద్వారా క్వాష్‌ కోరడం సరికాదు
  • గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్‌ కొట్టేసినా సెక్షన్‌ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్‌ ట్రయల్‌ కోర్టు విచారణ కొనసాగించవచ్చు
  • ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే
  • పీసీ యాక్ట్‌ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్‌లపై విచారించొచ్చు
  • పీసీ యాక్ట్‌ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్‌ కోర్టుకు ఉంది
  • సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు
  • ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది
  • ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది

  • జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్‌ జడ్జికి కూడా ఉంటాయి
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు.. చాలా తీవ్రమైన ఆర్థిక నేరం
  • ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్‌లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది
  • ఎఫ్‌ఐఆర్‌లో కాగ్నిజబుల్‌ అఫెన్సెస్‌కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం
  • ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి
  • ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని క్వాష్‌ పిటిషన్‌ వేశారు 
  • స్కిల్‌ స్కామ్‌ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది
  • పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు
  • ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్స్‌ సంస్థలు విచారణ చేస్తున్నాయి
  • ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది?
  • ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్‌కు గురవుతారు
  • రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు
  • అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు
  • మొత్తంగా ఈ కేసు 482సెక్షన్‌ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు
  • ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు
  • ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు
  • నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది
  • సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి
  • 17ఏ అనేది ఈ కేసులో  వర్తించదు
  •  17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది
  • 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది
  • 2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు
  • 2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది?
  • స్కిల్‌ స్కామ్‌ కేసులో మరింత దర్యాప్తు అవసరం
  • ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది
  • ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది 
  • గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ ఇది
  • శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్‌ 44 PMLA పెట్టారు
  • ఏసీబీ కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది.
  • ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది. 
  • ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు. 
  • అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది. 
  • జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి
  • నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి
  • అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు
  • ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు? 
  • ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.  17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది
  • రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్‌ను బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు
  • కాని మరో జడ్జ్‌ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు
  • రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్‌ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి
  • కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు

12:44 PM, Dec 14, 2023
తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలంటే ఒక్కసారి రికార్డులు చూడాల్సిందే
►పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌ ఏం ప్రచారం చేస్తున్నారంటే..
► 2019లో తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేశాయి
► ఆ పరిస్థితి YSRCPకి ప్రయోజనం చేకూర్చింది
► మేంగానీ.. కలిసి పోటీ చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది

కొన్ని పరిశీలనలు (కింద ఇచ్చిన ఎన్నికల సంఘం రికార్డుల ఆధారంగా).. మీరే వాస్తవాలు తెలుసుకోండి

► YSRCPకి సొంతంగా వచ్చిన ఓట్లు  1,56,88,569 అంటే 49.95%
► ఒక వేళ TDP, జనసేన కలిసి పోటీ చేసినా వారికి వచ్చే ఓట్ల శాతం 44.7% మాత్రమే, అంటే 1,40,41,479 ఓట్లు మాత్రమే
► సీట్ల పరంగా చూస్తే YSRCPకి వచ్చింది 151 అయితే TDPకి వచ్చింది 23, జనసేనకు వచ్చింది 1
► ఇంతటి ముందు చూపు ఉంది కాబట్టే 2014లో అసలు పవన్‌ కళ్యాణ్‌ పోటీకే దిగలేదు. నేను గాని బరిలో దిగి ఉంటే.. అని చెప్పుకోడానికి.!

ఒకసారి ఎన్నికల కమిషన్‌ వెబ్‌ సైట్‌ చూసి పార్టీలు, ఓట్లు, ఓట్ల శాతం చూడండయ్యా బాబు

సమన్వయం కుదుర్చుకున్నది ఇంత గొప్ప నాయకులా?
► తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం నడిపిన లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌
ఇద్దరి పొలిటికల్‌ కెరియర్‌లో ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయిన లోకేష్‌, పవన్‌

మంగళగిరిలో మంత్రిగా ఉంటూ బరిలో దిగిన నారా లోకేష్‌కు షాక్‌ ఇచ్చిన ఓటర్లు, 5270 ఓట్ల తేడాతో ఓటమి

గాజువాకలో పవన్‌ కళ్యాణ్‌ను పట్టించుకోని ప్రజలు, 16486 ఓట్ల తేడాతో ఓటమి

భీమవరంలో పవన్‌ కళ్యాణ్‌కు తప్పని పరాజయం, 7792 ఓట్ల తేడాతో ఓటమి

12:15 PM, Dec 14, 2023
చంద్రబాబు కేసుల స్టేటస్‌ ఏంటీ?

  • కేసు : స్కిల్ కుంభకోణం
  • స్టేటస్‌ : నవంబర్‌ 20న బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు
  • వివరణ :  ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్‌ను సాధారణ బెయిల్‌గా మార్చిన హైకోర్టు
  • కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు
  • కేసు : స్కిల్ స్కాం
  • అంశం : క్వాష్‌ పిటిషన్‌
  • స్టేటస్‌ : సుప్రీంకోర్టులో పెండింగ్‌
  • వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం
  • కేసు : ఇసుక కుంభకోణం
  • అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
  • స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
  • కేసు : ఫైబర్‌ నెట్‌ పేరిట నిధుల దోపిడి
  • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
  • స్టేటస్‌ : సుప్రీంకోర్టులో పెండింగ్‌
  • వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా
  • కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు
  • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
  • స్టేటస్‌ : మంజూరు చేసిన హైకోర్టు
  • వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు
  • కేసు : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అక్రమాల కేసు
  • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
  • స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
  •  కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు
  • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
  • స్టేటస్‌ : హైకోర్టులో జరిగిన విచారణ
  • వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్

11:15 AM, Dec 14, 2023
ఓటర్లతో క్షుద్ర రాజకీయానికి తెర లేపుతారా?

  • భారీ సంఖ్యలో టీడీపీ బోగస్‌ ఓట్లు చేర్పించినట్టు బయటపడుతోన్న ఆధారాలు
  • కుప్పం సహా 175 నియోజకవర్గాల్లో 41 లక్షల  బోగస్‌ ఓట్లు
  • కుప్పలు తెప్పలుగా ఫారం 7 దరఖాస్తులు..
  • విచారణ జరిపి ఆ దరఖాస్తులన్నీ నకిలీవని తేలుస్తున్న BLO లు (బూత్ లెవెల్ ఆఫీసర్స్)
  • 2014 ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు
  • వాటిని అడ్డం పెట్టుకుని నాడు 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి టీడీపీ
  • 2014-19 మధ్య సేవామిత్ర యాప్‌తో YSRCP అనుకూలర ఓట్లను టార్గెట్‌ చేసిన టిడిపి
  • ఏకంగా 50,23,565 ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు ఇచ్చిన బాబు మనుష్యులు
  • వైసీపీ ఫిర్యాదును పరిశీలించి 31,97,473 ఓట్లను తిరిగి చేర్పించిన ఎన్నికల కమిషన్
  • హైదరాబాద్‌లో నివసిస్తూ తెలంగాణలో ఓటర్లుగా నమోదైన 4.50 లక్షల మందికి ఏపీలోనూ ఓటు
  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇప్పటికీ పలు చోట్ల ఓటు కేంద్రాలు పెట్టిన తెలుగుదేశం
  • తెలంగాణలో ఓటేసిన వారికి గాలం వేస్తున్న టిడిపి నేతలు
  • మేమే తీసుకెళ్తాం, ఏపీకి ఓటు మార్పించుకోవాలని వినతులు

10:12 AM, Dec 14, 2023
ఫైబర్‌ గ్రిడ్‌ కేసు @ సుప్రీంకోర్టు

  • ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా
  • చంద్రబాబు 17A - క్వాష్ పిటిషన్ పై తీర్పు అనంతరమే ఈ కేసు విచారిస్తామన్న సుప్రీంకోర్టు
  • విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
  • చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా
  • కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలను ఇరుపక్షాలు చేయవద్దని సూచన
  • చంద్రబాబు అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని CID లాయర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
  • CID వేర్వేరు ప్రాంతాల్లో ప్రెస్‌మీట్ నిర్వహించిందన్న బాబు లాయర్‌ సిద్ధార్థ లూథ్రా
  • ఇరుపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గురించి పబ్లిక్‌గా వ్యాఖ్యలు చేయొద్దన్న సుప్రీంకోర్టు
  • ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం తో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

8:19 AM, Dec 14, 2023
ఐఆర్‌ఆర్‌ కేసులో నేడు ఏపీ హైకోర్టు విచారణ

  • చంద్రబాబు ముందస్తుబెయిల్ పై విచారించనున్న హైకోర్టు
  • రుషికొండలో నిర్మాణాలపై నేడు ఏపీ హైకోర్టు విచారణ
  • జనసేన నేత మూర్తి పిటిషన్ పై విచారించనున్న హైకోర్టు

7:33 AM, Dec 14, 2023
మాకొద్దీ జనసేన, పవన్‌ కళ్యాణ్‌.. మీకో దండం

  • జనసేనలో తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కిన ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన తండ్రి, కూతురు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు, నరసాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఆకుల వెంకట స్వామి

  • పవన్ కళ్యాణ్ ప్రవర్తన నచ్చకే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నా
  • నా కూతురు  కళ్యాణి సాఫ్ట్ వేర్ జాబ్  వదులుకుని ఆరేళ్లు జనసేన పార్టీ కోసం కష్టపడింది
  • పవన్‌ కళ్యాణ్‌ అప్పజెప్పిన అన్ని విధుల్లో చక్కగా పనిచేసింది
  • కార్యాలయంలోని అంతర్గత కుమ్ములాటల్లో నా కూతురును తొలగించారు  
  • పార్టీకి సేవ చేస్తే ఆఫీస్ నుంచి  వెళ్ళగొట్టారు
  • పవన్ కళ్యాణ్ మాటలకు, సిద్ధాంతాలకు ఆకర్షితుడినై పార్టీలో జాయిన్ అయ్యాను
  • పార్టీ గుర్తించి పదవులు కేటాయించింది
  • పవన్ కళ్యాణ్ మొదట్లో చెప్పిన మాటలకు ఇప్పుడు మాటలకు పొంతన లేకుండా పోయింది..
  • ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదు
  • పవన్ కళ్యాణ్ ఒకే కుటుంబానికి కొమ్ముకాస్తున్నాడు
  • టిడిపిపై గతంలో అవినీతి  చేశారని విమర్శలు చేశాడు
  • ఇప్పుడు అదే పార్టీకి మద్దతు తెలుపుతున్నాడు
  • పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను
  • పవన్ కళ్యాణ్ నిర్ణయం నచ్చక నేను రాజీనామా చేస్తున్నాను
  • పొత్తు పెట్టుకున్న తర్వాత కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు
  • జనసేన పార్టీలో ఉండి టిడిపిని విమర్శిస్తే వైసిపి  కోవర్ట్  అని పవన్ అంటున్నాడు
  • జనసైనికులు ఎవరికీ కోవర్టులు కాదు... చంద్రబాబుకి పవన్ కళ్యాణే పెద్ద కోవర్ట్
  • ఇప్పటివరకు జనసేన పార్టీ జెండాలు మోశాం
  • టిడిపి జెండాలు మోయమంటే మావల్ల కాదు
  • కాపు యువతను పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు
  • టిడిపికి ఓట్లు వేసే పరిస్థితిలో కాపులు లేరు
  • టిడిపితో పొత్తు పెట్టుకున్నందుకు ఒక సీటు గెలిచినా గొప్పే

జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆకుల జయకళ్యాణి 

  • పవన్ కళ్యాణ్ పై అభిమానంతో నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ జనసేన పార్టీలో చేరాను
  • పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేశాను
  • ఒక సమయంలో పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకున్నాను
  • పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చేలా మాట్లాడి పార్టీలో పని చేయించుకున్నారు
  • నాకు కేటాయిస్తానని చెప్పిన పదవులు మాత్రం వేరే వారికి కట్టబెట్టారు
  • పార్టీ ట్రెజరర్ రత్నం కాల్ చేసి మీ సేవలు చాలు అన్నారు
  • నాతోపాటు 43 మంది ఉద్యోగులను కారణం చెప్పకుండానే బయటికి పంపించేశారు
     

7:28 AM, Dec 14, 2023
మేనిఫెస్టో పేరుతో టీడీపీ-జనసేన కొత్త నాటకాలు..
టీడీపీ-జనసేన వేరు వేరు కాదు.
రెండూ ఒక్కటే..
టీడీపీ తోక పార్టీ జనసేన.

టీడీపీకి కాపులు నేరుగా ఓట్లు వేయరు కాబట్టి..
కాపుల ఓట్ల కోసం చంద్రబాబు సృష్టించిన..
మాయాజాల పార్టీనే జనసేన.

2014-19లో చంద్రబాబు 650 హామీలిచ్చి..
నెరవేర్చకుండా మేనిఫెస్టోను..
దాచిపెడితే పవన్ కల్యాణ్‌ ఇప్పటి వరకూ..
ఎందుకు ప్రశ్నించలేదు..?

తెలుగు దేశం హామీలు నెరవేర్చకపోతే..
తనది బాధ్యత అన్నాడు..
చంద్రబాబు ప్రశ్నించకపోవడమే..
పవన్ కల్యాణ్ తన బాధ్యత అనుకుంటున్నాడా..?

2014లో ఇచ్చిన 650 హామీలు నెరవేర్చకపోగా..
ఇప్పుడు కొత్త మేనిఫెస్టోపై కసరత్తు అట..!!!

చెప్పేవాడు చంద్రబాబు అయితే..
వినేవాడు ఏదో అన్న సామెత గుర్తుకు వస్తుంది..!!!

అసలు..
టీడీపీ-జనసేనలకు మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హతే లేదు.

పార్టీ పెట్టి పదేళ్లు దాటినా..
పట్టుమని 10 మంది మంది ఎమ్మెల్యేలను..
గెలిపించుకోలేని పవన్‌ కల్యాణ్..
పోటీ చేసిన రెండు చోట్ల..
ఓడిపోయిన పవన్ కల్యాణ్‌కు..
మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హత ఉంటుందా..?

మొన్న ఐదు అంశాలపై చర్చ..
నేడు 10 అంశాలపై చర్చ అంటూ..
లీకులు ఎల్లో కుట్రలో భాగమే..
ప్రజలను మోసం చేయడంలో భాగమే.

అసలు..
చంద్రబాబునే ప్రజలు నమ్మడం లేదు.
పవన్‌ రాజకీయాలకు వేస్ట్ అని..
ప్రజలు అనుకుంటున్నారు.
వీరిద్దరూ కలిసి మేనిఫెస్టో తయారు చేస్తారట..!!

మేం అధికారంలోకి వస్తే..
ప్రజలకు లక్షలకు లక్షలు డబ్బులు ఇస్తామని..
స్లిప్‌లు పంచుతున్నారు.

ఏ ప్రాతిపదిన స్లిప్‌లు పంచుతున్నారు..
ఏ హామీ ప్రకారం స్లిప్‌లు ఇస్తున్నారు..
ప్రజల నుంచి ఓటీపీలు ఎందుకు అడుగుతున్నారు..?

టీడీపీ - జనసేన కూటమి..
2024లో ఘోరంగా ఓడిపోతుందని ..
ప్రజలు చెబుతున్న మాట.

ఓడేపోయేదానికి..
ఫేక్ మేనిఫెస్టో అవసరమా..?
చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌లు సమాధానం చెప్పాలి.

మేనిఫెస్టోపై ఇప్పటికే..
హరిరామ జోగయ్య విమర్శలు గుప్పించారు.
ప్రజల ఆశయాలకు మేనిఫెస్టో దూరంగా ఉందంటూ..
హరిరామ జోగయ్య తన అభిప్రాయం కుండబద్దలు కొట్టారు.

సంక్షేమ పథకాలతో..
రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన..
బాబు బ్యాచ్ ఇప్పుడు..
మేం అధికారంలోకి వస్తే..
సంక్షేమ పథకాలు ఇస్తామని చెబుతున్నారు.
దీనిని ప్రజలు ఎలా నమ్ముతారు..?

నేతి బీరకాయలో నేయి ఉండదు..
చంద్రబాబు హామీల్లో నిజం ఉండదని..
గ్రామీణ ప్రజలు చెప్పుకునే మాట.

ఒకపక్క వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం..
టార్గెట్ 175 దిశగా జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంటే..
ఎల్లో బ్యాచ్‌ మాత్రం..
బిత్తర ముఖాలు వేసుకుని దిక్కులు చూస్తున్నారు.

6:53 AM, Dec 14, 2023
బాబు పాలసీ.. ఆక్‌ పాక్‌ కరివేపాక్‌.! : YSRCP

  • పెత్తందార్లకే పెత్తనం, వైకాపా సమన్వయకర్తల మార్పుల్లో దళితులు, బీసీలే సమిధలు
  • చంద్రబాబు నేతృత్వంలో ఈనాడు చిమ్మిన విషం
  • వాస్తవాలు చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.!
  • వైసీపీ నుంచి 23 మంది MLA  లను కొని , 2017 లోఅందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు బాబు
  • వీరిలో ఆదినారాయణరెడ్డి ,అమరనాధ్ రెడ్డి ,భూమా అఖిల ప్రియా రెడ్డి సుజయ్ కృష్ణరావులకు మంత్రి పదవులు ఇచ్చాడు
  • కానీ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఇచ్చాడా బాబు.?
  • గడప గడపకు మే 11 2022 న ప్రోగ్రాం మొదలయినప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో మార్పులుంటాయి అని పార్టీ అధిష్టానం స్పష్టంగా చేసింది
  • దళితుల స్థానాల్లో మార్పు చేసి  వారికే   వేరే చోట్ల  టికెట్లు ఇచ్చింది
  • బీసీ అయినా విడదల రజనీకి  గుంటూరు వెస్ట్ కేటాయించారు
  • కానీ ఆళ్ల  రామకృష్ణారెడ్డి , తిప్పల నాగిరెడ్డి ల స్థానాల్లో బీసీలకు  గంజి చిరంజీవి (చేనేత) , వరికూరి రామచంద్రరావు (యాదవ) కు ఇచ్చారు. అయినా ఏడుపేనా?
  • ఇక SC  నియోజక వర్గాల్లో రెడ్లదే  పెత్తనం అంటూ మరో విషం
  • టీడీపీ హయాంలో SC, BC  నియోజక వర్గాల్లో కమ్మ పెత్తనం ఉండేది కాబట్టి ఇప్పుడు అలాగే ఉండాలి అని కాకమ్మ కథలు చెబుతున్నారా?
  • దళితుల్లో పుట్టాలని ఎవరు  కోరుకుంటారు అని చెప్పింది చంద్రబాబు కాదా?
  • రాజకీయాలు అంటే మేమే చేయాలి, దళితులూ మీకెందుకు రాజకీయాలు అంటూ దుర్భషలాడింది మీ MLA చింతమనేని చౌదరి కాదా?
  • బాబు 5  ఏళ్ల పాలనలో ఎస్సీల  కోసం చేసిన  ఖర్చు  - రూ.35,250.46 కోట్లు
  • ఎస్సీల కోసం సీఎం జగన్‌ ప్రభుత్వం 4 ఏళ్లలో  చేసిన ఖర్చు -రూ.63,689 కోట్లు అంటే రెట్టింపు
  • దళితులకు ఇచ్చిన మంత్రి పదవులు :
  • బాబు హయాములో -2, సీఎం జగన్ పాలనలో -5
  • బాబు 4 కార్పొరేషన్ పదవులు, సీఎం జగన్ 15  కార్పొరేషన్ పదవులు ఇచ్చారు
  • శాసన మండలి చైర్మన్‌గా మోషెన్‌ రాజును చేశారు
  • రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే  మా కుల పెత్తనం దెబ్బ తింటుంది అని అడ్డుకున్నది చంద్రబాబు కాదా?

6:51 AM, Dec 14, 2023
ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసు నేటికి వాయిదా

  • అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కుంభకోణం కేసు
  • ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్
  • బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
  • తదుపరి విచారణ నేటికి వాయిదా

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు పూర్వపరాలేంటంటే.?

  • CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు
  • టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు
  • కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే
  • లింగమనేని కుటుంబంతో క్విడ్‌ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్‌ క్యాపిటల్‌లో భూములు
  • స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మూడుసార్లు మార్పు
  • అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్‌ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో
  • 2015 జూలై 22, 2017 ఏప్రిల్‌ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు
  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు
  • అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం
  • ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్‌మెంట్‌
  • కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని
  • కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం
  • లింగమనేని రమేశ్‌ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం
  • సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో ఉంటోన్న చంద్రబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement