ప్రతీకాత్మక చిత్రం
బన్సీలాల్‌పేట్: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అదే విధంగా 10 వేల రూపాయల జరిమానా విధించింది. బుధవారం పోక్సో కేసు ప్రత్యేక జడ్జి జి.ప్రేమలత ఈ మేరకు తీర్పునిచ్చారు. గాంధీనగర్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌రావు కథనం ప్రకారం..2017 సంవత్సరంలో కవాడిగూడ సింగాడికుంటకు చెందిన ఆకుల రాము(29) గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడగా...బాలిక గర్భం దాల్చింది.
దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి ఇన్‌స్పెక్టర్ ఎ. సంజీవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సుమారు ఐదేళ్లుగా కోర్టులో కేసు నడుస్తూ వస్తున్నది. బుధవారం ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడింది. నాటి ఇన్‌స్పెక్టర్, నేటి డీఎస్పీ ఎ.సంజీవరావు బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ ఎంతో కష్టపడి ప్రాసిక్యూషన్ ముందు సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేశామన్నారు. బాలికకు జన్మించిన పసికందు మృతిచెందాడని, పసివాడి డీఎన్‌ఏ సేకరించి నిందితుడి డీఎన్‌ఏతో పోల్చి..పక్కా ఆధారాలు సేకరించి ప్రాసిక్యూషన్ ముందు నిరూపించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment