
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ డివిజన్ జివై రెడ్డి బస్తీలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన పిల్లలిద్దరినీ భవనంపై నుంచి పడేసి అనంతరం తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా మహిళ భర్త అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో తట్టుకోలేక ఆమె ఎనిమిదో అంతస్తు నుంచి తన ఇద్దరు పిల్లలను కిందికి పడవేసి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మునీరు అవుతున్నారు. పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రి తరలించారు.