లక్నో: జ్ఞాన్‌వాపీ కేసులో హిందువుల పిటిషన్‌ను తిరస్కరించింది వారణాసి జిల్లా కోర్టు. మసీదు ప్రాంగణంలో లభించిన శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించేందుకు అనుమతి నిరాకరించింది. అలా చేస్తే శివలింగం దెబ్బతింటుందని ఈమేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది.
శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించి అది ఏ కాలం నాటిదో తేల్చాలని హిందువులు పిటిషన్ దాఖలు చేయగా.. ముస్లింలు దీన్ని వ్యతిరేకిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలను విన్న న్యాయస్థానం హిందువుల పిటిషన్‌ను తిరస్కరించింది.
జ్ఞాన్‌వాపీ మసీదు ఆవరణలో శ్రీనగర్ గౌరి మాతను పూజించేందుకు అనుమతించాలని ఐదుగురు హిందూ మహిళలు 2021 ఆగస్టులో కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణలో భాగంగా మసీదు ప్రాంగణంలో వీడియో సర్వే నిర్వహించగా.. శివలింగం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో దానికి కార్బన్ డేటింగ్ నిర్వహించాలని హిందువులు పిటషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది.
చదవండి: ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట
Comments
Please login to add a commentAdd a comment