సాక్షి, హైదరాబాద్: గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నాంపల్లి సీఐడీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. 2011, జనవరి 3న సూరి, అతడి ప్రధాన అనుచరుడు భానుకిరణ్, డ్రైవర్ మధు జూబ్లీహిల్స్ నుంచి సనత్‌నగర్ వెళ్తుండగా నవోదయ కాలనీ సమీపంలో సూరిపై పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపి హతమార్చారు. కేసులో ప్రధాన నిందితుడిగా భానుకిరణ్ అరెస్ట్ అయి చర్లపల్లి జైల్లో విచారణ ఖైదీగా ఉం టున్నాడు. కేసు దర్యాప్తు చేసిన సీఐడీ ఫోరెన్సిక్ ఆ«ధారాలతోపాటు డ్రైవర్ మధు వాంగ్మూలం ఆధారంగా వాదిస్తోంది. భానుకిరణే సూరిని హత్యచేశాడని, పరిటాల రవి కుటుంబం హస్తం ఉందని సూరి సతీమణి గంగుల భానుమతి ఆరోపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment