లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్‌లో 2020లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి యూపీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నలుగురు నిందితుల్లో ముగ్గురు.. రవి, రాము, లవ్‌కుష్‌ను నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రధాన నిందితుడు సందీప్ ఠాకూర్‌ను దోషిగా తేల్చినప్పటికీ అతనిపై అత్యాచారం, హత్య అభియోగాలు లేకుండా బాధితురాలిని తీవ్రంగా గాయపరిచినట్లు మాత్రమే న్యాయస్థానం పేర్కొంది.
హత్రాస్ సామూహిక అత్యాచార ఘటన 2020లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పొలంలో తల్లి, సోదురుడితో ఉన్న దళిత యువతిని అదేగ్రామంలో ఉన్నతకులానికి చెందిన వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వాంగ్మూలంలో పేర్కొంది.
ఆ ఘటనలో యువతిని తీవ్రంగా హింసించారు నిందితులు. దీంతో ఆమెకు చాలా చోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయి. అనంతరం కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి యువతి మరణించింది. అయితే పోలీసులు కుటుంబసభ్యులను ఇంట్లోనే బంధించి రాత్రికిరాత్రే ఆమె అంత్యక్రియలు నిర్వహించడంతో సీఎం యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసులో పోలీసులు కూడా నిందితులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. బాధితురాలు వాంగ్మూలం ఇచ్చేవరకు వారు నిందితులపై అత్యాచార అభియోగాలు మోపలేదు.
చదవండి: హోం మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకోని వ్యక్తి మృతి ..కానీ కాన్వాయ్..
Comments
Please login to add a commentAdd a comment