ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు మలిశెట్టి భానుకిరణ్ అలియాస్ భానును న్యాయస్థానం దోషిగా తేల్చింది. భానుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. భాను ప్రైవేటు గన్‌మన్ మన్మోహన్‌సింగ్ బదౌరియాను సైతం దోషిగా తేల్చిన కోర్టు... అతనికి ఐదేళ్ల జైలు విధించింది.