ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఇలాన్‌మస్క్ వేతన ప్యాకేజీకి సంబంధించి డెలవేర్ కోర్టు మరోసారి స్పందించింది. మస్క్‌కు అత్యధికంగా 55.8 బిలియన్ అమెరికన్ డాలర్ల(సుమారు రూ.4.6 లక్షల కోట్లు) వేతన ప్యాకేజీ ఇస్తే వాటాదారులకు అన్యాయం చేసినట్లేనని కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా సమర్థించుకుంది.
ఆ ప్యాకేజీకి మస్క్ అనర్హుడు
ఇలాన్‌మస్క్ షేర్లు, నగదు, ఇతర అలవెన్స్‌ల రూపంలో 2018లో 55.8 బిలియన్ డాలర్లు వేతనాన్ని తీసుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక వేతన ప్యాకేజీ. ఈ ప్యాకేజీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రిచర్డ్ టోర్నెట్టా అనే కంపెనీ వాటాదారు డెలవేర్ కోర్టును ఆశ్రయించారు. ఇంత మొత్తంలో వేతనం ఇవ్వడం కార్పొరేట్ ఆస్తులను దుర్వినియోగం చేయడమేనని తన ఫిర్యాదులో తెలిపారు. కంపెనీ డైరెక్టర్లపై ఒత్తిడి తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా తాను ఈ ప్యాకేజీ పొందారని చెప్పారు. ఈ వ్యవహారంపై కోర్టు గతంలో స్పందించి అంత ప్యాకేజీకి మస్క్ అనర్హుడని పేర్కొంది.
పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు
డెలవేర్ కోర్టు గతంలో తానిచ్చిన తీర్పును తాజాగా సమర్థించుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో తిరిగి మస్క్ ప్యాకేజీపై నిర్ణయం తీసుకున్నారు. షేర్ హోల్డర్లకు ఓటింగ్ ఏర్పాటు చేసి గతంలో మాదిరి 55.8 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీకి ఆమోదం పొందారు. ఇది గత తీర్పునకు వ్యతిరేకంగా ఉండడంతో తాజాగా కోర్టు స్పందించింది. అయితే, ముందుగా వెలువడిన తీర్పునకు బదులుగా మస్క్ పిటిషన్ దాఖలు చేశారు. వాటాదారుల ఓటింగ్‌ను పరిగణించి తనకు వేతన ప్యాకేజీను ఆమోదించాలనేలా తీర్పును సవరించాలని కోరారు. కానీ కోర్టు తన పిటిషన్‌ను తోసిపుచ్చింది.
ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..
మస్క్ ఏమన్నారంటే..
డెలవేర్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై మస్క్ స్పందించారు. ‘కంపెనీ నిర్ణయాలు, ఓటింగ్‌పై నియంత్రణ సంస్థ అధికారులు, వాటాదారులకే ఉండాలి. ఈ వ్యవహారం న్యాయమూర్తులకు అవసరం లేదు’ అన్నారు. టెస్లా సంస్థ దీనిపై స్పందింస్తూ కోర్టు తీర్పును పైకోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment