musk
-
భారత పారిశ్రామికవేత్తలకు మస్క్ ఆతిథ్యం
టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) అధినేత ఎలాన్‌మస్క్(Elon Musk) భారత్, అమెరికా సంబంధాలు సానుకూలంగా ఉన్నాయనే సంకేతాలిచ్చారు. ఇటీవల టెక్సాస్‌లోని స్పేస్ఎక్స్(SpaceX) స్టార్‌బేస్ ఫెసిలిటీలో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి తన మద్దతును వ్యక్తం చేశారు.ఆతిథ్యం(hosting)లో పాల్గొన్న ఇండియా గ్లోబల్ ఫోరం (ఐజీఎఫ్) నేతృత్వంలోని ప్రతినిధుల బృందంలో ప్రశాంత్ రుయా (డైరెక్టర్ - ఎస్సార్ క్యాపిటల్), జయ్ కోటక్ (కోహెడ్ - కోటక్ 811), రితేష్ అగర్వాల్ (ఫౌండర్ & గ్రూప్ సీఈఓ-ఓయో), కళ్యాణ్ రామన్ (సీఈఓ - ఫ్లిప్‌కార్ట్), ఆర్యమన్ బిర్లా (డైరెక్టర్ - ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్), నీలేష్ వేద్ (ఛైర్మన్ - అప్పారెల్ గ్రూప్), ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి ఉన్నారు.ఈ ఆతిథ్యంలో భాగంగా భారత పారిశ్రామికవేత్తలు స్పేస్ ఎక్స్ అత్యాధునిక సౌకర్యాలను సందర్శించారు. స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ఫ్లైట్ 7 ప్రయోగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, అంతరిక్ష అన్వేషణ రంగాల్లో అమెరికా, భారత్ మధ్య సహకారానికి ఉన్న అవకాశాలను మస్క్ నొక్కి చెప్పారు. ‘పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. అమెరికా, భారత్ మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి, అడ్డంకులను తగ్గించడానికి నేను అన్ని విధాలా అనుకూలం’ అని మస్క్ అన్నారు.ఇదీ చదవండి: ఏఐ చిప్‌లపై అమెరికా ఆంక్షల ప్రభావంఐజీఎఫ్ వ్యవస్థాపకులు మనోజ్ లాడ్వా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘స్థిరమైన, సాంకేతిక ఆధారిత భవిష్యత్తును రూపొందించడంలో భారత్‌కు, ప్రపంచ మార్గదర్శకుల మధ్య సహకారం పెరుగుతుందనడానికి ఈ కార్యక్రమం నిదర్శనం. డొనాల్డ్ ట్రంప్ త్వరలో అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న తరుణంలో అర్థవంతమైన చర్చలు మరింత ప్రాధాన్యతను ఇస్తాయి’ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డీజీజీ) కో-ఛైర్మన్‌గా మస్క్‌ను ప్రతిపాదించారు. -
మస్క్‌కు ప్రభుత్వం ఆహ్వానం
టెస్లా(Tesla) సీఈఓ ఎలాన్ మస్క్‌తోపాటు ఇతర ప్రధాన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ సంస్థల ఉన్నతాధికారులకు దేశంలోని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపింది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకం (SPMEPCI)కు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు వారికి ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం ఈమేరకు చర్చసాగనుంది.మార్చి 2024లో కొత్త ఈవీ పాలసీని ప్రతిపాదించారు. ప్రపంచ వాహన తయారీదారులను ఆకర్షించడానికి, దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచడానికి దీన్ని రూపొందించినట్లు ప్రభుత్వం గతంలో తెలిపింది. స్థానిక తయారీ, సరఫరాను తప్పనిసరి చేస్తూ దేశంలో ఉత్పత్తి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ఈ పథకం ప్రోత్సాహకాలను అందిస్తుంది. ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్ (పీఎల్ఐ-ఆటో) కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అనుగుణంగా దేశీయ విలువ జోడింపు (DVA)ను లెక్కిస్తారు.ఈవీ పాలసీ నిబంధనలు ఇవే..భారతదేశంలో కనీసం 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,150 కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్న వాహన తయారీదారులకు దిగుమతి సుంకాలను తగ్గించాలనే నిబంధనలున్నాయి. ఏదైనా కంపెనీ స్థానికంగా కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలో 25% డీవీఏ(DVA), ఐదో సంవత్సరం నాటికి 50% డీవీఏ సాధించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన తయారీదారులకు చెందిన ఉత్పత్తులు 35,000 డాలర్లు(రూ.30 లక్షలు) కంటే ఎక్కువ ధర ఉంటే దిగుమతి పన్ను సుమారు 70%గా విధిస్తారు.విభిన్న వాదనలుప్రతిపాదిత పథకానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ పథకం ద్వారా గణనీయమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నప్పటికీ టెస్లా, విన్‌ఫాస్ట్ వంటి వాహన తయారీదారులు కొన్ని నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 2024లో పాలసీపై ఇరు కంపెనీల నుంచి భిన్న వాదనలు వినిపించాయి. డీవీఏ లెక్కింపు పద్ధతి, అర్హత ప్రమాణాలపై ఆందోళన చెందాయి. నిర్ణీత గడువులోగా డీవీఏ లక్ష్యాలను చేరుకోవడంపై టెస్లా తన సలహాదారు ‘ది ఆసియా గ్రూప్ (TAG) ఇండియా’ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఇప్పటికే విన్‌ఫాస్ట్ పెట్టుబడులు500 మిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో తమిళనాడులో ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంటును నిర్మిస్తున్న వియత్నాంకు చెందిన విన్ ఫాస్ట్, ముందుగా కంపెనీలు చేస్తున్న ఖర్చులకు కూడా ప్రోత్సాహకాలు అందించాలని కోరుతోంది. ఈ రెండు కంపెనీలే కాకుండా ఇతర కంపెనీల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని పాలసీ మార్గదర్శకాలను సవరించడానికి ప్రభుత్వం యోచిస్తుందేమో చూడాల్సి ఉంది. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్ అండ్ డీ), ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఈ పథకంలో చేర్చాలని కొన్ని వర్గాలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: గోవాలో హై డిమాండ్ వేటికంటే..గతంలో మస్క్ పర్యటన రద్దు2024లో మస్క్ ఇండియా పర్యటన కొన్ని కారణాల వల్ల రద్దు అయింది. అప్పటి నుంచి భారత్‌లో కంపెనీ పెట్టుబడి ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారాయి. తాజా పరిణామాల వల్ల ఈమేరకు తిరిగి చర్చసాగే అవకాశం ఉంటుదేమోనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో రాబోయే ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు. దాంతో త్వరలో జరగబోయే ఈ సంప్రదింపులకు ప్రాముఖ్యత సంతరించుకుంది. టెస్లా, హ్యుందాయ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, కియా, టయోటాతో సహా టాటా మోటార్స్, మహీంద్రా, హీరో మోటోకార్ప్ వంటి భారతీయ కంపెనీలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. -
ప్రధానిపై విమర్శలు..మస్క్‌కు బ్రిటన్ కౌంటర్
లండన్:బ్రిటన్(Britain) ప్రధాని కీర్ స్టార్మర్(Keir Starmer)పై అమెరికా బిలియనీర్ ఇలాన్ మస్క్(Elon Musk) విమర్శలకు బ్రిటన్ ప్రభుత్వం గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్(Pakistan) మూలాలున్న వ్యక్తులు అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే గ్యాంగ్‌లను నడిపినా అప్పట్లో క్రౌన్ ప్రాసిక్యూషన్ హెడ్‌గా ఉన్న స్టార్మర్ పట్టించుకోలేదని మస్క్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)వేదికగా మస్క్ చేసిన ట్వీట్లు సంచలనం సృష్టించాయి.అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే గ్యాంగులను చట్టం ముందు దోషులుగా నిలపడంలో స్టార్మర్ అప్పట్లో విఫలమయ్యారని మండిపడ్డారు. ఇందుకే బ్రిటన్‌లో జరిగిన అత్యంత ఘోరమైన నేరాల్లో స్టార్మర్‌కు కూడా భాగస్వామ్యం ఉందని మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఆ గ్యాంగులపై విచారణకు లేబర్ పార్టీ ఒప్పుకోనందున ఆ పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నారు. అయితే ఈ మస్క్ చేసిన ఈ విమర్శలపై యూకే ఆరోగ్య శాఖ మంత్రి వెస్ స్ట్రీటింగ్ తప్పుపట్టారు. మస్క్‌కు ఎవరో తప్పుడు సమాచారమిచ్చారని,ఆయన ఆరోపణలు వాస్తవ దూరంగా ఉన్నాయని వెస్ పేర్కొన్నారు. అయితే బ్రిటన్‌లో అమ్మాయిలపై అకృత్యాలను అరికట్టేందుకు మస్క్‌తో పనిచేసేందుకు తాము సిద్ధమని తెలిపారు.ఇదీ చదవండి: షినవత్రకు అన్ని ఆస్తులా..? -
మస్క్ వేతన ప్యాకేజీపై కోర్టు తీర్పు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఇలాన్‌మస్క్ వేతన ప్యాకేజీకి సంబంధించి డెలవేర్ కోర్టు మరోసారి స్పందించింది. మస్క్‌కు అత్యధికంగా 55.8 బిలియన్ అమెరికన్ డాలర్ల(సుమారు రూ.4.6 లక్షల కోట్లు) వేతన ప్యాకేజీ ఇస్తే వాటాదారులకు అన్యాయం చేసినట్లేనని కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా సమర్థించుకుంది.ఆ ప్యాకేజీకి మస్క్ అనర్హుడుఇలాన్మస్క్ షేర్లు, నగదు, ఇతర అలవెన్స్‌ల రూపంలో 2018లో 55.8 బిలియన్ డాలర్లు వేతనాన్ని తీసుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక వేతన ప్యాకేజీ. ఈ ప్యాకేజీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రిచర్డ్ టోర్నెట్టా అనే కంపెనీ వాటాదారు డెలవేర్ కోర్టును ఆశ్రయించారు. ఇంత మొత్తంలో వేతనం ఇవ్వడం కార్పొరేట్ ఆస్తులను దుర్వినియోగం చేయడమేనని తన ఫిర్యాదులో తెలిపారు. కంపెనీ డైరెక్టర్లపై ఒత్తిడి తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా తాను ఈ ప్యాకేజీ పొందారని చెప్పారు. ఈ వ్యవహారంపై కోర్టు గతంలో స్పందించి అంత ప్యాకేజీకి మస్క్ అనర్హుడని పేర్కొంది.పిటిషన్ తోసిపుచ్చిన కోర్టుడెలవేర్ కోర్టు గతంలో తానిచ్చిన తీర్పును తాజాగా సమర్థించుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో తిరిగి మస్క్ ప్యాకేజీపై నిర్ణయం తీసుకున్నారు. షేర్ హోల్డర్లకు ఓటింగ్ ఏర్పాటు చేసి గతంలో మాదిరి 55.8 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీకి ఆమోదం పొందారు. ఇది గత తీర్పునకు వ్యతిరేకంగా ఉండడంతో తాజాగా కోర్టు స్పందించింది. అయితే, ముందుగా వెలువడిన తీర్పునకు బదులుగా మస్క్ పిటిషన్ దాఖలు చేశారు. వాటాదారుల ఓటింగ్‌ను పరిగణించి తనకు వేతన ప్యాకేజీను ఆమోదించాలనేలా తీర్పును సవరించాలని కోరారు. కానీ కోర్టు తన పిటిషన్‌ను తోసిపుచ్చింది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..మస్క్ ఏమన్నారంటే..డెలవేర్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై మస్క్ స్పందించారు. ‘కంపెనీ నిర్ణయాలు, ఓటింగ్‌పై నియంత్రణ సంస్థ అధికారులు, వాటాదారులకే ఉండాలి. ఈ వ్యవహారం న్యాయమూర్తులకు అవసరం లేదు’ అన్నారు. టెస్లా సంస్థ దీనిపై స్పందింస్తూ కోర్టు తీర్పును పైకోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పింది. -
మస్క్ కొత్తగా గేమింగ్ స్టూడియో!
రాజకీయ ప్రమేయంలేని గేమింగ్ వ్యవస్థ ఉండాలని ఎక్స్ సీఈఓ ఇలాన్‌మస్క్ అన్నారు. మస్క్ ఆధ్వర్యంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ‘ఎక్స్ఏఐ’ సాయంతో త్వరలో ఏఐ ఆధారిత గేమింగ్ స్టూడియోను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. గేమింగ్ పరిశ్రమలో పెద్ద సంస్థల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ఈ రంగాన్ని తిరిగి గొప్పగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ విభాగంలోని ప్రవేశిస్తున్నట్లు స్పష్టం చేశారు.ఆవిష్కరణలు కరవుగేమింగ్ పరిశ్రమలో మైక్రోసాఫ్ట్, సోనీ వంటి దిగ్గజ కంపెనీలతో పోటీ పడాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు మస్క్ తెలిపారు. ఈ పరిశ్రమలో ఆవిష్కరణలు లేక స్తబ్దత నెలకొందన్నారు. ఎక్స్ఏఐ ద్వారా ఈ పరిశ్రమను తిరిగి గొప్పగా తీర్చిదిద్దుతామన్నారు. డొజికాయిన్ గేమింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిల్లీ మార్కస్ ఇటీవల ఈ రంగంపై స్పందిస్తూ ఈ పరిశ్రమలో కార్పొరేట్ ఆధిపత్యం అధికమైందన్నారు. ఆయా సంస్థల వ్యక్తిగత ఆసక్తుల వల్ల ‘మానిప్యులేటివ్’ కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయని చెప్పారు. మార్కస్ వ్యాఖ్యలను మస్క్ అంగీకరిస్తూ ‘చాలా గేమ్ స్టూడియోలు పెద్ద సంస్థల యాజమాన్యంలో ఉన్నాయి. గేమింగ్ పరిశ్రమను మళ్లీ గొప్పగా చేయడానికి ఎక్స్ఏఐ గేమ్ స్టూడియోను ప్రారంభించబోతోంది. రాజకీయ ప్రమేయంలేని గేమింగ్ వ్యవస్థ ఉండాలి’ అని తెలిపారు.ఎక్స్‌బాక్స్‌పై విమర్శలుమైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని గేమింగ్ బ్రాండ్ ‘ఎక్స్‌బాక్స్’లో వివక్షతతో కూడిన పద్ధతులను అనుసరిస్తున్నట్లు ఇటీవల విమర్శలొచ్చాయి. కొన్ని గేమ్‌ల్లో నల్లజాతీయులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, తెల్లవారిని ఆయా గేమ్‌ల్లో తక్కువ చేసి చూపిస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. దాంతో మస్క్ తన ఎక్స్ ఖాతాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ట్యాగ్ చేస్తూ ‘ఇది చట్టవిరుద్ధం’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: అదానీ అప్పులపై బ్యాంకులు సమీక్షఇరువైపులా సంభాషించే ఏఐమార్చి 2023లో మస్క్ ఎక్స్ఏఐను స్థాపించారు. దీన్ని ‘గ్రోక్’ ఏఐ సాయంతో అభివృద్ధి చేశారు. ఇరువైపులా సంభాషించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. కృత్రిమ మేధ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి అమెరికాలోని టేనస్సీలోని మెంఫిస్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కంప్యూటర్ను ఏర్పాటు చేసే ప్రణాళికలను సైతం కంపెనీ గతంలో ప్రకటించింది. -
మంత్రికి క్షమాపణలు చెప్పిన మస్క్.. కారణం ఇదేనా..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌మస్క్‌కు చెందిన దిగ్గజ సంస్థ టెస్లా ప్లాంట్‌ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం సందర్శించారు. కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లోని ఈ కేంద్రంలో విద్యుత్ కార్ల తయారీని మంత్రి పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అయితే మంత్రి వెంట టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కనిపించలేదు. దీనిపై ఎక్స్ వేదికగా మంత్రికి మస్క్ క్షమాపణలు చెప్పారు. మంత్రి తన సందర్శనను ఉద్దేశించి ఎక్స్ ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు. ‘కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లో ఉన్న టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించాను. ఇక్కడ సీనియర్ హోదాలో పనిచేస్తోన్న భారత ఇంజినీర్లు, ఆర్థిక నిపుణులను కలవడం ఆనందంగా ఉంది. టెస్లా ప్రయాణంలో వారు అందిస్తోన్న సహకారం గర్వకారణం. టెస్లా తయారీలో ఇండియా నుంచి దిగుమతులు పెంచడం సంతోషంగా ఉంది. ఈ పర్యటనలో మస్క్‌ను మిస్ అవుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలి’ అని మంత్రి అన్నారు. మంత్రి ట్వీట్‌పై మస్క్ స్పందించారు. ‘మీరు టెస్లాను సందర్శిచడం మాకు గొప్ప గౌరవం. ఈ రోజు కాలిఫోర్నియాకు రాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాను. త్వరలో మీతో జరగబోయే భేటీకి ఎదురుచూస్తున్నాను’ అని టెక్ దిగ్గజం పోస్ట్ చేశారు. టెస్లా విద్యుత్ కార్లు త్వరలోనే భారత్‌లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో జరిగిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎలాన్ మస్క్ సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. ఈవీ వాహనాల తయారీకోసం దేశంలోని కొన్ని నిబంధనలు సడలించనున్నట్లు సమాచారం. తాజా పర్యటనలో గోయల్-మస్క్ భేటీ జరుగుతుందని, భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు, దేశీయంగా పరికరాల కొనుగోలు, ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటు, సుంకాల గురించి ప్రధానంగా చర్చిస్తారని వార్తలు వచ్చాయి. అయితే మస్క్ అనారోగ్యంతో ఈ భేటీ సాధ్యం కాలేదు. Visited @Tesla’s state of the art manufacturing facility at Fremont, California. Extremely delighted to see talented Indian engineers & finance professionals working at Senior positions and contributing to Tesla’s remarkable journey to transform mobility. Also proud to see… pic.twitter.com/FQx1dKiDlf — Piyush Goyal (@PiyushGoyal) November 14, 2023 -
ఎలాన్‌మస్క్ కుమారుడికి ఇండియన్ సైంటిస్ట్ పేరు
ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్ ఏం చేసినా సంచలనమే. వ్యాపార కార్యకలాపాలే కాకుండా వ్యక్తిగత వివరాలు వెల్లడించినా వైరల్‌గా మారడం ఖాయం. భారత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో బ్రిటన్‌లో జరిగిన సమావేశంలో ఎలాన్‌మస్క్ తన కుమారుడికి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మస్క్, శివోన్ జిలిస్ దంపతుల కుమారుడికి భారతీయ పేరు నామకరణం చేసినట్లు చెప్పారు. 1983లో నోబెల్ బహుమతి పొందిన భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎస్.చంద్రశేఖర్ పేరును తన కుమారుడికి నామకరణం చేస్తున్నట్లు మస్క్ దంపతులు తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మంత్రి తన ఎక్స్ ఖాతాలో పంచుకోవడంతో వైరల్ అయింది. ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్ ప్రొఫెసర్ ఎస్.చంద్ర శేఖర్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన నక్షత్రాల పరిణామం, వాటి నిర్మాణంపై ఎన్నో పరిశోధనలు చేశారు. ఆయన ‘చంద్రశేఖర్ లిమిట్’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం.. కొన్ని నక్షత్రాలు కాలక్రమేణా వాటి శక్తిని కోల్పోయి కుచించుకుపోతాయి. అయితే నక్షత్రాలకు ఉంటే వివిధ లక్షణాలను అనుసరించి అవి ఏ రకమైన స్థితిలోకి వెళతాయో కచ్చితంగా చెప్పవచ్చు. చంద్రశేఖర్ చేసిన పరిశోధనలకు గాను 1983లో విలియం ఏ.ఫ్లవర్‌తో కలిపి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. ఆయనకు నివాళిగా తన కుమారుడిని ప్రేమగా శేఖర్ అని పిలుస్తామని మస్క్ భార్య శివొన్ జిలిస్ తెలిపారు. ఆమె కెనడియన్ వెంచర్ క్యాపిటలిస్ట్. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యం కలిగిన వ్యక్తి. A pleasant coincidence…@Rajeev_GoI & @elonmusk pic.twitter.com/011ZCNbasW — Liz Mathew (@MathewLiz) November 3, 2023 -
World War: మూడో ప్రపంచ యుద్ధంపై మస్క్ కీలక వ్యాఖ్యలు
ఎలాన్ మస్క్ ఎక్స్(ట్విటర్)లోని స్పేసెస్‌లో చర్చ సందర్భంగా మూడో ప్రపంచ యుద్ధంకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ నుంచి మాస్కో వెంటనే తమ బలగాలను విరమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్నారు. డేవిడ్ సాక్స్, అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న అభ్యర్థి వివేక్ రామస్వామితో మస్క్ స్పేసెస్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్, హమాస్ భౌగోళిక రాజకీయాలపై విస్తృత చర్చ జరిగింది. రష్యా, చైనా సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించాయని మస్క్ పేర్కొన్నాడు. వ్లాదిమిర్ పుతిన్‌పై విస్తృతమైన ఆంక్షలు విధించాలనే పాశ్చాత్య నిర్ణయం ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. రష్యా ముడిసరుకులను అందిస్తుండడం, చైనా పారిశ్రామిక సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో గణనీయమైన సైనిక సామర్థ్యాన్ని సృష్టించే ప్రమాదం ఉందని తెలిపారు. వరుస అనాలోచిత నిర్ణయాలతో తెలియకుండానే మూడో ప్రపంచ యుద్ధం దిశగా పయనిస్తున్నట్లు హెచ్చరించారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల రష్యా, చైనాల మధ్య అంతరం తగ్గుతున్నట్లు ఏకాభిప్రాయానికి వచ్చారు. అంతర్జాతీయంగా అనిశ్చితుల వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
హీరోను పెళ్లాడనున్న ఎలాన్ మస్క్ మాజీ భార్య
ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి తెలిసిన చాలామందికి అతని మాజీ భార్య 'తలులా రిలే' (Talulah Riley) గురించి తెలిసే ఉంటుంది. వీరిద్దరూ చాలా కాలం క్రితమే విడిపోయారు, కాగా ఇప్పుడు ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తలులా రిలే నటుడు 'థామస్ బ్రాడీ సాంగ్స్టర్' (Thomas Brodie-Sangster)తో రెండు సంవత్సరాలు డేటింగ్ తరువాత ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించి రిలే ఒక ట్విటర్ పోస్ట్ చేసింది. దీనికి ఎలాన్ మస్క్ రెడ్ హార్ట్ ఎమోజితో అభినందనలు తెలిపారు. థామస్ బ్రాడీ సాంగ్స్టర్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ద్వారా వారి నిశ్చితార్థం గురించి స్పష్టం చేశాడు. అయితే వీరి పెళ్లి ఎప్పుడనేది తెలియాల్సిన విషయం. ఈ జంట 2021లో డేటింగ్ ప్రారంభించినట్లు త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. (ఇదీ చదవండి: నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ+ హాట్‌స్టార్.. అదే జరిగితే వినియోగదారులకు కష్టమే!) నిజానికి మస్క్ అండ్ రిలే గతంలో రెండేళ్లు డేటింగ్ చేసుకున్న తరువాత స్కాట్లాండ్లోని డోర్నోచ్ కేథడ్రల్‌లో వివాహం చేసుకున్నారు. కాగా 2016లో వీరు విడాకులు తీసుకున్నారు. కాగా ఇప్పుడు ఆంగ్ల నటుడితో త్వరలో పెళ్లిపీటలెక్కబోతోంది. (ఇదీ చదవండి: అయ్యయ్యో ఇలా అయిందేంటి? మూడు నెలల్లో వేల సంఖ్యలో తగ్గిన ఐటీ ఉద్యోగులు..) Congratulations! ♥️ — Elon Musk (@elonmusk) July 27, 2023 -
ముష్టియుద్ధానికి సిద్ధమవుతున్న మస్క్, జుకర్‌బర్గ్.. ట్రైనింగ్ కూడా..
సాధారణంగా ధనవంతులైన ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ ఉంటుంది, అలాంటి సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకుంటారు. అయితే ఇప్పుడు ప్రపంచ కుబేరులైన టెస్లా సీఈఓ 'ఎలన్ మస్క్' (Elon Musk), ఫేస్బుక్ వ్యవస్థాపకుడు 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) నిజమైన పోరుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. I’m up for a cage match if he is lol — Elon Musk (@elonmusk) June 21, 2023 మాటలతో మొదలైన ఈ పోరు చేతల వరకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. వీరు ఇప్పుడు ట్రైనింగ్ సెషన్ వరకూ వెళ్లారని కొన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది. ప్రారంభంలో.. జుకర్‌బర్గ్ ఒకే అంటే కేజ్ ఫైట్ చేయడానికి తాను సిద్దమేనని మస్క్ ట్విటర్ పోస్ట్ చేసాడు. దీనికి రిప్లై ఇస్తూ జుకర్‌బర్గ్ 'ప్లేస్ ఎక్కడో చెప్పు' అన్నట్లు సమాచారం. I did an impromptu training session with @elonmusk for a few hours yesterday. I'm extremely impressed with his strength, power, and skill, on the feet and on the ground. It was epic. It's really inspiring to see Elon and Mark doing martial arts, but I think the world is served… pic.twitter.com/cq00A9Xnmw — Lex Fridman (@lexfridman) June 27, 2023 అంతటితో ఆగకుండా మస్క్ 'వెగాస్ ఆక్టాగాన్' వచ్చేయ్ అక్కడ చూసుకుందాం.. అన్నాడట. అయితే ఇది కేవలం పోస్టులకు మాత్రమే పరిమితం అనుకున్న నెటిజన్లకు మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే వీరిద్దరూ కూడా ఈ ఫైట్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య ఫైట్ తథ్యమే అని చాలా మంది అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: కోకాకోలా క్యాన్సర్ కారకమా? డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోందంటే!) Here's a highlight video of Mark Zuckerberg and I training jiu jitsu. I look forward to training with @elonmusk as well. It's inspiring to see both Elon and Mark taking on the martial arts journey. See the full video here: https://t.co/G1ubUuxILK pic.twitter.com/WsLaRiFf1o — Lex Fridman (@lexfridman) June 25, 2023 నిజంగా వీరిద్దరి మధ్య పోరు జరుగుతుందా.. లేదా? అనేది ఖచ్చితంగా తెలియకపోయినా, ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే జరిగితే ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ గురించి బాగా తెలిసిన జుకర్‌బర్గ్ చేతిలో మస్క్ ఓటమి ఖాయమని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. -
ఎలాన్ మస్క్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడి స్ట్రాంగ్ కౌంటర్!
కీవ్: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో కొన్ని నెలలుగా భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ యుద్దానికి తెరదించేందుకు అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ కొద్ది రోజుల క్రింత ఓ ప్రతిపాదన చేశారు. మాస్కో ఆక్రమిత ఉక్రేనియన్ ప్రాంతాలలో ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం, క్రిమియన్ ద్వీపకల్పంపై రష్యా సార్వభౌమత్వాన్ని అంగీకరించటం, ఉక్రెయిన్‌కు తటస్థ హోదా ఇవ్వడం వంటి శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించారు. అదికాస్త వివాదానికి దారి తీసింది. తాజాగా మస్క్ ప్రతిపాదనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. తమ దేశం వచ్చి అక్కడి పరిస్థితులను గమనించాక మాట్లాడాలని స్పష్టం చేశారు. ద న్యూయార్క్ టైమ్స్ బుధవారం నిర్వహించిన డీల్‌బుక్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న జెలెన్స్కీ.. ఎలాన్ మస్క్ ప్రతిపాదనపై మండిపడ్డారు. ఉక్రెయిన్‌కు వచ్చి చూడాలని స్పష్టం చేశారు. ‘ఆయనను కొందరు ప్రభావితం చేసి ఉండొచ్చు. లేదా ఆయనే స్వతహాగా ఆ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నా. రష్యా చేసిన మారణకాండను అర్థం చేసుకోవాలనుకుంటే.. ఉక్రెయిన్ వచ్చి సొంతంగా పరిస్థితులను పరిశీలించాలి. ఆ తర్వాత ఈ యుద్ధానికి ముగింపు ఎలా పలకాలనే విషయాన్ని సూచించాలి. ఈ యుద్ధం ఎవరు ప్రారంభించారు? ఎవరు ముంగించాలి?’ అని పేర్కొన్నారు జెలెన్స్కీ. ఇదీ చదవండి: Russia Ukraine War: రష్యా సైనికుల భార్యలే ‘రేప్ చేయమ’ని ప్రోత్సహిస్తున్నారు: జెలెన్స్కీ భార్య -
ట్విట్టర్ భవిష్యత్ ఏంటి ..?
-
ట్విట్టర్ ని దివాలా తీయించడానికి కంకణం కట్టుకున్న మస్క్
-
...ట్విట్టర్ నన్ను అణచివేస్తుంది కాపాడండీ
ట్విట్టర్ నన్ను అణచివేస్తుంది కాపాడండీ.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ -
జీవితానికి రన్‌వే...
వంద మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది... ఇదే నానుడితో నడక మొదలు పెట్టారీ మహిళలు. ఆ నడకను కాస్తా పరుగుగా మార్చి, సుదీర్ఘమైన పరుగుతో జీవితంలో కొత్త లక్ష్యాలు చూస్తున్నారు. క్వాలిటీ లైఫ్ కోసం ఒకరు ... జీవితంలో నిలబడడానికి ఒకరు... రికార్డు మారథాన్ల కోసం ఒకరు... ఇలా పరుగునే జీవితంగా మార్చుకున్నారు. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ ఇవాళ మారథాన్ నిర్వహిస్తున్న వేళ విభిన్నమైన జీవితాల నుంచి వచ్చిన ముగ్గురు మహిళల పరుగు ప్రయాణం గురించి... అస్సాంకు చెందిన కస్తూరికి పరుగు కేవలం హాబీ. పుణే నుంచి వచ్చిన అపర్ణది జీవన్మరణ పోరాటం. హైదరాబాద్‌వాసి యాభెరైండేళ్ల పద్మది అధిక బరువు తగ్గాలనే చిన్న కోరిక. అక్కడి కోచ్ సలహాతో రన్‌ను ఓ సాహసంలా మొదలు పెట్టారు. రెండేళ్లు తిరక్కుండానే ఆమె ఇండియా, ఇండోనేషియాల్లో 12 హాఫ్ మారథాన్లను పూర్తి చేశారు. ఇప్పుడామె లక్ష్యం పరుగెడుతూ ఉండడమే. సునీతకు కొత్త ప్రదేశాలను చూడడం, ఫొటోగ్రఫీ ఇష్టం. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం, సామాజికంగా చైతన్యం తీసుకురావడం ఆమె అభిలాష. స్నేహితులతో హిమాలయాల్లో చేసిన ట్రెక్కింగ్ ఆమెను మారథాన్ వైపు మళ్లించింది. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నిర్వహిస్తున్న సామాజిక పరుగు ఉద్యమంలో పాల్గొనే వారిలో ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. ఆరేళ్ళక్రితం ముప్ఫై తొమ్మిదేళ్ళ వయసులో పరుగు ప్రారంభించిన సునీతకు ఇప్పుడు 45 ఏళ్లు. ఈ ఆరేళ్లలో 30 ఫుల్ మారథాన్లు, పది హాఫ్ మారథాన్లు చేశారు. వీటితోపాటు బెంగళూరులో 50 కి.మీ రేస్, న్యూజిలాండ్‌లో 100 కి.మీ రేస్‌లోనూ పాల్గొన్నారు. భారత్ నుంచి పాల్గొన్న ఏకైక మహిళ ఆమె. ఈ పరుగు ఎవరెస్టుకి తొలిమెట్టు! ఈ ఏడాది హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నిర్వహిస్తున్న మారథాన్ నాలుగోది. ఈ రన్లో పాల్గొనడం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి మొదటి మెట్టు అవుతుందంటారు పుణే నుంచి వచ్చిన అపర్ణ. ఆమెకు 44 ఏళ్ళు. ఎముకలను తినేసే వ్యాధితో బాధపడిన ఆమె ఎవరి మీదా ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడాలనే తపనతోనే పరుగును ఓ యజ్ఞంలా చేస్తున్నారు. వీల్ చెయిర్‌కే పరిమితం కావాల్సిన జీవితాన్ని ఆమె పట్టుదలతో ట్రాక్‌లోకి తెచ్చుకున్నారు. గత ఏడాది మే నెల నుంచి మారథాన్లలో ఆమె పాల్గొంటున్నారు. ఆమెకిది నాలుగో మారథాన్. ‘‘ఇప్పటి వరకు అన్నీ హాఫ్ మారథాన్‌లే. వచ్చే ఏడాది జనవరిలో ముంబయిలో ఫుల్ మారథాన్‌లో పాల్గొంటాను. నా లక్ష్యం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం. హైదరాబాద్‌లో నేల ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఈ నేల మీద పరిగెట్టిన అనుభవం హిమాలయాల అధిరోహణకు దోహదం చేస్తుందనే ఇక్కడికి వచ్చాను’’ అన్నారామె. ఈ పరుగు తన ఆరోగ్యాన్ని కాపాడడమే కాక మానసిక స్థయిర్యాన్ని పెంచింది, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలుగుతున్నారు. హాఫ్ మారథాన్‌ను రెండు గంటల పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసిన ఆమె... ఈ నేల మీద ఎంత సమయం పడుతుందో చూడాలంటున్నారు. నిజానికి ఆమె హాఫ్ మారథాన్ పూర్తి చేసిన సమయం సాధారణమైన వ్యక్తులు తీసుకునే సమయం కంటే తక్కువే. ఆమె ఇద్దరు కూతుళ్లు, కొడుకు తల్లిని చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ఇంతకంటే కావల్సింది ఏముంది- అంటారామె. మారిన జీవన శైలి! ఇప్పటికి 12 హాఫ్ మారథాన్లు పూర్తి చేసిన పద్మ రెండు నెలల్లో 15 కిలోలు తగ్గారు. అప్పట్లో నాలుగ్గంటల నిద్రపోవడమే కష్టమయ్యేది, ఇప్పుడు ఏడు గంటల పాటు చక్కగా నిద్రపోగలుగుతున్నానంటారామె. అందరూ బృందంగా పరుగు పెట్టడం వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతాయంటారామె. ఆమె ఈ పరుగులో పాల్గొనడానికి రిలయెన్స్‌లో పని చేసే తన ఉద్యోగులను చైతన్యవంతం చేశారు. ‘‘నేను పొందిన ప్రయోజనాలు నా సహోద్యోగులు కూడా పొందాలనేదే నా తాపత్రయం. మారథాన్ రన్ ప్రారంభించిన తర్వాత దేహం దానంతట అదే ఆహారపు అలవాట్లను మార్చుకుంది. ఇప్పుడు నూనెపదార్థాలను చూసినా తినాలపించడం లేదు. పండ్లు తినాలనే కోరిక పెరుగుతోంది. నీళ్లు తాగాలనే కోరిక కూడా ఎక్కువైంది. దేహమే అలా కోరుకుంటోంది. అంతకంటే పెద్ద విషయం మానసిక సమతుల్యత బాగా ఎక్కువైంది’’ అంటారామె. అలాంటి వారిలో వైశాలి, సయూరి దల్వీ లాంటి ఎందరో ఉన్నారు. ఐఐటి ప్రొఫెసర్ల నుంచి బ్యాంకింగ్ ఉన్నతోద్యోగుల వరకు వివిధ రంగాల వాళ్లు, ముఖ్యంగా మహిళలు మారథాన్‌లో పాల్గొంటున్నారు. ఇంతటి సుదీర్ఘమైన పరుగులో పాల్గొంటున్న ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైన కారణం ఉన్నప్పటికీ అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట మాత్రం... ‘పరుగుతో దేహం, మెదడు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఎంతటి ఒత్తిడులనైనా తట్టుకుని వాటిని సమగ్రంగా నిర్వర్తించగలిగిన మనోనిశ్చలత్వం వచ్చింది. చీకాకులు దరి చేరడం లేదు. మనసు ఆహ్లాదంగా ఉంటోంది’ అని మాత్రమే. నిజమే! పరుగెత్తితే... పాలు తాగకపోయినా దేహం కోరినన్ని నీళ్లు తాగవచ్చు. అదే గొప్ప ఆరోగ్యం, ఆనందం. - వాకా మంజులారెడ్డి