లండన్:బ్రిటన్(Britain) ప్రధాని కీర్ స్టార్మర్(Keir Starmer)పై అమెరికా బిలియనీర్ ఇలాన్ మస్క్(Elon Musk) విమర్శలకు బ్రిటన్ ప్రభుత్వం గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్(Pakistan) మూలాలున్న వ్యక్తులు అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే గ్యాంగ్‌లను నడిపినా అప్పట్లో క్రౌన్ ప్రాసిక్యూషన్ హెడ్‌గా ఉన్న స్టార్మర్ పట్టించుకోలేదని మస్క్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)వేదికగా మస్క్ చేసిన ట్వీట్లు సంచలనం సృష్టించాయి.
అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే గ్యాంగులను చట్టం ముందు దోషులుగా నిలపడంలో స్టార్మర్ అప్పట్లో విఫలమయ్యారని మండిపడ్డారు. ఇందుకే బ్రిటన్‌లో జరిగిన అత్యంత ఘోరమైన నేరాల్లో స్టార్మర్‌కు కూడా భాగస్వామ్యం ఉందని మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఆ గ్యాంగులపై విచారణకు లేబర్ పార్టీ ఒప్పుకోనందున ఆ పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నారు.
అయితే ఈ మస్క్ చేసిన ఈ విమర్శలపై యూకే ఆరోగ్య శాఖ మంత్రి వెస్ స్ట్రీటింగ్ తప్పుపట్టారు. మస్క్‌కు ఎవరో తప్పుడు సమాచారమిచ్చారని,ఆయన ఆరోపణలు వాస్తవ దూరంగా ఉన్నాయని వెస్ పేర్కొన్నారు. అయితే బ్రిటన్‌లో అమ్మాయిలపై అకృత్యాలను అరికట్టేందుకు మస్క్‌తో పనిచేసేందుకు తాము సిద్ధమని తెలిపారు.
ఇదీ చదవండి: షినవత్రకు అన్ని ఆస్తులా..?
Comments
Please login to add a commentAdd a comment