బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పెటాంగ్‌తర్న్ షినవత్ర తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. తనకు 400 మిలియన్ డాలర్ల (రూ.3,431 కోట్లు) ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు థాయ్‌లాండ్ జాతీయ అవినీతి నిరోధక కమిషన్(ఎన్‌ఏసీసీ)కు శుక్రవారం డిక్లరేషన్ సమర్పించారు. షినవత్రకు దేశ విదేశాల్లో పెద్ద సంఖ్యలో స్థిరచరాస్తులతోపాటు అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌లు, చేతి గడియారాలు, విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి.
ఆమె వద్ద 200కుపైగా డిజైనర్ హ్యాంగ్‌బ్యాగ్‌లు ఉన్నాయి. వీటి విలువ 2 మిలియన్ డాలర్లు(రూ.17.15 కోట్లు). అలాగే 75 లగ్జరీ చేతి గడియారాల విలువ 5 మిలియన్ డాలర్లు (రూ.42.88 కోట్లు). షినవత్ర 2023 సెప్టెంబర్‌లో 37 ఏళ్ల వయసులో థాయ్‌లాండ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలో అత్యంత పిన్నవయసు్కరాలైన ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఆమె తండ్రి థక్సిన్ షినవత్ర సహా కుటుంబంలో నలుగురు ప్రధానమంత్రులుగా పనిచేశారు. థక్సిన్ థాయ్‌లాండ్‌లో అత్యంత సంపన్నుడిగా రికార్డుకెక్కారు.
Comments
Please login to add a commentAdd a comment