
ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి తెలిసిన చాలామందికి అతని మాజీ భార్య 'తలులా రిలే' (Talulah Riley) గురించి తెలిసే ఉంటుంది. వీరిద్దరూ చాలా కాలం క్రితమే విడిపోయారు, కాగా ఇప్పుడు ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
తలులా రిలే నటుడు 'థామస్ బ్రాడీ సాంగ్‌స్టర్' (Thomas Brodie-Sangster)తో రెండు సంవత్సరాలు డేటింగ్ తరువాత ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించి రిలే ఒక ట్విటర్ పోస్ట్ చేసింది. దీనికి ఎలాన్ మస్క్ రెడ్ హార్ట్ ఎమోజితో అభినందనలు తెలిపారు.
థామస్ బ్రాడీ సాంగ్‌స్టర్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ద్వారా వారి నిశ్చితార్థం గురించి స్పష్టం చేశాడు. అయితే వీరి పెళ్లి ఎప్పుడనేది తెలియాల్సిన విషయం. ఈ జంట 2021లో డేటింగ్ ప్రారంభించినట్లు త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.
(ఇదీ చదవండి: నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ+ హాట్‌స్టార్.. అదే జరిగితే వినియోగదారులకు కష్టమే!)
నిజానికి మస్క్ అండ్ రిలే గతంలో రెండేళ్లు డేటింగ్ చేసుకున్న తరువాత స్కాట్లాండ్‌లోని డోర్నోచ్ కేథడ్రల్‌లో వివాహం చేసుకున్నారు. కాగా 2016లో వీరు విడాకులు తీసుకున్నారు. కాగా ఇప్పుడు ఆంగ్ల నటుడితో త్వరలో పెళ్లిపీటలెక్కబోతోంది.
(ఇదీ చదవండి: అయ్యయ్యో ఇలా అయిందేంటి? మూడు నెలల్లో వేల సంఖ్యలో తగ్గిన ఐటీ ఉద్యోగులు..)
Congratulations! ♥️
— Elon Musk (@elonmusk) July 27, 2023
Comments
Please login to add a commentAdd a comment