Elon Musk vs Mark Zuckerberg Cage Fight Training, Twitter Post Goes Viral - Sakshi
Sakshi News home page

Musk vs Zuckerberg: మస్క్ & జుకర్‌బర్గ్‌ రియల్‌ ఫైట్‌? చూడటానికి సిద్ధమేనా!

Published Thu, Jun 29 2023 8:58 PM | Last Updated on Thu, Jun 29 2023 9:18 PM

Elon musk vs mark zuckerberg cage fight training twitter post - Sakshi

సాధారణంగా ధనవంతులైన ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ ఉంటుంది, అలాంటి సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకుంటారు. అయితే ఇప్పుడు ప్రపంచ కుబేరులైన టెస్లా సీఈఓ 'ఎలన్ మస్క్' (Elon Musk), ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు 'మార్క్ జుకర్‌బర్గ్‌' (Mark Zuckerberg) నిజమైన పోరుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మాటలతో మొదలైన ఈ పోరు చేతల వరకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. వీరు ఇప్పుడు ట్రైనింగ్ సెషన్‌ వరకూ వెళ్లారని కొన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది. ప్రారంభంలో.. జుకర్‌బర్గ్‌ ఒకే అంటే కేజ్ ఫైట్ చేయడానికి తాను సిద్దమేనని మస్క్ ట్విటర్ పోస్ట్ చేసాడు. దీనికి రిప్లై ఇస్తూ జుకర్‌బర్గ్‌ 'ప్లేస్ ఎక్కడో చెప్పు' అన్నట్లు సమాచారం.

అంతటితో ఆగకుండా మస్క్ 'వెగాస్ ఆక్టాగాన్' వచ్చేయ్ అక్కడ చూసుకుందాం.. అన్నాడట. అయితే ఇది కేవలం పోస్టులకు మాత్రమే పరిమితం అనుకున్న నెటిజన్లకు మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే వీరిద్దరూ కూడా ఈ ఫైట్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య ఫైట్ తథ్యమే అని చాలా మంది అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: కోకాకోలా క్యాన్సర్ కారకమా? డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోందంటే!)

నిజంగా వీరిద్దరి మధ్య పోరు జరుగుతుందా.. లేదా? అనేది ఖచ్చితంగా తెలియకపోయినా, ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే జరిగితే ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ గురించి బాగా తెలిసిన జుకర్‌బర్గ్‌ చేతిలో మస్క్ ఓటమి ఖాయమని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement