గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఎలాన్ మస్క్ & మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు దీనికి చరమ దశ వచ్చిందా అన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ప్లేస్ కూడా ఫిక్స్ చేసినట్లు టెస్లా సీఈఓ ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. ఈ ఫైట్ మస్క్ అండ్ జుక్ ఫౌండేషన్‌ల ద్వారా నిర్వహిచనున్నట్లు తెలుస్తోంది. దీనికి రోమ్ నగరం వేదిక కానున్నట్లు, ఇప్పటికే ఇటలీ ప్రధానితో, అక్కడి సాంస్కృతిక శాఖామంత్రితో మాట్లాడినట్లు మస్క్ ట్వీట్ చేశారు. దీని ద్వారా వచ్చే డబ్బు మొత్తం స్వచ్చంద సంస్థలకు వెళ్లనున్నట్లు ఇదివరకే తెలియజేసారు.
మెటా అండ్ ఎక్స్ ద్వారా ఈ ఫైట్ లైవ్ చూడవచ్చని వెల్లడించారు. ఇప్పటికే జరగాల్సిన ఈ ఫైట్ మస్క్ ఆరోగ్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అంతే కాకుండా ఈ పోరుకి తానూ ఎప్పుడూ సిద్దమే అన్నట్లు గతం నుంచి జుకర్‌బర్గ్ చెబుతూనే ఉన్నాడు. అయితే ఇప్పటికి కూడా ఈ ఫైట్ జరుగుతుందా? లేదా అనేదాని మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు డేట్ కూడా ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: మొబైల్ కనిపించకుండా పోయిందా? డోంట్ వర్రీ - పరిష్కారమిదిగో..!
ఈ కేజ్ ఫైట్ కోసం ఇప్పటికే ప్రపంచంలోని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ పోరు జరిగితే ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ఎంతోమందిలో రోజురోజుకి ఎక్కువవుతోంది. బహుశా ఇది త్వరలోనే జరిగే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
The fight will be managed by my and Zuck’s foundations (not UFC).
— Elon Musk (@elonmusk) August 11, 2023
Livestream will be on this platform and Meta. Everything in camera frame will be ancient Rome, so nothing modern at all.
I spoke to the PM of Italy and Minister of Culture. They have agreed on an epic location.
Comments
Please login to add a commentAdd a comment