rome
-
రోమ్‌లో 2 వేల ఏళ్ల నాటి బాత్ హౌస్
సాక్షి, నేషనల్ డెస్క్: ఏసీ గదులు, ప్రైవేట్ బాత్ టబ్‌లు. విందుల కోసం ప్రత్యేకమైన, విలాసవంతమైన గదులు. సంపన్నుల ఇళ్లలో ఉండే విలాసాల గురించి తెలిసిందే. ఇప్పుడంటే సరే గానీ ఏకంగా 2 వేల ఏళ్ల కిందటే ఇలాంటి నిర్మాణాలున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. పురాతన రోమన్ నగరమైన పోంపెయ్లో ఇలాంటివన్నీ ఉన్నట్టు తాజాగా తేలింది. 2 వేల ఏళ్ల కింద నిర్మించిన పెద్ద ప్రైవేట్ థర్మల్ కాంప్లెక్స్ ఒకటి తవ్వకాల్లో బయటపడింది.పోంపెయ్ పార్కు మధ్య ప్రాంతంలో బాత్ హౌస్‌లు బయటపడ్డాయి! నాటి పాలక వర్గ సభ్యులు విందుల కోసం 30 మంది సామర్థ్యమున్న విశాలమైన గదులను ఏర్పాటు చేసుకున్నారని పోంపెయ్ పురావస్తు పార్కు డైరెక్టర్ గాబ్రియేల్ జుచ్ట్రీగల్ తెలిపారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రోత్సహించడం, ఏకాభిప్రాయ సాధన తదితరాల కోసం సం సమావేశాలు, ఒప్పందాలు వంటివి ఇక్కడ జరిగేవని వెల్లడించారు.ఇటీవల ఇదే ప్రాంతంలో అప్పటి బేకరీ, లాండ్రీ షాప్, రెండు విల్లాలను కనుగొన్నారు. అప్పట్లో మౌంట్ వెసూవియస్ అగ్నిపర్వత బద్ధలవ్వడంతో దాని బూడిద కింద పోంపెయ్తో పాటు హెర్కులేనియం నగరాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడవన్నీ తవ్వకల్లో బయట పడుతున్నాయి. నాటి ప్రమాదంలో మరణించిన వ్యక్తుల ఎముకలు కూడా పురావస్తు శాస్త్రవేత్తలకు లభించాయి.ఇదీ చదవండి: గాజా ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
చరిత్రలో సువర్ణాధ్యాయం
రోమ్కు, ఆ తరువాత మధ్యధరా, యూరప్‌కు గ్రీస్ ఎలాంటిదో... దక్షిణాసియా, మధ్యఆసియా, ఆ మాటకొస్తే చైనాకూ భారత్ అలాంటిదని అంటారు విలియం డార్లింపిల్. క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 12, 13 శతాబ్దాల కాలం ఇండియాలో సువర్ణాధ్యాయం అని చెబుతారు తన తాజా పుస్తకంలో. భారతీయ గణిత, ఖగోళ శాస్త్ర భావనలు అరబ్ దేశాలకు, అక్కడి నుంచి యూరప్‌కు వ్యాప్తి చెందిన వైనం గురించి రాశారు. ప్రాచీన భారతదేశం విశ్వగురు అని, 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ఆ బంగారు కాలం అంతరించడం మొదలైందని వాదించే హిందుత్వవాదులకు ఈ పుస్తకం మద్దతుగా నిలుస్తుందన్న విమర్శలను డార్లింపిల్ కొట్టేస్తారు. ‘‘అది యాదృచ్ఛికం’’ అంటారు.విలియం డార్లింపిల్ తాజా పుస్తకం భారతీయ చదువరులకు బాగా నచ్చుతుందనుకుంటున్నాను. ఎందుకంటే... మనలాంటి వాళ్లు చాలాకాలంగా నమ్ముతున్న విషయాన్ని ఆయన మరోసారి రూఢి చేశారు. అయితే అదేమిటన్నది ఆయన మాటల్లో వినడమే మేలు. డార్లింపిల్ రాసిన పుస్తకం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12 – 13 శతాబ్దాల మధ్య కాలం నాటి పరిణామాలకు సంబంధించినది. ఈ కాలానికి సంబంధించి ఆయన ఏమంటారంటే... ‘‘రోమ్కు, ఆ తరువాత మధ్యధరా, యూరప్‌కు గ్రీస్ ఎలాంటిదో... దక్షిణాసియా, మ««ధ్య ఆసియా, ఆ మాటకొస్తే చైనాకూ భారత్ అలాంటిది’’ అని!ప్రాచీన భారతదేశం ప్రపంచంలో తీసుకొచ్చిన మార్పుల గురించి డార్లింపిల్ ‘ద గోల్డెన్ రోడ్: హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ద వరల్డ్’’ పేరుతో రాసిన పుస్తకంలో అక్షరబద్ధం చేశారు. భారతీయల చెవులకు ఇంపైన ఇంకో మాట కూడా ఇందులో ఉంది. ఇది చైనాతో భారత్ పోలికకు సంబంధించినది. చైనా తనను తాను ఈ ప్రపంచానికి కేంద్రంగా చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి పాశ్చాత్య దేశాలకు ప్రత్యక్ష వ్యాపారం ఉన్న ఆనవాళ్లేమీ లేవంటారు ఆయన. ఆ కాలంలో ‘‘ఒకరి గురించి మరొకరికి చూచాయగా మాత్రమే తెలుసు’’ అని ఆయన యూరప్, చైనాల గురించి నాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్, రోమన్ సామ్రాజ్యాల మధ్య వాణిజ్య విస్తృతి చాలా ఎక్కువ. భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వసూలు చేసే సుంకం రోమన్ సామ్రాజ్య ఖజానాలో మూడో వంతు వరకూ ఉండేది. ఇంకో రుజువు ఏమిటంటే... భారతీయ సంగ్రహాలయాల్లో రోమ్ సరిహద్దుల్లోని దేశాల్లోనూ లేనన్ని రోమన్ నాణేలు ఉండటం. ఇది భారత్– చైనాల మధ్య శత్రుత్వాన్ని కొత్త రూపంలో రాజేసినట్టుగా లేదూ?ఇవన్నీ డార్లింపిల్ పుస్తకంలో మూడు రకాల కథనాల్లో కనిపిస్తాయి. చైనా, మధ్యాసియాలకు ఆపై సైబీరియా, మంగోలియాల వరకూ విస్తరించిన బౌద్ధం తాలూకూ కథనం ఒకటైతే... భారతీయ గణిత, ఖగోళ శాస్త్ర భావనలు అరబ్ దేశాలకు, అక్కడి నుంచి యూరప్‌కు వ్యాప్తి చెందిన వైనం రెండో కథనం. హిందూయిజ, సంస్కృతాలు దక్షిణాసియాలో కంబోడియా, లావోస్, జావాల వరకూ వ్యాపించిన కథనం చివరిది. బాగ్ధాద్ మంత్రుల మొదలుకొని ఇటలీ గణిత శాస్త్రవేత్తల వరకూ రకరకాల పాత్రల ద్వారా ఈ కథనాలు నడుస్తాయి. టొలెడో మతాధికారి, చైనాలోని ఏకైక మహిళ సామ్రాజ్ఞి, కంబోడియాలోని అంగ్‌కోర్‌వాట్, జావాలోని బోరోబుడుర్, బిహార్‌లోని నలందాల వెనుక దాగి ఉన్న ఎన్నో కథలను వివరిస్తుందీ పుస్తకం. టొలెడో మతాధికారి 1068లో ప్రపంచంలోని మే«ధా చరిత్ర గురించి రాస్తూ... అది భారత కాలమని వర్ణించాడు. ‘విలియం ద కాంకరర్’ తొలిసారిగా బ్రిటిష్ గడ్డపై అడుగుపెట్టిన ఈ కాలంలోనే రాసిన ఈ చరిత్రలో భారత్ తన వరాలకు పేరొందిందని రాశాడు. ‘‘శతాబ్దాలుగా విజ్ఞానానికి సంబంధించిన అన్ని శాఖల్లో భారతీయుల సామర్థ్యాన్ని రాజులు అందరూ గుర్తించారు. జ్ఞానవంతులు వాళ్లు. జ్యామితి, అంక గణితాల్లో ఎంతో పురోగతి సాధించారు. వైద్యం విషయంలో మానవులందరి కంటే ముందున్నారు’’ అని కీర్తించాడు. ఈ పుస్తకం ద్వారా నాకు మూడు విషయాలు స్పష్టమయ్యాయి. పుస్తక శీర్షికలోని బంగారు దారి నేల మార్గం కాదు. సముద్రాల పైది. శక్తిమంతమైన వానాకాలపు గాలులు భారతీయ వర్తకులను పశ్చిమాన అరేబియాకు, తూర్పున సుమత్రా, జావా వరకు చేరేలా చేశాయి.దక్షిణాసియాకు హిందూయిజం, సంస్కృత సంబంధిత సంస్కృతి విస్తరించేందుకు యుద్ధాలు కారణం కాదు. ఇందులో బ్రాహ్మణ మిషనరీలు ముందుంటే... తరువాతి కాలంలో వ్యాపారులు వ్యాప్తి చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... భారత్‌లోని అన్యాయ కుల వ్యవస్థ ఇక్కడకు విస్తరించకపోవడం. దురదృష్టం కొద్దీ డార్లింపిల్ ఈ విషయంపై ఎక్కువగా వివరించలేదు.అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం, ఇది మనం ఆశించేది అయినప్పటికీ చారిత్రక వాస్తవం కాకపోవచ్చు... సోర్బోన్ , ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాన్నీ నలందా విశ్వవిద్యాలయ స్ఫూర్తితో ఏర్పాటు చేశారని అనిపిస్తుంది. చివరగా... ప్రాచీన భారతదేశం విశ్వగురు అని, 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ఆ బంగారు కాలం అంతరించడం మొదలైందని వాదించే హిందుత్వవాదులకు ఈ పుస్తకం మద్దతుగా నిలుస్తుందని కొంతమంది విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. డార్లింపిల్ రెండింటికీ సంబంధమే లేదని స్పష్టం చేస్తారు. ‘‘అది యాదృచ్ఛికం, అసంగతం.’’ ఆయన పుస్తకంలో చెప్పే ఇంకా ఆసక్తికరమైన సంగతులు చాలానే ఉన్నాయి. వాటిని మీ కోసమే వదిలేస్తాను.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Cover Story: ఆ ఖాళీ సమాధి యేసు పునరుత్థానానికి నిలువెత్తు సాక్ష్యం!
‘‘యేసు సమాధిలో పరుండియుండి వాసిగ మూడవనాడు లేచెన్.. లేచెన్ సమాధి నుండి మృత్యువుపై విజయమొంది.. మృత్యుబంధంబులన్ నిత్యుండు త్రెంచెన్ స్తుత్యుండు జయించెన్.. జయం జయం’’ అంటూ రాబర్ట్ లౌరీ వ్రాసిన పాటను గొంతెత్తి పాడే సమయం ఈస్టర్ పండుగ. ప్రపంచవ్యాప్తంగా విస్తరించియున్న క్రైస్తవులు ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మానవుని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. ప్రస్తుతం ఝెరూషలేములోని యేసు ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మహిమాన్వితమైన ఆ చారిత్రక సంఘటన మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది. ‘‘ఆ కాలంలో యేసు అనే ఒక మనుష్యుడుండేవాడు. అతడిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి మంచి బోధకునిగా ఉన్నాడు. తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు మొదట ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుండి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు’’ ఈ మాటలను చరిత్రకారుడు ఫ్లావియస్ జోసఫస్ తన పుస్తకంలో వ్రాశాడు. ఆయన రాసిన సంగతులు నేటికీ చరిత్రకు ఆధారంగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు జన్మను, మరణాన్ని, పునురుత్థాన్ని కూడా ధ్రువీకరించాడు. ‘‘యేసుక్రీస్తు నిజంగా జీవించి, మరణించి, మృతులలో నుండి లేచాడన్న తమ దృఢ విశ్వాసము కొరకు వారు శ్రమపడి మరణించారు’’ అని సుటోనియస్ అనే చరిత్రకారుడు వ్రాశాడు. ఇతడు రోమా చరిత్రకారుడు. హేడ్రియన్ అనే రాజు వద్ద అధికారిగా పనిచేసేవాడు. చరిత్రకు సంబంధించిన విషయాలను స్పష్టంగా తన వ్రాతలలో పొందుపరచాడు. రోమన్ చక్రవర్తులైన జూలియస్ సీజర్ నుండి డొమీషియన్ వరకు గల 12 మంది చక్రవర్తుల జీవిత చరిత్రలను వ్రాశాడు. రోమా సామ్రాజ్యంలోని రాజకీయాల గూర్చి, కవులను గూర్చి, సామాన్య ప్రజలను గూర్చి చాలా విషయాలు వ్రాసి భద్రపరచాడు. మొదటి శతాబ్దంలో రగిలిన ఉజ్జీవాన్ని, సంఘం పొందిన శ్రమలను, ధైర్య విశ్వాసాలతో పరిస్థితులను ఎదుర్కొన్న దేవుని ప్రజల పరిస్థితిని సుటోనియస్ వివరించుట ద్వారా యేసుక్రీస్తు ఒక కల్పిత పాత్ర కాదని, ఆయన మనుష్యులందరి కొరకు ప్రాణం పెట్టి మూడవ రోజున తిరిగిలేచిన సజీవుడని ప్రతి ఒక్కరూ గుర్తించడానికి దోహదమయ్యింది. యేసుక్రీస్తు జీవితం ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకు వచ్చింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా, పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా పరమాత్ముని బాటలో నడవాలని క్రీస్తు బోధించాడు. సి.ఎస్.లూయీ అనే సుప్రసిద్థ సువార్తికుడు, వేదాంతవేత్త ఇలా అంటాడు. ‘‘యేసు ఈ లోకానికి వచ్చి తానెవరో లోకానికి తెలియచేశాడు. నేను లోకానికి వెలుగును, జీవాహారము నేనే, మార్గము సత్యమును జీవమును నేనే అని చెప్పడంలో మనిషి మనసులో ఉన్న ప్రశ్నలకు జవాబులనిచ్చాడు. క్రీస్తు ఆవిధంగా పలికాడంటే ఆయన అబద్ధీకుడైనా లేదా మతిస్థిమితం లేనివాడైనా లేదా రక్షకుడైనా అయ్యుండాలి. యేసుక్రీస్తు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. ఆయన మతి స్థిమితం లేనివాడు కాదు. అదే వాస్తవమైతే ఆయన ఇన్ని విశిష్ట బోధలు చేసియుండేవారు కాదు. అనేకులను స్వస్థపరచేవాడు కాదు. ఆయన రక్షకుడు గనుకనే సిలువలో మనిషి పాపముల నిమిత్తం మరణించి మూడవ రోజున తిరిగి లేచారు.’’ తన జీవితకాలమంతా భౌతికంగా అంధురాలైనప్పటికీ క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని, అయన ప్రేమతత్త్వాన్ని తాను రచించిన ఎనిమిది వేల పాటలతో తెలియచేసి క్రైస్తవ ప్రపంచంలో ఖ్యాతిని ఆర్జించిన ఫ్యానీ క్రాస్బీ క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ఇలా వ్రాసింది. ‘‘క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన విశిష్ట బలము ద్వారా మరణాన్ని జయించాడు. రాయి పొర్లింపబడింది. సమాధి ఆయనను శాశ్వతంగా బంధించలేకపోయింది. జగమంతా ఆనందంతో నిండిపోయింది. క్రీస్తు స్నేహితులారా! మీరు కన్నీళ్ళు విడచుట మానండి ఎందుకంటే ఆయన మహిమగల రాజు.’’ ఈ మాటలను తన హృదయాంతరాళాల్లోంచి వ్రాయడం ద్వారా తాను భౌతికంగానే అంధురాలు గాని ఆధ్యాత్మికంగా కాదు అని ఋజువు చేసింది క్రాస్బీ. క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసు లేఖనాలు ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. నా విమోచకుడు సజీవుడు అని యోబు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా పలికాడు. దావీదు కీర్తనలలో కూడా క్రీస్తు పునరుత్థానమును గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ‘‘నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యవు’’– (కీర్తన 16:10) అనే ప్రవచనం క్రీస్తుకు ముందు వెయ్యిసంవత్సరాల క్రితమే చెప్పబడింది. ఝెషయా అనే ప్రవక్త క్రీస్తును గూర్చి ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. అవన్నీ క్రీస్తుకు ముందు ఏడువందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయి. వాటిలో క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ప్రవచనం ఝెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చూడగలము. అతడు తన్నుతానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో అనేకసార్లు తన శిష్యులకు ఇలా చెప్పాడు. ‘‘మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగించబడును. వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయన మీద ఉమ్మివేసి, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను’’– (లూకా 18:3133). క్రీస్తు తనకు సంభవింపబోవు వాటిని ముందుగానే తన శిష్యులకు తెలియచేశాడు. వాస్తవానికి యేసుక్రీస్తుకు పొంతి పిలాతు అనే రోమన్ గవర్నర్ ద్వారా అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తిని తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఆ తదుపరి ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. ఈ నాటికి ఝెరూషలేమునకు వెళ్ళితే అక్కడ వయా డొలొరిసా అనే మార్గాన్ని చూస్తాము. ఆ మార్గములో పద్నాలుగు స్టేషన్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో క్రీస్తు ఏ విధంగా శ్రమపడ్డారో చరిత్రను తెలుసుకోవచ్చు. సిలువ మరణ శిక్ష మొదటిగా ఫనిషియన్లు అమలు పరచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు మరియు రోమన్లు ఈ శిక్షను అమలు పరచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. సిలువ శిక్ష అనేది అవమానకరమైన కార్యంగా భావించేవారు. రోమన్ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ శిక్ష విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు ఈ శిక్ష విధించే వారు. యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్ళు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ యొక్క బరువు సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. భారభరితమైన ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. యేసు సిలువను మోసుకొంటూ గొల్గొతా అనే ప్రాంతాన్ని చేరుకోగానే ఆయనను సిలువపై ఉంచి చేతులలోను కాళ్ళలోను మేకులు కొట్టి వేలాడదీశారు. శుభ శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు యేసును సిలువవేశారు. సుమారు ఆరు గంటలు యేసు సిలువపై వ్రేలాడి ఏడు మాటలు పలికారు. నేటికి అనేకమంది సిలువలో క్రీస్తు పలికిన యేడు మాటలను ధ్యానం చేస్తుంటారు. పలుకబడిన ఒక్కోమాటలో ప్రపంచానికి కావల్సిన అద్భుతమైన సందేశం ఉందని క్రైస్తవులు విశ్వసిస్తారు. అరిమతయియ యోసేపు, నికోదేము అనువారు క్రీస్తు దేహాన్ని సిలువనుండి దింపి ఒక తోటలో తొలచబడిన సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు బహు ధనవంతుడు, యూదుల న్యాయసభలోని సభ్యుడు. తాను అంతకు ముందు క్రీస్తుకు రహస్య శిష్యుడు. అంతవరకు తనలో గూడుకట్టుకున్న భయాన్ని వదిలి పిలాతు దగ్గరకు వెళ్ళి తన ప్రభువును పాతిపెట్టడానికి అనుమతి కోరాడు. సిలువ వేయబడిన ఒక వ్యక్తికోసం మహాసభ సభ్యుడైన అతడు బహిరంగంగా తీసుకొన్న తన నిర్ణయం వలన పిలాతుకు కలిగిన ఆశ్చర్యం, యూదులకు కలిగిన అసహనం ఊహించవచ్చు. యోసేపు తనకోసం తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తుకు ఇచ్చేశాడు. నీ పరిస్థితేంటి అని ఎవరో అడిగారట. అందుకు యోసేపు ‘‘నేను యేసుకు ఈ సమాధిని మూడు రోజులకే ఇస్తున్నాను’’ అని సమాధానమిచ్చాడు. నిజమే! యేసు సమాధిలో మూడు రోజులే ఉన్నాడు. తాను మరణించక ముందు తన పునరుత్థానమును గురించి పదే పదే మాట్లాడాడు. తాను చెప్పినట్టే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసిస్తూ, మరణపు ముల్లును విరిచి క్రీస్తు మృత్యుంజయుడైనాడు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఆశించేది గెలుపు. ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని ఇచ్చేది. భూమ్మీద బతికే అందరికి ముఖ్యమైనది కూడా. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మనిషి తాను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని ఆకాంక్షిస్తాడు. ఆ విజయం వల్ల దక్కిన సంతృప్తితో కాలం గడపాలని కోరకుంటాడు. ఓటమి అంగీకరించడం చేదైన విషయమే! మింగుడు పడని వ్యవహారమే! ప్రపంచంలో చాలా రకాలైన గెలుపులున్నాయి. పరీక్షల్లో, పందెపురంగంలో, ఉద్యోగ బాధ్యతల్లో, అనుకున్నది సాధించడంలో.. ఇంకా మరెన్నో! ఏదో ఒక పనిలో విజయాన్ని సాధిస్తేనే ఇంత సంతోషంగా మానవుడుంటే, ప్రతి మనిషికి ముల్లులా తయారైన మరణాన్నే జయిస్తే?! మృత్యువునే గెలిస్తే?! ఇంకెంత ఆనందం, ఇంకెంత ఉత్సాహం! సరిగ్గా రెండు వేల సంవత్సరాల క్రితం అదే జరిగింది. మనిషి మెడలు వంచిన మరణం మెడలు వంచబడ్డాయి. అంతవరకు ప్రతి ఒక్కరినీ తన గుప్పిట్లో బంధించిన మరణం మరణించింది. అసలు ఈ పుట్టుకకు, మరణానికి, దానిని గెలవడానికి ఉన్న సంబంధం ఏమిటి? మనుషులంతా పుడుతున్నారు. ఏదో ఒక రోజు ఏదో ఒకవిధంగా మరణిస్తున్నారు. శరీరం మట్టిలో కలిసిపోతుంది. చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇలాంటి మదిని తొలిచే ప్రశ్నలన్నింటికి అద్భుతమైన సమాధానాలు క్రీస్తు మరణ పునరుత్థానాల వలన ప్రపంచానికి లభించాయి. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులెందరో సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికి ఫారోల సమాధులు (పిరమిడ్లు), వారి దేహాలు ఉన్నాయి. గొప్పవ్యక్తులమని చాటించుకున్న ఫారోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బాబిలోను రాజైన నెబూకద్నెజర్ మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికి అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి ఉంది. రోమ్‌లో జూలియస్ సీజర్ సమాధి మూయబడియుంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు. యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏదీ ఉండదని ఋజువు చేయబడింది. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఏండ్లతరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యల మీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనివిని ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది. యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవలేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలు సందర్శించి, అనేక వివరాలు సేకరించిన తర్వాత ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలను బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి, ఒక అద్భుతమైన పుస్తకాన్ని వ్రాశాడు. దాని పేరు ‘‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. యేసు మరణాన్ని జయించి తిరిగిలేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణీలోనికి తీసుకొచ్చారు గాని, వాటిలో ఏవీ వాస్తవం ముందు నిలబడలేదు. శిష్యులు తప్పు సమాధినొద్దకు వెళ్ళారని, యేసు దేహం ఎత్తుకుపోయారని, అసలు యేసు సిలువలో చనిపోలేదు.. స్పృహతప్పి పడిపోయారని, శక్తిమంతమైన సుగంధద్రవ్యాలను ఆయనకు పూసి బతికించేశారని, శిష్యులు భ్రమపడి యేసు కనబడ్డాడని చెప్పి ఉండవచ్చని ఎన్నో తప్పుడు సిద్ధాంతాలను తెరపైకి తీసుకొచ్చారు. సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ఖాళీ సమాధి నేర్పించిన పాఠం ఇదే కదా! సత్యాన్ని అందరూ మోసుకెళ్ళి సమాధిలో పెట్టవచ్చును గాని దానిని ఎక్కువ కాలం అక్కడ ఉంచలేరు. యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్ శతాధిపతి పేరు బైబిల్లో లేదు గాని, చరిత్రలో అతని పేరు చూడగలము. ఆ వ్యక్తి పేరు లాజినస్. పిలాతు ఆజ్ఞను శిరసావహించడంలో ప్రథముడు. అతని సమక్షంలోనే యేసుకు మేకులు కొట్టబడ్డాయి. ముళ్ళకిరీటం ధరించబడింది. సిలువ ప్రక్రియ అంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ‘ఆ నీతిమంతుని జోలికి పోవద్దు’ అని తన భర్తకు వర్తమానం పంపిన పిలాతు భార్య క్లౌదియ ప్రొక్యులా లాజినస్‌ను కలుసుకుని, ఇలా అడిగింది ‘‘సిలువలో మరణించిన క్రీస్తుపై నీ అభిప్రాయం ఏమిటి? ఆ మహనీయుని గురించి ఏమనుకుంటున్నావు?’’ ఆ ప్రశ్నలకు లాజినస్ ఇచ్చిన సమాధానమిది‘‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. మిట్టమధ్యాహ్నం సూర్యుడు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు వచ్చిన చీకటి, సమాధులలో నుండి మనుష్యులు లేవడం, దేవాలయపు తెర పై నుండి కిందకు చినగడం చూస్తుంటే తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణపు మెడలు వంచి సజీవుడై బయటకు వస్తాడు. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి బయలుదేరతాడు. ఈసారి ఆయనను ఏ రోమన్ చక్రవర్తి, శతాధిపతి గాని, సైనికుడు గాని, యూదా మత పెద్దలైన శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని బదులిచ్చాడు. యేసుక్రీస్తు పునరుత్థానం వలన మనిషికి సమాధానం, ధైర్యం, నిరీక్షణ అనుగ్రహించబడ్డాయి. సమాధానం.. యేసుక్రీస్తు చనిపోయారని భయంతో నింపబడి శిష్యులకు ఆదివారం సాయంత్రం పునరుత్థానుడైన యేసు ప్రత్యక్షమయ్యాడని అపొస్తలుడైన యోహాను తన సువార్తలో వ్రాశాడు. శిష్యులంతా ఇంటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి ‘మీకు సమాధానం కలుగునుగాక’ అని వారితో చెప్పెను. మూడున్నర సంవత్సరాలు తనతో ఉండి గెత్సేమనే తోటలో తనను పట్టుకుంటున్నప్పుడు విడిచి పారిపోయిన వారిని బహుశా ఎవరైనా చీవాట్లు పెడతారేమో గాని ప్రేమపూర్ణుడైన ప్రభువు వారి స్థితిని సంపూర్ణంగా తెలుసుకున్నవాడై వారికి శాంతి సమాధానాలను ప్రసాదించాడు. సమాధానకర్తయైన ప్రభువును హృదయాల్లోనికి ఆహ్వానించడమే ఆశీర్వాదకరం. ఈనాడు అనేకులు తమ పరిస్థితులను బట్టి హృదయంలో, కుటుంబంలో సమాధానం లేనివారుగా ఉంటున్నారు. సమాధానం లేకనే ఆత్యహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. శాంతిగా బతకడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. నవ్వుతూ బతకాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. రోజులో కొంత సమయం అక్కడికి వెళ్ళి పగులబడి నవ్వుకుంటున్నా శాంతి సమాధానాలు దొరకని కారణాన ఈ మధ్యన క్రైయింగ్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఏడ్వడం ద్వారా భయటకు పంపిస్తే సంతోషంగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే మార్గాలు మాత్రమే! నిజమైన ఆనందం, శాంతి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా లభిస్తుంది. యేసుక్రీస్తు అలిసిపోయిన ప్రజలను చూసి ఇలా అన్నాడు. ‘‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును’’ ఆయన చెంతకు వచ్చిన ఎన్నో జీవితాలు పావనమయ్యాయి. పునరుత్థానుడైన క్రీస్తును చూచి శిష్యులు పులకించిపోయారు. దేవుడు తమను విడిచిపెట్టలేదన్న సత్యం వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో తమ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయారు. గెలుపుబాటలో దూసుకుపోయారు. భయపడకుడి.. ఆదివారం ఉదయం తెల్లవారకముందే కొంతమంది స్త్రీలు క్రీస్తు సమాధిని చూడడానికి వచ్చారు. వారక్కడికి వచ్చినప్పటికే ఒక గొప్ప భూకంపం వచ్చింది. ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి సమాధిరాయి పొర్లించి దానిమీద కూర్చుండెను. అక్కడ ఉన్న రోమా కావలివారు వణికి చచ్చినవారివలె ఉన్నారు. వారు భయపడాల్సింది ఏదీలేదనే వాగ్దానాన్ని వారు పొందుకున్నారు. లోకమంతా ఎన్నో భయాలతో నిండింది. వ్యాధులు, యుద్ధాలు, వైఫల్యాలు, ఇంకా ఎన్నో సమస్యలు మనిషి భయానికి కారణాలుగా ఉన్నాయి. భయం మనిషిని ముందుకు వెళ్ళనివ్వదు. గమ్యంవైపు సాగనివ్వదు. భయం గుప్పిట్లో జీవిస్తున్న మనిషికి నిజమైన ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడన్నది లేఖన సత్యం. నిరీక్షణ.. యేసుక్రీస్తు మొదటగా లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. మానవులందరి రక్షణ కొరకు సిలువ శ్రమను, మరణమును అనుభవించారు. మూడవ దినమున తిరిగిలేచారు. రెండవసారి ఆయన తన ప్రజలను అనగా ఆయన రక్తములో కడుగబడి, పాపక్షమాపణ పొంది పవిత్రజీవితాన్ని, ఆయన పట్ల విశ్వాసాన్ని కొనసాగించువారికి నిత్యజీవాన్ని అనుగ్రహించుటకు రాబోతున్నారు. ఆయన పునరుత్థానుడై ఉండకని యెడల ఆ నిరీక్షణకు అవకాశమే లేదు. లోకములో ఎన్నో విషయాల కొరకు ఎదురుచూసి నిరాశ పడతారు కానీ ప్రభువు కొరకు ఎదురు చూసేవారు ఎన్నడూ సిగ్గుపడరు. ప్రభువునందు మనకున్న నిరీక్షణ ఎన్నడూ అవమానకరము కాదు. ‘‘విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువును గెలిచి నేడు వేంచెసె యజమానుడెల్ల ప్రయాసములు ఎడబాప స్వజనులను రక్షింప సమసె సిలువమీద... విజయంబు మానవుల పాపము నివృత్తిని విభుడొనరింపన్ కుజనులచే అతడు క్రూర మరణము నొంది విజిత మృత్యువునుండి విజయుండై వేంచేసె’’ అంటూ కీర్తనలు పాడుచూ క్రీస్తు పునరుత్థానమును ఆధ్యాత్మిక ఆనందంతో, నిండు హృదయంతో దేవుని ప్రజలంతా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. (సాక్షి పాఠకులకు ఈస్టర్ శుభాకాంక్షలు). — డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి ఇవి చదవండి: Funday Story: 'ఋతధ్వజుడు మదాలసల గాథ' -
ఆ చిల్లర విలువ ఎంత అంటే?
ప్రతి ఏటా లక్షలాదిమంది పర్యాటకులు ఇటలీ రాజధాని రోమ్ను సందర్శిస్తుంటారు. రోమ్ అందాలను చూసినవారు మళ్లీ ఇక్కడికి రావాలని అనుకుంటారు. రోమ్ని సందర్శించే పర్యాటకులు ట్రెవీ ఫౌంటెన్‌లో ఒక నాణెం లేదా రెండు నాణేలు విసురుతుంటారు. ఈ విధంగా ప్రతి ఏటా సుమారు ఒక మిలియన్ యూరోలు (రూ.9 కోట్లు) ఈ ఫౌంటెన్‌లో జమ అవుతున్నాయట. ఒక అంచనా ప్రకారం పర్యాటకులు ప్రతిరోజూ సుమారు 3000 యూరో నాణేలను ఈ ఫౌంటెన్‌లోకి విసిరివేస్తున్నారు. అంటే ప్రతిరోజూ రూ. 2,50,000 అంటే సంవత్సరానికి రూ.9 కోట్లు ఈ ఫౌంటెన్‌లోకి విసురుతున్నారన్న మాట. ట్రెవీ ఫౌంటెన్‌లోకి విసిరిన నాణేలను బయటకు తీసి, స్థానిక పేదలు, నిరాశ్రయులైన ప్రజలకు ఆహారం అందించడానికి ఉపయోగిస్తారు. ట్రెవీ ఫౌంటెన్ రోమ్‌లోని ట్రెవీ నగరంలో ఉంది. ఈ ఫౌంటెన్ 85 అడుగుల ఎత్తు, 161 అడుగుల వెడల్పు కలిగివుంది. ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన ఫౌంటెన్లలో ఒకటి. దీనికి ఇటాలియన్ ఆర్కిటెక్ట్ నికోలా సాల్వి రూపమిచ్చారు. పియట్రో బ్రాచి దీనిని నిర్మించారు. దీని నిర్మాణ పనులు 1732లో ప్రారంభమై 1762లో పూర్తయ్యాయి. రోమ్కు వచ్చే దాదాపు ప్రతి పర్యాటకుడు ట్రెవీ ఫౌంటెన్‌లో నాణెం విసురుతాడు. రోమ్ను మరోమారు సందర్శించాలనుకునే పర్యాటకులు ఈ ఫౌంటెన్‌లో నాణేలు విసురుతారట. Tourists throw over €1 million into Italy's Trevi Fountain each year. pic.twitter.com/GVAIfciJSg — Historic Vids (@historyinmemes) March 24, 2024 కాగా ఈ పౌంటెన్లో నాణేలు విసిరేందుకు ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఫౌంటెన్ దగ్గర సినిమా షూటింగ్‌లు, ఫ్యాషన్ షోలు తరచూ నిర్వహిస్తుంటారు. 1954లో విడుదలైన ‘త్రీ కాయిన్స్ ఇన్ ది ఫౌంటెన్’ అనే హాలీవుడ్ చిత్రం ఈ ఫౌంటెన్ ఇతివృత్తం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ ఫౌంటెన్ మరింత ఫేమస్‌గా మారింది. . -
9 లక్షల ఏళ్ల క్రితం 99 శాతం మానవాళి మాయమైందట!
దాదాపు 9 లక్షల ఏళ్ల క్రితం 99 శాతం మానవాళి ఉన్నపళాన తుడిచిపెట్టుకుపోయిందట. చివరి మంచు యుగం తుదినాళ్లలో చోటు చేసుకున్న విపరీతమైన వాతావరణ మార్పులే ఇందుకు కారణంగా నిలిచాయని అంతర్జాతీయ అధ్యయనం ఒకటే తాజాగా తేలి్చంది. అయితే నేటి ఆధునిక మానవుని పూరీ్వకులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి కూడా ఈ మహా ఉత్పాతం పరోక్షంగా కారణమైందని చెబుతోంది. చాన్నాళ్ల క్రితం. అంటే దాదాపు 9.3 లక్షల నుంచి 8.13 లక్షల ఏళ్ల క్రితం. పర్యావరణ పరంగా భూమ్మీద కనీ వినీ ఎరుగని ఉత్పాతం సంభవించింది. ఈ మహోత్పాతం వల్ల అప్పటి జనాభాలో ఏకంగా 98.9 శాతం తుడిచిపెట్టుకుపోయిందట. దాని బారినుంచి కేవలం 1,300 మంది మాత్రమే బతికి బట్టకట్టారట. మన పూరీ్వకులైన హోమోసెపియన్లు వీరినుంచే పుట్టుకొచ్చారట. చివరి మంచు యుగపు తుది నాళ్లలో ఈ పెను ఉత్పాతం జరిగింది. అధ్యయనం ఇలా... ► రోమ్‌లోని సపియెంజా వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లారెన్స్ నిపుణులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ► ఆ యుగంలో జరిగిన తీవ్ర వాతావరణ మార్పులు మానవ జాతి వినాశనానికి కారణంగా మారినట్టు వారు తేల్చారు. ► అధ్యయనం కోసం 50కు పైగా విభిన్న దేశాలకు చెందిన 3,154 మంది సంపూర్ణ జన్యుక్రమాలను లోతుగా విశ్లేíÙంచారు. ► ఇందుకోసం ఫిట్ కోల్ అనే సరికొత్త బయో ఇన్ఫర్మాటిక్స్ పద్ధతిని అనుసరించారు. ► ఈ డేటాను నాటి వాతావరణ, శిలాజ సమాచారంతో పోల్చి చూశారు. ► హోమోసెపియన్ల ఆవిర్భావానికి కాస్త ముందు.. పూర్వ చారిత్రక యుగపు మిస్టరీల్లోకి తొంగిచూసేందుకు ఈ కొత్త వివరాలు ఎంత ఉపయోగపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. ► ఈ డేటాను నాటి వాతావరణ, శిలాజ సమాచారంతో పోల్చి చూశారు. ► హోమోసెపియన్ల ఆవిర్భావానికి కాస్త ముందు.. పూర్వ చారిత్రక యుగపు మిస్టరీల్లోకి తొంగిచూసేందుకు ఈ కొత్త వివరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. ► జెనెటిక్ బాటిల్ నెక్‌గా పిలుస్తున్న ఈ మహోత్పాతానికి నాటి మంచు యుగ సంధి సందర్భంగా చోటు చేసుకున్న తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమని తేలింది. ► ఆ దెబ్బకు నేటి ఆఫ్రికా ఖండమంతా ఎండిపోయి మరు భూమిగా మారిందట. ► మానవులతో పాటు ఏనుగుల వంటి భారీ క్షీరదాలన్నీ దాదాపుగా అంతరించాయట. ► ఆ దెబ్బకు దాదాపు 3 లక్షల ఏళ్ల పాటు మానవ ఉనికి ఉందా లేదా అన్నంత తక్కువ స్థాయికి పడిపోయిందట. ► ఆ సమయం నాటి శిలాజాల్లో మానవ అవశేషాలు అసలే దొరక్కపోవడం కూడా దీన్ని ధ్రువీకరిస్తోంది. ► ఈ అధ్యయన వివరాలు జర్నల్ సైన్స్‌లో పబ్లిష్ అయ్యాయి. ‘నాటి మంచు యుగపు మహోత్పాతం మానవ వికాసంలో ఒక రకంగా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. తదనంతరం పుట్టుకొచ్చిన ఆదిమ మానవ సంతతే ఆఫ్రికా నుంచి యురేషియాకేసి విస్తరించింది. ఈ విస్తరణ ఆఫ్రికాలో హోమోసెపియన్లు, యూరప్‌లో నియాండర్తల్, ఆసియాలో దేనిసోవన్ల ఆవిర్భావానికి కారణమైంది‘ – ఫాబియో డీ విన్సెంజో – నేషనల్ డెస్క్, సాక్షి -
మస్క్ & జుకర్‌బర్గ్ పోరుకి అంతా సిద్ధం.. వేదిక అక్కడే?
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఎలాన్ మస్క్ & మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు దీనికి చరమ దశ వచ్చిందా అన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ప్లేస్ కూడా ఫిక్స్ చేసినట్లు టెస్లా సీఈఓ ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈ ఫైట్ మస్క్ అండ్ జుక్ ఫౌండేషన్ల ద్వారా నిర్వహిచనున్నట్లు తెలుస్తోంది. దీనికి రోమ్ నగరం వేదిక కానున్నట్లు, ఇప్పటికే ఇటలీ ప్రధానితో, అక్కడి సాంస్కృతిక శాఖామంత్రితో మాట్లాడినట్లు మస్క్ ట్వీట్ చేశారు. దీని ద్వారా వచ్చే డబ్బు మొత్తం స్వచ్చంద సంస్థలకు వెళ్లనున్నట్లు ఇదివరకే తెలియజేసారు. మెటా అండ్ ఎక్స్ ద్వారా ఈ ఫైట్ లైవ్ చూడవచ్చని వెల్లడించారు. ఇప్పటికే జరగాల్సిన ఈ ఫైట్ మస్క్ ఆరోగ్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అంతే కాకుండా ఈ పోరుకి తానూ ఎప్పుడూ సిద్దమే అన్నట్లు గతం నుంచి జుకర్‌బర్గ్ చెబుతూనే ఉన్నాడు. అయితే ఇప్పటికి కూడా ఈ ఫైట్ జరుగుతుందా? లేదా అనేదాని మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు డేట్ కూడా ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: మొబైల్ కనిపించకుండా పోయిందా? డోంట్ వర్రీ - పరిష్కారమిదిగో..! ఈ కేజ్ ఫైట్ కోసం ఇప్పటికే ప్రపంచంలోని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ పోరు జరిగితే ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ఎంతోమందిలో రోజురోజుకి ఎక్కువవుతోంది. బహుశా ఇది త్వరలోనే జరిగే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. The fight will be managed by my and Zuck’s foundations (not UFC). Livestream will be on this platform and Meta. Everything in camera frame will be ancient Rome, so nothing modern at all. I spoke to the PM of Italy and Minister of Culture. They have agreed on an epic location. — Elon Musk (@elonmusk) August 11, 2023 -
Shriya Saran: రోమ్ వీధుల్లో భర్తతో శ్రియ రొమాన్స్ (ఫోటోలు)
-
చీర అందమే అందం! ఇటలీ వాసులనే ఫిదా చేసింది!
విదేశాల్లో ఉంటే కచ్చితంగా ఏ దేశస్తులైనా అక్కడి ఆహార్యానికి తగ్గట్టుగా ఉంటాం. మన సంప్రదాయాలకు సంబంధించిన దుస్తులు పర్సనల్‌గానే వాడతాం గానీ. అంత తేలిగ్గా అవి వేసుకుని బయటకు రాం. లేదా అక్కడ మన కమ్యూనిటీ వాళ్లు ఉంటే..అంతా ఒకచోట కలిస్తే గనుక మన దేశ సంప్రదాయాన్ని ఫాలో అవుతాం. అలా కాకుండా ఎలాంటి సందర్భం లేకుండా ఫారినర్స్ రద్దీగా ఉండేచోట మనం గనుక మన వేషధారణలో కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. అలాంటి వీడియోని పల్లవి రాజ్ అనే కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయడంతో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఓ మహిళ ఇటలీలోని రోమ్ వీధుల గుండా ఓ మహిళ చీర కట్టుకుని ఓ దేవతా మాదిరి వెళ్లింది. అక్కడ సరిగ్గా వందలాదిమంది విదేశీయులు బారులుతీరి ఉన్నారు. వారంతా ఒక్కసారిగా ఆమె వంకే చూస్తూ ఉండిపోయారు. మరికొందరూ ఫోటోలు తీశారు. మరికొందరూ వావ్ అంటూ నోరెళ్లబెట్టారు కూడా. ఎక్కడైన మన సంప్రదాయానికి అందరూ ఫిదా కావల్సిందే కదా. ఎప్పటకీ మన చీరే ట్రెండీ ఫ్యాషన్ దానికి మించిది మరోకటి లేదు అని మరోసారి రుజువైంది. View this post on Instagram A post shared by Pallavi Raj (@myshadowbeats) (చదవండి: 46 వేల ఏళ్లనాగి పురుగుకి జీవం పోస్తే..పిల్లల్ని కనడం ప్రారంభించింది!) -
రోమ్ వీధుల్లో రొమాన్స్.. పబ్లిక్‌లో స్టార్ కపుల్ లిప్ లాక్!
ప్రియాంక చోప్రా బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె హాలీవుడ్లో బిజీగా ఉన్నారు. రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. తాజాగా లండన్‌లో నిర్వహించిన సిటాడెల్ ప్రీమియర్‌లో ప్రియాంక చోప్రా కూడా పాల్గొన్నారు. ఇంగ్లీష్‌లో రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించారు. ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్లో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ సిటాడెల్ ఏప్రిల్ 28న అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం తన భర్త, హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌తో కలిసి రోమ్ వేకేషన్ వెళ్లింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను నిక్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అందులో రోమ్ వీధుల్లో నడుస్తూ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది ఈ జంట. ఆ వీడియోలో ప్రియాంక, నిక్ జోనాస్ లిప్ కిస్ చేస్తూ కనిపించారు. అక్కడే ఇద్దరూ కలిసి ఐస్‌క్రీం తింటూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ 2018 డిసెంబర్లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. జనవరి 2022లో సరోగసీ ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చారు. వీరి కూతురికి మాల్టీ మేరీ అని పేటు పెట్టారు. ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) -
అస్వస్థతకు గురైన పోప్.. ఆస్పత్రిలో చేరిక
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ అస్వస్థతో బుధవారం ఆస్పత్రిలో చేరారు. 86 ఏళ్ల పోప్ శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు, ఆయన్ని రోమ్‌లోని(ఇటలీ) జెమెల్లీ ఆస్పత్రిలో చేరినట్లు వాటికన్ సిటీ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. మరికొన్ని రోజులు ఆయన ఆస్పత్రిలోనే ఉంటారని తెలుస్తోంది. అయితే శ్వాస కోశ సంబంధిత సమస్యలే అయినప్పటికీ.. ఆయన కోవిడ్ సోకలేదని స్పష్టం చేసింది ఆ ప్రకటన. ఆయన అనారోగ్యంపై వార్తలు బయటకు రాగానే.. త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు పంపుతున్నారు పలువురు. గత కొంతకాలంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏడాదికాలంగా పలు ముఖ్యకార్యక్రమాలకు ఆయన గైర్హాజరు అవుతున్నారు. ఇదీ చదవండి: ప్రజల ఇష్టానుసారమే నిర్ణయం తీసుకుంటాం! -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతి.. కానీ..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతి. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉందిది. రోమ్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన వియా వెనెటోకు కూతవేటు దూరంలో ఉన్న ఈ భవంతి పదహారో శతాబ్దం నాటిది. దీని సీలింగ్‌పై ఆనాటి సుప్రసిద్ధ ఇటాలియన్ చిత్రకారుడు కరవాగియో చిత్రించిన మ్యూరల్స్ ఈ భవంతికి ప్రత్యేక ఆకర్షణ. దాదాపు 70 ఎకరాల ప్రాంగణంలో ఉన్న ఈ భవంతి విస్తీర్ణం 30 వేల చదరపు అడుగులు. ఇటలీలోని ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన లుదోవిసీ కుటుంబానికి చెందిన ఈ భవంతిలో ప్రస్తుతం ప్రిన్స్ నికోలా లుదోవిసీ బోన్‌కాంపానీ మూడో భార్య ప్రిన్సెస్ రీటా బోన్‌కాంపానీ లుదోవిసీ ఉంటున్నారు. ప్రిన్స్ నికోలో మొదటి భార్య సంతానం ఆస్తి కోసం దావా వేయడంతో ఈ భవంతిని ఇప్పుడు వేలం వేసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ భవంతికి 53,900 కోట్ల డాలర్లు (రూ. 44.31 లక్షల కోట్లు) ఉంటుందని అధికారుల అంచనా. ఈ ఏడాది జనవరిలోను, ఆ తర్వాత ఏప్రిల్లోను దీనికి వేలం ప్రకటించినా, దీనిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అపర కుబేరులెవరైనా ముందుకొస్తే తప్ప ఈ భవంతిని వేలంలో అమ్మడం సాధ్యం కాదని ఇటాలియన్ అధికారులు అంటున్నారు. వేలంలో కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దీనిని ఇటాలియన్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తే బాగుంటుందని ప్రిన్సెస్ రీటా దాదాపు 40 వేల సంతకాలతో ప్రభుత్వానికి ఒక పిటిషన్‌ను సమర్పించారు. అయితే, ఈ భవంతి విలువ ఇటలీ సాంస్కృతిక శాఖ బడ్జెట్‌కు మించి ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చదవండి: ఉద్యోగులకు ఊహించని షాక్!..ట్విటర్,మెటా బాటలో మరో దిగ్గజ సంస్థ! -
Ancient Slave Room: రెండు వేల ఏళ్ల నాటి బానిస గది ఇదిగో..!
Archaeologists Discover slave Room at Pompeii: రాజులు బానిసలను ప్రత్యేకమైన దీవులు, గుహలు, గదుల్లో బంధించినట్లు చర్రితలో చదివాం. అయితే ఈ ఆధునిక కాలంలో బానిస వ్యవస్థ దాదాపు లేదు అనటంలో సందేహం లేదు. అయితే పురాతన కాలంలో బానిసలకు సంబంధించిన విషయాలు ఆసక్తిగా ఉండటంతో పాటు భయం గొల్పుతాయి కూడా! అయితే తాజాగా ఇటలీలోని రోమ్‌లో ఓ పురాతన ‘బానిస గది’ తవ్వకాల్లో బయటపడింది. పాంపీ పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఈ గది బయటపడింది. సుమారు రెండు వేల ఏళ్ల క్రితం వెసువియస్ పర్వతం విస్ఫోటనం వల్ల వెలువడిన బూడిద కింద పాంపీ నగరం సమాధి అయిపోయిన విషయం తెలిసిందే. సివిటా గియులియానా విల్లాలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ బానిసరూంలో మూడు బెడ్స్, ఒక మట్టి కుండ, చెక్కపెట్టెను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గదిలోని మంచాలు 1.7 మీటర్ల పోడవు, 1.4 మీట్లర్ల వెడల్పుతో ఉన్నాయి. వాటితోపాటు కుండలు, కొని ఇతర వస్తువులు కూడా లభించాయి. వాటిని చూస్తే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బానిసలు ఈ గదిలో ఉన్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ గది గోడకు ఓ చిన్న కిటికి ఉండి.. గోడలకు ఎటువంటి అలంకరణ లేకుండా ఉన్నాయని తెలిపారు. అక్రమ తవ్వకాలు జరిగి కొంతమంది ఇక్కడ లభించే కళాఖండాలను అమ్ముకుంటున్నారని పురావస్తు శాస్త్రవేత్తలు అధికారికంగా 2017లో తవ్వకాలు ప్రారంభించారు. ‘బానిస గది’ పై స్పందించిన పాంపీ డైరెక్టర్ జనరల్ గాబ్రియేల్ జుచ్ట్రిగెల్ మాట్లాడుతూ.. చరిత్రక మూలాల్లో అరుదుగా కనిపించే వ్యక్తులకు సంబంధించిన వాస్తవికత బయటకు వచ్చిందని తెలిపారు. పురాతనమైన కాలానికి చెందినవారు ఎలా జీవించారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. తన జీవితంలో ఇది ఓ గొప్ప తవ్వకమని పేర్కొన్నారు. -
2050 నాటికి కర్బన ఉద్గారాల తటస్థీకరణ
రోమ్: భూగోళంపై జీవజాలం మనుగడకు పెనుముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పుల పట్ల జి–20 దేశాల అధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్యం పెరగడంతోపాటు భూమి వేడెక్కడానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను 2050 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలని తీర్మానించారు. కర్బన ఉద్గారాల తటస్థీకరణ కచ్చితంగా సాధించాలని నిర్ణయానికొచ్చారు. అంతేకాకుండా విదేశాల్లో బొగ్గు ఆధారిత(థర్మల్) విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు ఇకపై ఎలాంటి ఆర్థిక సాయం అందించరాదని ప్రతిన బూనారు. కోవిడ్–19 మహమ్మారిపై పోరాటంలో వ్యాక్సిన్లే అతిపెద్ద ఆయుధాలని అంగీకరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సిన్ల పంపిణీని పెంచడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇటలీ రాజధాని రోమ్‌లో రెండు రోజులపాటు జరిగిన జి–20 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. సదస్సులో పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఈ తీర్మానాల గురించి వివరిస్తూ ‘రోమ్ డిక్లరేషన్’ జారీ చేశారు. అవేమిటంటే... ► బొగ్గును మండించి, విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండడంతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీని అడ్డుకోవడానికి విదేశాల్లో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు రుణ సాయంనిలిపివేయాలి. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిరుత్సాహపర్చాలి. ఈ ఏడాది ఆఖరి నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావాలి. చైనా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలు ఇప్పటికే ఈ తరహా తీర్మానాలు చేసుకున్నాయి. అయితే, సొంత దేశాల్లో బొగ్గు వాడకం తగ్గించుకోవడంపై జి–20 నేతలు లక్ష్యాలను నిర్దేశించుకోలేదు. ► వాతావరణ మార్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద దేశాలకు సాయం చేయడానికి గతంలోనే అంగీకరించినట్లుగా ధనిక దేశాలు ప్రతిఏటా 100 బిలియన్ డాలర్లు సమీకరించాలి. పేద దేశాలకు రుణ సాయాన్ని పెంచాలి. ► కర్బన తటస్థీకరణ లేదా ‘నెట్ జీరో’ ఉద్గారాల లక్ష్య సాధనకు అందరూ కట్టుబడి ఉండాలి. ఈ శతాబ్ధి మధ్య నాటికి..అంటే 2050 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలి. వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు, వాతావరణం నుంచి తొలగించే ఉద్గారాల మధ్య సమతూకం ఉండడమే కర్బన తటస్థీకరణ. అంటే ఏ మేరకు ఉద్గారాలు విడుదలవుతాయో అంతేస్థాయిలో వాటిని వాతావరణం నుంచి తొలగించాలి. ► 2021 ఆఖరుకల్లా ప్రపంచంలో కనీసం 40% మందికి కరోనా టీకా ఇవ్వాలి. 2022 జూన్ ఆఖ రుకి 70% మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి. టీకా సరఫరాలో అవరోధాలను తొలగించాలి. ► కరోనాతో నిలిచిపోయిన అంతర్జాతీయ ప్రయాణాలను తగిన రీతిలో పునఃప్రారంభించాలి. ► కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ కార్మికులకు, అంతర్జాతీయ సంస్థలకు, సైంటిస్టులకు కృతజ్ఞతలు. ► ఆహార భద్రతను సాధించాలి. ప్రజలందరికీ అవసరమైన పౌష్టికాహారం అందించాలి. ఈ విషయంలో ఎవరినీ విస్మరించడానికి వీల్లేదు. స్పెయిన్ ప్రధాని శాంచెజ్‌తో మోదీ భేటీ భారత్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో మ రిన్ని పెట్టుబడులు పెట్టాలని స్పెయిన్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఆయన రోమ్‌లో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో భేటీ అయ్యారు. పరస్పర ప్రయోజనాలున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఏంజెలా మెర్కెల్‌తో సమావేశం ప్రధాని మోదీ రోమ్‌లో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తోనూ సమావేశమయ్యారు. భారత్–జర్మనీ నడుమ ద్వైపాక్షిక సంబంధాలపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతోనూ మోదీ సమావేశమయ్యారు. జి–20 భేటీకి హాజరైన నేతలు ఆదివారం రోమ్‌లోని ప్రముఖ ట్రెవి ఫౌంటెయిన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వీరు తమ భుజాలపై నుంచి నాణేన్ని ఫౌంటెయిన్లోకి విసిరారు. ఫౌంటెయిన్‌లో పడేలా నాణెం విసిరిన వారు రోమ్కు మరోసారి వస్తారనే నమ్మిక ఉంది. భారత ప్రధాని మోదీతోపాటు నాణేన్ని విసిరిన వారిలో స్పెయిన్ ప్రధాని శాంచెజ్, ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్, జర్మనీ ఛాన్సెలర్ మెర్కెల్, ఇటలీ ప్రధాని ద్రాఘి ఉన్నారు. -
ఫ్రాన్స్ అధ్యక్షుడు, సింగపూర్ ప్రధానితో మోదీ భేటీ
జి–20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోమ్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో భేటీ అయ్యారు. భారత్–ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మాక ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర, అంతర్జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ వెంట విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భదత్రా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు. మోదీ, మాక్రాన్ నడుమ ఫలవంతమైన చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువరూ అభిప్రాయాలను పంచుకున్నారని వెల్లడించింది. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడనున్నాయని పేర్కొంది. నరేంద్ర మోదీ రోమ్‌లో సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్‌తోనూ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను ఈ సందర్భంగా సమీక్షించారు. లూంగ్‌తో మోదీ ఫలవంతమైన చర్చలు జరిపారని భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్విట్టర్లో వెల్లడించింది. భారత సంతతి ప్రజలతో సమావేశం ఇటలీలోని పలువురు భారత సంతతి ప్రజలు, భారతీయులను కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారు. ఈ మేరకు ఫొటోలను మోదీ ట్విట్టర్లో పంచుకున్నారు. -
500 కోట్ల టీకా డోసులు
రోమ్: వచ్చే ఏడాది చివరి నాటికల్లా 500 కోట్లకుపైగా కోవిడ్–19 టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తద్వారా తమ దేశంతోపాటు ఇతర దేశాలకూ మేలు జరుగుతుందని అన్నారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రపంచానికి భారత్ తనవంతు సాయం కచ్చితంగా అందిస్తుందని తెలిపారు. తమ దేశంలో ఇప్పటికే 100 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశామని గుర్తుచేశారు. ఆయన శనివారం రోమ్‌లో ప్రారంభమైన జి–20 దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సులో ‘గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ హెల్త్’ అంశంపై మాట్లాడారు. కరోనాపై పోరులో భారత్ పోషిస్తున్న పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో నిబంధనలను మరింత సరళతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పరం గుర్తించే విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఒక యంత్రాంగం ఉండాలని సూచించారు. భారత్‌లో దేశీయంగానే అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కోవాగ్జి న్’కు అత్యవసర వినియోగ అనుమతి ప్రక్రియ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వద్ద పెండింగ్‌లో ఉందని మోదీ గుర్తుచేశారు. త్వరగా అనుమతి లభిస్తే ఇతర దేశాలకు టీకాల విషయంలో సాయం చేసేందుకు ఆస్కారం ఉంటుందని వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో భారత్ నుంచి 150 దేశాలకు అవసరమైన అత్యవసర ఔషధాలు, వైద్య పరికరాలు పంపించామని వివరించారు. సాహసోపేత ఆర్థిక సంస్కరణలు కనిష్ట కార్పొరేట్ ట్యాక్స్‌ను 15 శాతంగా నిర్ధారిస్తూ జి–20 తీసుకున్న నిర్ణయం పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలను శ్రీకారం చుట్టామన్నారు. కరోనా ప్రభావం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవాలంటే అన్ని దేశాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటంతోపాటు ఆరోగ్య రంగంలో భవిష్యత్తుల్లో తలెత్తబోయే దుష్పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని చెప్పారు. ఈ దిశగా ‘వన్ ఎర్త్, వన్ హెల్త్’ అనే సంకల్పాన్ని తీసుకోవాలని కోరారు. రోమ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమాల వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్ శ్రింగ్లా మీడియాకు తెలియజేశారు. పేద దేశాలకు మరిన్ని టీకాలు: ఇటలీ ప్రధాని ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలతో కూడిన జి–20 శిఖరాగ్ర సదస్సు శనివారం ఇటలీ రాజధాని రోమ్‌లోని నువొలా కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా ప్రారంభమయ్యింది. అతిథ్య దేశం ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ ప్రారంభోపన్యాసం చేశారు. జి–20 దేశాల అధినేతలకు స్వాగతం పలికారు. పేద దేశాలకు కోవిడ్–19 వ్యాక్సిన్లు మరిన్ని అందించాలని జి–20 సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. కరోనా టీకాల పంపిణీ విషయంలో ధనిక దేశాలు, పేద దేశాల మధ్య అంతరం నైతికంగా ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లో ఇప్పటివరకు కేవలం 3 శాతం మందికే పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ జరిగిందని గుర్తుచేశారు. ఇక ధనిక దేశాల్లో 70 శాతం మంది కనీసం ఒక్క డోసైనా తీసుకున్నారని తెలిపారు. తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు మరింత చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. శిఖరాగ్ర సదస్సులో తొలిరోజు ప్రధానంగా ప్రపంచ ఆరోగ్య, ఆర్థిక రంగాలపై చర్చించారు. ఈ సదస్సు ఆదివారం కూడా కొనసాగనుంది. సోమవారం నుంచి స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. -
ఈయూతో బంధం పదిలం
రోమ్: యూరోపియన్ యూనియన్(ఈయూ), భారత్ మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. జి–20 సదస్సులో పాల్గొనడానికి యూరప్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇటలీలోని రోమ్‌లో ఈయూ అత్యున్నత అధికారులతో సమావేశమై చర్చలు జరిపారు. కోవిడ్–19 మహమ్మారి విసురుతున్న సవాళ్లు, ఈయూ–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం, అఫ్గానిస్తాన్, ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్యం, వాణిజ్యం, సంస్కృతి, పర్యాటకం తదితర రంగాల్లో భారత్, ఈయూ మధ్య బంధాన్ని మరింత సుదృఢం చేసుకోవాలని నిర్ణయించారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిషెల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లెయన్‌తో లోతైన చర్చలు జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది. ఆర్థిక రంగంలో సహకారంతో పాటు, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలను పెంచి, మెరుగైన సమాజాన్ని స్థాపించడానికి కృషి చేయాలని ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చినట్టుగా పేర్కొంది. మరోవైపు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ పచ్చదనం నెలకొల్పడంలో భారత్ కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో పట్టు కోసం చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ అభిప్రాయాలను గౌరవిస్తామని ఈయూ హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ శనివారం నుంచి జి–20 భేటీకి రానున్నారు. మోదీకి ఈయూ అభినందనలు భారత్‌లో తక్కువ వ్యవధిలోనే 100 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినందుకు గాను ప్రధాని మోదీని ఈయూ అధికారులు అభినందించారు. ఆయనను కలుసుకోవడం ఆనందంగా ఉందని, ఇరుపక్షాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం సరైన పట్టాలు ఎక్కిందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు లెయెన్ పేర్కొన్నారు. జాతిపితకు ప్రధాని నివాళులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోమ్‌లో శుక్రవారం భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘‘ఎవరి ఆదర్శాలైతే ప్రజల్లో ధైర్య సాహసాలను నింపుతాయో, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తాయో అలాంటి మహాత్ముడికి రోమ్‌లో నివాళులర్పించే అరుదైన అవకాశం నాకు లభించింది’’ అని మోదీ అనంతరం ట్విట్టర్లో పేర్కొన్నారు. అనంతరం ప్రధాని రోమ్‌లో ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు మోదీకి డ్రాఘీ ఘన స్వాగతం పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. -
రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ
-
జి–20 సదస్సుకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఇటలీలోని రోమ్‌లో ఈ నెల 30న ప్రారంభం కానున్న జి–20 దేశాల అధినేతల 16వ శిఖరాగ్ర సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు విదేశాంగ శాఖ ఆదివారం వెల్లడించింది. ప్రధాని ఈ నెల 29 నుంచి నవంబర్ 2వ తేదీదాకా ఇటలీతోపాటు యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో పర్యటిస్తారని తెలియజేసింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)–26 ప్రపంచ దేశాల అధినేతల సదస్సులోనూ ఆయన పాల్గొంటారని పేర్కొంది. జి–20 కూటమికి ప్రస్తుతం ఇటలీ నాయకత్వం వహిస్తోంది. ఈ నెల 30, 31న.. రోమ్‌లో రెండో రోజులపాటు జరిగే శిఖరాగ్ర సదస్సుకు ఆ దేశమే ఆతిథ్యం ఇస్తోంది. అఫ్గానిస్తాన్ పరిణామాలు, వాతావరణ మార్పులు మానవాళికి విసురుతున్న సవాళ్లు, కరోనా వైరస్ వంటి కీలక అంశాలపై జి–20 సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. 1999 నుంచి జి–20 సదస్సును ప్రతిఏటా నిర్వహిస్తున్నారు. కాప్–26 సదస్సు ఈ నెల 31 నుంచి నవంబర్ 12 దాకా యూకేలోని గ్లాస్గోలో జరగనుంది. -
నేను మరణించాలని కోరుకున్నారు: పోప్
రోమ్: క్యాథలిక్ క్రైస్తవుల మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మరణించాలని చర్చికే చెందిన కొందరు అధికారులు కోరుకు న్నారని వ్యాఖ్యానించారు. ఇటీవలే ఆయనకు ఉదర సంబంధిత సర్జరీ జరిగింది. సర్జరీ సమయానికి తాను తీవ్ర అస్వస్థతతో ఉన్నానని వారు భావించారంటూ సంప్రదాయవాదులను ఉద్దేశించి అన్నారు. తాను మరణించాలని వారు కోరు కున్నారని చెప్పారు. గత వారం ఆయన స్లొవేకియా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఓ మీడియాకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. తాను మరణిస్తే తదుపరి పోప్‌ను ఎన్నుకోవడానికి కూడా వారు సిద్ధమయ్యారని, కానీ దేవుడి దయ వల్ల తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు. లాటిన్ భాషా పూజా విధానం కారణంగా చర్చిలో చీలికలు వస్తున్నాయని అంతర్గత నివేదికల ద్వారా గ్రహిం చిన పోప్ ఫ్రాన్సిస్, దానిపై ఆంక్షలు పెట్టారు. ఇది చర్చిలోని సంప్రదాయవాదులకు నచ్చలేదు. దీంతో పాటు ఆయన తీసుకునే పలు నిర్ణయాలు సంప్రదాయవాదులకు కోపం తెప్పిస్తున్న నేపథ్యంలో పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
త్వరపడండి.. ఇళ్లు ఖరీదు కేవలం రూ. 87 మాత్రమే
రోమ్: మీరు ఇల్లు కొనాలి అనుకుంటున్నారా..? అయితే త్వరపడండి ఇది మీకు మంచి అవకాశం. అతి చౌకైన ధరకే ఇళ్లు అందుబాటులో ఉన్న సంగతి మీకు తెలుసా..? అత్యంత సుందరమైన ప్రదేశంలో అది కూడా అన్ని వసతులతో నిండి ఉన్న ఇళ్లు అమ్మకానికి ఉన్నాయి. ఎంత చౌక అంటే ఆ ఇంటి విలువ కేవలం రూ. 87 రూపాయలు మాత్రమే. నమ్మడం కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజం. అయితే ఈ చాన్స్ మన దేశంలో కాదు. ఇటలీలో మాయోంజా అనే అందమైన పట్టణం ఉంది. ఇది రోమ్కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణంలో ఇళ్లు ఒక యూరో కంటే తక్కువ ధరకే అక్కడి ప్రభుత్వం వారు విక్రయిస్తున్నారు. మరి ఇంత అందమైన నగరంలో, సువిశాలమైన ఇళ్లను ఎందుకు ఇంత తక్కువ ధరకే అమ్ముతున్నారంటే ఆ ప్రదేశంలోని 90 శాతం ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. దానితో ఎంతో అందమైన ఈ ప్రదేశం ఇప్పుడు ఎవరూ నివసించకపోవడంతో బోసిపోయింది. అందుకే అక్కడి ప్రభుత్వం వారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మాయోంజాలోని ఇళ్లల్లో ప్రజలు నివాసముండడానికి ప్రోత్సహించేందుకు అతి తక్కువ ధరకే ఈ ఇళ్లను విక్రయిస్తున్నారు. మాయోంజా నగరానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకే ఇలా ఇళ్లను తక్కువ ధరకే విక్రయిస్తున్నామని అక్కడి మేయర్ క్లాడియో స్పెర్డుటి పేర్కొన్నారు. అయతే ఈ ఇళ్లను విడతల వారీగా విక్రయానికి ఉంచనున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే తొలి విడతలో భాగంగా ఇళ్ల కొనుగోళ్లకు సంబందిచిన దరకాస్తుల స్వీకరణ ఈ నెల 28న ముగియనుంది. ఈ పట్టణం ఒకప్పుడు నిత్యం ప్రజలతో కళకళలాడుతూ ఉండేది. అయితే 1968వ సంవత్సరంలో వచ్చిన భూకంపం ప్రభావంతో చాలా మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. దానితో మాయోంజ పట్టణం పూర్తిగా ఖాళీ అయింది. ప్రస్తుతం ప్రజలు నివసించక అక్కడ అన్నీ ఖాళీ ఇళ్లే దర్శనమిస్తాయి. మళ్లీ ఎలాగైనా ఆ పట్టణం జనంతో కళకళలాడేలా చేయాలని ప్రభుత్వం అక్కడి ఇళ్లను అతి తక్కువ ధరకే వేలంలో విక్రయిస్తోంది. అందుకే కనిష్ఠ ధర ఒక యూరోగా నిర్ణయించింది. ఒక యూరో అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 87 రూపాయలు. ఈ ధర చెల్లించి ఇల్లు కొనుక్కోవచ్చు. ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ వేలం పాటల్లోనూ పాల్గొనవచ్చు. టౌన్ అత్యంత పురాతనమైనది కావడంతో ఇక్కడ ఇళ్లు రోడ్డుకు ఇరువైపుల ఒకదానికి దగ్గరగా ఇంకొకటి కలిసి ఉంటాయి. అన్ని కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉండేందుకు ఎంతో బాగుంటుంది కాబట్టి అందరూ ఇళ్లను కొనుక్కోవాలని ప్రోత్సహిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ టౌన్ మళ్లీ జనాభాతో కళకళలాడాలని ఆకాంక్షిస్తోంది. అయితే ఈ ఇళ్లు కొనే ముందు ఒక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే కొనుగోలు చేసిన ఇళ్లను మరమత్తులు చేయించుకోవాలి. వాటిని కొత్త ఇళ్లల్లా తీర్చిదిద్దుకోవాలి. తప్పనిసరిగా మూడు సంవత్సరాలలో కొనుగోలు చేసిన ఇళ్లను పునరుద్ధరించాలి. దానితో పాటు ఒప్పందంలో డిపాజిట్‌గా 5,000 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇళ్లు పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన ఇళ్లలో కచ్చితంగా నివసించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ ఇంటిని పునర్నిర్మాణం చేసి ఎలా ఉపయోగించుకోబోతున్నారో మాత్రం కశ్చితంగా స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి తెలియచేయాలి. వాస్థవానికి ఇటలీలోని గ్రామీన ప్రాంతాల్లో ఈ పధకం మూడేళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇలా ప్రజలు నివసించని నిర్మానుష్యపు ప్రాంతాల్లో ఒకటైన చింక్వా ఫ్రాండీ అనే ప్రాంతంలోని కాళీ ఇళ్లను కేవలం ఒక్క అమెరికన్ డాలరుకే అప్పట్లో అమ్మకానికి పెట్టారు. అలాగే సిసిలియా అనే మరో గ్రామంలోనూ ఇదే తరహాలో ఒక యూరోకే ఇళ్లని విక్రయించడం జరిగింది. మరి ఈ ఆఫర్ ఎంతమంది ప్రజలకి నచ్చుతుందో వేచి చూడాల్సిందే. -
పోప్ ఫ్రాన్సిస్ కీలక నిర్ణయం
రోమ్: క్రైస్తవుల ఆరాధనా పద్ధతికి సంబంధించిన వ్యవహారంపై పోప్ ఫ్రాన్సిస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్చిలో చీలికకు కారణమవుతోందనే కారణంతో ‘లాటిన్ మాస్’పై శుక్రవారం ఆంక్షలు పెట్టారు. ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ చర్యతో మాజీ పోప్ బెనెడిక్ట్16 తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ వ్యతిరేకించినట్లు అయింది. ప్రస్తుతమున్న స్థానిక భాష ఆరాధనా క్రమాన్ని 1960లలో జరిగిన వాటికన్2 సమావేశం నుంచి పాటిస్తున్నారు. అంతకు ముందు ఆ కార్యక్రమాన్ని కేవలం లాటిన్ భాషలోనే ప్రపంచమంతటా నిర్వహించేవారు. అయితే కొన్ని చోట్ల లాటిన్ భాష ఇంకా కొనసాగుతుండగా, పోప్ దానిపై ఆంక్షలు పెట్టారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల బిషప్లెవరూ వారి ప్రాంతాల్లో లాటిన్ మాస్ గ్రూపులు ఏర్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా ఈ ఆంక్షల్లో పోప్ ప్రస్తావించారు. అంతర్గతంగా చర్చిలో జరుగుతున్న వ్యవహారాలపై పోప్ నివేదిక తెప్పించుకోగా, అందులో లాటిన్ మాస్ వ్యవహారంపై ప్రత్యేక గ్రూపులు ఉన్నట్లు తేలింది. దీంతో తప్పక జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత తనపై పడిందని పోప్ పేర్కొన్నారు. ప్రస్తుత పోప్‌పై సంప్రదాయవాదులు ఆయన నిర్ణయంపై వ్యతిరేకత వెలిబుచ్చుతున్నారు. -
ఇటలీ నవ్వింది
‘ఇట్స్ కమింగ్ హోమ్... యూరో కప్ ప్రారంభమైన రోజు నుంచి ఇంగ్లండ్ అభిమానులు ఎప్పటిలాగే ఆశలు, అంచనాలతో హోరెత్తించారు. ఇక 55 ఏళ్ల తర్వాత ఒక మేజర్ టోర్నీలో ఫైనల్ చేరడంతో వారి ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. సొంతగడ్డపై జరిగే తుది పోరులో కచ్చితంగా తమ జట్టే గెలుస్తుందని భావించి ముందస్తు సంబరాలకు సిద్ధమైపోయారు. కానీ యూరో కప్ ఇంగ్లండ్ ఇంటికి రాలేదు. లండన్ నుంచి సుమారు వేయి మైళ్ల దూరంలోని రోమ్ నగరానికి తరలి పోయింది. పెనాల్టీ షూటౌట్ వరకు చేరిన సమరంలో సత్తా చాటిన ఇటలీ యూరప్ చాంపియన్‌గా నిలిచింది. ఆ జట్టు యూరో గెలవడం ఇది రెండోసారి కాగా... ఇంగ్లండ్ తొలి టైటిల్ విజయానికి మరోసారి దూరంగా నిలిచిపోయింది. లండన్: ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీ యూరో కప్ –2020ని ఇటలీ సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఫైనల్లో ఇటలీ పెనాల్టీ షూటౌట్లో 3–2తో ఇంగ్లండ్‌ను ఓడించింది. నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయం కూడా ముగిసిన తర్వాత ఇరు జట్లు 1–1 గోల్స్ స్కోరుతో సమంగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. అంతకుముందు తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ తరఫున 2వ నిమిషంలో ల్యూక్ పాల్ షా గోల్ సాధించగా... రెండో అర్ధభాగంలో లియోనార్డో బొనుసి 67వ నిమిషంలో ఇటలీకి గోల్ అందించి స్కోరు సమం చేశాడు. తాజా విజయంతో వరుసగా 34 మ్యాచ్‌ల పాటు ఓటమి ఎరుగని ఘనతను సాధించిన ఇటలీ 1968 తర్వాత మళ్లీ యూరో ట్రోఫీని గెలుచుకుంది. మేజర్ టోర్నీలలో గతంలో ఆరు సార్లు పెనాల్టీ షూటౌట్లోనే ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు ఈ ఫలితం కూడా అదే వేదనను మిగిల్చింది. ఇటలీ ఖాతాలో నాలుగు ప్రపంచకప్ టైటిల్స్ (1934, 1938, 1982, 2006) కూడా ఉన్నాయి. చాంపియన్ ఇటలీ జట్టుకు కోటి యూరోలు (రూ. 88 కోట్ల 46 లక్షలు), రన్నరప్ ఇంగ్లండ్ జట్టుకు 70 లక్షల యూరోలు (రూ. 61 కోట్ల 91 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. హోరాహోరీ... 90 వేల సామర్థ్యం గల వెంబ్లీ స్టేడియం... కరోనా కారణంగా అధికారికంగా 67 వేల మందికే అనుమతి. అయితేనేం... తమ జట్టు ఆడుతోంది కాబట్టి టికెట్ లేని వీరాభిమానులు కూడా గేట్లు బద్దలు కొట్టి పెద్ద సంఖ్యలో స్టేడియంలోకి దూసుకొచ్చారు. ఫైనల్లో తొలి 30 నిమిషాల ఆట చూస్తే స్థానిక అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసేలా కనిపించింది. ఆట ఆరంభంలోనే ట్రిప్పియర్ ఇచ్చిన హాఫ్ వాలీ క్రాస్ పాస్‌ను నేరుగా ఇటలీ గోల్ పోస్ట్‌లోకి షా పంపడంతో స్టేడియం దద్దరిల్లింది. 1 నిమిషం 57వ సెకన్లో షా చేసిన ఈ గోల్ ఒక యూరో ఫైనల్లో అత్యంత వేగవంతమైన గోల్‌గా గుర్తింపు పొందింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఇటలీ మెల్లగా కోలుకునే ప్రయత్నం చేసింది. జట్టు మిడ్ ఫీల్డర్లు చక్కటి పాస్‌లతో బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఆధిక్యం అందుకున్న తర్వాత కూడా ఇంగ్లండ్ ఆశ్చర్యకరంగా డిఫెన్స్‌కే పరిమితమైంది. ముఖ్యంగా కెప్టెన్ హ్యరీ కేన్ కనీసం ఒక్క గోల్ స్కోరింగ్ అవకాశం కూడా సృష్టించకుండా పేలవ ప్రదర్శన కనబర్చడం జట్టును దెబ్బ తీసింది. రెండో అర్ధ భాగంలో ఇటలీ శ్రమకు తగిన ఫలితం లభించింది. వెరాటీ కొట్టిన హెడర్‌ను ఇంగ్లండ్ కీపర్ పిక్‌ఫోర్డ్ అడ్డుకున్నా... సమీపంలోనే ఉన్న బొనుసి గోల్ పోస్ట్‌లోకి పంపించడంలో సఫల మయ్యాడు. అదనపు సమయంలో మాత్రం ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించి విఫలమమయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించేందకు షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో ఇటలీ 3–2తో ఆధిక్యంలో ఉన్న సమయంలో సాకా గోల్ చేసి ఉంటే మ్యాచ్ సడెన్డెత్కు వెళ్లేది. అయితే తొలిసారి జాతీయ జట్టు తరఫున పెనాల్టీ తీసుకున్న సాకా కొట్టిన కిక్‌ను ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డొనరుమా ఎలాంటి ఆందోళన లేకుండా ఎడమ వైపునకు డైవ్ చేస్తూ కూల్‌గా ఆపడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది. ఇంగ్లండ్ ప్లేయర్ సాకా కొట్టిన చివరి షాట్‌ను నిలువరిస్తున్న ఇటలీ గోల్‌కీపర్ డొనరుమా పునరుజ్జీవం... నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్... 2018లో జరిగిన ప్రపంచకప్‌కు కనీసం అర్హత సాధించలేకపోయింది. ఇటలీ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత విచారకర క్షణాలవి. ప్రదర్శన పాతాళానికి పడిపోయిన జట్టును తీర్చిదిద్దే బాధ్యతను కొత్త కోచ్ రాబర్టో మన్సినీ తీసుకున్నాడు. అక్కడి నుంచి ఇటలీ ‘పునరుజ్జీవం’ పొందింది. ‘యూరో’ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడిన పది మ్యాచ్‌లలో పది కూడా గెలిచి అజేయంగా, అందరికంటే ముందుగా ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. గత ఏడాదే జరగాల్సిన ఈ మెగా టోర్నీ కోవిడ్ కారణంగా ఏడాది వాయిదా పడింది. ఆ సమయంలో ఇటలీ దేశం తీవ్ర క్షోభను అనుభవించింది. కరోనా కారణంగా ఆ దేశంలో ఏకంగా 1 లక్షా 27 వేల మరణాలు నమోదయ్యాయి. 27 దేశాల యూరోపియన్ యూనియన్‌లో ఇదే పెద్ద సంఖ్య. గత 16 నెలల్లో వివిధ రూపాల్లో లాక్డౌన్లను ఎదుర్కొన్న ఇటలీకి ‘యూరో’ కొత్త ఆరంభాన్నిచ్చింది. ఈ టోర్నీలో సొంతగడ్డ రోమ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లను గెలిచిన జట్టు అభిమానులకు ఆనందాన్ని పంచింది. ఫైనల్‌తో కలిపి ఇటలీకి వరుసగా 34 మ్యాచ్‌లలో ఓటమి అనేదే లేదు. అసాధారణ పరిస్థితులను అధిగమించి, తమకు ఊరటనందిస్తూ సాధించిన ఈ విజయానికి యావత్ ఇటలీ పులకించిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఆ ముగ్గురిపై ఆగ్రహం... 19, 21, 23... ఇంగ్లండ్ తరఫున మూడు పెనాల్టీలు వృథా చేసిన బుకాయో సాకా, జేడన్ సాంచో, మార్కస్ రాష్ఫోర్డ్ల వయసులు ఇవి. చెప్పుకోదగ్గ అంతర్జాతీయ అనుభవం లేని కుర్రాళ్లు. అత్యుత్తమ కోచ్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన సౌత్‌గేట్ ప్రణాళిక పెనాల్టీల విషయంలో తప్పుగా తేలింది. ఫామ్‌లో ఉన్న స్టెర్లింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడం, ఇద్దరు సీనియర్లు హ్యరీ కేన్, హ్యారీ మాగ్వైర్ తొలి రెండు పెనాల్టీలు తీసుకొని కీలకమైన, తీవ్ర ఒత్తిడి ఉండే మిగతా పెనాల్టీలను యువ ఆటగాళ్లకు వదిలేయడం కూడా పెద్ద తప్పే. మ్యాచ్ ఫలితం తర్వాత నల్ల జాతీయులైన ఈ ముగ్గురు యువ ఆటగాళ్లపై దురదృష్టవశాత్తూ ఇంగ్లండ్ అభిమానులు వర్ణ వివక్ష వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు. తీవ్ర పదజాలంతో వారిని దూషిస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడంపై ఫుట్‌బాల్ సమాజం అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు ఓటమి అనంతరం ఇంగ్లండ్ వీధుల్లో కూడా అభిమానులు వీరంగం సృష్టించారు. లీసెస్టర్ స్క్వేర్ వద్ద చెత్త పోసి బాటిల్స్ తగలబెట్టి రచ్చ రచ్చ చేశారు. మ్యాచ్ ముగియగానే పలువురు ఇటలీ అభిమానులపై దాడులు కూడా చేయడం విషాదం! అవార్డులు గోల్డెన్ బూట్ (టోర్నీ టాప్ స్కోరర్) క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–5 గోల్స్) గోల్డెన్ బాల్ (టోర్నీ బెస్ట్ ప్లేయర్) డొనరుమా (ఇటలీ) -
మ్యాచ్ మధ్యలో కుప్పకూలిన ఫుట్‌బాల్ ప్లేయర్
రోమ్: యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. కొపెన్‌హగన్ వేదికగా డెన్మార్క్, ఫిన్లాండ్ జట్ల మధ్య గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో అంతరాయం ఏర్పడింది. 42వ నిమిషంలో ఒక్కసారిగా డెన్మార్క్ ఆటగాడు క్రిస్టియాన్ ఎరిక్సన్ మైదానంలో కుప్పకూలిపోయాడు. అతన్ని వైద్య సబ్బంది ఆస్పత్రికి తీసుకువెళ్లారు. క్రిస్టియన్ కుప్పకూలడంతో మ్యాచ్‌ను రిఫరీలు రద్దుచేశారు. ఇక క్రిస్టియన్ ఎరిక్సన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అతను స్పృహలోకి వచ్చాడని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. క్రిస్టియన్ త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు, క్రీడా ప్రముఖలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. చదవండి: ఇటలీ శుభారంభం -
అమ్మ, నాన్న ఎక్కడ.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారి
రోమ్: గత ఆదివారం నార్త్ ఇటలీలోని మాగ్గియోర్ సరస్సు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కేబుల్ కార్ బ్రేక్ ఫెయిల్ అయి కొండల్లో పడిపోవడంతో క్యాబిన్‌లోని 14 మంది చనిపోయారు.. కానీ ఒక్కడు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అతనే ఐదేళ్ల పిల్లాడు ఈతాన్ బిరాన్.. యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి కోమాలో ఉన్న ఈతాన్ బిరాన్ శుక్రవారం సృహలోకి వచ్చాడు. కళ్లు తెరిచిన మరుక్షణం.. అమ్మ, నాన్న ఎక్కడ.. వారిని చూడాలి అంటూ ఈతన్ అడిగాడు. కానీ ఆ ప్రమాదంలో అతని పేరెంట్స్‌తో పాటు తమ్ముడు, తాతను కోల్పోయినట్లు అతనికి తెలియదు. ఆ విషయం ఆ పిల్లాడికి ఎలా చెప్పాలో ఆసుపత్రి సిబ్బందికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం బిరాన్‌ను చూసుకోవడానికి పిల్లాడి ఆంటీ ఆయా తోడుగా ఉంది. విషయంలోకి వెళితే.. ఈతన్ బిరాన్.. తండ్రి అమిత్(30), తల్లి తాల్(26),తమ్ముడు టామ్(2)తో పాటు తాత, నానమ్మ కోహెన్(81), కోనిస్కి(71) తో కలిసి నార్త్ ఇటలీలో టూర్‌కి వచ్చాడు. మాగ్గియోర్ సరస్సు వద్ద ఉన్న కేబుల్ కార్లో ఎక్కడానికి వారంతా సిద్దమయ్యారు. ఈ కుటుంబంతో పాటు మరో 8 మంది కూడా క్యాబిన్లో ఎక్కారు. కొద్దిదూరం వరకు బాగానే వెళ్లినప్పటికి మధ్యలో సడెన్‌గా బ్రేక్ డౌన్ అయింది. అయితే దురదృష్టవశాత్తూ కేబుల్ తెగింది. దీంతో కొండ మధ్యలో ఉన్న వాళ్లు దాదాపు 20 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోగా.. చెట్ల మధ్యలో క్యాబిన్ ఇరుక్కుంది. ఈ ప్రమాదంలో ఈతా బిరాన్ ఫ్యామిలీతో సహా మిగతా 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. కానీ బిరాన్ మాత్రం తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న సిబ్బంది హుటాహుటిన ఆ ప్రదేశానికి వెళ్లి చనిపోయినవారిని క్యాబిన్లో నుంచి బయటికి తీశారు. కాగా సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని.. బ్రేక్స్ సరిగా ఉన్నాయోల ఏదో చూసుకోకుండానే ఆపరేషన్ నిర్వహించినట్లు తేలింది. కాగా పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి.. ప్రమాదానికి కారణమైన ముగ్గురి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. -
వెరైటీ ఫుడ్..దాన్ని చూసి నెటిజన్లు షాక్!