రోమ్: వారం రోజుల క్రితం మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) చేతిలో ఎదురైన పరాజయానికి స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ప్రతీకారం తీర్చుకున్నాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–3, 6–4తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జ్వెరెవ్‌పై గెలిచి 12వసారి సెమీఫైనల్ చేరుకున్నాడు. సెమీఫైనల్లో రీలీ ఒపెల్కా (అమెరికా)తో నాదల్ ఆడతాడు.
టర్కీ గ్రాండ్‌ప్రి రద్దు
ఇస్తాంబుల్: టర్కీలో కరోనా కేసుల ఉధృతి తగ్గకపోవడం... అంతర్జాతీయంగా ప్రయాణ ఆంక్షలు కూడా ఉండటంతో... ఇస్తాంబుల్‌లో జూన్ 13న జరగాల్సిన టర్కీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసు రద్దయింది. టర్కీ గ్రాండ్‌ప్రి రద్దు కావడంతో ఎఫ్1 క్యాలెండర్‌లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. జూన్ 27న జరగాల్సిన ఫ్రాన్స్ గ్రాండ్‌ప్రి రేసు జూన్ 20న జరుగుతుంది. ఆస్ట్రియాలో వరుసగా రెండు రేసులు (జూన్ 27న తొలి రేసు, జూలై 4న రెండో రేసు) నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment