
Archaeologists Discover slave Room at Pompeii: రాజులు బానిసలను ప్రత్యేకమైన దీవులు, గుహలు, గదుల్లో బంధించినట్లు చర్రితలో చదివాం. అయితే ఈ ఆధునిక కాలంలో బానిస వ్యవస్థ దాదాపు లేదు అనటంలో సందేహం లేదు. అయితే పురాతన కాలంలో బానిసలకు సంబంధించిన విషయాలు ఆసక్తిగా ఉండటంతో పాటు భయం గొల్పుతాయి కూడా! అయితే తాజాగా ఇటలీలోని రోమ్‌లో ఓ పురాతన ‘బానిస గది’ తవ్వకాల్లో బయటపడింది. పాంపీ పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఈ గది బయటపడింది. సుమారు రెండు వేల ఏళ్ల క్రితం వెసువియస్ పర్వతం విస్ఫోటనం వల్ల వెలువడిన బూడిద కింద పాంపీ నగరం సమాధి అయిపోయిన విషయం తెలిసిందే.
సివిటా గియులియానా విల్లాలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ బానిసరూంలో మూడు బెడ్స్, ఒక మట్టి కుండ, చెక్కపెట్టెను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గదిలోని మంచాలు 1.7 మీటర్ల పోడవు, 1.4 మీట్లర్ల వెడల్పుతో ఉన్నాయి. వాటితోపాటు కుండలు, కొని ఇతర వస్తువులు కూడా లభించాయి. వాటిని చూస్తే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బానిసలు ఈ గదిలో ఉన్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ గది గోడకు ఓ చిన్న కిటికి ఉండి.. గోడలకు ఎటువంటి అలంకరణ లేకుండా ఉన్నాయని తెలిపారు.
అక్రమ తవ్వకాలు జరిగి కొంతమంది ఇక్కడ లభించే కళాఖండాలను అమ్ముకుంటున్నారని పురావస్తు శాస్త్రవేత్తలు అధికారికంగా 2017లో తవ్వకాలు ప్రారంభించారు. ‘బానిస గది’ పై స్పందించిన పాంపీ డైరెక్టర్ జనరల్ గాబ్రియేల్ జుచ్ట్రిగెల్ మాట్లాడుతూ.. చరిత్రక మూలాల్లో అరుదుగా కనిపించే వ్యక్తులకు సంబంధించిన వాస్తవికత బయటకు వచ్చిందని తెలిపారు. పురాతనమైన కాలానికి చెందినవారు ఎలా జీవించారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. తన జీవితంలో ఇది ఓ గొప్ప తవ్వకమని పేర్కొన్నారు.