Archaeologist
-
తాజ్‌మహల్‌ని చూసి.. ముషారఫ్ ఏం అన్నారంటే..
పాక్ మాజీ అధ్యక్షుడు దివంగత పర్వేజ్ ముషారఫ్ 2001లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఆగ్రా సమ్మిట్ కోసం భారత్‌ని సందర్శించారు. అప్పుడు ఆయన తన సతీమణితో కలిసి ఆగ్రాలోని ప్రేమకు స్మారక చిహ్నం అయిన తాజ్‌మహల్‌ని సందర్శించారు. ముషారఫ్ తాజ్ మహల్ నిర్మాణ అద్భుతానికి ఎంతగానో మంత్ర ముగ్దులయ్యారు. ఆ స్మారక చిహ్నాన్ని చూసినప్పుడూ ఆయన అడిగిన మొదటి ప్రశ్న గురించి చెబుతూ.. నాటి సంఘటనను పురావస్తు శాస్తవేత్త కెకె మహ్మద్ గుర్తు చేసుకున్నారు. ముషారఫ్ తాజ్‌మహల్ సందర్శించడానికి వచ్చినప్పుడు మహ్మద్ పురావస్తు శాఖలోని ఆగ్రా సర్కిల్‌కు సూపరింటెండ్ ఆర్కియాలజిస్ట్‌గా ఉన్నారు. ముషారఫ్ తాజ్‌మహల్‌ని చూసిన వెంటనే దీన్ని ఎవరూ రూపొందించారు అని మహ్మద్‌ని ప్రశ్నించారు. బహుశా ఆయన నేను షాజహాన్ అని చెబుతానని అనుకుని ఉండోచ్చు, కానీ నేను ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అని చెప్పానన్నారు మహ్మద్. ఎందుకంటే ఉస్తాద్ లాహోర్కి చెందినవాడు. ముషారఫ్‌కి ఆ ప్రేమ స్మారక చిహ్నం విశిష్టత గురించి చెప్పేందుకు మహ్మద్‌ని టూరిస్ట్ గైడ్‌గా నియమించారు. ఈ స్మారక చిహ్నం ఆప్టికల ఇల్యూషన్ గురించి కూడా చెప్పినట్లు మహ్మద్ గుర్తు చేసుకున్నారు. అంతేగాదు ముషారఫ్ తనని తాజ్‌మహల్‌ని చూడటానికి ఉత్తమమైన సమయం ఎప్పుడూ అని కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. సూర్యుని కిరణాలు ఆ స్మారక కట్టడంపై పడగానే పాలరాతి మహల్ కాస్తా ధగధగ మెరుస్తుందని, అలాగే వర్షం కురిసినప్పుడూ బాధగా విలపిస్తున్నట్లు కనిపిస్తుందని చెప్పినట్లు తెలిపారు. అంతేగాదు తాను ముంతాజ్, షాజహాన్ల వివాహం లాహోర్ కోటలో జరిగిందని, మొఘల్ చక్రవర్తి జన్మస్థలం కూడా అదేనని చెప్పడంతో ముషారఫ్ ఒక్కసారిగా తాను తనవారి ఇంట్లో ఉన్నట్లు భావించారని చెప్పారు మహ్మద్. వాస్తవానికి మహ్మద్ ఆ తాజ్‌మహల్‌ని చూడటానికి 45 నిమిషాల సమయం ఇచ్చాం గానీ కానీ ఆయన తన భార్యతో కలిసి కాసేపు వ్యక్తిగతంగా గడిపేలా మరో 15 నిమిషాలు పొడిగించినట్లు మహ్మద్ నాటి సంఘటనను వివరించారు. కాగా, ముషారఫ్ సెప్టెంబర్ 25, 2006న తాను రచించిన ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్ ఏ మెమోరియల్ పుస్తకంలో ఈ తాజ్‌మహల్ గురించి ప్రస్తావించారు. అందులో ..ఆగ్రా అనేది తాజ్‌మహల్ స్మారక ప్రదేశం. ఇది ప్రేమకు సంబంధించిన మొఘల్ స్మారక చిహ్నం. ఈ కట్టడం అతీతమైన అందం కారణంగానే ప్రపంచంలోని అద్భుతాలలో ఒకటిగా నిలించింది అని ముషారఫ్ పుస్తకంలో పేర్కొన్నారు. (చదవండి: జెలెన్స్కీని చంపేందుకు ప్లాన్ చేస్తున్నారా? పుతిన్ ఏమన్నారంటే..) -
16వ శతాబ్దపు శిల్పాలను పరిరక్షించుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం, నాగిరెడ్డిపాలెం– మన్నె సుల్తాన్‌పాలెం మధ్య పొలాల్లో క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందిన విజయనగర రాజుల కాలానికి చెందిన వీరభద్రాలయం శిథిలమై, అందులో నిలువెత్తు శిల్పాలు దెబ్బతిన్నాయని, వాటిని పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలని పురావస్తు పరిశోధకుడు, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి (సీసీవీఏ) సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కోరారు. చారిత్రక సంపదను కాపాడి భవిష్యత్ తరాలకు అందించేందుకు సీసీవీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక పరిశోధనా కార్యక్రమంలో భాగంగా ఆదివారం బెల్లంకొండ మండలం పరిసర ప్రాంతాల్లో పర్యటించానని శివనాగిరెడ్డి ప్రకటనలో తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన వీరభద్రుడు, భద్రకాళి శిల్పాలు జీర్ణావస్థలో ఉన్నాయని వివరించారు. నాగిరెడ్డిపాలెం శివారు ప్రాంతంలో ఉన్న క్రీస్తు 16వ శతాబ్దానికి చెందిన శిథిలమైన శివాలయాన్ని కూడా పునర్నిర్మాణం చేసి భావితరాలకు వాటి గొప్పతనాన్ని చాటాలని ఆయన కోరారు. అక్కడ ఉన్న చారిత్రక సంపద గురించి సమీపంలోని గ్రామస్థులకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు. -
Ancient Slave Room: రెండు వేల ఏళ్ల నాటి బానిస గది ఇదిగో..!
Archaeologists Discover slave Room at Pompeii: రాజులు బానిసలను ప్రత్యేకమైన దీవులు, గుహలు, గదుల్లో బంధించినట్లు చర్రితలో చదివాం. అయితే ఈ ఆధునిక కాలంలో బానిస వ్యవస్థ దాదాపు లేదు అనటంలో సందేహం లేదు. అయితే పురాతన కాలంలో బానిసలకు సంబంధించిన విషయాలు ఆసక్తిగా ఉండటంతో పాటు భయం గొల్పుతాయి కూడా! అయితే తాజాగా ఇటలీలోని రోమ్‌లో ఓ పురాతన ‘బానిస గది’ తవ్వకాల్లో బయటపడింది. పాంపీ పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఈ గది బయటపడింది. సుమారు రెండు వేల ఏళ్ల క్రితం వెసువియస్ పర్వతం విస్ఫోటనం వల్ల వెలువడిన బూడిద కింద పాంపీ నగరం సమాధి అయిపోయిన విషయం తెలిసిందే. సివిటా గియులియానా విల్లాలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ బానిసరూంలో మూడు బెడ్స్, ఒక మట్టి కుండ, చెక్కపెట్టెను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గదిలోని మంచాలు 1.7 మీటర్ల పోడవు, 1.4 మీట్లర్ల వెడల్పుతో ఉన్నాయి. వాటితోపాటు కుండలు, కొని ఇతర వస్తువులు కూడా లభించాయి. వాటిని చూస్తే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బానిసలు ఈ గదిలో ఉన్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ గది గోడకు ఓ చిన్న కిటికి ఉండి.. గోడలకు ఎటువంటి అలంకరణ లేకుండా ఉన్నాయని తెలిపారు. అక్రమ తవ్వకాలు జరిగి కొంతమంది ఇక్కడ లభించే కళాఖండాలను అమ్ముకుంటున్నారని పురావస్తు శాస్త్రవేత్తలు అధికారికంగా 2017లో తవ్వకాలు ప్రారంభించారు. ‘బానిస గది’ పై స్పందించిన పాంపీ డైరెక్టర్ జనరల్ గాబ్రియేల్ జుచ్ట్రిగెల్ మాట్లాడుతూ.. చరిత్రక మూలాల్లో అరుదుగా కనిపించే వ్యక్తులకు సంబంధించిన వాస్తవికత బయటకు వచ్చిందని తెలిపారు. పురాతనమైన కాలానికి చెందినవారు ఎలా జీవించారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. తన జీవితంలో ఇది ఓ గొప్ప తవ్వకమని పేర్కొన్నారు. -
పరిశోధకుడు
వారణాసిలో పురాతత్వ శాస్త్రవేత్తగా నాగార్జున పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ఫలితాలు వచ్చే ఏడాది వెండితెరపై విడుదలవుతాయి. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా, మౌనీరాయ్ కీలక పాత్రధారులు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఒక శక్తిమంతమైన ఆయుధం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుంది. చేతుల నుంచి నిప్పును రప్పించే శివ పాత్రలో రణ్‌బీర్, ఇషా పాత్రలో ఆలియా కనిపిస్తారు. శివ పాత్రకు గురువుగా అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. పురాతత్వ శాస్త్రవేత్తగా నాగార్జున నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఏడాది జూన్‌లో నాగార్జునపై వారణాసిలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మనాలిలో జరుగుతోంది. అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్లపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మూడు విభాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి విభాగం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. -
లక్షల ఏళ్ళ క్రితమే అక్కడ మనుషులున్నారు..
బెంగళూరుః దేశంలోనే సాఫ్ట్ వేర్ కార్యకలాపాలకు కేంద్రంగా... సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు నగరం ఇప్పుడు ప్రాచీన చరిత్రకూ సాక్ష్యంగా మారింది. చరిత్రకారుడు డాక్టర్ కె.బి. శివతారక్ మొదటిసారి బెంగళూరులో జరిపిన పరిశోధనల్లో రాతియుగంనాటి ఆనవాళ్ళు కనిపించాయి. నాలుగు లక్షల ఏళ్ళ క్రితమే అక్కడ మనుషుల ఉనికి ఉన్నట్లు ఆయన తన పరిశోధనల ద్వారా నిరూపించారు. బెంగళూరులో మొట్టమొదటిసారి రాతియుగంనాటి చరిత్రకు ఆనవాళ్ళు బయటపడ్డాయి. బెంగళూరు ప్రాంతంలో 4 లక్షల ఏళ్ళ క్రితమే మనుషుల మనుగడ ఉన్నట్లు మంగళూరు విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్ర, పురాతత్వ శాస్త్రాల రిటైర్డ్ ప్రొఫెసర్ కె.బి. శివతారక్ వెల్లడించారు. తవ్వకాల్లో ఇంతకు ముందెప్పుడూ బయట పడని లక్షల ఏళ్ళనాటి చారిత్రక సాక్ష్యాలు వెలువడినట్లు ఆయన చెప్తున్నారు. కదిరెనహల్లి ప్రాంతంలో నీటి పైపుల లీకేజ్ ను పరిశీలించేందుకు మే నెలలో చేపట్టిన తవ్వకాల సమయంలో తానక్కడే ఉన్నానని, సమీపంలోనే నివసిస్తుండటంతో అక్కడి తవ్వకాలను ఎంతో ఉత్సుకతతో గమనించానని, అక్కడ బయటపడ్డ రాళ్ళను తీసి పరిశీలించడంతో, గతంలో తాను తుముకూరు, మాండ్యా, చిత్రదుర్గ జిల్లాల నుంచి సేకరించిన ప్రాచీన పనిముట్లకు సంబంధించిన పోలికలు ఉన్నట్లు గమనించానని శివతారక్ తెలిపారు. చేతి గొడ్డలి, ఆకురాయి, సుత్తి, స్ఫటిక శిల వంటి ఐదు రాతి పనిముట్లను వనశంకరి ప్రాంతంనుంచీ తాను సేకరించినట్లు శివతారక్ తెలిపారు. రాతియుగంనాటి మనుషులు ఈ పనిముట్లను వివిధ అవసరాలకు వినియోగించినట్లు తెలుస్తోందని చెప్పారు. అప్పట్లో వేట ప్రధాన వృత్తిగా ఉండటంతో జంతువులను చంపేందుకు, వాటి చర్మం ఒలిచేందుకు, ఇతర పనులకు రాతి పనిముట్లను వినియోగించి ఉండొచ్చని ఆయన వివరించారు. తనకు దొరకిన పరికరాలను ఆయన పురాతత్వ కార్యాలయానికి సమర్పించారు. అయితే రాతియుగంనాటి మనుషులు బెంగళూరు పరిసరాల్లో నివసించినట్లు ఇంతకు ముందు ఎటువంటి ఆధారాలు లేవని, అలాగే స్ఫటిక క్వారీలు, పనిముట్ల వినియోగం కూడా కనిపించలేదని, తుమకూరు ప్రాంతంలో ఈ స్ఫటిక, రాతి పనిముట్లు ఎలా బయటపడ్డాయో అంతుచిక్కడం లేదని కర్ణాటక విశ్వవిద్యాలయానికి చెందిన మరో పురాతత్వ మాజీ ప్రొఫెసర్ రవి తెలిపారు. -
600 బీసీలోనే బైబిల్ రచనలు ప్రారంభం
జెరూసలెం: బైబిల్లోని చాలా రచనలు 600 బీసీలో యూదుల సామ్రాజ్యం సమయంలోనే రచించినట్లు ఓ అధ్యయనంలో తేలింది. టెల్ ఆవివ్ యూనివర్సిటీ పురావస్తు శాఖ ప్రొఫెసర్ ఇజ్రాయెల్ ఫిన్కెల్స్టైన్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనం చేసింది. మృత సముద్రానికి పశ్చిమాన ఉన్న ‘అరద్ ఎడారి కోట’లోని 16 శాసనాలను విశ్లేషించిన అనంతరం ఈ విషయాలను వెల్లడించింది. -
ఆ నేడు 12 సెప్టెంబర్, 2001
చారిత్రక చిత్రం! ఫ్రాన్సులోని లస్కు గుహల్లో పదిహేను వేల సంవత్సరాల క్రితం నాటి గుహచిత్రాలు (కేవ్ పెయింటింగ్స్)ని నలుగురు టీనేజర్లు కనుగొన్నారు. వీటిలో రకరకాల జంతువుల బొమ్మలతోబాటు. పక్షి తలతో ఉన్న మనిషి బొమ్మ ఒకటి కనిపించింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ గుహలు వేట కేంద్రంగా, మత క్రతువులు నిర్వహించే ప్రదేశంగా వాడుకలో ఉన్నట్లు ఆర్కియాలజిస్ట్‌లు అంచనా వేశారు. 1948లో జనసందర్శనకు వీలుగా లస్కు గుహలను ముస్తాబు చేశారు. అయితే ఇక్కడ అమర్చిన ఆర్టిఫిషియల్ లైట్లు గుహచిత్రాలపై ప్రతిఫలించి, వాటి సహజ రంగులను మార్చివేస్తూ, చివరికి చిత్రాలు రంగు వెలిసి పోయి, అదృశ్యమై పోయే పరిస్థితి కనిపించడంతో1963లో జనసందర్శనపై నిషేధం విధించారు. 1983లో లస్కు గుహలకు సమీపంలో వాటిని పోలిన కృత్రిమగుహలతో పాటు అందులో చిత్రాలు కూడా సృష్టించారు. వీటిని ప్రతి ఏటా వేలాది మంది సందర్శిస్తున్నారు.