ఆ నేడు 12 సెప్టెంబర్, 2001
చారిత్రక చిత్రం!
ఫ్రాన్సులోని లస్కు గుహల్లో పదిహేను వేల సంవత్సరాల క్రితం నాటి గుహచిత్రాలు (కేవ్ పెయింటింగ్స్)ని నలుగురు టీనేజర్లు కనుగొన్నారు. వీటిలో రకరకాల జంతువుల బొమ్మలతోబాటు. పక్షి తలతో ఉన్న మనిషి బొమ్మ ఒకటి కనిపించింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ గుహలు వేట కేంద్రంగా, మత క్రతువులు నిర్వహించే ప్రదేశంగా వాడుకలో ఉన్నట్లు ఆర్కియాలజిస్ట్‌లు అంచనా వేశారు.
1948లో జనసందర్శనకు వీలుగా లస్కు గుహలను ముస్తాబు చేశారు. అయితే ఇక్కడ అమర్చిన ఆర్టిఫిషియల్ లైట్లు గుహచిత్రాలపై ప్రతిఫలించి, వాటి సహజ రంగులను మార్చివేస్తూ, చివరికి చిత్రాలు రంగు వెలిసి పోయి, అదృశ్యమై పోయే పరిస్థితి కనిపించడంతో1963లో జనసందర్శనపై నిషేధం విధించారు. 1983లో లస్కు గుహలకు సమీపంలో వాటిని పోలిన కృత్రిమగుహలతో పాటు అందులో చిత్రాలు కూడా సృష్టించారు. వీటిని ప్రతి ఏటా వేలాది మంది సందర్శిస్తున్నారు.