ఇటలీని కుదిపేసిన భారీ భూకంపం!
రోమ్: భారీ భూకంపం మరోసారి ఇటలీని కుదిపేసింది. సెంట్రల్ ఇటలీలో ఆదివారం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తినష్టాల గురించి ఇప్పుడిప్పుడే సమాచారం అందుతోంది. ఆగ్రేయ పెరుజియాకు 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నెలకొని ఉందని అమెరికా భూగర్భ విజ్ఞాన సంస్థ తెలిపింది. భూమికి 108 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది.
గత వారం రోజుల్లో ఇటలీలో సంభవించిన రెండో భూకంపం ఇది. గత బుధవారం తూర్పు రోమ్ లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించగా.. దీని ప్రకంపనలు రాజధాని రోమ్ ను వణికించాయి. రెండు నెలల కిందట ఇటలీలో సంభవించిన భూకంపంలో 300 మందికిపైగా మృతిచెందిన సంగతి తెలిసిందే.