
డోర్ తెరచిన ఫైర్ సిబ్బంది షాక్!
రోమ్: చాలా కాలంగా మూసి ఉన‍్న ఓ గదిని తెరచిన ఫైర్ సిబ్బంది షాక్‌కు గురైన ఘటన రోమ్‌లో చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో వాటర్ లీక్ అవుతుండటంతో దానిని సరిచేయడానికి వచ్చిన వర్కర్లు.. ఫైర్ సిబ్బంది సహాయంతో ఫ్లాట్ డోర్ ఓపెన్ చేయగా.. బెడ్‌పై అస్థిపంజరాన్ని గుర్తించారు.
కార్సో ఫ్రాన్సియా జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సుమారు రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయాడని పోలీసుల వద్ద ఫిర్యాదు నమోదుకాబడిన ఓ 59 ఏళ్ల వ్యక్తి మృతదేహంగా అక్కడ దొరికిన ఆధారాలను బట్టి గుర్తించారు. కాగా.. అతడి కుటుంబ సభ్యులు ఎవరూ రోమ్ నగరంలో ఉండటం లేదని పోలీసులు తెలిపారు. బెడ్‌పై నిద్రిస్తున్న సమయంలోనే అతడు మృతి చెంది ఉంటాడని భావిస్తున్నా.. ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.