
రోమ్: క్యాథలిక్ క్రైస్తవుల మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మరణించాలని చర్చికే చెందిన కొందరు అధికారులు కోరుకు న్నారని వ్యాఖ్యానించారు. ఇటీవలే ఆయనకు ఉదర సంబంధిత సర్జరీ జరిగింది. సర్జరీ సమయానికి తాను తీవ్ర అస్వస్థతతో ఉన్నానని వారు భావించారంటూ సంప్రదాయవాదులను ఉద్దేశించి అన్నారు. తాను మరణించాలని వారు కోరు కున్నారని చెప్పారు. గత వారం ఆయన స్లొవేకియా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఓ మీడియాకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు.
తాను మరణిస్తే తదుపరి పోప్‌ను ఎన్నుకోవడానికి కూడా వారు సిద్ధమయ్యారని, కానీ దేవుడి దయ వల్ల తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు. లాటిన్ భాషా పూజా విధానం కారణంగా చర్చిలో చీలికలు వస్తున్నాయని అంతర్గత నివేదికల ద్వారా గ్రహిం చిన పోప్ ఫ్రాన్సిస్, దానిపై ఆంక్షలు పెట్టారు. ఇది చర్చిలోని సంప్రదాయవాదులకు నచ్చలేదు. దీంతో పాటు ఆయన తీసుకునే పలు నిర్ణయాలు సంప్రదాయవాదులకు కోపం తెప్పిస్తున్న నేపథ్యంలో పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment