
నాణెం.. నమ్మకం
రోమ్‌లోని ట్రెవీ ఫౌంటెన్‌ను నిత్యం వందల మంది యాత్రికులు సందర్శిస్తుంటారు. ఆ ఫౌంటెన్ వైపు వీపు పెట్టి నిలబడి ఏదైనా కోరుకుని అందులోకి వెనక్కి ఓ నాణాన్ని విసిరితే ఈ కోరిక తీరుతుందని నమ్మకం. టర్కీ నుంచి రోమ్‌కి వచ్చిన ఇర్శిజ్ అనే అతను తిరుగు ప్రయాణంలో ఆ ఫౌంటెన్ దగ్గర ఆగాడు.
తన భార్య ఆరోగ్యం కుదుట పడాలని కోరుకోవాలని తెచ్చుకున్న ఒకే ఒక్క నాణెం చేత్తో పట్టుకున్నాక బల్గేరియా నుంచి వచ్చిన ఓ మధ్య వయస్కుడు ఇర్శిజ్‌ని ఇలా అడిగాడు- ‘దయచేసి మీ దగ్గర ఓ నాణెం ఉంటే ఇస్తారా? నా దగ్గర అన్నీ పెద్ద నోట్లే ఉన్నాయి. నా తల్లికి ఇంకో గంటలో ఆపరేషన్. అది సక్సెస్ కావాలని కోరుకోదల్చుకున్నాను’. ఇర్శిజ్ వెంటనే తన నాణాన్ని అతనికి ఇచ్చి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిపోయాడు.
పృథ్వీరాజ్