సాధారణంగా కొందరికి ప్రయాణాలంటే ఒక విధమైన యాంగ్జైటీ ఉంటుంది. దీంతో ఆందోళనగా చెమటలు పట్టేసి ఒక విధమైన ఒత్తిడికి గురవ్వుతుంటారు. ఈ జర్నీ ఎప్పుడు పూర్తి అయ్యి ఇంటికి చేరుకుంటామా..! అని అనుకుంటుంటారు. అలాంటి వారికి ఈ ఎయిర్‌పోర్ట్ ఒత్తిడిని దూరం చేసేలా లామా థెరఫీని అందిస్తుంది. ఇదేంటి అనే కదా..!
ఏం లేదండి మనకిష్టమైన వ్యక్తులు లేదా పెంపుడు జంతువులను చూడగానే రిలీఫ్‌గా ఉంటుంది. ఏ విధమైన భయాందోళనలు దరిచేరవు. పైగా ధైరంగా ఉంటుంది. అలాంటి ఆలోచనతోనే లోరీ గ్రెగోరీ, షానన్ జాయ్చే అనే తల్లికూతుళ్ల బృందం అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ ఎయిర్‌పోర్ట్‌లో విచిత్రమైన థెరపీని అందిస్తుంది.
ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేలా లామాస్, అల్పాకాస్ అనే ఒంటె జాతికి చెందిన జంతువులతో లామా అనే థెరపీని అందిస్తోంది. అలాంటి జంతువులు ఈ ఎయిర్‌పోర్ట్‌లో మొత్తం ఐదు లామాలు, ఆరు అల్పాకస్‌లు ఉన్నాయి. వాటితో ఈ థెరపీని అందిస్తుంది. ఈ జంతువులు మెడలకు "ఐ హార్ట్ PDX" నెక్‌కర్చీఫ్‌లు, పాంపమ్ హెడ్‌బ్యాండ్‌లతో ప్రయాణికులకు దర్శనమిస్తాయి. అసలు ఇవి ఎలా ప్రయాణికులకు థెరపీని అందిస్తాయనే కదా సందేహం..
లామా థెరపీ అంటే..
ఏం లేదండి ఇవి అందంగా ముస్తాభై ఎయిర్‌పోర్ట్ అంత కలియతిరుగుతాయి. అక్కడకు వచ్చిన ప్రయాణికుల దగ్గరికి వచ్చి అటు ఇటు తిరుగతుంటాయి అంతే..!. అయితే ఆ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన ప్రయాణికులు.. వాటిని చూడగానే జర్నీ వల్ల కలిగిన యాంగ్జైటీ అంతాపోయి ముఖంపై చిరునవ్వు వస్తుందట. దీన్నే లామా థెరపీ అంటారు.
ఆ ఒంటె జాతికి చెందిన జంతువుల పేరు మీదుగా ఆ థెరఫీకి పేరు పెట్టారు. అంతేగాదు అక్కడకు వచ్చిన ప్రయాణికులంతా వాటిని చూడగానే ప్రశాంతత వస్తుందని, సంతోషంగా ఉంటామని చెబుతున్నారట. దీన్ని ఎలాంటి లాభప్రేక్ష లేకుండా ప్రయాణికుల సౌకర్యార్థం ఆ తల్లి కూతుళ్లు నిర్వహించడం విశేషం. అంతేగాదు విమానాశ్రయ ప్రతినిధి అల్లిసన్ ఫెర్రే ఈ జంతువుల కారణంగా ప్రయాణికుల ముఖాల్లో ఒత్తడి మాయం అయ్యి ప్రశాంతంగా కనిపిస్తున్నాయి అని చెబుతున్నారు కూడా.
ఈ పోర్ట్‌ల్యాండ్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులకు శాంతియుత వాతావరణాన్ని అందించేలా సహజమైన కాంతిని అందించే లైట్లు, ఆహ్లాదభరితమైన అందమైన పూల కుండీలు తదితరాలతో టెర్మినల్‌ని రీ డిజైన్ చేశారట అక్కడ అధికారులు. అందులో భాగంగానే ఈ జంతువులను కూడా ఏర్పాటు చేశారట. ఇలా జంతువులతో సర్వీస్ అందించటం తొలిసారి కాదు గతంలో శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలోని "వాగ్ బ్రిగేడ్"లో డ్యూక్ అనే 14 ఏళ్ల పిల్లిని కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారట. ఆ పిల్లి పైలట్ టోపీ చొక్కా కాలర్ ధరించి ప్రయాణికుల ఆందోళన భయాలను పోగొట్టేలా ఆ ఎయిర్‌పోర్ట్‌లో కలియతిరుగుతుండేదట.
(చదవండి: కల నెరవేర్చే..అమ్మ అభిమానిక..)
Comments
Please login to add a commentAdd a comment