
రోమ్ : ఇటలీ తెలుగు సాంస్కృతిక సంఘం(ఐటీసీఏ) ఆధ్వర్యంలో రోమ్‌లోని కాళీ మందిర్ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరిపారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో ఆలయ ప్రాంగణం అంతా పండగ వాతావరణం నిండిపోయింది. ఇతర దేశాలకు చెందిన మహిళలు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటలీలో దొరికే వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి విదేశీవనితలు రోజంతా ఆడిపాడారు.
ఈ కార్యక్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్లు పిన్నమరెడ్డి సౌమ్యారరెడ్డి, నల్లయగరీ అశ్వినిరెడ్డి, ఐటీసీఏ వ్యవస్థాపకులు కొక్కుల మనోజ్ కుమార్, నరబోయిన రాహుల్ రాజ్, ఇతర సభ్యులు ఆడెపు అనుదీప్, ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు.