ప్రతి ఏటా లక్షలాదిమంది పర్యాటకులు ఇటలీ రాజధాని రోమ్‌ను సందర్శిస్తుంటారు. రోమ్ అందాలను చూసినవారు మళ్లీ ఇక్కడికి రావాలని అనుకుంటారు. రోమ్‌ని సందర్శించే పర్యాటకులు ట్రెవీ ఫౌంటెన్‌లో ఒక నాణెం లేదా రెండు నాణేలు విసురుతుంటారు. ఈ విధంగా ప్రతి ఏటా సుమారు ఒక మిలియన్ యూరోలు (రూ.9 కోట్లు) ఈ ఫౌంటెన్‌లో జమ అవుతున్నాయట.
ఒక అంచనా ప్రకారం పర్యాటకులు ప్రతిరోజూ సుమారు 3000 యూరో నాణేలను ఈ ఫౌంటెన్‌లోకి విసిరివేస్తున్నారు. అంటే ప్రతిరోజూ రూ. 2,50,000 అంటే సంవత్సరానికి రూ.9 కోట్లు ఈ ఫౌంటెన్‌లోకి విసురుతున్నారన్న మాట. ట్రెవీ ఫౌంటెన్‌లోకి విసిరిన నాణేలను బయటకు తీసి, స్థానిక పేదలు, నిరాశ్రయులైన ప్రజలకు ఆహారం అందించడానికి ఉపయోగిస్తారు.
ట్రెవీ ఫౌంటెన్ రోమ్‌లోని ట్రెవీ నగరంలో ఉంది. ఈ ఫౌంటెన్ 85 అడుగుల ఎత్తు, 161 అడుగుల వెడల్పు కలిగివుంది. ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన ఫౌంటెన్లలో ఒకటి. దీనికి ఇటాలియన్ ఆర్కిటెక్ట్ నికోలా సాల్వి రూపమిచ్చారు. పియట్రో బ్రాచి దీనిని నిర్మించారు. దీని నిర్మాణ పనులు 1732లో ప్రారంభమై 1762లో పూర్తయ్యాయి. రోమ్‌కు వచ్చే దాదాపు ప్రతి పర్యాటకుడు ట్రెవీ ఫౌంటెన్‌లో నాణెం విసురుతాడు. రోమ్‌ను మరోమారు సందర్శించాలనుకునే పర్యాటకులు ఈ ఫౌంటెన్‌లో నాణేలు విసురుతారట.
Tourists throw over €1 million into Italy's Trevi Fountain each year. pic.twitter.com/GVAIfciJSg
— Historic Vids (@historyinmemes) March 24, 2024
కాగా ఈ పౌంటెన్‌లో నాణేలు విసిరేందుకు ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఫౌంటెన్ దగ్గర సినిమా షూటింగ్‌లు, ఫ్యాషన్ షోలు తరచూ నిర్వహిస్తుంటారు. 1954లో విడుదలైన ‘త్రీ కాయిన్స్ ఇన్ ది ఫౌంటెన్’ అనే హాలీవుడ్ చిత్రం ఈ ఫౌంటెన్ ఇతివృత్తం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ ఫౌంటెన్ మరింత ఫేమస్‌గా మారింది. .
Comments
Please login to add a commentAdd a comment