fountain
-
ఆ చిల్లర విలువ ఎంత అంటే?
ప్రతి ఏటా లక్షలాదిమంది పర్యాటకులు ఇటలీ రాజధాని రోమ్ను సందర్శిస్తుంటారు. రోమ్ అందాలను చూసినవారు మళ్లీ ఇక్కడికి రావాలని అనుకుంటారు. రోమ్ని సందర్శించే పర్యాటకులు ట్రెవీ ఫౌంటెన్‌లో ఒక నాణెం లేదా రెండు నాణేలు విసురుతుంటారు. ఈ విధంగా ప్రతి ఏటా సుమారు ఒక మిలియన్ యూరోలు (రూ.9 కోట్లు) ఈ ఫౌంటెన్‌లో జమ అవుతున్నాయట. ఒక అంచనా ప్రకారం పర్యాటకులు ప్రతిరోజూ సుమారు 3000 యూరో నాణేలను ఈ ఫౌంటెన్‌లోకి విసిరివేస్తున్నారు. అంటే ప్రతిరోజూ రూ. 2,50,000 అంటే సంవత్సరానికి రూ.9 కోట్లు ఈ ఫౌంటెన్‌లోకి విసురుతున్నారన్న మాట. ట్రెవీ ఫౌంటెన్‌లోకి విసిరిన నాణేలను బయటకు తీసి, స్థానిక పేదలు, నిరాశ్రయులైన ప్రజలకు ఆహారం అందించడానికి ఉపయోగిస్తారు. ట్రెవీ ఫౌంటెన్ రోమ్‌లోని ట్రెవీ నగరంలో ఉంది. ఈ ఫౌంటెన్ 85 అడుగుల ఎత్తు, 161 అడుగుల వెడల్పు కలిగివుంది. ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన ఫౌంటెన్లలో ఒకటి. దీనికి ఇటాలియన్ ఆర్కిటెక్ట్ నికోలా సాల్వి రూపమిచ్చారు. పియట్రో బ్రాచి దీనిని నిర్మించారు. దీని నిర్మాణ పనులు 1732లో ప్రారంభమై 1762లో పూర్తయ్యాయి. రోమ్కు వచ్చే దాదాపు ప్రతి పర్యాటకుడు ట్రెవీ ఫౌంటెన్‌లో నాణెం విసురుతాడు. రోమ్ను మరోమారు సందర్శించాలనుకునే పర్యాటకులు ఈ ఫౌంటెన్‌లో నాణేలు విసురుతారట. Tourists throw over €1 million into Italy's Trevi Fountain each year. pic.twitter.com/GVAIfciJSg — Historic Vids (@historyinmemes) March 24, 2024 కాగా ఈ పౌంటెన్లో నాణేలు విసిరేందుకు ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఫౌంటెన్ దగ్గర సినిమా షూటింగ్‌లు, ఫ్యాషన్ షోలు తరచూ నిర్వహిస్తుంటారు. 1954లో విడుదలైన ‘త్రీ కాయిన్స్ ఇన్ ది ఫౌంటెన్’ అనే హాలీవుడ్ చిత్రం ఈ ఫౌంటెన్ ఇతివృత్తం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ ఫౌంటెన్ మరింత ఫేమస్‌గా మారింది. . -
ఆ ఫౌంటెన్ కోసం ఏకంగా రూ. 16 కోట్లు ..! కానీ చివరికి..
అప్పుడప్పుడు కొన్ని పనులు మిస్‌ఫైర్ అవుతుంటాయి. అలా ఆస్ట్రేలియాలోనూ ఓ సంఘటన జరిగింది. దాదాపు రూ. పదహారు కోట్లు ఖర్చు పెట్టి, అక్కడి ప్రభుత్వం ఒక అందమైన వాటర్ ఫౌంటెన్‌ను సిటీ మధ్యలో నెలకొల్పితే.. అదికాస్త ఈ ప్రపంచంలోనే అత్యంత చెత్త వాటర్ ఫౌంటెన్‌గా మారింది. ప్రముఖ ఆర్ట్ గ్రూప్ ‘గెలిటిన్’ డిజైన్ చేసిన ఈ ఫౌంటెన్.. ఇప్పటి వరకు వారు డిజైన్ చేసిన ఆర్ట్ వర్క్స్ అన్నిటికంటే ఎక్కువ విమర్శలను ఎదుర్కొంది. ‘ప్రచారం చేసినట్లుగా 150 సంవత్సరాల వియన్నా చరిత్ర, ఆధునిక నీటి వ్యవస్థ, నీరు – సామాజిక బాధ్యత.. వంటి విషయాలు ఈ డిజైన్‌లో ఎక్కడ ప్రతిబింబించాయి?’ అంటూ ప్రజలు విరుచుకుపడుతున్నారు. పైగా ఇందుకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేయడాన్నీ తప్పుబడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ఫౌంటెన్ విపరీతంగా ట్రోల్స్ కావడంతో ఈ మధ్యనే గెలిటిన్ ‘అందం చూసే వారి కళ్లల్లో ఉంటుంది’ అని స్పందించింది. ‘వారు అన్నమాట నిజమే కానీ, అందాన్ని ఎవరి కళ్లూ చూడలేకపోతే అది చూసేవారి తప్పు కాదుకదా!’ అంటూ పెదవి విరుస్తున్నవారూ లేకపోలేదు. (చదవండి: అరటిపండుతో తయారు చేసిన సుత్తి! ఎలాగో వింటే షాకవ్వుతారు) -
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఫౌంటేన్.. 150 మీటర్ల ఎత్తుతో నీరు పైకి
సాక్షి, కరీంనగర్: మానేరు తీరాన్ని సుందరంగా తీర్చిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే రిటెయినింగ్ వాల్ నిర్మాణం వేగంగా సాగుతున్న క్రమంలో ఫౌంటేన్‌కు సంబంధించిన పనులు సమాంతరంగా ఊపందుకున్నాయి. ఉత్తర తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న మానేరు వంతెనల నడుమ ఏర్పాటు చేస్తున్న ఈ బృహత్తర ప్రాజెక్టు.. కరీంనగర్ పర్యాటకానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకువస్తుందని ప్రభుత్వం ధీమాగా ఉంది. అందుకే, ఈ ప్రాజెక్టు పనులను మంత్రి గంగుల కమలాకర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ కూడా ఈ ప్రాజెక్టు పురోగతిపై నిరంతర సమాచారం తెప్పించుకుంటున్నారు. ఈ ప్రాజెక్టులో హైలైట్‌గా నిలిచే ఫౌంటేన్ పనులకు ఈనెల 26వ తేదీన మంత్రి భూమి పూజ చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ఎంఆర్ఎఫ్ ప్రాజెక్టును పూర్తి చేసి, సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం చేయాలన్న సంకల్పంతో జిల్లా మంత్రి,అధికారులు పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫౌంటేన్.. కరీంనగర్లో ఇన్స్టాల్ చేయబోయే ఫౌంటేన్ ప్రపంచంలోనే మూడోఅతిపెద్దది కావడం విశేషం. మొదటిది దక్షిణ కొరియాలోని సియోల్‌లో, రెండోది చైనాలోని షాంఘైలో మూడోది మన కరీంనగర్‌లోనే కావడం గమనార్హం. నీటి మీద 100 మీటర్ల ఎత్తున నిర్మించనున్న ఈ ఫౌంటేన్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రాత్రిపూట అందమైన రంగులు చిమ్మే లైటింగ్‌తోపాటు, సంగీతానికి అనుగుణంగా 150 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తుతో నీరు పైకి చిమ్మడం పర్యాటకులను ముగ్గుదలను చేస్తుంది. దీనిపై నీటినే తెరగా చేసుకుని లఘు చిత్రాల ప్రదర్శన ప్రజలను అబ్బురపోయేలా చేస్తుందని మంత్రి తెలిపారు. భారతదేశ, తెలంగాణ చరిత్రలను తెలియజేసేలా పలు లఘుచిత్రాలను ప్రదర్శించే వీలు ఫౌంటేన్‌లో ఉండటం దీని ప్రతేకత. ఇందులో నీటిపారుదల శాఖ రూ.310 కోట్లు, పర్యాటకశాఖ రూ.100 కోట్లు మొత్తం రూ.410 కోట్ల ప్రాజెక్టు ఇది. ఇందులో కేవలం ఫౌంటేన్కే రూ.70 కోట్లు వెచ్చించడం గమనార్హం. ఫౌంటేన్ ఒక హైలైట్ తొలిదశలో మానేరు రివర్ ఫ్రంట్ పనులను మొదటి దశలో 3.75 కి.మీ వరకు అభివద్ధి చేస్తాం. రెండవ దశలో 6.25 కి.మీలు పూర్తి చేస్తాం. మానేరు రివర్ ఫ్రంట్ కు ఇరువైపులా పార్కులు, వాటర్ ఫౌంటేన్స్, థీమ్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, మ్యూజికల్ ఫౌంటేన్స్, ఆట స్థలాలు, గార్డెన్స్ లాంటివి ఏర్పాటు చేస్తాము. మానేర్ రివర్ ఫ్రంట్ లో 12 నుంచి 13 ఫీట్ల లోతు వరకు నీరు నిల్వ ఉంటుందని, ఇందులో స్పీడ్ బోట్లు, క్రోజ్ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఎంఆర్ఎఫ్ ప్రాజెక్టులో ఫౌంటేన్ ఒక హైలైట్‌గా నిలవనుంది. అలాగే తీగల వంతెనపై నాలుగు భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నాం. వాటి ద్వారా వాణిజ్య ప్రకటనలతోపాటు, ప్రభుత్వ పథకాలనూ ప్రచారం చేసుకోవచ్చు. -
శివలింగాన్ని రక్షించండి.. నమాజ్‌కు అనుమతించండి
న్యూఢిల్లీ/వారణాసి: కాశీలోని జ్ఞానవాపి– శ్రింగార్ గౌరీ కాంప్లెక్స్‌లో సర్వే సమయంలో కనుగొన్నట్లు చెబుతున్న శివలింగం ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. అందులో ముస్లింలు నమాజ్ కొనసాగించుకునేందుకు అనుమతినిచ్చింది. న్యాయ సమతుల్యతలో భాగంగా ఈ ఆదేశాలిస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నరసింహతో కూడిన బెంచ్ తెలిపింది. 20 మందిని మాత్రమే నమాజుకు అనుమతించాలన్న కింద కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చింది. మసీదు కమిటీ కోరినట్లు సర్వే తదితర ప్రక్రియలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. శివలింగం బయటపడిన ప్రాంతంలో ముస్లింలు వజు చేసుకుంటారని యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. అక్కడ ఎలాంటి విధ్వంసం జరిగినా శాంతిభద్రతల సమస్య వస్తుందని చెప్పారు. కావాలంటే ముస్లింలు వజు వేరే చోట చేసుకోవచ్చన్నారు. కానీ వజూ లేకుండా నమాజ్‌కు అర్థం లేదని మసీదు కమిటీ తరఫు న్యాయవాది హుజెఫా అహ్మదీ వాదించారు. హృద్రోగంతో ఆస్పత్రిలో చేరిన దిగువ కోర్టులో వాది తరఫు న్యాయవాది కోలుకొనే దాకా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. రాజ్యాంగ విరుద్ధం వారణాసి కోర్టు ఆదేశాలన్నీ రాజ్యాంగ విరుద్ధమని అంతకుముందు అహ్మదీ వాదించారు. జైన్ దరఖాస్తుకు స్పందించి శివలింగం దొరికిన ప్రాంతానికి సీలు వేయాలన్న తాజా ఆదేశం సరికాదన్నారు. ఇంతవరకు సర్వే పూర్తయి నివేదిక రాకముందే ఇలాంటి ఆదేశం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ‘‘మసీదులో ప్రార్ధనలకు అనుమతించాలన్న అభ్యర్థనే అసంబద్ధం. ఇవన్నీ పట్టించుకోకుండా కింద కోర్టు సర్వే జరిపిస్తోంది. మేం హైకోర్టును ఆశ్రయించినప్పుడు కమిషనర్ నియామకానికే అనుమతిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. కానీ సర్వేకు కూడా కింద కోర్టు ఆదేశించింది. సర్వే జరుగుతుండగా అకస్మాత్తుగా శివలింగం కనిపించిందని దరఖాస్తు పెట్టుకోగానే, అది ఫౌంటెన్ అని మసీదు కమిటీ చెబుతున్నా పట్టించుకోకుండా ఆ ప్రాంత రక్షణకు హడావుడిగా ఆదేశాలిచ్చింది’’ అని వాదించారు. కేసు సుప్రీంలో ఉన్నందున స్థానిక కోర్టు విచారణపై స్టే విధించాలని కోరారు. అందుకు ధర్మాసనం తిరస్కరించింది. హిందూ భక్తుల పార్టీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను మే 19కి వాయిదా వేసింది. సర్వే పూర్తి కాలేదు జ్ఞానవాపి మసీదులో సర్వేకు నియమించిన కమిషన్ తమ పని ఇంకా పూర్తి కాలేదని పేర్కొంది. మరికొంత గడువు కావాలని అసిస్టెంట్ అడ్వకేట్ కమిషనర్ అజయ్ ప్రతాప్‌సింగ్ కోర్టును కోరారు. నివేదికలో 50 శాతం పూర్తయిందన్నారు. సర్వేలో భూగర్భ గదులను పరిశీలించామని, కొన్నింటి తాళం చెవులు లభించకపోతే జిల్లా యంత్రాంగం తాళాలు పగలగొట్టడంతో వాటిని కూడా వీడియో తీశామని చెప్పారు. ‘‘వజూ ఖానాలో శివలింగం అంశంపై నేను మాట్లాడను. అక్కడ ఏదో దొరకడం మాత్రం నిజం. దాని ఆధారంగానే కోర్టు ఆదేశాలిచ్చింది’’ అని తెలిపారు. సింగ్ అభ్యర్థన విన్న వారణాసి సివిల్ కోర్టు సర్వే పూర్తి చేయడానికి మరో రెండు రోజుల గడువిచ్చింది. సర్వే కమిషనర్ అజయ్ మిశ్రాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. సర్వే సమయంలో మిశ్రా సొంతంగా ప్రైవేట్ ఫొటోగ్రాఫర్‌ను తెచ్చుకున్నారని మరో కమిషనర్ విశాల్ సింగ్ కోర్టుకు తెలిపారు. సదరు ఫొటోగ్రాఫర్ మీడియాకు తప్పుడు సమాచారమిస్తున్నారన్నారు. అయితే ఆ ఫొటోగ్రాఫర్ తనను మోసం చేశారని మిశ్రా వాపోయారు. ఆ గోడను తొలగించండి! కాశీ విశ్వనాథ ఆలయంలో నంది విగ్రహానికి ఎదురుగా ఉన్న తాత్కాలిక గోడను తొలగించాలని ఐదుగురు హిందూ మహిళలు వారణాసి కోర్టులో మరో పిటీషన్ వేశారు. గోడను తొలగిస్తే బయటపడిన శివలింగం వద్దకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని వీరు పేర్కొన్నారు. మసీదు తూర్పు ప్రాంతంలో నంది విగ్రహం వైపు కూడా సర్వే జరపాలని కోరారు. ఈ విషయంపై బుధవారం వాదనలు వింటామని కోర్టు తెలిపింది. అలాగే మసీదు బావిలో చేపల సంరక్షణ గురించి కూడా బుధవారం కోర్టు విచారిస్తుందని అసిస్టెంట్ అడ్వకేట్ కమిషనర్ అజయ్ చెప్పారు. మథుర మసీదులో నమాజ్ నిలిపివేతకు పిటిషన్ మథుర: నగరంలోని షాహీ ఈద్గా మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించకుండా నిరోధించాలని కోరుతూ కొందరు న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు స్థానిక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ ప్రాంతం శ్రీకృష్ణ జన్మస్థలి అని అందువల్ల ఇక్కడ నమాజ్‌ను నిషేధించాలని వీరు కోరారు. ఇప్పటికే ఈ అంశంపై పది పిటీషన్లు మథుర కోర్టులో ఉన్నాయి. 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కత్రాకేశవ్ దేవ్ మందిరంలో ఈ మసీదు ఉంది. మసీదు ఉన్న చోటే కృష్ణుడు జన్మించాడని మెజార్టీ హిందువుల భావన అని తాజా పిటీషన్లో పేర్కొన్నారు. మసీదును హిందూ దేవాలయ శిథిలాలపై నిర్మించినందున దీనికి మసీదు హోదా రాదన్నారు. అందువల్ల ఇక్కడ నమాజు చేయకుండా శాశ్వత నిరోధ ఉత్తర్వులివ్వాలని కోరారు. ఇతర మత చిహ్నాలు లేని, వివాదంలో లేని ప్రాంతంలోనే మసీదు నిర్మించాలని ఖురాన్ చెబుతోందన్నారు. దీనిపై విచారణ మే 25న జరుగుతుందని జిల్లాప్రభుత్వ న్యాయవాది చెప్పారు. -
జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కోర్టులో విచారణ
-
ఊరంతా ఊట నీరే
- గోరుకల్లు గ్రామస్తుల ఆవేదన - పునరావాసం కోసం డిమాండ్ - తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయింపు - అడుగడుగునా పోలీస్ పహారా పాణ్యం : ‘రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేసింది మొదలు గ్రామంలో ఎటు చూసినా ఊటనీరు బయటకు వస్తోంది. కట్ట నుంచి నీరు లీకేజీ అవుతోంది. ఇంటి గోడలు నెమ్మెక్కి పేక మేడల్లా కూలిపోతున్నాయి. రెండు నెలలుగా ఈ పరిస్థితి ఉంది. ఇప్పటికే 20 ఇళ్లు కూలిపోయాయి. మరి కొన్నింటి గోడలు చీలికలు ఇచ్చి కుంగిపోతున్నాయి. ఎక్కడ చూసినా దుర్వాసన భరించలేకపోతున్నాం. సమస్య పరిష్కరించాలని కోరుతూ నాలుగు రోజులుగా నిరాహార దీక్షలు చేపట్టినా అధికారుల్లో స్పందన లేదు’ అంటూ మండల పరిధిలోని గోరుకల్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఇంటికి ఒకరు చొప్పున కదిలి రోడ్డెక్కారు. తొమ్మిది కిలోమీటర్ల మేర పాదయాత్రగా వచ్చిన సుమారు 500 మంది గ్రామస్తులు పాణ్యం తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. సర్వం కొల్పోయిన గ్రామస్తులు గోరుకల్లు రిజర్వాయర్ కోసం గ్రామస్తుల నుంచి 2వేల ఎకరాల భూములను సేకరించిన అధికారులు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. ఇప్పటికే గ్రామానికి రెండు సార్లు వచ్చిన సీఎం చంద్రబాబు నెల రోజుల్లో పరిహారం అందిస్తామని ప్రకటనలు గుప్పించినా ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేదు. గ్రామంలో 400పైగా ఇళ్లుండగా 3వేల వరకు జనాభా ఉంది. ఉన్న ఇళ్లు ఊటల దెబ్బకు కూలీపోతున్నాయి. ఊట నీరు ఇళ్లలో చేరి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గతంలో లీక్ వ్యవహారంపై ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీనీ ఏర్పాటు చేసినా అందుకు సంబంధించిన విషయాలు గోప్యంగా ఉంచారు. రిజర్వాయర్ కట్ట నుంచి లీకేజీలను ఆపేందుకు రూ.45 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపిన అధికారులు ఆ ఊటలు మాత్రం రిజర్వాయర్‌కు చెందినవి కాదని చెబుతుండడం గమనార్హం. భారీగా పోలీసుల మోహరింపు.. గ్రామంలో నీటి ఊటల సమస్యపై గ్రామస్తులు ఆందోళన ప్రారంభించడం, విషయాన్ని ముందే తెలుసుకున్న పోలీసులు వారు హైవేపైకి రాకుండా కొండజుటూరు రోడ్డు వద్ద సిబ్బందిని మోహరించారు. ఐదురుగురు ఎస్ఐలు, 70మంది పోలీస్, స్పెషల్ పార్టీ సిబ్బంది బందోబస్తు చేపట్టారు. బారీకేడ్లను ఏర్పాటు చేసి గ్రామస్తులను దొంగు రస్తా మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు పంపించారు. కార్యాలయం వద్దకు చేరుకున్న గ్రామస్తులు ఒక్క సారిగా కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.పోలీస్‌లు తలుపులను మూయడంతో అక్కడే బఠాయించి నిరసన చేపట్టారు.సీపీఎం నాయకులు ఓబులపతి, ప్రభాకర్‌రెడ్డి , రామకృష్ణ, భాస్కర్, అలివేలు, ఉసేన్ గ్రామస్తులకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. తహసీల్దార్ చంద్రావతికి వినతిపత్రం అందించారు. పరిహారం, పునరావాసానికి డిమాండ్.. కూలిపోయిన ఇళ్లు, కోల్పోయిన భూములను తక్షణమే పరిహారం ఇప్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సురక్షిత ప్రాంతంలో పునరావాసం కల్పించాలని కోరారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజి వర్తింపజేయాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. గతంలో ఇందుకు మంత్రి హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు అతీగతీ లేదని గ్రామస్తులు తెలిపారు. పదిరోజులు గడువు ఇవ్వండి.. చంద్రావతి, తహసీల్దార్ గ్రామస్తుల సమస్యపై ఇప్పటికే రెండుసార్లు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. ఆర్డీఓ సుధాకర్‌రెడ్డితో పాటు ప్రత్యేకంగా నాలుగు సార్లు గ్రామంలో పర్యటించాం. కూలిపోయిన ప్రతి ఇంటిని నమోదు చేసి ప్రభుత్వానికి పంపించాం. మరో పదిరోజులు సమయమిస్తే మా పరిధిలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. త్రిసభ్య కమిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం కలెక్టర్‌కు ఆదేశాలించ్చింది. ఆయన కమిటీని నియమిస్తే అందులో సభ్యులుగా ఉన్న ఇంజనీర్లు , రెవెన్యూ అ«ధికారులు త్వరలోనే గ్రామంలో పర్యటించి సమస్యకు కారణాలు తెలుసుకుంటారు. పరిష్కారంపై సూచనలు చేస్తారు. -
ఫౌంటేన్ కాదు.. పైప్‌లైన్ లీక్ !
ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌కు పంపింగ్ అవుతున్న దేవాదులు ఫేజ్ –1 పైప్‌లైన్ ఎయిర్‌వాల్వ్ బుధవారం ఉదయం రెండు చోట్ల లీక్ అయింది. మండంలోని పెద్దపెండ్యాల, తాటికాయల గ్రామశివార్లలో లీక్ కావడంతో పొలాల్లోకి నీరు వరదలా వచ్చింది. విషయం తెలుసుకున్న దేవాదుల ప్రాజెక్టు సిబ్బంది లీకేజీని సరిచేశారు. – ధర్మసాగర్ -
ఫౌంటేన్.. అదిరెన్..
ఇంద్రధనుస్సు వర్ణాలతో మెరిసిపోతున్న ఈ బ్రిడ్జి ఫౌంటేన్ దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఉంది. హన్ నదిపై ఉన్న బ్రిడ్జికి రెండువైపులా ఉండే ఈ ఫౌంటేన్‌ను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అంతేకాదు.. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జి ఫౌంటేన్‌గా గిన్నిస్ రికార్డు కూడా సాధించింది. 1.14 కిలోమీటర్ల పొడవుతో ఉండే ఈ ఫౌంటేన్ నిమిషానికి 190 టన్నుల నీటిని చిమ్ముతుంది. 2009లో దీన్ని నిర్మించారు. -
టాయిలెట్ ఫౌంటెయిన్..!
పేరు చూసి కంగారుపడకండి.. వీటిలో నుంచి వచ్చేవి మామూలు నీళ్లే. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి కదా? అందుకే కాస్త కొత్తగా ఉండాలని ఫౌంటెయిన్కి ఇలా యూరినల్స్, టాయిలెట్ కమోడ్స, సింకులు తగిలించారు అంతే. చైనా సెంట్రల్ గౌంగ్డంగ్ ప్రావిన్సులోని ఫోషన్ నగరంలో దీన్ని నిర్మించారు. వంద మీటర్ల పొడవు, ఐదు మీటర్ల ఎత్తుతో ఉన్న ఈ ఫౌంటెయిన్ నిర్మాణానికి దాదాపు పదివేల టాయిలెట్ బౌల్స్ వినియోగించారు. వీటన్నం టినీ ట్యాప్ కనెక్షన్‌తో అనుసంధానం చేశారు. వాటిలో నుంచి ఆగుతూ ఆగుతూ వచ్చే జలపాతం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.