34 మంది శరణార్థులు జలసమాధి | 34 people refugees watery grave | Sakshi
Sakshi News home page

34 మంది శరణార్థులు జలసమాధి

May 25 2017 3:03 AM | Updated on Sep 5 2017 11:54 AM

34 మంది శరణార్థులు జలసమాధి

34 మంది శరణార్థులు జలసమాధి

శరణార్థులతో కిక్కిరిసిన ఒక పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు.

రోమ్‌: శరణార్థులతో కిక్కిరిసిన ఒక పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఈ ప్రమాదం జరిగిందని, ఇప్పటివరకు 34 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని, 150 నుంచి 200 మంది వరకు గల్లంతయ్యారని ఇటలీ కోస్ట్‌గార్డ్‌ అధికారులు వెల్లడించారు.

దాదాపు 500 నుంచి 700 మంది శరణార్థులు ఒక చెక్కపడవపై మధ్యధరా సముద్రాన్ని దాటాలని ప్రయత్నిస్తుండగా లిబియా తీరం నుంచి 20 నాటికల్‌ మైళ్లు ప్రయాణించిన తరువాత ఈ ప్రమాదం జరిగింది. ఒక పెద్ద కెరటం పడవని బలంగా తాకడంతో డెక్‌పైన ఉన్నవారు, పడవలో ఉన్నవారు అదుపు తప్పి సముద్రంలో పడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement