
రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్ నుంచి రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపవలోవ్ (కెనడా) జంట తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. బోపన్న–షపవలోవ్ ద్వయం 4–6, 4–6తో డానియల్ (న్యూజిలాండ్)–ఫిలిప్ ఓస్వాల్డ్ (ఆస్ట్రియా) జోడీ చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్‌లో ఓడిన బోపన్న జంటకు 7,500 యూరోల (రూ. 6 లక్షల 69 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.